వికీపీడియా:నిర్వాహకుల పనుల సమీక్ష/చదువరి/2022 జూలై - 2022 డిసెంబరు
వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ పేజీలో నిర్వాహకులు చెయ్యాల్సిన కనీసమాత్రపు పని ఎంతో సముదాయం నిర్ణయించింది. ఆ సూచనల మేరకు 2019 మార్చి నుండి ఇప్పటి వరకు 6 సార్లు ఆరు నెలల సమీక్ష చేసుకుంటూ వస్తున్నాను. ఇది 7 వ సమీక్ష. 2022 జూలై 1 నుండి 2022 డిసెంబరు 31 వరకు ఉన్న 6 నెలల కాలంలో నేను చేసిన నిర్వాహకత్వ పనుల వివరాలను ఈ పేజీలో పెట్టాను. ఈ లెక్క లోకి ప్రధాన పేరుబరిలో చేసిన మార్పుచేర్పులు రావు కాబట్టి, వాటిని పరిగణించలేదు.
నిర్వాహక చర్యలు
మార్చుఈ కాలంలో నేను చేసిన మొత్తం నిర్వాహక చర్యలు: 2,373. ఈ నిర్వాహక చర్యల వివరాలను ఎక్స్ టూల్స్ పరికరంలో చూడవచ్చు.
చెప్పుకోదగ్గ పనులు
మార్చుఈ కాలంలో నేను చేసిన ప్రత్యేకమైన పనులు ఇక్కడ ఉంటాయి. ఇవి నిర్వాహకేతర పనులు కూడా ఉండవచ్చు. ప్రత్యేకమైన పనులు కాబట్టి వాటిని ఇక్కడ ఉదహరిస్తున్నాను. (మామూలుగా చేసే నిర్వాహక పనులను ఇక్కడ పరిగణించలేదు):
- వికీపీడియా:వికీప్రాజెక్టు/ఎర్రలింకుల సంస్కరణ ప్రాజెక్టును చేపట్టి, ప్రధానబరి పేజీల్లో ఉండే ఎర్రలింకులను నీలి లింకులుగా మార్చేందుకు కృషిచేసాను. 3 నెలల పాటు సాగిన ఈ ప్రాజెక్టు ద్వారా 1,06,000 పైచిలుకు ఎర్రలింకులను నీలిలింకులుగా మార్చడంలో పాత్ర పోషించాను.
- తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణ తరువాత మండలాలు, గ్రామాల పేజీల్లో పేజీల్లో చేర్చవలసిన సమాచారాన్ని స్ప్రెడ్షీట్ ద్వారా తయారుచేసాను. ఈ పనిని చేసేందుకు వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలంగాణా మండలాల పేజీల్లో చెయ్యవలసిన మార్పుచేర్పులు, వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలంగాణా గ్రామాల పేజీల్లో చెయ్యవలసిన మార్పుచేర్పులు అనే రెండు ప్రాజెక్టులు మొదలుపెట్టి నిర్వహించాను. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాయి.
- ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ తరువాత గ్రామాల పేజీల్లో చెయ్యాల్సిన మార్పులను ఆటోవికీబ్రౌజరు ద్వారా చేసాను.
- ఆటోవికీబ్రౌజరు వాడి (వాడుకరి ChaduvariAWBNew పేరిట) మొత్తం 20,512 మార్పుచేర్పులు చేసాను.
పేరుబరి వారీగా నా దిద్దుబాట్లు
మార్చు- వికీపీడియా: 396. ఇందులో రచ్చబండలో రాసినవి: 71
- మూస: 1,655
- సహాయం: 23
- వర్గం: 125
- మీడియావికీ: 2
- మాడ్యూల్: 208
ఈ కాలంలో ట్రాన్స్‌లేట్‌వికీలో నేను చేసిన అనువాదాల సంఖ్య: 135. ఈ కాలంలో నేను చేసిన మొత్తం దిద్దుబాట్లు: 7,134
నా నిర్వాహకత్వం గురించి చెప్పేదేమైనా ఉంటే, ముఖ్యంగా విమర్శ ఉంటే, దీని చర్చా పేజీలో రాయండి.