చర్చ:వాసి (ప్రసిద్ధి)

తాజా వ్యాఖ్య: తొలగింపు ప్రతిపాదన (కొనసాగింపు..) టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: K.Venkataramana

తొలగింపు ప్రతిపాదన మార్చు

వాడుకరి:YVSREDDY గారూ, గతంలో వాసి (ప్రసిద్ధి) పేజీని కింది కారణాల వల్ల తొలగించాను:

  1. అదొక డిక్షనరీలో ఉండాల్సిన ఎంట్రీ. ఇక్కడ రాసారు. 8 సంవత్సరాలుగా విస్తరణకు నోచుకోక మొలకగానే ఉండిపోయింది.
  2. వాసి అనే పదానికి అర్థం, దానికి ఉదాహరణలు రాసారే తప్ప వికీపీడియా విజ్ఞాన సర్వస్వ సమాచారమేమీ లేదు.
  3. "వాసి అంటే ఊరు అనే అర్థం వస్తుంది." అలా అని ఎక్కడ ఉంది? దానికి మూలం రాయలేదు.
  • మీరు ఆ తొలగింపును పట్టించుకోకుండా గతంలో చేసినట్లే మళ్ళీ అదే సమాచారంతో అదే మొలకను సృష్టించారు. ఇది వికీ పద్ధతికి విరుద్ధం.
  • ఒక పక్కన మొలకలను విస్తరించేందుకు సముదాయమంతా కృషి చేస్తోంటే అదేమీ పట్టించుకోకుండా కొత్త మొలకను సృష్టించారు. ఇది వికీ సముదాయం పట్ల పట్టింపు లేని మీ ధోరణిని సూచిస్తోంది.

గతంలో ఈ విషయమై మీపై నిరోధం విధించారు. అయినా మీలో మార్పు వచ్చినట్లు కనిపించడం లేదు. మరొక్కసారి మీరు ఇలా తొలగించిన పేజీలను సృష్టిస్తే వికీ నియమానుసారం మీపై మళ్ళీ తగు చర్య తీసుకోవాల్సి ఉంటుంది. గమనించగలరు. మీ చర్చ పేజీలో రాయవద్దని అన్నారు కాబట్టి మీ అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఇక్కడ రాసాను. __చదువరి (చర్చరచనలు) 15:30, 21 జూన్ 2020 (UTC)Reply

    1. చదువరి గారు, ప్రస్తుతం వికీపీడియాలో మీరు ఎవరు వ్రాసినదైనా, అది ఎటువంటి వ్యాసమైనా దానిని తొలగించాలనుకుంటే దానికి మీకు పూర్తిగా మద్దతు లభించగలదు. అలాగే ఎటువంటి వాడుకరిని అయినా నిరోధించేందుకు మీకు పూర్తిగా మద్దతు లభించగలదు. అది న్యాయమైననూ, అన్యాయమైననూ. నేను చెప్పేది నిజమో, కాదో తెలుసుకోవాలంటే ఇది అన్యాయం అని మీకు అనిపించేలా ఒక చర్యను తీసుకోండి అర్థమవుతుంది మీకే. YVSREDDY (చర్చ) 05:03, 23 జూన్ 2020 (UTC)Reply
వాడుకరి:YVSREDDY గారూ, నేను ఒక అంశం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి మాట్టాడాను. ఒక పేజీ గురించి మాట్లాడాను. ఆ పేజీలో మీరు చేసిన ఒక పని గురించి మాట్లాడాను. మూణ్ణాలుగు అంశాలను ప్రస్తావించాను. అంతే తప్ప, జనరిక్‌గా, ఏదో ఊకదంపుడుగా, రొడ్డకొట్టుడుగా మాట్లాడలేదు. మీరు కూడా అలాగే మాట్టాడాలని, ఇలా చుట్టు తిరుగుడుగా మాట్టాడవద్దనీ అభ్యర్ధిస్తున్నాను. పైన మీరు మాట్టాడినట్టుగా జనరిక్‌గా మాట్టాడితే మనమధ్య జరిగేది వాగ్వాదం తప్ప చర్చ కాదు. వాగ్వాదానికి నేను సిద్ధంగా లేను. నాకంత సమయమూ లేదు. నేను లేవనెత్తిన అంశాల్లో తప్పుంటే చెప్పండి, సరిదిద్దుకుంటాను. మీ తప్పుంటే మీరు సరిదిద్దుకోండి. వికీకి కావాల్సిందదే గాని, అనవసరమైన వాగ్వాదాలు కాదు. __చదువరి (చర్చరచనలు) 05:19, 23 జూన్ 2020 (UTC)Reply
చదువరి గారూ, మీరన్నట్లు ఇది నిఘంటు అర్థంగా ఉండాల్సిన వ్యాసమే. ఈ వ్యాసాన్ని వైవిఎస్ రెడ్డి గారు ఏదోలా విస్తరించాలని చూస్తున్నారు గానీ నాకేమీ ఇది విజ్ఞానవంతమైన వ్యాసంగా కనిపించడం లేదు. సంబంధం లేని విషయాన్ని ఇరికిస్తున్నారు - రవిచంద్ర (చర్చ) 06:08, 23 జూన్ 2020 (UTC)Reply
అవును రవిచంద్ర గారు. మరింత సమాచారాన్ని ఇరికించే కొద్దీ అది మరింతగా ఋజువౌతోంది. ఇది వికీపీడియాలో ఉండదగ్గ వ్యాసమే అని నిరూపించే సమాచారాన్ని చేర్చడం లేదాయన. __చదువరి (చర్చరచనలు) 06:49, 23 జూన్ 2020 (UTC)Reply
YVSREDDY గారి అభిప్రాయాలు ఏమీ మార్చుకున్నట్లులేదు.తన స్వంత అభిప్రాయాలు కొన్ని, కొంత గాలికి దొరికిన సమాచారం ఎలాగైనా వికీపీడియాలో చేర్చాలనే పట్టుదలతోనే ఉన్నట్లు కనిపిస్తుంది.అందుకే YVSREDDY గారు సృష్టించిన వ్యాసాలకు మూలాలు ఉండవు.--యర్రా రామారావు (చర్చ) 07:24, 23 జూన్ 2020 (UTC)Reply
ఇది వికీపీడియాలో ఉండాల్సిన వ్యాసం కాదు. వ్యాసానికి సంబంధంలేని సమాచారం చేర్చడమేకాకుండా, ఇతర వాడుకరుల మీద నిందలు వేస్తున్నారు. Pranayraj Vangari (Talk2Me|Contribs) 08:28, 23 జూన్ 2020 (UTC)Reply

@ వాడుకరి చర్చ:K.Venkataramana నుంచి

వెంకటరమణ గారూ ఎంతమాట అనేసారు.ముందు మనం చేసే వృత్తికి న్యాయం చేయాలి.తరువాత ప్రవృతికి. మీకు గడువు విధించటం నాతెలివితక్కువ పని. అది మాములుగారాసిందే!మీరు కావాల్సినంత టైం తీసుకొని నిరభ్యంతరంగా సరిదిద్దండి.తొలగించేటప్పుడు ఎవరమైనా వికీపీడియా నియమాలు పాటించవలసిందేనని మనందరకు తెలిసిన విషయమే.నాపై మీకు కలిగిన నమ్మకంతో, నన్ను నిర్వాహకత్వ భాధ్యతలకు ప్రతిపాదించారు.మీపై నాకు ఎప్పడూ గౌరవమే.నేను మీ స్పూర్తితో నిర్వహకుని భాధ్యతలు నెరెవేర్చటంలో భాగంగానే నడుచుకుంటున్నా గానీ, ఇందులో ఎవరిని ఎత్తి చూపటానికి మాత్రంకాదని సవినయంగా తెలుపు చున్నాను. పెద్ద మనసుతో అర్థం చేసుకొనగలరు. --యర్రా రామారావు (చర్చ) 16:48, 26 ఫిబ్రవరి 2020 (UTC)Reply
    • కావాల్సినంత టైం తీసుకొని నిరభ్యంతరంగా సరిదిద్దండి - అనే వెసులుబాటు నిర్వాహకులకు మాత్రమే వర్తిస్తుందా
      • రోజుకో వ్యాసం చొప్పున విస్తరిస్తాను అని చెప్పినా వాడుకరుల మాటలు పట్టించుకోరా, అనుకున్న వెంటనే వాడుకరుల వ్యాసాలు అయితే తొలగిస్తారా, తొలగించిన వ్యాసాలను మళ్ళీ సృష్టించి అదే రోజున విస్తరిస్తే నియమాలు ఉల్లంఘించారని నిరోధం విధిస్తారా. వికీపీడియా విధివిధానాలు అడిగితే తెలుపలేని, ఆ నియమాలు అసలు తెలియని వారు నిర్వాహకులుగా కొనసాగుతూనే ఉంటారా, అవసరమయితే నిర్వాహకులపై కూదా చర్యలు తీసుకునే హక్కు వాడుకరులకు ఉంటుందని తెలియదా, వాడుకరులు నియమిస్తేనే నిర్వాహకులు అవుతారని, వారి అనుమతి ఉన్నంతకాలమే నిర్వాహకులుగా ఉండగలరని తెలుపవలెనా. పది మంది ఉపాధ్యాయులు ఒక విద్యార్థి అన్నట్లుగా తెలుగు వికీపీడియా తయారైంది. ఈ వ్యాసం తెలుగు వికీపీడియాలో ఎందుకు ఉండకూడదో తెలిపిన వారే, ఈ వ్యాసం ఉండదగినదే అని తెలిపితే పై చర్చలో పాల్గొన్న వారంతా ఎటువంటి చర్చ చేస్తారు అంటే అవును ఈ వ్యాసం ఖచ్చితంగా ఉండవల్సిందే అని చెబుతారు. నేను చెప్పేది నిజమో, కాదో తెలుసుకోవాలంటే చదువరి గారు ఈ వ్యాసం ఎందుకు ఉండాలో అనే విషయముపై ఒక నిమిషం కేటాయించండి చాలు. ఎందుకంటే ప్రస్తుతం తెలుగు వికీపీడియా వికీ విధివిధానాలకు అనుగుణంగా పనిచేయటం లేదు, వ్యక్తుల విధివిధానాలకు అనుగుణంగా పనిచేస్తున్నది. YVSREDDY (చర్చ) 08:51, 23 జూన్ 2020 (UTC)Reply
"వికీపీడియా వికీ విధివిధానాలకు అనుగుణంగా పనిచేయటం లేదు, వ్యక్తుల విధివిధానాలకు అనుగుణంగా పనిచేస్తున్నది." - ని అన్నారు మీరు, YVSREDDY గారు. నిజమే, మీరు అలాగే పని చేస్తున్నారు. దానికి మీరు పనిచేసే విధానమే ఋజువు.
  1. ఈ వ్యాసం ఉండకూడదని ఇక్కడ నలుగురు అన్నారు. ఉండాలని మీరొక్కరే అన్నారు. మీ విధానమే చెల్లుతోంది -కనీసం ఇప్పటి వరకు
  2. "తొలగించిన వ్యాసాలను తొలగించేదాకా ఆగి వెంటనే సృష్టించేస్తున్నారు, అలా చెయ్యకూడదు" అని సుమారు పదిమంది మీకు చెప్పి ఉన్నారు గతంలో. అయినా మీరు ఆ పని చేసారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు (ఈ పేజీయే తాజా ఋజువు). మీ విధివిధానాలకు అనుగుణంగా పనిచేస్తున్నారు గానీ, వికీ విధివిధానాల ప్రకారం కాదు.
  3. లేవనెత్తిన విషయాలపై సూటిగా చర్చ చెయ్యండి అని వికీ నియమాలు చెబుతున్నై. కానీ మీరు దాన్నెప్పుడూ పట్టించుకోలేదు. అసలు చర్చను పక్కన పడేస్తారు. అసలు చర్చకే సంబంధం లేని సంగతులను తీసుకుని రచ్చ చేస్తారు. ఇదుగో ఇప్పుడు చేస్తున్నట్లు. ఇంతవరకూ అసలు విషయం గురించి మాట్టాడలేదు మీరు. ఇక్కడా విధివిధానాలకు అనుగుణంగానే పనిచేస్తున్నారు, వికీ విధానాల పరంగా కాదు.
మీరు అలా పనిచేస్తున్నారు కాబట్టే "వ్యక్తుల విధివిధానాలకు అనుగుణంగా పనిచేస్తున్నది" అని మీకు అనిపిస్తోంది. మీ పద్ధతులు మార్చుకుని వికీ విధానాల ప్రకారం పనిచెయ్యండి. ప్రపంచం తిరిగి మామూలుగా కనబడ్డం మొదలౌతుంది. __చదువరి (చర్చరచనలు) 09:52, 23 జూన్ 2020 (UTC)Reply

@ వాడుకరి చర్చ:YVSREDDY నుంచి

మీరు సృష్టించిన ఈ వ్యాసాలు పరిశీలించండి మార్చు

YVSREDDY రెడ్డి గారు నమస్కారం.ముందుగా క్షమించాలి.అనువాదం కోరబడిన వ్యాసాలు పరిస్థితి మీద జరిగిన చర్చ గమనించగలరు.తెలుగు వికీపీడియాకు ఉండవలసిన ఈ దిగువ వివరింపబడిన వ్యాసాలు మంచి ఆలోచనతో సృష్టించారు.కానీ అవి చాలాకాలం నుండి ఆంగ్లభాషలోనే ఉన్నవి.

దయచేసి వాటిని వారం రోజులలో అనువదించి అనువదించ వలసిన పేజీలు వర్గం నుండి తప్పించగలందులకు కోరుచున్నాను.లేకపోతే అవి తొలగించబడునని తెలియజేయటానికి చింతిస్తున్నాం.--యర్రా రామారావు (చర్చ) 17:59, 25 ఫిబ్రవరి 2020 (UTC)Reply

అసలు దీని మీద YVSREDDY గారి స్పందనేలేదు.స్పందిస్తే గదా తెలిసేది.పోనీ ఇప్పటికైనా వాటిపై స్పందించి తగిన సవరణలు చేసారా?లేదు.పైన రాసినదానిలో వాడుకరుల పేజీలే కాదు, నిర్వాహకులు సృష్టించిన పేజీలు కూడా తొలగించటానికి వెనుకాడటలేదనేది అనేది తెలియరాలేదా YVSREDDY గారూ!--యర్రా రామారావు (చర్చ) 10:37, 23 జూన్ 2020 (UTC)Reply
యర్రా రామారావు గారు, వ్యాసాల తొలగింపు చర్చల్లోకానీ, వ్యాసాల తొలగింపు చర్చాపేజీల్లోకానీ YVSREDDY గారు పాల్గొని తన సమయాన్ని వృధా చేసుకోరు. వికీ నియమాలను పాటించకుండా వ్యాసాలను సృష్టించడం, వాటిని తొలగిస్తే మళ్ళీమళ్ళీ సృష్టించి వికీలో ఎక్కించే పనిలో బిజీగా ఉంటారు కాబట్టి, మనం కూడా మన సమయం వృధా చేసుకోకుండా ఈ వాడుకరిపై శాశ్వత చర్య తీసుకుంటే వికీకి మంచిదని నా అభిప్రాయం. Pranayraj Vangari (Talk2Me|Contribs) 11:02, 23 జూన్ 2020 (UTC)Reply
  • వ్యాసాల తొలగింపు చర్చల్లోకానీ, వ్యాసాల తొలగింపు చర్చాపేజీల్లోకానీ YVSREDDY గారు పాల్గొని తన సమయాన్ని వృధా చేసుకోరు. - ఇది నిజమే.
  • వికీ నియమాలను పాటించకుండా వ్యాసాలను సృష్టించడం - ఇది అబద్ధం (ఎందుకంటే నేను నలుగురు నిర్వాహకులను వికీ విధివిధానాలను తెలిపే లింకు ఇవ్వమని కోరియున్నాను. ఏ ఒక్క నిర్వాహకుడు కూడా స్పందించలేదు, అందుకే పైన చర్చలో వికీపీడియా విధివిధానాలు అడిగితే తెలుపలేని, ఆ నియమాలు అసలు తెలియని వారు నిర్వాహకులుగా కొనసాగుతూనే ఉంటారా అని వ్రాసినది)
  • వాటిని తొలగిస్తే మళ్ళీమళ్ళీ సృష్టించి వికీలో ఎక్కించే పనిలో బిజీగా ఉంటారు - మళ్ళీ సృష్టించినవి విస్తరించాను, విస్తరించిన వ్యాసాలను కూడా తొలగిస్తే మళ్ళీమళ్ళీ సృష్టించాను)
  • వాడుకరిపై శాశ్వత చర్య తీసుకుంటే వికీకి మంచిదని నా అభిప్రాయం - ఇది అబద్ధం (ఎందుకంటే వికీకి వ్యాసాలను విస్తరించే వాడుకరుల అవసరం ఉంది కాని, విస్తరించిన వ్యాసాలను తొలగించే నిర్వాహకుల అవసరంలేదు, అందుకని వికీకి అవసరం లేని వారు శాశ్వతంగా తప్పుకుంటే వికీకి మంచిది) - YVSREDDY (చర్చ) 13:53, 23 జూన్ 2020 (UTC)Reply
YVSREDDY గారు,
  • 'వికీ నియమాలను పాటించకుండా వ్యాసాలను సృష్టించడం అబద్ధం అంటూనే, వికీ విధివిధానాలను తెలిపే లింకు ఇవ్వమని కోరియున్నాను' అన్నారు. దీన్నిబట్టి మీకు వికీ నియమాల మీద స్పష్టత లేదని, ఒకవేళ స్పష్టత ఉన్నాకూడా వాటిని పాటించడంలేదని తెలుస్తోంది.
  • 'వ్యాసాలను విస్తరించాను' అని పదే పదే చెప్తున్నారు. మీరు సృష్టించిన వ్యాసాలు ఎన్ని, అందులో మొలక వ్యాసాలు ఎన్ని, మూలాలు లేని వ్యాసాలు ఎన్ని, ఇంగ్లీషులో ఉన్న వ్యాసాలు ఎన్ని, వికీ నియమాలకు అనుగుణంగా మీరు విస్తరించిన వ్యాసాలు ఎన్ని అనేవి ఒకసారి చూసుకోండి. (మీ మొలకల జాబితాలో గ్రామాల పేజీలు, సినిమాల పేజీలు కాకుండానే 810 ఇతర మొలక వ్యాసాలు ఉన్నాయన్న సంగతి మర్చిపోయారేమో..!)
  • 'మళ్ళీ సృష్టించినవి విస్తరించాను, విస్తరించిన వ్యాసాలను కూడా తొలగిస్తే మళ్ళీమళ్ళీ సృష్టించాను' అన్నారు. వ్యాసాలను వికీ నియమాలకు అనుగుణంగా రాస్తే ఎవరూ తొలగించరని తెలుసుకోండి. మీరు విస్తరించాను అని చెప్తున్న వ్యాసాల జాబితా ఒకసారి చూసుకుంటే అవి ఎందుకు తొలగించబడ్డాయో తెలుస్తుంది. ( తొలగించబడిన వ్యాసాల జాబితాలో ఆయా వ్యాసాల వివరాలు చూడండి).
  • 'వికీకి వ్యాసాలను విస్తరించే వాడుకరుల అవసరం ఉంది' అని చెప్తున్న మీరు దాన్ని పాటించే వాడుకరుల జాబితాలో మాత్రం లేరు. కాబట్టి, మీలాంటి వాడుకరుల అవసరం వికీపీడియాకు లేదని మరోసారి చెప్తున్నాను. Pranayraj Vangari (Talk2Me|Contribs) 20:18, 23 జూన్ 2020 (UTC)Reply

తొలగింపు ప్రతిపాదన (కొనసాగింపు..) మార్చు

ఈ పేజీలో చర్చ ఈ వ్యాసపు పరిధిని దాటి పోయింది. చర్చను ఈ వ్యాసం వరకే పరిమితం చేద్దాం. ఈ వ్యాసం పేజీని ఉంచాలా తొలగించాలా అనే విషయం మీద మాత్రమే చర్చించాలని విజ్ఞప్తి. __చదువరి (చర్చరచనలు) 23:47, 23 జూన్ 2020 (UTC)Reply

కేవలం పదానికి ఉదాహరణలు మాత్రమే తెలుపబడినవి.వ్యాసంలో విషయసంగ్రహం లేదు.ఇచ్చిన మూలం కూడా ఈ వ్యాసానికి సరిపోయేదికాదు.ఇదే పదానికివిక్షనరీలో వివరణ పేజీ ఉంది.కావున ఇది వికీలో ఉండదగినదికాదు.కావున తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 03:05, 24 జూన్ 2020 (UTC)Reply
ఈ వ్యాసంలో విస్తరిద్దామన్నా విషయం లేదు. ఇది విక్షనరీ లో ఉండవలసిన వ్యాసం. వికీ ప్రమాణాలకు అనుగుణంగా లేని ఈ వ్యాసాన్ని తొలగించాలి. K.Venkataramana(talk) 03:32, 24 జూన్ 2020 (UTC)Reply
పైన చెప్పిన అభిప్రాయమే మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను. ఇది నిఘంటు పదం. దీనికని ప్రత్యేక వ్యాసం అవసరం లేదు. - రవిచంద్ర (చర్చ) 06:53, 24 జూన్ 2020 (UTC)Reply
YVSREDDY గారూ, ఈ వ్యాసాన్ని ఉంచాలా లేదా అనే విషయంపై అంశాల ప్రాతిపదికన చర్చించమని మిమ్మల్ని కోరాను. మీరు దాని విషయమై ఒక్క ముక్క మాట్లాడలేదు. చర్చను దారిమళ్ళించే ప్రయత్నం చేసారు. అది చాలదన్నట్లు నలుగురు సాటి వాడుకరులను కలిపి చిన్నబుచ్చేలా ఒక సంక్షిప్త పదాన్ని కాయించి మాట్లాడారు. పైగా వాళ్ళంతా వ్యాస భక్షణ చేస్తున్నారని వారిపై అనుచితమైన నింద వేసారు. (పైగా ఏ సమయంలో..? వీళ్ళంతా కలిసి కొన్ని వందల మొలకలలో కొన్ని వేలబైట్లను చేర్చి విస్తరిస్తూ ఉన్న సమయంలో! దీని కంటే అన్యాయం మరొకటి ఉండదు) దీనివలన కింది విషయాలు తేటతెల్లమౌతున్నై:
  1. మీరు గత నిరోద్ఝం తరువాత ఏమీ మారలేదు. మీ పద్ధతులను మార్చుకోలేదు. తొలగించిన వ్యాసాన్ని వెంటనే మళ్ళీ అదే సమాచారంతో సృష్టించారు.
  2. దాన్ని తొలగించాలా లేదా అనే చర్చ జరుగుతోంటే దాని గురించి అస్సలు మాట్లాడకుండా చర్చను పక్కదారి పట్టించారు.
  3. ఈ విషయాలపై చర్చలో పాల్గొన్న వాడుకరులను అవమానిస్తూ మాట్లాడారు.
  4. వికీలో జరిగే సాముదాయిక కృషి పట్ల మీకు గౌరవం లేదు.
YVSREDDY గారూ, ఇది అనుచిత ప్రవర్తన. వికీ విధానాలకు, వికీ మర్యాదకూ విరుద్ధం.
తోటి వాడుకరులకు - రెడ్డి గారు తన తప్పు గ్రహించి, అవమానకరంగా మాట్టాడినందుకు 24 గంటల్లోగా ఆ వాడుకరులకు క్షమాపణ చెప్పని పక్షంలో ఆయన్ను రెండు వారాల పాటు నిరోధించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. అలాగే ఈ వ్యాసం ఉంచాలా లేదా అనే చర్చను 7 రోజుల పాటు కొనసాగించి ఆపై నిర్ణయం తీసుకోవాలని కూడా నేను ప్రతిపాదిస్తున్నాను. మీ అభిప్రాయాలు చెప్పగలరు.__చదువరి (చర్చరచనలు) 16:10, 24 జూన్ 2020 (UTC)Reply
చదువరి గారి నిర్ణయాన్ని సమర్ధిస్తున్నాను. - రవిచంద్ర (చర్చ) 16:45, 25 జూన్ 2020 (UTC)Reply
చదువరి గారి నిర్ణయంతో నేను ఏకీభవిస్తున్నాను. - --యర్రా రామారావు (చర్చ) 04:23, 26 జూన్ 2020 (UTC)Reply
చదువరిగారి నిర్ణయాన్ని సమర్ధిస్తున్నాను.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 07:50, 26 జూన్ 2020 (UTC)Reply
నేను వ్యతిరేకిస్తున్నాను (సభ్యుడి చర్యలకు నేను సమర్థంచడం లేదు కాని నిషేధం అనేది ప్రక్రియ ప్రకారమే జరగాలి, వ్యాసం తొలగింపుకు కూడా సరైన కారణాలు లేవు) సి. చంద్ర కాంత రావు- చర్చ 18:05, 26 జూన్ 2020 (UTC)Reply

నిర్ణయం మార్చు

పై చర్చలను కొంతవరకు అర్ధం చేసుకోగలిగాను. కొన్న శీర్షికలను సరిదిద్దాను. చర్చలలో కొంత భాగాలు అసంబద్ధమైనవిగా వున్నాయి (తొలి విభాగంలో యర్రా రామారావు గారు వాడుకరి చర్చ:K.Venkataramana ను ఉటంకించటం). సభ్యులు చర్చలను మరింత అర్ధవంతంగా జరపటానికి సహకరించండి. తొలగింపుపై నిర్ణయం తీసుకునేందులకు పైన చర్చలను, విక్షనరీలో వ్యాసాన్ని, ఆంగ్ల వికీపీడియాలో దగ్గరి పోలికవున్న వ్యాసాలను (en:Recognition, en:quantity పరిశీలించినమీదట, విస్తారమైన విషయ విశ్లేషణకు అవకాశం కల పదాలు వికీపీడియా లో కూడా వుండవచ్చు అని అభిప్రాయపడుతున్నాను. ఆంగ్ల వికీపీడియా వ్యాసాల మాదిరిలో వ్యాసాన్ని విస్తరించవలసినదిగా సూచించడమైనది. నిషేధం గురించి రచ్చబండ లో చర్చించమని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 06:15, 2 జూలై 2020 (UTC)Reply

అర్జున గారూ మీరు (తొలి విభాగంలో యర్రా రామారావు గారు వాడుకరి చర్చ:K.Venkataramana ను ఉటంకించటం). ఈ వాక్యంను పైన ఉదహరించారు.ఈ వాక్యంలో ఎవరు ఉటంకించారో సరియైన వివరణ ఇవ్వగలరు.--యర్రా రామారావు (చర్చ) 04:47, 4 జూలై 2020 (UTC)Reply
మరింత శోధించినమీదుట నేను పేర్కొన్న భాగం వాడుకరి:YVSREDDY గారు చేర్చారని తెలిసింది. దానిలో తొలిగా మీ సంతకం వివరాలుండడంతో మీరు చేర్చినట్లు పొరబడ్డాను. క్షమించండి. --అర్జున (చర్చ) 04:55, 4 జూలై 2020 (UTC)Reply
గమనించినందుకు ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 05:17, 4 జూలై 2020 (UTC)Reply
ఈ వ్యాసం నిఘంటువులోని ఒక పదం. శీర్షికలోనే దాని అర్థం కూడా వాడుకరి సూచించాడు. ఇక వ్యాసంలోని అంశాలన్నీ వాసి, ప్రసిద్ధి అనే అర్థాల చుట్టూ త్రిప్పి త్రిప్పి స్వంత ఉదాహరణలనుపయోగించి విస్తరించే ప్రయత్నించారు. ఆంగ్ల వికీలో మాదిరిగా ఒక నిఘంటువులో ఉన్న పదాన్ని వికీ నియమాల ప్రకారం విస్తరిస్తే మంచిదే. కానీ ఈ పదాన్ని విస్తరించడానికి సమాచారం లేదు. మూలాలు, లింకులు లేవు. నలుగురు వాడుకరులు కూడా తొలగించమని తెలిపారు. కనుక దీనిని తొలగించాలి. అనేక రోజులు కష్టపడి ఏకవాక్యవ్యాసాలు, మొలక వ్యాసాలు, నాణ్యత లేని వ్యాసాలను విస్తరిస్తున్న సమయంలో ఇలాంటి వ్యాసాలు ఉండటం సరికాదు. ఈ వ్యాసం ఎందుకు ఉండాలో రెడ్డిగారు తెలియజేయలేదు సరికదా నిత్యం వికీపీడియాలో వ్యాసాల అభివృద్దికి పాటుపడుతున్న వాడుకరులపై "వ్యాస భక్షకులు" అనే ఆరోపణలు కూడా చేసాడు. ఈ వ్యాసాన్ని ఎక్కువ మంది సభ్యులు తొలగించమని కోరినందున తొలగించండి. K.Venkataramana(talk) 12:39, 2 జూలై 2020 (UTC)Reply
@Arjunaraoc: గారూ, వికీపీడియాలో నిర్ణయాలు అన్నవి విధానాలు, ఆ విధానాలన్నవి వికీపీడియా మూల స్తంభాల చుట్టూ కదా ఉండాలి. వ్యక్తిగత అభిప్రాయాల ప్రాతిపదికన నిర్ణయాలు ఎలా చేస్తాం? చర్చల్లో అభిప్రాయాలు వెలువరించేవారు కూడా సంబంధిత విధానానికి (ఇప్పటికే విధానం ఉంటే) వ్యాఖ్యానం చేయడంలోనూ, వ్యాసంలోని విషయాన్ని ఆ వ్యాఖ్యానంతో సరితూచడంలోనూ భేదం ఉంటుంది తప్పించి విధానానికి వ్యతిరేకమైన భాష్యాలు చేసేట్టయితే అవి పరగణనలోకి తీసుకోకూడదు. ఇక్కడ పైన చెప్పిన అభిప్రాయాల్లో అత్యధిక శాతం ఇది వికీపీడియాలో ఉండదగిన వ్యాసం కాదని ఉంది. ఏది వికీపీడియా కాదు అన్న విధానంలో సూటిగా వికీపీడియా నిఘంటువు కాదు అని వికీపీడియా నిఘంటువు కాదు కాబట్టి, కేవలం పదానికి నిర్వచనం రాసేందుకు గాను పేజీ సృష్టించకండి. అని సూటిగా చెప్పారు. అలాంటప్పుడు విధానాన్ని వదిలివేసి స్వంత అభిప్రాయాల ప్రాతిపదికన జరగడం ఎంతవరకూ సబబు? ఉదాహరణకు: వ్యాసం తొలగింపుకు కూడా సరైన కారణాలు లేవు అన్న @C.Chandra Kanth Rao: గారి అభిప్రాయం చూడండి, అలానే మీరే వెలిబుచ్చిన విస్తారమైన విషయ విశ్లేషణకు అవకాశం కల పదాలు వికీపీడియా లో కూడా వుండవచ్చు అని అభిప్రాయపడుతున్నాను. చూడండి. విస్తారమైన విషయ విశ్లేషణకు అవకాశం లేని పదాలు అంటూ ప్రపంచంలో ఉండవు. ప్రతీ పదానికి కొన్ని కనీసం కొన్ని దశాబ్దాలు మొదలుకొని, కొన్ని వందలు, వేల యేళ్ళ చరిత్ర ఉంటుంది. ఆ లెక్కన ప్రతీ పదానికి వ్యాసం ఉండవచ్చుననే అర్థం వస్తుంది. ఆ విధంగా నిర్ణయించాలి అంటే అందుకు "ఏది వికీపీడియా కాదు" అన్న పేజీలో పాలసీ చర్చ చేసి చేయాలి. రేపొద్దున్న ప్రతీవారూ ప్రతీ పదానికి ఒక పేజీ పెట్టి నిర్వచనం రాసి భవిష్యత్తులో విస్తారమైన విషయ విశ్లేషణకు అవకాశం ఉందన్న ముక్క చెప్పి చేతులు దులుపుకుంటారు. ఏతావతా, ఈ నిర్ణయంలో పైన చెప్పిన పాలసీకి వ్యతిరేకంగా కేవలం అభిప్రాయం ప్రాతిపదకతో ఉంది. --పవన్ సంతోష్ (చర్చ) 03:14, 3 జూలై 2020 (UTC)Reply
@K.Venkataramana:,@Pavan santhosh.s: గార్లకు, మీ స్పందనకు ధన్యవాదాలు. కేవలం ఆధిక్యతపై నిర్ణయం చేయటానికి నిర్వాహకులు, అధికారులు అవసరంలేదు. చర్చలో ప్రధానమైన విషయం నిఘంటువులో వుండవలసిన పదం ఇక్కడ ఉండకూడదు అని. దానికి మూలాలతో ఆంగ్లవికీపీడియాలో ఏ విధంగా దానికి వ్యతిరేకంగా పదాలున్నాయో తెలియచేశాను. ఆ సూచన పాటించకపోతే కొన్ని రోజుల తర్వాత మరల తొలగింపు చర్చ ప్రారంభించవచ్చు. --అర్జున (చర్చ) 04:31, 4 జూలై 2020 (UTC)Reply
అర్జున గారూ, ఫలానా పేజీలు ఇంగ్లీషు వికీపీడియాలో ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఇక్కడ ఉండవచ్చని చెబుతున్నారా? అదా దీనికి కారణం!!!?
  1. ప్రస్తుతం ఈ పేజీలో ఉన్న సమాచారాన్ని బట్టి, పేజీని తొలగించాలా లేదా అనేది నిర్ణయించాలి. దాని గురించి అసలు మాట్లాడారా మీరు? లేదు. అస్సలు మాట్టాడలేదు.
  2. ఇంగ్లీషులో ఫలానా పదాలకు పేజీలు ఉన్నై కాబట్టి ఈ పేజీ కూడా ఉండొచ్చు అని అంటున్నారు. ఇది ఎంత అసంబద్ధంగా ఉందో చూడండి..
    1. మీరు చూపిన ఉదాహరణల్లో ఒకటి అయోమయ నివృత్తి పేజీ!!! అయోమయ నివృత్తి పేజీ మామూలు వ్యాసం పేజీ ఒకటేనని మీ ఉద్దేశమా?
    2. ఇక రెండో ఉదాహరణలో ఉన్న సమాచారాన్నీ ఈ పేజీలో ఉన్న సమాచారాన్నీ పోల్చి చూసారా? రెండూ ఒకేలా ఉన్నాయనిపించిందా?
  3. పోనీ ఆ ఉదాహరణలను ఇస్తూ ఆ పేజీల పద్ధతిలోనే ఈ పేజీని కూడా వికీపీడియా యోగ్యంగా ఎలా విస్తరించవచ్చో చెప్పారా? లేదు! ఎలాంటి సమాచారం రాయొచ్చో చెప్పారా? లేదు!
  4. పోనీ అదే ఇంగ్లీషు వికీపీడియాలో ఈ పేజీకి (వాసి (ప్రసిద్ధి)) సంబంధించిన పేజీ ఏమైనా ఉందా అని చూసారా? ఉంటే ఏంటా పేజీ? ఆ పేజీలో ఎలాంటి సమాచారం చేర్చారు? ఈ విషయాలను పరిశీలించి తదనుగుణంగా నిర్ణయించారా అంటే అదీ లేదు.
ఈ పేజీలో సరుకు లేదు. ఈ నిర్ణయంలో హేతువు లేదు. రమణ గారికి, పవన్ గారికీ మీరిచ్చిన సమాధానంలో పస లేదు. __చదువరి (చర్చరచనలు) 06:24, 8 జూలై 2020 (UTC)Reply
చదువరి గారు, మీ సూచనలు పరిశీలించాను. ఇంతకు ముందు చెప్పినదానికి అదనంగా నేను చెప్పవలసినదేమీలేదు. ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 05:11, 9 జూలై 2020 (UTC)Reply
అర్జున గారూ, సరే సార్. కింది వాక్యాలతో నేను కూడా ఈ చర్చను ముగిస్తాను:
  1. ప్రస్తుతం ఉన్న సమాచారాన్ని బట్టి ఈ పేజీ ఉండదగిందా కాదా అనేది మీరు ఇంతవరకూ చెప్పనే లేదు.
  2. పోనీ పేజీని ఉంచాలని నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అని ముగ్గురం అడిగినప్పుడు కూడా ఈ సమాచారం ఉండదగినదే, అందుకే తీసుకున్నాను అని మీరు చెప్పలేదు. (ఈ సమాచారం ఉండదగినది కాదు అని మీరు అన్యాపదేశంగా అంగీకరించినట్టే అని నేను అర్థం చేసుకున్నాను)
  3. మీరు చూపిన రెండు ఉదాహరణలూ మీ నిర్ణయాన్ని సమర్ధించడం లేదు అని నేను చెప్పాను. దానిపై మీరు స్పందించలేదు.
  4. పోనీ, ఈ పేజీలో ఎలాంటి సమాచారాన్ని చేర్చి విస్తరించాలి అని అడిగితే మీరు దానికి సమాధానం చెప్పలేదు.
  5. ఈ పేజీకి అంతర్వికీ లింకు ఇవ్వదగిన ఎన్వికీ పేజీని చూడండి, అందులో ఏ సమాచారం ఉందో పరిశీలించండి అని నేను చెప్పాను. కానీ మీరు ఆ పని చెయ్యలేదు. వాసి (ప్రసిద్ధి) కి అతి దగ్గరి ఇంగ్లీషు అర్థం "fame". మీరు దాన్ని పరిశీలించారో లేదో చెప్పలేదు. పరిశీలించలేదనే అనుకుంటున్నాను. కనీసం ఇప్పుడైనా దాని ఎన్వికీ పేజీ] చూడండి. అదొక "అయోమయ నివృత్తి పేజీ". ఈ పేజీ తొలగింపుకు దీన్ని కారణంగా నేను చూపడం లేదు. ఎన్వికీ వ్యాసాల ప్రసక్తి మీరే తెచ్చారు, అందుకే నేనూ ఆ ప్రసక్తి తెచ్చాను. "వాసి (ప్రసిద్ధి)" పేజీకి మీరు చూపిన వ్యాసాల కంటే బాగా దగ్గరిగా ఉన్న పేజీ ఇది. ఈ కొలబద్ద ప్రకారం చూసినా ఈ నిర్ణయం తప్పే అని తేలుతోంది.
పై విషయాలన్నిటినీ చూస్తే ఈ చర్చలో మీరు చేసిన నిర్ణయం సరైనది కాదని తేలుతోంది. అది సరైనదే అని చెప్పే ఆధారం ఒక్కటి కూడా మీరు చూపించలేదు. __చదువరి (చర్చరచనలు) 05:41, 9 జూలై 2020 (UTC)Reply

ఇక్కడ చర్చ జరిగింది, సభ్యుల అభిప్రాయాలు వెల్లడయ్యాయి, చివరికి నిర్ణయం కూడా వెలువడింది. అర్జునగారు చెప్పినట్లు చర్చ ప్రధానంగా నిఘంటువులో ఉండవలసిన పదం ఇక్కడ ఉండకూడదు అనే విషయంపైనే సాగింది. ప్రస్తుతం పేజీలో కేవలం డిక్షనరీ మాదిరిగా అర్థం ఇచ్చే సమాచారం మాత్రమే కాకుండా మరికొంత సమాచారం/విభాగాలు కూడా ఉంది/ఉన్నాయి. అంతేకాకుండా ఈ పేజీని ఒక మంచి అయోమయనివృత్తి పేజీగా చేయడానికి మేలైన అవకాశం ఉంది. కాని చర్చ ఆ దిశలో సాగలేదు. కాబట్టే అన్ని అంశాలు పరిశీలించి తొలగింపునకు నేను సరైన కారణాలు లేవన్నాను. సభ్యులు అర్థం చేసుకుంటారనుకున్నాను. కాని నిర్ణయం జరిగిననూ దానిపైనా చర్చ కొనసాగుతోంది. అర్జునగారి నిర్ణయం స్పష్టంగానే ఉన్ననూ చదువరి గారు మొదట లేవనెత్తిన 4 సందేహాలు కూడా సరైనవిగా లేవు.
1) ప్రస్తుతం ఈ పేజీలో ఉన్న సమాచారాన్ని బట్టి, పేజీని తొలగించాలా లేదా అనేది నిర్ణయించాలి. దాని గురించి అసలు మాట్లాడారా మీరు? లేదు. అస్సలు మాట్టాడలేదు. → ఆంగ్ల వికీపీడియా వ్యాసాల మాదిరిలో వ్యాసాన్ని విస్తరించవలసినదిగా సూచించడమైనది అని నిర్ణయంలో చెప్పారు కాబట్టి సరిపోయింది (అంటే తొలగింపు అవసరం లేదని స్పష్టమౌతోంది)
2) ఇది ఎంత అసంబద్ధంగా ఉందో చూడండి.. → ఇందులో అసంబద్ధత ఏముంది? వ్యాసం లేదా అయోమయ నివృత్తి పేజీలలో ఏదో ఒక విధంగా చేయడానికి అవకాశముంది అనేది అర్థమౌతోంది.
3) పోనీ ఆ ఉదాహరణలను ఇస్తూ ఆ పేజీల పద్ధతిలోనే ఈ పేజీని కూడా వికీపీడియా యోగ్యంగా ఎలా విస్తరించవచ్చో చెప్పారా? లేదు! ఎలాంటి సమాచారం రాయొచ్చో చెప్పారా? లేదు! → పరిష్కారం చెబితే మంచితే మంచిదే కాని నిర్ణయం చెప్పేవారే ఖచ్చితంగా పరిష్కారం కూడా చూపాలనే నియమం ఉందా?
4) పోనీ అదే ఇంగ్లీషు వికీపీడియాలో ఈ పేజీకి (వాసి (ప్రసిద్ధి)) సంబంధించిన పేజీ ఏమైనా ఉందా అని చూసారా? ఉంటే ఏంటా పేజీ? ఆ పేజీలో ఎలాంటి సమాచారం చేర్చారు? → ఆంగ్లవికీలో పేజీ ఉంటేనే తెవికీలో పేజీ ఉండాలనే నియమం ఉందా?
దీనికి అర్జునగారు సమాధానం ఇస్తూ ఇంతకు ముందు చెప్పినదానికి అదనంగా నేను చెప్పవలసినదేమీలేదు అన్నారు. అయిననూ మళ్ళీ ఐదు సందేహాలు సంధించారు. ఈ ఐదు సందేహాలు కూడా పై లాంటివే!

తెవికీని ముందుండి నడిపించేవారు ఉన్న పేజీలను ఏ విధంగా అభివృద్ధి చేసి తెవికీ పాఠకులకు ఉపయోగకరంగా మరల్చాలో హుందాగా ఆలోచించాలి కాని సరైన కారణం లేకున్ననూ తొలగించాలని పట్టుపట్టడం మంచి పద్దతి కాదు. తెలియని వారు తొలగించడానికి ప్రయత్నించిననూ సాధ్యమైనంత వరకు ఉన్న పేజీలను కాపాడుకోవాలి. ఇక్కడ ఎవరేమి చేసిననూ పాఠకుల కోసమే, కాబట్టి పాఠకుల ప్రయోజనం గురించే ఆలోచించాలి. ప్రతిదానికీ బాగా ఆలోచిస్తే పరిష్కారాలు తప్పకుండా లభ్యమౌతాయి. చర్చ జరిగిన పిదప నిర్ణయంపై అభ్యంతరం లేవనెత్తరాదని నేను చెప్పడం లేదు. అవసరమైతే నిర్ణయాన్ని కూడా మార్చవచ్చు కాని ఇక్కడ చర్చను మరియు ప్రతిపాదనకు స్పందనలను పరిశీలిస్తే నిర్ణయం సరైనదేనని తెలుస్తోంది. ఇక నా అభిప్రాయం చెప్పాలంటే ఈ పేజీని వ్యాసం పేజీగా కంటే ఒక అయోమయనివృత్తి పేజీగా చేయడమే బాగుంటుంది (బ్రాకెట్‌లో ఉన్న అర్థాన్ని మాత్రం తీసివేయాలి). అసలు ఇప్పుడున్న పేజీ కూడా వ్యాసం పేజీ కంటే అయోమయనివృత్తి పేజీ లక్షణమే ఎక్కువ కల్గియుంది. వాసి అంటే ఒక అర్థమే కాదు చాలా అర్థాలున్నాయి. అవన్నీ ప్రారంభంలోనే వ్రాయాలి. ఆ తర్వాత ఒక్కో విభాగంలో వాసి పేరుతో ఉన్న ప్రాంతాలు, వాసి పేరుతో ఉన్న వ్యక్తులు, వాసి పదాలున్న సామెతలు, వాసి పదాలున్న జాతీయాలు, వాసి పేరుతో ఉన్న ఇతరాలు ... తదితర విభాగాలతో ఒక మంచి అయోమయనివృత్తి పేజీ తయారై పాఠకులకు చాలా ఉపయోగపడవచ్చు. ఇతర సభ్యులు కూడా ఇంకనూ ఆలోచిస్తే మరింత మెరుగైన పేజీ తయారౌతుంది. అంతేకాని ఏ విధంగా చూసిననూ ఈ పేజీ తొలగింపునకు అవకాశం మాత్రం లేదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:00, 9 జూలై 2020 (UTC)Reply

ఏది వికీపీడియా కాదు అన్నదానిలో సుస్పష్టంగా వికీపీడియా ఒక డిక్షనరీ కాదని ఉంది. ఉదాహరణకు: అవసరం (పదం), మించి (పదం), విషయం (పదం), చర్చ (పదం), పోతుంది (క్రియ) - ఈ పదాలన్నిటికీ కూడా ఒక్కో పేజీ సృష్టించవచ్చు. కానీ తద్వారా వికీపీడియా విధానాన్ని దెబ్బతీస్తుంది. పైన నేను స్పష్టంగా విధానాన్ని ప్రస్తావించాను, ఐనప్పటికీ చంద్రకాంతరావు గారు "సరైన కారణం లేకున్ననూ" అని వ్యాఖ్యానించడం, అసలు నేను ప్రస్తావించిన కారణాన్ని గురించి ఒక్క ముక్క కూడా ప్రస్తావించకపోవడం సరిగా లేదు. నేను చెప్పిన కారణంగా (ఏది వికీపీడియా కాదు విధానం) ఈ వ్యాసాన్ని తొలగించాలి. తొలగించాకా ఉండేది ఊరిపేరుతో వాసి అన్న ఒకే ఒక్క పేజీ. ఆ తర్వాత మరేదైనా కారణంతో (ఉదాహరణకు ఎవరైనా ఆ పేరుతో ఒక సినిమా, ఇంకొకరు ఒక సీరియల్, మూడో వ్యక్తి గొప్ప నవల రాశారనుకుందాం) మూడు పేజీలు ఏర్పడినప్పుడు అయోమయం ఏర్పడుతుంది, అప్పుడు నివృత్తి చేయవచ్చు. అందాకా ఈ వ్యాసం స్పష్టంగా విధానానికి వ్యతిరేకం కాబట్టి అవసరం లేదు. ఉంచితే మెల్లిగా ఒక్కొక్కరూ పైన చెప్పిన పేజీలు తయారుచేసి విధానోల్లంఘనను పదే పదే చేసే అవకాశం ఉంది. --పవన్ సంతోష్ (చర్చ) 12:39, 10 జూలై 2020 (UTC)Reply
ఇక్కడ కేవలం పదానికి అర్థం మాత్రమే రాయబడలేదు కాబట్టి "వికీపీడియా నిఘంటువు కాదు" అనేది దీనికి వర్తించదు. డిక్షనరీలోని పదాలకు వ్యాసాలను సృష్టించరాదనే నియమమేదీ లేదు కాకుంటే దానికి ఇతర నియమాలు పాటించాల్సి ఉంటుందని నేను ఇదివరకే చెప్పాను. డిక్షనరీ పదాలకే కాదు అక్షరాలకూ వ్యాసాలుండవచ్చు, ఉన్నాయి కూడా (ఉదా: ). అయితే ఈ పేజీని వ్యాసం పేజీ కంటే అయోమయనివృత్తి పేజీగా ఉంచడానికే ఎక్కువ అవకాశముంది. మూడు పేజీలు ఉన్నప్పుడు అయోమయం ఏర్పడుతుందని తెలుసు కాని అయోమయనివృత్తి పేజీ సృష్టించాలంటే ఖచ్చితంగా మూడు వ్యాసాలు ఉండితీరాలనే నిబంధన గాని చర్చగాని ఉందా? ఇప్పటికే అయోమయ పేజీలలో ఒకేఒక్క నీలంరంగు లింకులున్నవి మస్తుగా దర్శనమిస్తున్నాయి. పలు పేజీలలో రెండు లింకులే (అందులో ఒకటి ఎర్రలింకు) ఉన్నాయి. కొన్ని అయోమయ పేజీలలో పూర్తిగా ఎర్రలింకులే ఉన్నాయి. మరి ఆ పేజీలకో నియమం, ఈ పేజీకో నియమం అంటే ఇక నేనేమీ చేయలేను. (ఉదా:కు చూడండి కిర్లోస్కర్, బౌలింగ్, వికెట్, అరూరు, అంతము, చెడు, పోలో, మీసాల, రంకు, ...) సి. చంద్ర కాంత రావు- చర్చ 20:50, 11 జూలై 2020 (UTC)Reply
  • చాన్నాళ్ళ క్రితం చర్చ, చాలా సుదీర్ఘమైన చర్చ. ఐతే ఇంత కింది దాకా చదివేంత ఓపిక ఉన్న సభ్యుల కోసం చిన్న వివరణ. పైన చంద్రకాంతరావు గారు చెప్పిన ఉండరాని అయోమయ నివృత్తుల్లో చాలావరకూ తొలగించాను. అలానే, ఫలానా ఉండకూడని పేజీ ఉంది కాబట్టి ఈ ఉండకూడని పేజీ ఉండదగ్గదే అన్న లాజిక్ కరెక్ట్ కాదు. దీన్ని ఇంగ్లీష్ వికీపీడియా వాళ్ళు చర్చల్లో అసలు తలెత్తనివ్వరు. ఎవరైనా ఈ రకం వాదన చేస్తే What about article x? అంటే ఫలానా దాని సంగతేమిటి? అన్న ఓ పేజీకి లింకిచ్చి, ఈ రకంగా వాదించకూడదూ అని చెప్తారు. తెలుగులోనూ మనం ఇలాంటి పద్ధతులు అనుసరించాల్సిన అవసరం ఇకనైనా ఉంది. --పవన్ సంతోష్ (చర్చ) 13:25, 4 సెప్టెంబరు 2020 (UTC)Reply
వికీపీడియాలో మనకు తెలియకుండా మూలాలు లేని, ఉండకూడని వ్యాసాలేమైనా ఉంటే అవి మన దృష్టిలోకి వచ్చినప్పుడు, తొలగించడమో, తొలగింపు ప్రతిపాదన చేయడమో చేయాలి. కానీ ఏదైనా వ్యాసం తొలగించాలన్నప్పుడు ఫలానా వ్యాసం ఎలా ఉంది? అని అనడం సరైనది కాదు. ఈ వ్యాసం తొలగించాలని చాలా మంది అబిప్రాయం. పై చర్చననుసరించి దీని తొలగింపుపై సరైన నిర్ణయం తీసుకోవాలి. K.Venkataramana(talk) 13:48, 4 సెప్టెంబరు 2020 (UTC)Reply
Return to "వాసి (ప్రసిద్ధి)" page.