వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఆగష్టు 15
- 1769 : నెపోలియన్, ఫ్రెంచ్ చక్రవర్తి జననం.(మ.1821)
- 1872 : సుప్రసిద్ధ బెంగాలీ పండితుడు, కవి అరవిందుడు జననం (మ.1950).
- 1913 : ప్రముఖ కవి, సాహితీ వేత్త, బాల సాహిత్యకారుడు బాడిగ వెంకట నరసింహారావు జననం (మ.1994).
- 1935 : అలనాటి తెలుగు సినిమా నటి రాజసులోచన జననం (మ.2013).
- 1947 : భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన రోజు. (చిత్రంలో)
- 1949 : తెలుగు సినిమా రంగంలో ఒక ఉత్తమమైన భావాలున్న రచయిత మైలవరపు గోపి జననం.
- 1949 : ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు కొండా వెంకటప్పయ్య మరణం (జ.1866).
- 1961 : ప్రముఖ దక్షిణ భారత నటి సుహాసిని జననం.
- 1969 : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ను స్థాపించారు.
- 1972 : భారతదేశము లో పోస్టలు ఇండెక్సు నంబరు (PIN) అమలు లోకి వచ్చింది.
- 1974 : చారిత్రాత్మకమైన సెయింట్ జార్జ్ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన తొలి తమిళనాడు ముఖ్యమంత్రిగా కరుణానిధి అయ్యారు.