వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/వాసి (ప్రసిద్ధి)
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 13:19, 16 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఇది డిక్షనరీలో ఉండాల్సిన పదం. ఇక్కడ రాసారు. 8 సంవత్సరాలుగా విస్తరణకు నోచుకోక మొలకగానే ఉండిపోయింది. మూలాలు, లింకులు లేవు. దీనిని వ్యాసంగా పరిగణించలేము దీనిపై చర్చ:వాసి (ప్రసిద్ధి) లో ఇదివరకు చర్చ జరిగినా ఫలితం ప్రకటించలేదు. దీనిని వారం రోజులలో మూలాల సహితంగా విస్తరించనిచో తొలగించాలి.-- K.Venkataramana -- ☎ 13:39, 9 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- వారం రోజులలో మూలాల సహితంగా విస్తరించనిచో తొలగించాలి. యర్రా రామారావు (చర్చ) 14:28, 9 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ పేజీ వికీపీడియాలో ఉండదగినది కాదు. ఇదొక నిఘంటువు పేజీ. పెద్దబాలశిక్ష లాంటి చిన్న పిల్లల పుస్తకాల్లో కూడా ఇంతకంటే ఎక్కువ నాణ్యతగల సమాచారం ఉంటుంది. దానికితోడు ఒక్క మూలం కూడా లేదు. దీన్ని తొలగించాలని గతంలో చర్చ జరిగింది. దాదాపు 9 నెలల కిందట ఆ చర్చను ముగిస్తూ తొలగించరాదనే నిర్ణయం ప్రకటించారు. వ్యాసాన్ని విస్తరించాలని కూడా ఆ నిర్ణయంలో చెప్పారు. ఆనాటి చర్చలో పాల్గొని తొలగింపు ప్రతిపాదనను వ్యతిరేకించిన వారు గాని, తొలగించరాదని నిర్ణయం ప్రకటించినవారు గానీ ఈ 9 నెలల్లో వ్యాసాన్ని విస్తరించే కనీస ప్రయత్నం చెయ్యలేదు. పేజీ ఏ ఎదుగూ బొదుగూ లేకుండా, చిన్నమెత్తు మెరుగుదల లేకుండా ఆ రోజున ఎలాగుందో ఇవ్వాళ కూడా అలాగే ఉంది. చర్చలను ముగిస్తూ చేసే నిర్ణయం సరిగ్గా లేకపోతే ఏం జరుగుతుంది అనేదానికి ఈ పేజీ ఒక ఉదాహరణ. పైన వెంకటరమణ గారు, రామారావు గారు ఇచ్చిన వారం రోజుల గడువులోనైనా, ఆనాటి తొలగింపు ప్రతిపాదనను వ్యతిరేకించిన వారు, నిర్ణయం ప్రకటించినవారూ నైతిక బాధ్యత తీసుకుని దీన్ని మెరుగుపరచి, ఇది విక్షనరీ పేజీ కాదని, వికీలో ఉండదగినదేననీ, ఆనాటి తమ వాదన సరైనదేననీ నిరూపించుకుంటారేమో చూడాలి. లేదంటే పేజీని తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 15:50, 9 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- గతంలో చర్చలు జరిగినప్పుడు "ఆంగ్ల వికీపీడియా వ్యాసాల మాదిరిలో వ్యాసాన్ని విస్తరించవలసినదిగా సూచించడమైనది." అని నిర్ణయం వెలువరించారు. అది జరిగి దాదాపు ఆరేడు నెలలు కావస్తున్నది. ఇప్పటికీ ఏ మార్పుచేర్పులూ లేవు. సంవత్సరాల పాటు ఎదుగూ బొదుగూ లేదు, వ్యాసంగా ఉండడానికే తగినది కాదు, అన్నిటికీ మించి హేమీహేమీలైన వాడుకరులు దీన్ని ఉంచాలి, అభివృద్ధి చేయాలి అని అంత సమర్థనలు చేశాకా అర్థ సంవత్సరం గడిచినా ఏమార్పులూ చేయలేదు. ఇలాంటి వ్యాసానికి ఇంకొక వారం సమయం ఇవ్వడం కూడా అనవసరమని నా భావన. దీన్ని సాధ్యమైనంత వెంటనే తొలగించాలి. --పవన్ సంతోష్ (చర్చ) 02:49, 10 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.