వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మే 5
- 1494 : క్రిస్టోఫర్ కొలంబస్ జమైకా ద్వీపాన్ని కనుగొన్నాడు.
- 1821 : ఫ్రాన్సు చక్రవర్తి నెపోలియన్ మరణం (జ. 1769).
- 1905 : భారతీయ సంతాలి భాష కోసం ఓల్ చికి లిపిని అభివృద్ధి చేసిన పండిట్ రఘునాథ్ ముర్ము జననం (మ.1982).
- 1916 : భారత మాజీ రాష్ట్రపతి జ్ఞానీ జైల్సింగ్ జననం (మ. 1987).
- 1930 : ప్రముఖ సినీ సంగీత దర్శకులు పిఠాపురం నాగేశ్వరరావు జననం (మ. 1996). (చిత్రంలో)
- 1955 : పశ్చిమ జర్మనీ పూర్తి సార్వభౌమాధికారాన్ని పొందినది.
- 1989 : భారతీయ సినీ నటి లక్ష్మీ రాయ్ జననం.
- 1995 : తెలుగు సినిమా నటుడు, రంగస్థల నటుడు నాగభూషణం మరణం (జ. 1921).
- 2003 : దక్షిణాఫ్రికా ఉద్యమనేత వాల్టర్ సిసులు మరణం (జ. 1912).