వికీపీడియా:నిర్వాహకుల పనుల సమీక్ష/చదువరి/2019 ఏప్రిల్ - 2019 సెప్టెంబరు
వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ పేజీలో నిర్వాహకులు కనీసమాత్రం చెయ్యాల్సిన పని ఎంతో సూచన చేసారు. నా పని ఎలా ఉందో ఆర్నెల్ల కోసారి చేసే మదింపు ఈ పేజీలో ఉంటుంది.
2019 ఏప్రిల్-సెప్టెంబరు
మార్చు2019 ఏప్రిల్ 1 నుండి 2019 సెప్టెంబరు 30 వరకు నేను చేసిన నిర్వాహకత్వ పనుల వివరాలు
అడ్మిన్ స్కోరు
మార్చుఈ కాలంలో నేను తీసుకున్న మొత్తం నిర్వాహక చర్యలు: 758. ఎక్స్ టూల్స్ పరికరంలోని అడ్మిన్ స్కోరు కింది లింకులో ఉంది.
ప్రత్యేకమైన పనులు
మార్చుఈ కాలంలో నేను చేసిన ప్రత్యేకమైన పనులు. ఇవి నొర్వహక పనులు కావు. కానీ ప్రత్యేకమైన పనులు కాబట్టి ఇక్కడ ఉదహరిస్తున్నాను. (మామూలుగా చేసే నిర్వాహక పనులను ఇక్కడ పరిగణించలేదు):
- వ్యక్తుల వర్గాలను క్రమబద్ధీకరించేందుకు గాను ఒక కొత్త ప్రాజెక్టును మొదలుపెట్టాను. అయితే ఇందులో వాడుకరులను పెద్దగా చేర్చలేకపోయాను. ఇద్దరు మాత్రమే పాల్గొన్నారు. వాడుకరులను ఇందులో పాల్గొనేలా చెయ్యలేకపోవడం నా వైఫల్యం. (ప్రాజెక్టులో తలపెట్టిన పని దాదాపు మొత్తాన్నీ నేను ఒక్కణ్ణే చేసాను. ఆ విధంగా ప్రాజెక్టు లక్ష్యం నెరవేరింది. కానీ అది నా నిర్వాహకత్వానికి సంబంధించినది కాదు). ఒక నిర్వాహకుడిగా నేను ఈ ప్రాజెక్టులో 10% మాత్రమే విజయం సాధించాను.
- ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని గ్రామాల పేర్లలో ఉన్న తప్పులను సవరించేందుకు ఒక ప్రాజెక్టును మొదలుపెట్టాను. ఇందులో ఏడుగురు వాడుకరులు పాల్గొంటున్నారు. ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. నిర్వాహకత్వం పరంగా ఈ ప్రాజెక్టు నిర్వహణలో 30 శాతం విజయం సాధించినట్టు.
- ఉల్లేఖన పరికరంలో ఆటోమాటిక్ అంశాన్ని చేతనం చేసాను. గతంలో ఇది పనిచేసేది కాదు. ఇప్పుడు పనిచేస్తోంది. ఇది 100% విజయం.
- అనువాదాలు: స్థానికీకరణలు చాలానే చేసాను. లెక్కించలేదు.
పేరుబరి వారీగా నా దిద్దుబాట్లు:
మార్చువికీపీడియా: 139 (రచ్చబండను మినహాయించి) :: వికీపీడియా చర్చ: 38
మీడియావికీ: 3
మాడ్యూల్: 105
నా నిర్వాహకత్వం గురించి చెప్పేదేమైనా ఉంటే, ముఖ్యంగా విమర్శ ఉంటే, దీని చర్చా పేజీలో రాయండి.
ఈ కాలంలో నేను చేసిన మొత్తం దిద్దుబాట్లు: 12663