వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు/గ్రామాల పేర్ల సవరణ

గ్రామాల పేజీల్లో సమాచారం చేర్చడమనే పని జరుగుతోంది. ఆ పేజీల నాణ్యతను పెంచడమనే పనిని చేపట్టాలి. నాణ్యత విషయంలో అన్నిటికంటే ముఖ్యమైనది గ్రామం పేరును సరిగ్గా రాయడం. వికీపీడియాలో అనేక గ్రామాల పేర్లు తప్పుగా రాసాం. ఈ తప్పులను సవరించి, ఆయా పేజీలను సరైన పేరుకు తరలించడం, తత్సంబంధిత పేజీల్లో చెయ్యాల్సిన మార్పులు చెయ్యడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం.

అలా తప్పు పేరు రాయడం ఎందుకు జరిగిందంటే.. మార్చు

  1. ఈ పేర్లను ఇంగ్లీషు నుండి తెలుగీకరించారు. అలా చెయ్యడంలో అనేక తప్పులు దొర్లాయి. Ramapuram అనే పేరును రామాపురం అని, రామపురం అని, రమాపురం అని రమపురం అనీ రకరకాలుగా తెలుగు చెయ్యవచ్చు. అసలు పేరు ఏదో తెలిసినవాళ్ళే సరిగా చెయ్యగలరు. తెలియనివాళ్ళు తమకు తోచిన పేరును పెట్టి పేజీని తయారుచేసారు.
  2. ఈ ఇంగ్లీషు పేర్లన్నిటినీ భారత జనగణన వారి ఫైళ్ళనుండి తీసుకున్నారు. ఆ ఫైళ్ళలో పేర్ల స్పెల్లింగుల్లో ఉన్న లోపాలు అలాగే తెలుగులోకీ దొర్లుకొచ్చాయి. ఉదాహరణకు రెండు రాష్ట్రాల్లోని పల్లె లు, పల్లి లు అన్నీ కూడా జనగణన వారు పల్లె లుగా చూపించారు. ఆ తప్పులు వికీపీడియనులు కొన్నిటిని సరిచేసి ప్రచురించారుగానీ, మిగిలినవి అలాగే ఉండిపోయాయి. పల్లె, పల్లి ల లాగానే ఇంకా కొన్ని అలాంటి తప్పులున్నాయి - పేట్ / పేట, ఖండ్రిక / కండ్రిగ వంటివి.
  3. తెలంగాణలో, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ లోని గ్రామాల పేర్లు చాలావరకు హలంతాలు. వీటిని చాలావరకు సరిగ్గానే రాసాం. కొన్ని తప్పులున్నాయి. వాటిని సరిదిద్దాలి.
  4. ఇదే ప్రాంతంలోని గ్రామాల పేర్లు కొన్నిటికి మధ్యలో పొల్లు నిలబడుతుంది. తూప్రాన్‌పేట, సుల్తాన్‌పల్లి వంటివి. చాలా సందర్భాల్లో ఈ పేర్లు తూప్రాంపేట, సుల్తాన్ పల్లి.. ఇలా అయ్యాయి. వీటిని సరిదిద్దాలి.

కొన్ని తప్పులను వికీపీడియనులు గమనించారు.. మార్చు

  1. పేజీపేరు తప్పుగా ఉన్నప్పటికీ, పాఠ్యంలో ఈ పేరును సరిదిద్దారు. అలా సరిదిద్దిన వారికి పేజీని సరయిన పేరుకు తరలించడం తెలిసి ఉండదు బహుశా.
  2. ఫలానా గ్రామం పేరు తప్పుగా పడిందని కొన్ని వర్గాల్లో రాసారు.

పేజీ పేరు తప్పో కాదో నిర్ణయించడమెలా? మార్చు

అసలు, పేజీ పేరు తప్పో కాదో ముందు నిర్ణయించాలిగా. అదెలా?

  1. అన్నిటికంటే విశ్వసనీయమైన వనరులివి.. వీళ్ళు చెప్పిన పేరు సరైనదని భావించవచ్చు.
    1. ఆయా గ్రామస్థులు,
    2. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు.
    3. ఆ మండలం లోని ప్రజలు
  2. అలాంటి విశ్వసనీయ వనరులు లేకపోతే, వికీపీడియాలో ఏ పేరైతే ఉందో ఆ పేరుతో గూగుల్లో వెతకాలి. వచ్చిన ఫలితాల్లో..
    1. ఇంగ్లీషు పేజీల లింకులను అసలు పట్టించుకోవద్దు.
    2. వికీపీడియా, దాని మిర్రరు సైట్లు, వికీపీడియాపై ఆధారపడిన సైట్లనూ పట్టించుకోవద్దు.
    3. విశ్వసనీయ లింకు (ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభ, నమస్తే తెలంగాణ వంటి వార్తాపత్రికల లింకు) కనబడితే, ఆ లింకుకు వెళ్ళి అక్కడ గ్రామం పేరును ఎలా రాసారో చూడండి. వాళ్ళు ఆ పేజీలో పేర్కొన్న గ్రామం మనం వెతుకుతున్న గ్రామమేనా (అదే మండలానికి చెందినదేనా) అనే సంగతిని రూఢి పరచుకోవాలి. ఆ పేరు వికీ పేరుతో సరిపోలితే ఆ పేరు దాదాపుగా సరైనదేనని నిశ్చయించుకోవచ్చు. అలాంటి విశ్వసనీయ లింకులు ఒకటి కంటే ఎక్కువ కనబడితే, ఆ పేరు సరైనదేనని మరింత గట్టిగా రూఢి పరచుకోవచ్చు.
    4. ఫోటోలు: గ్రామంలోని ప్రభుత్వ భవనాల (పంచాయితీ భవనం, గ్రంథాలయం వంటివి), దుకాణాలు వగైరాల ఫొటోలుంటే, ఆ భవనాల బోర్డులపై పేరు ఎలా ఉందో చూడవచ్చు. ఇది కూడా విశ్వసనీయ వనరే. ఎన్ని ఎక్కువ బోర్డులు కనబడితే అంత ఎక్కువ విశ్వసనీయత.

ఫలితాల్లో అలాంటి విశ్వసనీయ లింకులు లేకపోయినా, ఫోటోల్లో ఆ పేరు లేకపోయినా సదరు గ్రామం పేరు సందేహాస్పదంగా భావించాలి.

సరైన పేరేదో తెలుసుకోవడం ఎలా.. మార్చు

పేరు తప్పని తేలిందనుకోండి. అయితే సరైన పేరేదో తెలుసుకోవడం ఎలాగా? మనకు సరిగా తోచిన రెండు మూడు పేర్లతో గూగుల్లో వెతకాలి.

పనికొచ్చే వనరులు మార్చు

  1. ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభ, నమస్తే తెలంగాణ వంటి పేరొందిన వార్తాపత్రికల లింకులు వస్తే ఆ పేరే సరైందని దాదాపుగా అనుకోవచ్చు. అయితే ఆ ఫలితంలో వచ్చిన గ్రామం, మనం వెతుకున్న గ్రామం ఒకటేనని నిర్ధారించుకున్నాకే ఈ పేరు సరైనదని నిర్ధారించుకోవాలి. ఎందుకంటే, ఒకే పేరుతో అనేక గ్రామాలున్నాయని గుర్తుంచుకోండి.
  2. ఫలితాల్లో వార్తాపత్రికలు రాకపోతే.. సామాజిక మాధ్యమాల (బ్లాగులు, ఫేసుబుక్కు, వగైరా) లింకులేవైనా వచ్చాయేమో చూడండి. మామూలుగా అయితే ఇవి విశ్వసనీయమైనవి కావు. కానీ సాధారణంగా ఆయా గ్రామాలకు చెందిన వ్యక్తులే ఈ పేజీలు పెట్టుకుంటారు కాబట్టి, వారు తమ గ్రామం పేరును సరిగానే రాసుకుంటారని భావించవచ్చు కాబట్టీ.. వీటిని పరిగణన లోకి తీసుకోవచ్చు. మూణ్ణాలుగు పైగా వేరువేరు లింకులు మనం వెతుకుతున్న పేరునే చూపిస్తూంటే ఆ పేరు సరైనదని మరింత గట్టిగా అనుకోవచ్చు. ఒకటో రెండో వస్తే అది కొంత బలహీనమైన సూచికగా భావించాలి. కొందరు బ్లాగరులు, ఫేసుబుక్కరులూ వికీపేజీని తీసుకెళ్ళి తమ పేజీల్లో పెట్టేసుకున్నారు (అక్కడి పాఠ్యాన్ని చూస్తే తెలుస్తుంది వికీ నుండి గ్రహించారని). వాటిని పట్టించుకోకూడదని వేరే చెప్పాల్సిన పనిలేదు.

పనికిరాని వనరులు మార్చు

కింది లింకులు అస్సలు పనికిరావు.

  1. ఫలితాల్లో వికీపీడియా, దాని మిర్రరు సైట్లూ వస్తాయి. మిర్రరు సైట్లలో వచ్చే సమాచారం వికీలో ఉన్న సమాచారం లాగానే ఉంటుంది. అది మిర్రరనేందుకు అదే గుర్తు. గ్రామం పేరు సరైనదో కాదో నిర్ధారించుకునేందుకు వికీపీడియా, దాని మిర్రర్లూ అస్సలు పనికిరావు.
  2. ఫలితాల్లో రాష్ట్ర ప్రభుత్వాల సైట్లు వస్తాయి. వాటిని పట్టించుకోకుండా ఉంటే మంచిది. కొన్ని ప్రభుత్వ సైట్లు వికీపీడియానే అనుసరిస్తున్నాయన్న సూచనలున్నాయి.
  3. మీరు చెందుర్తి పేరుతో వెతుకుతున్నారనుకోండి.. చెందుర్తి వాతావరణం ఎలా ఉంది.. అంటూ కొన్ని వాతావరణం సైట్ల లింకులు (స్కైమెట్ వెదర్ వంటివి) వస్తాయి. వాటిని పట్టించుకోకండి. అవి వికీపీడియాను అనుసరిస్తున్నట్లుగా సూచనలున్నాయి.

సరిదిద్దడం మార్చు

సరైన పేరేదో తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు సరిదిద్దాలి. ఈ విధానమేంటి?

గ్రామం పేజీ మార్చు

  1. ఒక మండలం పేజీని తీసుకోవాలి. ఆ మండలంలోని గ్రామాల పేజీల్లో ఒకదాన్ని తీసుకుని సవరించాలి.
  2. మండలం పేజీ లోని గ్రామం పేరును, దాని లింకును రెంటినీ సవరించాలి.
  3. తప్పు పేరుతో ఉన్న గ్రామం పేరును, చర్చాపేజీతో సహా సరైన పేరుకు తరలించాలి. ఈ పని ఏ వాడుకరైనా చెయ్యవచ్చు. తరలించేటపుడు పాత పేజీని దారిమార్పుగా ఉంచాలి.
  4. చివరగా, "మండలం లోని గ్రామాలు" మూసలో ఈ పేర్లను సవరించాలి.

మండలం పేజీ మార్చు

  1. జిల్లా పేజీలో పేరు తప్పుగా ఉంటే: అందులో చూపించిన మండలాల జాబితాలో తప్పుగా ఉన్న మండలాల పేర్లను సవరించాలి.
  2. లింకు తప్పుగా ఉంటే:
    1. సంబంధిత మండల పేజీని సరైన పేరుకు తరలించాలి.
    2. జిల్లా పేజీలో సంబంధిత లింకును కొత్త పేజీకి మార్చాలి.

ఆ విధంగా ఒక మండలం లోని గ్రామాల పేర్లను, అవసరమైన చోట్ల ఆ మండలం పేరునూ సవరించాక ఆ మండలం పేజీని కింది "మండలాల వారీగా సవరణల స్థితి" అనే విభాగంలో చేర్చాలి.

కొన్ని ఉపయోగపడే లింకులు మార్చు

తప్పు పేర్లను గమనించిన వారు వెంటనే మార్చెయ్యడం సరైన పద్ధతి. అలా చెయ్యలేని పరిస్థితులుంటే కనీసం ఆయా తప్పులను, సరైన పేర్లనూ ఇక్కడ రాస్తే ఇతర సభ్యులు తగు చర్య తీసుకునే వీలుంటుంది. ఒకే లింకులో ఒకటి కంటే ఎక్కువ గ్రామాల పేర్లుంటే ఆ పేర్లన్నీ రాయాలి. వికీ మూలాలుగా పనికొచ్చే పేర్లనే ఇక్కడ రాయాలని గమనించాలి.

  1. గతంలో గ్రామ పంచాయితీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఈ ఆంధ్రభూమి లింకులో ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లోని చాలా గ్రామాల పేర్లు ఇందులో లభిస్తాయి. ఈ వెబ్‌పేజీ నుండి ఇతర పేజీలకు ఉన్న లింకుల ద్వారా మరిన్ని గ్రామాల పేర్లను కూడా చూడొచ్చు.
  2. మీభూమి (ఆంధ్రప్రదేశ్ గ్రామాలు)
  3. ఆంధ్రప్రదేశ్ గ్రామాలు
  4. ధరణి (తెలంగాణ గ్రామాలు - ప్రస్తుతం వికారాబాదు జిల్లా మాత్రమే చూపిస్తోంది)
  5. గుంటూరు జిల్లా గ్రామాలు
  6. విశాఖ జిల్లాలో కొన్ని మండలాల్లో కొన్ని గ్రామాలు
  7. విశాఖ జిల్లా జి.మాడుగుల, కుంబిడిసింగి, గద్దెరాయి
  8. విశాఖ జిల్లా జి.మాడుగుల మండలంలో సొలభం, గలగండ, వంతాల, లక్కపాడు, బరిసింగి, గానుగురోలు, అంబలమామిడి, దబ్బలగరువు, గెమ్మిలి, పాచనపల్లి, కొక్కిరాపల్లి, బొడ్డగొంది, కిముడుపల్లి, వెన్నెల కోట
  9. పశ్చిమగోదావరి జిల్లాలో 2000 కన్నా తక్కువ జనాభా కలిగి ఆంధ్రబ్యాంక్ అవుట్లెట్ కలిగిన గ్రామాలు

పాల్గొంటున్న వాడుకరులు మార్చు

ఒకే జిల్లా లోని పేజీలపై ఒకరి కంటే ఎక్కువ మంది వాడుకరులు పనిచెయ్యవచ్చు. ఒకే మండలానికి చెందిన గ్రామాల పేజీలపై ఒకరి కంటే ఎక్కువ మంది పని చెయ్యకూడదని ఏమీ లేదు గానీ, అంత అవసరం లేదని మనం గ్రహించాలి.

క్ర.సం సంతకం జిల్లా
1 చదువరి (చర్చరచనలు) గుంటూరు జిల్లా
2 వాడుకరి:Pavan santhosh.s పశ్చిమ గోదావరి జిల్లా
3 వాడుకరి:B.K.Viswanadh పశ్చిమ గోదావరి జిల్లా
4 ప్రణయ్‌రాజ్ వంగరి నల్లగొండ జిల్లా
5 యర్రా రామారావు అనంతపురం జిల్లా
6 సి. చంద్ర కాంత రావు- చర్చ మహబూబ్‌నగర్ జిల్లా
7 --కె.వెంకటరమణచర్చ శ్రీకాకుళం జిల్లా

మండలాల వారీగా సవరణల స్థితి మార్చు

ఆంధ్రప్రదేశ్ మార్చు

శ్రీకాకుళం జిల్లా మార్చు

క్ర.సం మండలం స్థితి (పూర్తైంది / పని జరుగుతోంది) విశేషాలేమైనా..
1 ఆమదాలవలస మండలం పని పూర్తయినది 3 గ్రామాల శీర్షికలలో దోషాలను సరిచేసితిని. ఆయా వ్యాసాలలోని దోషాలను కూడా సరిచేసితిని.
2 సారవకోట మండలం పని పూర్తయినది 9 గ్రామాల శీర్షికలలో దోషాలను సరిచేసితిని. ఆయా వ్యాసాలలోని దోషాలను కూడా సరిచేసితిని.
3 పాతపట్నం మండలం పని పూర్తయినది 12 గ్రామాల శీర్షికలలో దోషాలను సరిచేసితిని. ఆయా వ్యాసాలలోని దోషాలను కూడా సరిచేసితిని.
4 ఎచ్చెర్ల మండలం పని పూర్తయినది 10 గ్రామాల శీర్షికలలో దోషాలను సరిచేసితిని. ఆయా వ్యాసాలలోని దోషాలను కూడా సరిచేసితిని. దారిమార్పు లేకుండా వాస్తవ శీర్షికలకు తరలించితిని.
5 నరసన్నపేట మండలం పని పూర్తయినది 9 గ్రామాల శీర్షికలలో దోషాలను సరిచేసితిని. దారిమార్పు లేకుండా వాస్తవ శీర్షికలకు తరలించితిని. ఆయా వ్యాసాలలోని ఉన్న దోషాలను కూడా సరిచేసితిని. మూసలో కూడా వ్యాసాల పేర్లను సరిదిద్దాను.

విజయనగరం జిల్లా మార్చు

క్ర.సం మండలం స్థితి (పూర్తైంది / పని జరుగుతోంది) విశేషాలేమైనా..
1

విశాఖపట్నం జిల్లా మార్చు

క్ర.సం మండలం స్థితి (పూర్తైంది / పని జరుగుతోంది) విశేషాలేమైనా..
1

తూర్పు గోదావరి జిల్లా మార్చు

క్ర.సం మండలం స్థితి (పూర్తైంది / పని జరుగుతోంది) విశేషాలేమైనా..
1

పశ్చిమ గోదావరి జిల్లా మార్చు

క్ర.సం మండలం స్థితి (పూర్తైంది / పని జరుగుతోంది) విశేషాలేమైనా..
1 అత్తిలి మండలం పూర్తైంది రెండు గ్రామాల పేర్ల మార్పు, పాతవాటిని దారిమార్పుగా వదిలేశాను.
2 తాడేపల్లిగూడెం మండలం పూర్తైంది కుంచనపల్లె అని ఉన్నదాన్ని కుంచనపల్లి (తాడేపల్లిగూడెం)గా దిద్దాను. క్రిష్ణా పురం అన్నదాన్ని కృష్ణాపురం (తాడేపల్లిగూడెం)గా దిద్దాను. అలానే వాటికి లింకున్న మూసలోనూ, మండలం పేజీలోనూ దిద్దాను. పట్టెంపాలెం (తాడేపల్లిగూడెం) సరైన పేరే, కానీ మరో రూపమైన పట్టింపాలెం కూడా ప్రచారంలో ఉండడంతో దారిమార్పు రూపొందించాను
3 జీలుగుమిల్లి మండలం పూర్తైంది బోతప్పగూడెం నుండి బొత్తప్పగూడెం, నెర్సుగూడెం నుండి నెరసుగూడెం, పాలచెర్ల రాజవరం నుండి పాలచర్ల రాజవరం, బర్రెంకలపాడు నుండి బర్రింకలపాడు అన్న పేర్లకు దారిమార్పుతో తరలించాను. మూసల్లో, పేజీల్లో దిద్దుబాట్లు చేశాను.
4 పోడూరు మండలం పని పూర్తి అయ్యింది పోడూరు తో సహా అన్ని గ్రామాల పేర్లు సరిగానే ఉన్నాయి. వాడుకగా ఉన్న మరో పేరును (ఉదా.రావిపాడు-రాయిపాడు)గ్రామ సమాచారపు మొదటి పేరాలో చేర్చాను.
5 ఆకివీడు మండలం పూర్తైంది కోళ్ళపఱ్ఱును కోళ్ళపర్రు, మాదివాడను మదివాడ, సిద్దాపురం పేరును సిద్ధాపురంగా మార్చాను. మండలం మూసలోనూ, వ్యాసంలోనూ పేరు మార్చాను.
6 దేవరపల్లి మండలం పని మొదలుపెట్టాను

కృష్ణా జిల్లా మార్చు

క్ర.సం మండలం స్థితి (పూర్తైంది / పని జరుగుతోంది) విశేషాలేమైనా..
1

గుంటూరు జిల్లా మార్చు

గుంటూరు జిల్లా గ్రామాల పేర్లను సవరించే పని దాదాపు పూర్తైంది. కొన్ని గ్రామాల పేర్ల విషయంలో సందేహాలున్నందున వాటిపై చర్య ఏమీ తీసుకోకుండా వాటిని వర్గం:సందేహాస్పదమైన పేరు, ఉనికి గల గుంటూరు జిల్లా గ్రామాలు అనే వర్గంలోకి చేర్చాను. కింది పట్టికలో వివరాలున్నాయి __చదువరి (చర్చరచనలు) 05:33, 10 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

క్ర.సం మండలం స్థితి (పూర్తైంది / పని జరుగుతోంది) విశేషాలేమైనా..
1 అచ్చంపేట మండలం పూర్తైంది కస్తల అగ్రహారం, నీలేశ్వరపాలెం ల లింకులను మార్చాను. మిగతావాటి లింకులను వివిధ వనరులతో సరి చూసాను. అవసరమైన చోట్ల చర్చాపేజీల్లో నా గమనింపులను చేర్చాను. ఒక గ్రామం పేజీని (తేళ్లచెరువు) తొలగించాను. మూసలో లింకులను సరిచేసాను. మండల పేజీలోను, గ్రామాలాన్నిటి పేజీల్లోనూ గ్రామాల, మండలాల లింకులను సరిచేసాను. గ్రామాల పేజీల్లో ఉన్న {{గుంటూరు జిల్లా}} అనే మూసను తీసేసాను. ప్రభుత్వ సైట్లలోని డేటాపై గుడ్డిగా ఆధారపడలేదు.
2 అమరావతి మండలం పూర్తైంది యండ్రాయి, పెద మద్దూరుల పేర్లు మార్చాను. మునుగోడు (అమరావతి మండలం)కు మునగోడు అనే దారిమార్పు సృష్టించాను. అన్ని పేజీల్లోనూ మండలం లింకు సరిచేసాను. అనవసరమైన మూసలను తీసేసాను. మండలం లోని గ్రామాల మూసను సవరించాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, ఆ గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకులను తీసెయ్యలేదు.
3 అమృతలూరు మండలం పూర్తైంది పేర్లన్నీ బానే ఉన్నాయి. బోడపాడును మాత్రం ఆకృతి మారుస్తూ తరలించాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, ఆ గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకులను తీసెయ్యలేదు.
4 ఈపూరు మండలం పూర్తైంది ఇనుమళ్ళ, దాసుళ్ళపల్లి, వానికుంట లను సరిన పేర్లకు తరలించాను. కొచ్చర్లకు దారిమార్పు సృష్టించాను. మండల లింకులు మార్చాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, ఆ గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకులను తీసెయ్యలేదు.
5 కర్లపాలెం మండలం పూర్తైంది పేర్ల మార్పులేమీ చెయ్యాల్సిన అవసరం పడలేదు. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, ఆ గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకులను తీసెయ్యలేదు.
6 కాకుమాను మండలం పూర్తైంది పేర్ల మార్పులు చెయ్యాల్సిన అవసరం పడలేదు. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, ఆ గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకులను తీసెయ్యలేదు.
7 కారంపూడి మండలం పూర్తైంది ఒప్పిచెర్ల ను ఒప్పిచర్ల గాను, నర్మలపాడును నరమాలపాడు గాను మార్చాను. మూడు గ్రామాల పేజీలను తొలగించాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, ఆ గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకులను తీసెయ్యలేదు.
8 కొల్లిపర మండలం పూర్తైంది గ్రామాల పేర్లు సరిగానే ఉన్నాయి. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, ఆ గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకులను తీసెయ్యలేదు.
9 కొల్లూరు మండలం పూర్తైంది రెవిన్యూ గ్రామాల పేర్లు సరిగానే ఉన్నాయి. ఇతర గ్రామాల పేర్ల ఆకృతి సరిగా లేనందున సరైన అకృతికి తరలించాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, ఆ గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకులను తీసెయ్యలేదు.
10 క్రోసూరు మండలం పూర్తైంది ఉయ్యందన, హసనాబాద్ గ్రామాలను ప్రస్తుత పేర్లకు తరలించాను. మూసలో ఈ మార్పులు చేసాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, ఆ గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకులను తీసెయ్యలేదు.
11 గుంటూరు మండలం పూర్తైంది అక్కిరెడ్డిపాలెం ను అంకిరెడ్డిపాలెం కు తరలించాను. మండలం లోని గ్రామాల మూసలో మార్పులు చేసాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, ఆ గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకులను తీసెయ్యలేదు.
12 గురజాల మండలం పూర్తైంది ఒక గ్రామాన్ని కొత్త పేరుకు తరలించాను. మండలం లోని గ్రామాల మూసలో మార్పులు చేసాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, ఆ గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకులను తీసెయ్యలేదు.
13 చిలకలూరిపేట మండలం పూర్తైంది ఆరు పేజీలను సరైన పేరుకు తరలించాను. మండలం లోని గ్రామాల మూసలో మార్పులు చేసాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, ఆ గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకులను తీసెయ్యలేదు.
14 చుండూరు మండలం పూర్తైంది ఒక పేజీని వేరే పేరుకు తరలించాను. రెండు రెవిన్యూయేతర గ్రామాల పేజీల పేర్ల విషయంలో సందిగ్ధత ఉండడంతో అలాగే ఉంచేసాను. మూసలో మార్పులేమీ చెయ్యలేదు. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, ఆ గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకులను తీసెయ్యలేదు.
15 చెరుకుపల్లి (గుంటూరు జిల్లా) మండలం పూర్తైంది ఐదు తరలింపులు చేసాను. మూసను తగు విధంగా మార్చాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, ఆ గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకులను తీసెయ్యలేదు.
16 చేబ్రోలు మండలం పూర్తైంది తరలింపుల అవసరమేమీ పడలేదు. గత పేజీల్లో చేసినట్లుగానే - 1.మండల లింకులు మార్చాను, 2.అనవసరమైన మూసలు తీసేసాను, 3. మూసలో మండలం లింకు ఇచ్చాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, ఆ గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకులను తీసెయ్యలేదు.
17 తాడికొండ మండలం పూర్తైంది తరలింపుల అవసరమేమీ పడలేదు. గత పేజీల్లో చేసినట్లుగానే - 1.మండల లింకులు మార్చాను, 2.అనవసరమైన మూసలు తీసేసాను, 3. మూసలో మండలం లింకు ఇచ్చాను. రెవిన్యూయేతర గ్రామాలేమీ లేవు. కాబట్టి ఆ వర్గాన్ని సృష్టించలేదు.
18 తాడేపల్లి మండలం పూర్తైంది తరలింపుల అవసరమేమీ పడలేదు. గత పేజీల్లో చేసినట్లుగానే - 1.మండల లింకులు మార్చాను, 2.అనవసరమైన మూసలు తీసేసాను, 3. మూసలో మండలం లింకు ఇచ్చాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, ఆ గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకులను తీసెయ్యలేదు.
19 తుళ్ళూరు మండలం పూర్తైంది ఒక పేజీని తరలించాను. - 1.మండల లింకులు మార్చాను, 2.అనవసరమైన మూసలు తీసేసాను, 3. మూసలో మండలం లింకు ఇచ్చాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, ఒక గ్రమాన్ని అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీ లింకులను తీసెయ్యలేదు.
20 తెనాలి మండలం పూర్తైంది. పెదవూడి, పెరగలవూడి అనే రెండు గ్రామాల పేజీలను తొలగించాను. 3 పేజీలను తరలించాను. ఈ రెండు గ్రామాల పేర్లు జాలంలో కనబడలేదు. మూసను తదనుగుణంగా మార్చాను. 1.మండల లింకులు మార్చాను, 2.అనవసరమైన మూసలు తీసేసాను, 3. మూసలో మండలం లింకు ఇచ్చాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, ఆ గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకులను తీసెయ్యలేదు.
21 దాచేపల్లి మండలం పూర్తైంది రెండు పేజీలను తరలించాను. 1.మండల లింకులు మార్చాను, 2.అనవసరమైన మూసలు తీసేసాను, 3. మూసలో మండలం లింకు ఇచ్చాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, ఆ గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకులను తీసెయ్యలేదు.
22 దుగ్గిరాల మండలం పూర్తైంది పెరకలపూడి --> పేరుకలపూడి; దేవరపల్లె అగ్రహారం --> దేవరపల్లి అగ్రహారం. మూసలో లింకులు మార్చాను. 1.మండల లింకులు మార్చాను, 2.అనవసరమైన మూసలు తీసేసాను, 3. మూసలో మండలం లింకు ఇచ్చాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, ఆ గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకులను తీసెయ్యలేదు.
23 దుర్గి మండలం పూర్తైంది రెండు పేజీలను వేరే పేజీల్లో విలీనం చేసి, వీటిని దారిమార్పులుగా మార్చాను. మూసలో లింకులు సవరించాను. 1.మండల లింకులు మార్చాను, 2.అనవసరమైన మూసలు తీసేసాను, 3. మూసలో మండలం లింకు ఇచ్చాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, ఆ గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకులను తీసెయ్యలేదు.
24 నకరికల్లు మండలం పూర్తైంది దేచవరము --> దేచవరం. మూసలో లింకుల సవరణ. 1.మండల లింకులు మార్చాను, 2.అనవసరమైన మూసలు తీసేసాను, 3. మూసలో మండలం లింకు ఇచ్చాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, ఆ గ్రామాన్ని అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీ లింకును తీసెయ్యలేదు.
25 నగరం మండలం పూర్తైంది ఐదు పేజీలను తరలించాను. మూసలో లింకులు మార్చాను. 1.మండల లింకులు మార్చాను, 2.అనవసరమైన మూసలు తీసేసాను, 3. మూసలో మండలం లింకు ఇచ్చాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, 24 గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకును తీసెయ్యలేదు.
26 నరసరావుపేట మండలం పూర్తైంది ఒక పేజీని తరలించాను, మూసలో లింకును మార్చాను. 1.మండల లింకులు మార్చాను, 2.అనవసరమైన మూసలు తీసేసాను, 3. మూసలో మండలం లింకు ఇచ్చాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, 9 గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకును తీసెయ్యలేదు.
27 నాదెండ్ల మండలం పూర్తైంది తరలింపులేమీ చెయ్యలేదు. 1.మండల లింకులు మార్చాను, 2.అనవసరమైన మూసలు తీసేసాను, 3. మూసలో మండలం లింకు ఇచ్చాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, 9 గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకును తీసెయ్యలేదు.
28 నిజాంపట్నం మండలం పూర్తైంది 11 పేజీలను తరలించాను, మూసలో వాటి లింకులు సవరించాను. 1.మండల లింకులు మార్చాను, 2.అనవసరమైన మూసలు తీసేసాను, 3. మూసలో మండలం లింకు ఇచ్చాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, 9 గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకును తీసెయ్యలేదు.
29 నూజెండ్ల మండలం పూర్తైంది 3 పేజీలను తరలించాను, మూసలో వాటి లింకులు సవరించాను. 1.మండల లింకులు మార్చాను, 2.అనవసరమైన మూసలు తీసేసాను, 3. మూసలో మండలం లింకు ఇచ్చాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, 10 గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకును తీసెయ్యలేదు.
30 పిట్టలవానిపాలెం మండలం పూర్తైంది ఒక పేజీని తరలించాను. 1.మండల లింకులు మార్చాను, 2.అనవసరమైన మూసలు తీసేసాను, 3. మూసలో మండలం లింకు ఇచ్చాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, 7 గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకును తీసెయ్యలేదు.
31 పిడుగురాళ్ళ మండలం పూర్తైంది మొర్జంపాడు పేజీని తొలగించాను. వేరే మండలంలోని ఈ ఊరి పేజీలో పిడుగురళ్ళ మూసను ఉంచడంతో ఈ గ్రామం పేజీ ఈ మండలం లోకి వచ్చి చేరింది. తిసేసాను. 1.మండల లింకులు మార్చాను, 2.అనవసరమైన మూసలు తీసేసాను, 3. మూసలో మండలం లింకు ఇచ్చాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, 2 గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకును తీసెయ్యలేదు.
32 పెదకాకాని మండలం పూర్తైంది ఒక పేజీని తరలించాను. 1.మండల లింకులు మార్చాను, 2.అనవసరమైన మూసలు తీసేసాను, 3. మూసలో మండలం లింకు ఇచ్చాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, 3 గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకును తీసెయ్యలేదు.
33 పెదకూరపాడు మండలం పూర్తైంది పేజీలేమీ తరలించలేదు. 1.మండల లింకులు మార్చాను, 2.అనవసరమైన మూసలు తీసేసాను, 3. మూసలో మండలం లింకు ఇచ్చాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, 2 గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకును తీసెయ్యలేదు.
34 పెదనందిపాడు మండలం పూర్తైంది ఒక పేజీని తరలించాను. 1.మండల లింకులు మార్చాను, 2.అనవసరమైన మూసలు తీసేసాను, 3. మూసలో మండలం లింకు ఇచ్చాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, 8 గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకును తీసెయ్యలేదు.
35 పొన్నూరు మండలం పూర్తైంది 4 పేజీలను తరలించాను, మూసలో వాటి లింకులు సవరించాను. 1.మండల లింకులు మార్చాను, 2.అనవసరమైన మూసలు తీసేసాను, 3. మూసలో మండలం లింకు ఇచ్చాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, 11 గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకును తీసెయ్యలేదు.
36 ప్రత్తిపాడు మండలం పూర్తైంది 4 పేజీలను తరలించాను, మూసలో వాటి లింకులు సవరించాను. 1.మండల లింకులు మార్చాను, 2.అనవసరమైన మూసలు తీసేసాను, 3. మూసలో మండలం లింకు ఇచ్చాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, 8 గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకును తీసెయ్యలేదు.
37 ఫిరంగిపురం మండలం పూర్తైంది 2 పేజీలను తరలించాను, మూసలో వాటి లింకులు సవరించాను. 1.మండల లింకులు మార్చాను, 2.అనవసరమైన మూసలు తీసేసాను, 3. మూసలో మండలం లింకు ఇచ్చాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, 3 గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకును తీసెయ్యలేదు.
38 బాపట్ల మండలం పూర్తైంది 3 పేజీలను తరలించాను, మూసలో వాటి లింకులు సవరించాను. 1.మండల లింకులు మార్చాను, 2.అనవసరమైన మూసలు తీసేసాను, 3. మూసలో మండలం లింకు ఇచ్చాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, 11 గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకును తీసెయ్యలేదు.
39 బెల్లంకొండ మండలం పూర్తైంది పేజీలను తరలించలేదు. 1.మండల లింకులు మార్చాను, 2.అనవసరమైన మూసలు తీసేసాను, 3. మూసలో మండలం లింకు ఇచ్చాను. ఈ మండలంలో రెవిన్యూయేతర గ్రామాలేమీ లేవు.
40 బొల్లాపల్లి మండలం పూర్తైంది పేజీలను తరలించలేదు. 1.మండల లింకులు మార్చాను, 2.అనవసరమైన మూసలు తీసేసాను, 3. మూసలో మండలం లింకు ఇచ్చాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, 4 గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకును తీసెయ్యలేదు.
41 భట్టిప్రోలు మండలం పూర్తైంది 3 పేజీలను తరలించాను, మూసలో వాటి లింకులు సవరించాను. 1.మండల లింకులు మార్చాను, 2.అనవసరమైన మూసలు తీసేసాను, 3. మూసలో మండలం లింకు ఇచ్చాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, 11 గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకును తీసెయ్యలేదు.
42 మంగళగిరి మండలం పూర్తైంది ఒక పేజీని తరలించాను. 1.మండల లింకులు మార్చాను, 2.అనవసరమైన మూసలు తీసేసాను, 3. మూసలో మండలం లింకు ఇచ్చాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, 3 గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకును తీసెయ్యలేదు.
43 మాచవరం (గుంటూరు జిల్లా) మండలం పూర్తైంది ఒక పేజీని తరలించాను. దాని లింకును మూసలో మార్చాను. 1.మండల లింకులు మార్చాను, 2.అనవసరమైన మూసలు తీసేసాను, 3. మూసలో మండలం లింకు ఇచ్చాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, 4 గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకును తీసెయ్యలేదు.
44 మాచర్ల మండలం పూర్తైంది 6 పేజీలను తరలించాను. వాటి లింకులను మూసలో మార్చాను. మాచెర్ల మండలంలోని గ్రామాలు మూసను {{మాచర్ల మండలంలోని గ్రామాలు}} మూసకు తరలించి, అన్ని పేజీలో ఆ మూసను మార్చాను. 1.మండల లింకులు మార్చాను, 2.అనవసరమైన మూసలు తీసేసాను, 3. మూసలో మండలం లింకు ఇచ్చాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, 13 గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకును తీసెయ్యలేదు. మాచర్ల (పట్టణ) అనే గ్రామం లేదేమోనని సందేహంగా ఉంది. దాన్ని నిర్ధారించుకుని తీసెయ్యవచ్చు.
45 ముప్పాళ్ళ (గుంటూరు) మండలం పూర్తైంది 6 పేజీలను తరలించాను. వాటి లింకులను మూసలో మార్చాను. 1.మండల లింకులు మార్చాను, 2.అనవసరమైన మూసలు తీసేసాను, 3. మూసలో మండలం లింకు ఇచ్చాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, 13 గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకును తీసెయ్యలేదు. దెచవరప్పాడు అనే గ్రామం పేరు తప్పేమోనని సందేహంగా ఉంది. గూగిలిస్తే సరైన సమాచారం దొరకలేదు. సరైన సమాచారం దొరికాక తగు చర్య తీసుకోవాలి.
46 మేడికొండూరు మండలం పూర్తైంది 1 పేజీని తరలించాను. మూసలో లింకును మార్చాను. 1.మండల లింకులు మార్చాను, 2.అనవసరమైన మూసలు తీసేసాను, 3. మూసలో మండలం లింకు ఇచ్చాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, 1 పేజీని అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీ లింకును తీసెయ్యలేదు.
47 యడ్లపాడు మండలం పూర్తైంది 5 పేజీలను తరలించాను. వాటి లింకులను మూసలో మార్చాను. 1.మండల లింకులు మార్చాను, 2.అనవసరమైన మూసలు తీసేసాను, 3. మూసలో మండలం లింకు ఇచ్చాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, 6 గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకును తీసెయ్యలేదు.
48 రాజుపాలెం (గుంటూరు) మండలం పూర్తైంది ఒక పేజీని తరలించాను. మూసలో లింకును మార్చాను. రాజుపాలెం(గుంటూరు) మండలం లోని గ్రామాలు మూసను సరైన ఆకృతి గల {{రాజుపాలెం (గుంటూరు) మండలం లోని గ్రామాలు}} పేరుకు తరలించి, పేజీలన్నిటిలో పాత మూసను తీసేసి కొత్త మూసను పెట్టాను. 1.మండల లింకులు మార్చాను, 2.అనవసరమైన మూసలు తీసేసాను, 3. మూసలో మండలం లింకు ఇచ్చాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, 3 గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకును తీసెయ్యలేదు.
49 రెంటచింతల మండలం పూర్తైంది పేజీలనేమీ తరలించలేదు. 1.మండల లింకులు మార్చాను, 2.అనవసరమైన మూసలు తీసేసాను, 3. మూసలో మండలం లింకు ఇచ్చాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, 2 గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకును తీసెయ్యలేదు.
50 రేపల్లె మండలం పూర్తైంది 5 పేజీలను తరలించాను. వాటి లింకులను మూసలో మార్చాను. వడ్డేవారిపాలెం, వద్దివారిపాలెం పేజీలు రెంటినీ వడ్డివారిపాలెం పేజీకి దారిమార్పు చేసాను. 1.మండల లింకులు మార్చాను, 2.అనవసరమైన మూసలు తీసేసాను, 3. మూసలో మండలం లింకు ఇచ్చాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, 20 గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకును తీసెయ్యలేదు.
51 రొంపిచర్ల మండలం పూర్తైంది 4 పేజీలను తరలించాను. మండలం పేజీని సరైన పేరుకు తరలించాను. వాటి లింకులను మూసలో మార్చాను. గ్రామాల మూసను సరైన పేరుకు తరలించాను. అన్ని పేజీల్లోనూ గ్రామాల మూసను మార్చాను. 1.మండల లింకులు మార్చాను, 2.అనవసరమైన మూసలు తీసేసాను, 3. మూసలో మండలం లింకు ఇచ్చాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, 7 గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకును తీసెయ్యలేదు.
52 వట్టిచెరుకూరు మండలం పూర్తైంది 3 పేజీలను తరలించాను. వాటి లింకులను మూసలో మార్చాను. 1.మండల లింకులు మార్చాను, 2.అనవసరమైన మూసలు తీసేసాను, 3. మూసలో మండలం లింకు ఇచ్చాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, 4 గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకును తీసెయ్యలేదు.
53 వినుకొండ మండలం పూర్తైంది 2 పేజీలను తరలించాను. వాటి లింకులను మూసలో మార్చాను. 1.మండల లింకులు మార్చాను, 2.అనవసరమైన మూసలు తీసేసాను, 3. మూసలో మండలం లింకు ఇచ్చాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, 4 గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకును తీసెయ్యలేదు.
54 వెల్దుర్తి (గుంటూరు) మండలం పూర్తైంది 2 పేజీలను తరలించాను. వాటి లింకులను మూసలో మార్చాను. వర్గం పేరు సరైన ఆకృతిలో లేనందున సరైన పేరుతో వర్గాన్ని సృష్టించి అందులోకి వర్గాలను చేర్చాను. మూసను సరైన పేరుకు తరలించాను. అన్ని పేజీల్లోనూ కొత్త మూసను చేర్చాను 1.మండల లింకులు మార్చాను, 2.అనవసరమైన మూసలు తీసేసాను, 3. మూసలో మండలం లింకు ఇచ్చాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, 6 గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకును తీసెయ్యలేదు.
55 వేమూరు మండలం పూర్తైంది 1 పేజీని తరలించాను. దాని లింకును మూసలో మార్చాను. 1.మండల లింకులు మార్చాను, 2.అనవసరమైన మూసలు తీసేసాను, 3. మూసలో మండలం లింకు ఇచ్చాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, 5 గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకును తీసెయ్యలేదు.
56 శావల్యాపురం మండలం పూర్తైంది 3 పేజీలను తరలించాను. వాటి లింకులను మూసలో మార్చాను. 1.మండల లింకులు మార్చాను, 2.అనవసరమైన మూసలు తీసేసాను, 3. మూసలో మండలం లింకు ఇచ్చాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, 8 గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకును తీసెయ్యలేదు.
57 సత్తెనపల్లి మండలం పూర్తైంది 2 పేజీలను తరలించాను. వాటి లింకులను మూసలో మార్చాను. 1.మండల లింకులు మార్చాను, 2.అనవసరమైన మూసలు తీసేసాను, 3. మూసలో మండలం లింకు ఇచ్చాను. రెవిన్యూయేతర గ్రామాల వర్గాన్ని వేరే సృష్టించి, 5 గ్రామాలను అందులోకి తరలించాను. మూసలో మాత్రం ఈ పేజీల లింకును తీసెయ్యలేదు.

ప్రకాశం జిల్లా మార్చు

క్ర.సం మండలం స్థితి (పూర్తైంది / పని జరుగుతోంది) విశేషాలేమైనా..
1

నెల్లూరు జిల్లా మార్చు

క్ర.సం మండలం స్థితి (పూర్తైంది / పని జరుగుతోంది) విశేషాలేమైనా..
1

కర్నూలు జిల్లా మార్చు

క్ర.సం మండలం స్థితి (పూర్తైంది / పని జరుగుతోంది) విశేషాలేమైనా..
1

కడప జిల్లా మార్చు

క్ర.సం మండలం స్థితి (పూర్తైంది / పని జరుగుతోంది) విశేషాలేమైనా..
1

అనంతపురం జిల్లా మార్చు

క్ర.సం మండలం స్థితి (పూర్తైంది / పని జరుగుతోంది) విశేషాలేమైనా..
1 డి.హిరేహాల్ మండలం పూర్తైంది ఈ మండలంలో ఒక నిర్జన గ్రామంతో కలుపుకుని 18 రెవిన్యూ గ్రామాలు ఉన్నవి.వాటిలో 4 గ్రామాల శీర్శికలు సరిగానే ఉన్నవి.13 గ్రామాలు శీర్శికలు సవరించాను.సోమలాపురం గ్రామం శీర్శిక సందేహాస్పదంగా ఉన్నందున ఎటువంటి మార్పు చేయలేదు. అన్ని గ్రామాల చర్చాపేజీలలో చేపట్టిన చర్యలు వివరించాను. సవరణలకు అనుగుణంగా మండల వ్యాసం పేరుబరి, మండలంలోని గ్రామాలు వర్గం, మండలంలోని గ్రామాలు మూసలో లంకెలు సవరించాను.మండలంలోని గ్రామాలు మూస దారిమార్పు లేకుండా తరలింపు చేసిన మూస తిరిగి అన్ని గ్రామాలకు తగిలించాను.మండల ప్రత్యేక వ్యాసం లింకు అన్ని గ్రామాలకు కలిపాను.అన్ని గ్రామ వ్యాసాల పేజీల నందు ఉన్న ఎర్రలింకులు కలిపాను. పనిచేయని మూలాల లంకె (పాపులేషన్ ఫైండర్), 2011 జనాభా వివరాలు రెండుచోట్ల ఉన్నందున ఒకచోట తొలగించాను.ఒక గ్రామం రెవిన్యూయేతర గ్రామాలు వర్గంలో చేర్చాను.రెవిన్యూయేతర గ్రామాలు మూస నుండి తొలగించి, మండలం వ్యాసంలో రెవెన్యూయేతర గ్రామాల విభాగంలో కూర్పు చేసాను.సమాచారపెట్టెలులోని సమాచారం అనుగుణంగా సవరించాను.మురాడి అనే పేరుతో ఉన్న మరియెక వ్యాసం తొలగించాను. ఈ మండలం కర్ణాటక సరిహద్దుల సమీపంగా ఉన్నందున ఉచ్చారణలో ఆ రాష్ట్ర ప్రభావం వలన గ్రామల శీర్శికలు సరిగా గుర్తించటంలో టైం పట్టింది.
2 బొమ్మనహాళ్ మండలం పూర్తైంది ఈ మండలంలో 16 రెవిన్యూ గ్రామాలు ఉన్నవి.నిర్జన గ్రామాలు లేవు.వీటిలో 9 గ్రామాల శీర్శికలు సరిగానే ఉన్నవి.7 గ్రామాల శీర్శికలు తరలించాను. డి.హిరేహాల్ మండలంలో చేసిన మిగిలిన అన్ని మార్పులు, సవరణలు ఈ మండలంలో కూడా చేసాను.రెండు గ్రామాలు రెవిన్యూయేతర గ్రామాలు వర్గంలో చేర్చాను.రెవిన్యూయేతర గ్రామాలు మూస నుండి తొలగించి, మండలం వ్యాసంలో రెవిన్యూయేతర గ్రామాల విభాగంలో కూర్పు చేసాను.అన్ని గ్రామాల చర్చాపేజీలలో చేపట్టిన చర్యలు వివరించాను.
3 విడపనకల్లు మండలం పూర్తైంది ఈ మండలంలో 14 రెవిన్యూ గ్రామాలు ఉన్నవి.నిర్జన గ్రామాలు లేవు.వీటిలో 11 గ్రామాల శీర్శికలు సరిగానే ఉన్నవి.3 గ్రామాల శీర్శికలు తరలించాను.రెండు గ్రామాలు రెవిన్యూయేతర గ్రామాలు వర్గంలో చేర్చాను. అనుగుణంగా మూస, వర్గం సవరించాను. రెవిన్యూయేతర గ్రామాలు మూస నుండి తొలగించి,మండలం వ్యాసంలోని రెవిన్యూయేతర గ్రామాల విభాగంలో కూర్పు చేసాను.అన్ని గ్రామాల చర్చాపేజీలలో చేపట్టిన చర్యలు వివరించాను.డి.హిరేహాల్ మండలంలో చేసిన మిగిలిన అన్ని మార్పులు,సవరణలు ఈ మండలంలో కూడా చేసాను.
4 వజ్రకరూరు పూర్తైంది ఈ మండలంలో 16 రెవిన్యూ గ్రామాలు ఉన్నవి.నిర్జన గ్రామాలు లేవు.వీటిలో 2 గ్రామాల శీర్శికలు సరిగానే ఉన్నవి.13 గ్రామాల శీర్శికలు తరలించాను.ఒక గ్రామం పొట్టిపాడు (వజ్రకరూర్) సందేహాస్పదంగా ఉన్నందున ఎటువంటి మార్పులు చేపట్టలేదు.అనుగుణంగా మూస, వర్గం సవరించాను. ఒక గ్రామం రెవిన్యూయేతర గ్రామాలు వర్గంలో చేర్చాను.రెవిన్యూయేతర గ్రామాలు మూస నుండి తొలగించి,మండలం వ్యాసంలోని రెవిన్యూయేతర గ్రామాల విభాగంలో కూర్పు చేసాను.అన్ని గ్రామాల చర్చాపేజీలలో చేపట్టిన చర్యలు వివరించాను. డి.హిరేహాల్ మండలంలో చేసిన మిగిలిన అన్ని మార్పులు ఈ మండలంలో కూడా చేసాను.
5 గుంతకల్లు పూర్తైంది ఈ మండలంలో 19 రెవిన్యూ గ్రామాలు ఉన్నవి.నిర్జన గ్రామాలు లేవు.వీటిలో 6 గ్రామాల శీర్శికలు సరిగానే ఉన్నవి.11 గ్రామాల శీర్శికలు వివిధ కారణాలతో తరలించాను.మండలంలో రెవిన్యూ గ్రామాలు 19 ఉండగా 18 గ్రామాలు మాత్రమే కూర్పు చేయబడినవి.తిమ్మనచర్ల గ్రామం మండల వ్యాసంలోని మండలంలోని రెవిన్యూ గ్రామాలు విభాగంలో, మూసలో కూర్పు చేసాను.వ్యాసం పేజీ సృష్టించబడలేదు.గుంతకల్లు పట్టణం రెవిన్యూ గ్రామం కానందున దాని స్థానంలో గుంతకల్లు (గ్రామీణ) పేజీ సృష్టించి, గుంతకల్లు పట్టణ వ్యాసం నుండి గ్రామానికి చెందిన డేటా తరలించాను. సవరించిన ప్రకారం అనుగుణంగా అన్ని గ్రామాలు లంకెలు మూసలో సవరించాను.ఒక గ్రామం రెవిన్యూయేతర గ్రామాలు వర్గంలో చేర్చాను.రెవిన్యూయేతర గ్రామాలు మూస నుండి తొలగించి, మండల వ్యాసంలోని రెవిన్యూయేతర గ్రామాల విభాగంలో కూర్పు చేసాను.అన్ని గ్రామాల చర్చా పేజీలలో చేపట్టిన చర్యలు వివరించాను. డి.హిరేహాల్ మండలంలో చేసిన మిగిలిన అన్ని మార్పులు ఈ మండలంలో కూడా చేసాను.
6 గుత్తి పూర్తైంది ఈ మండలంలో 22 రెవిన్యూ గ్రామాలు ఉన్నవి.నిర్జన గ్రామాలు లేవు.వీటిలో 5 గ్రామాల శీర్శికలు సరిగానే ఉన్నవి.17 గ్రామాల శీర్శికలు వివిధ కారణాలతో తరలించాను.సవరించిన ప్రకారం అనుగుణంగా అన్ని గ్రామాలు లంకెలు మూసలో సవరించాను.అన్ని గ్రామాల మండలంలంకె సవరించాను. అన్ని గ్రామాల సమాచారపెట్టెలో సవరణలు చేసాను.రెండు గ్రామం రెవిన్యూయేతర గ్రామాలు వర్గంలో చేర్చాను.రెవిన్యూయేతర గ్రామాలు మూస నుండి తొలగించి, మండల వ్యాసంలోని రెవిన్యూయేతర గ్రామాల విభాగంలో కూర్పు చేసాను.అన్ని గ్రామాల చర్చా పేజీలలో చేపట్టిన చర్యలు వివరించాను. డి.హిరేహాల్ మండలంలో చేసిన మిగిలిన అన్ని మార్పులు ఈ మండలంలో కూడా చేసాను.
7 పెద్దవడుగూరు పూర్తైంది ఈ మండలంలో 24 రెవిన్యూ గ్రామాలు ఉన్నవి.నిర్జన గ్రామాలు లేవు.వీటిలో 11 గ్రామాల శీర్శికలు సరిగానే ఉన్నవి. 13 గ్రామాల శీర్శికలు వివిధ కారణాలతో తరలించాను.సవరించిన ప్రకారం అనుగుణంగా అన్ని గ్రామాలు లంకెలు మూసలో సవరించాను.అన్ని గ్రామాల మండలంలంకె సవరించాను. అన్ని గ్రామాల సమాచారపెట్టెలో సవరణలు చేసాను.13 రెవిన్యూయేతర గ్రామాలు వర్గంలో చేర్చాను.రెవిన్యూయేతర గ్రామాలు మూస నుండి తొలగించి, మండల వ్యాసంలోని రెవిన్యూయేతర గ్రామాల విభాగంలో కూర్పు చేసాను.అన్ని గ్రామాల చర్చా పేజీలలో చేపట్టిన చర్యలు వివరించాను. డి.హిరేహాల్ మండలంలో చేసిన మిగిలిన అన్ని మార్పులు ఈ మండలంలో కూడా చేసాను.
8 యాడికి మండలం పూర్తైంది ఈ మండలంలో 14 రెవిన్యూ గ్రామాలు ఉన్నవి.నిర్జన గ్రామాలు లేవు.వీటిలో 7 గ్రామాల శీర్శికలు సరిగానే ఉన్నవి.7 గ్రామాలు శీర్శికలు వివిధ కారణాలతో తరలించాను.సవరించిన ప్రకారం అనుగుణంగా అన్ని గ్రామాలు లంకెలు మూసలో సవరించాను.అన్ని గ్రామాల మండలంలంకె సవరించాను. అన్ని గ్రామాల సమాచారపెట్టెలో సవరణలు చేసాను.6 రెవిన్యూయేతర గ్రామాలు వర్గంలో చేర్చాను.రెవిన్యూయేతర గ్రామాలు మూస నుండి తొలగించి, మండల వ్యాసంలోని రెవిన్యూయేతర గ్రామాల విభాగంలో కూర్పు చేసాను.అన్ని గ్రామాల చర్చా పేజీలలో చేపట్టిన చర్యలు వివరించాను. డి.హిరేహాల్ మండలంలో చేసిన మిగిలిన అన్ని మార్పులు ఈ మండలంలో కూడా చేసాను.
9 తాడిపత్రి మండలం పూర్తైంది ఈ మండలంలో 27 రెవిన్యూ గ్రామాలు ఉన్నవి.నిర్జన గ్రామాలు లేవు.వీటిలో 15 గ్రామాల శీర్శికలు సరిగానే ఉన్నవి.12 గ్రామాలు శీర్శికలు సవరణ నిమిత్తం తరలించాను.సవరించిన ప్రకారం అనుగుణంగా అన్ని గ్రామాలు లంకెలు మూసలో,వ్యాసంలోని విభాగంలో సవరించాను.అన్ని గ్రామాల మండలం లంకెలు సవరించాను. అన్ని గ్రామాల సమాచారపెట్టెలో సవరణలు చేసాను.7 రెవిన్యూయేతర గ్రామాలు వర్గంలో చేర్చాను.రెవిన్యూయేతర గ్రామాలు మూస నుండి తొలగించి, మండల వ్యాసంలోని రెవిన్యూయేతర గ్రామాల విభాగంలో కూర్పు చేసాను.అన్ని గ్రామాల చర్చా పేజీలలో చేపట్టిన చర్యలు వివరించాను. డి.హిరేహాల్ మండలంలో చేసిన మిగిలిన అన్ని మార్పులు ఈ మండలంలో కూడా చేసాను.
10 పెద్దపప్పూరు మండలం పూర్తైంది ఈ మండలంలో 17 రెవిన్యూ గ్రామాలు ఉన్నవి.నిర్జన గ్రామాలు లేవు.వీటిలో 12 గ్రామాల శీర్శికలు సరిగానే ఉన్నవి.6 గ్రామాలు శీర్శికలు సవరణ నిమిత్తం తరలించాను.సవరించిన ప్రకారం అనుగుణంగా అన్ని గ్రామాలు లంకెలు మూసలో,వ్యాసంలోని విభాగంలో సవరించాను.అన్ని గ్రామాల మండలం లంకెలు సవరించాను. అన్ని గ్రామాల సమాచారపెట్టెలో సవరణలు చేసాను.4 రెవిన్యూయేతర గ్రామాలు వర్గంలో చేర్చాను.రెవిన్యూయేతర గ్రామాలు మూస నుండి తొలగించి, మండల వ్యాసంలోని రెవిన్యూయేతర గ్రామాల విభాగంలో కూర్పు చేసాను.అన్ని గ్రామాల చర్చా పేజీలలో చేపట్టిన చర్యలు వివరించాను. డి.హిరేహాల్ మండలంలో చేసిన మిగిలిన అన్ని మార్పులు ఈ మండలంలో కూడా చేసాను.
11 శింగనమల మండలం పూర్తైంది ఈ మండలంలో 20 రెవిన్యూ గ్రామాలు ఉన్నవి.అందులో నిర్జన గ్రామం ఒకటి.సముదాయం నిర్ణయంమేరకు నిర్జన గ్రామం తొలగించాను.వీటిలో 7 గ్రామాల శీర్శికలు సరిగానే ఉన్నవి.12 గ్రామాలు శీర్శికలు సవరణ నిమిత్తం తరలించాను.సవరించిన ప్రకారం అనుగుణంగా అన్ని గ్రామాలు లంకెలు మూసలో, వ్యాసంలోని విభాగంలో సవరించాను.అన్ని గ్రామాల మండలం లంకెలు, అన్ని గ్రామాల సమాచారపెట్టెలు సవరణలు చేసాను.అన్ని గ్రామాల చర్చా పేజీలలో చేపట్టిన చర్యలు వివరించాను. డి.హిరేహాల్ మండలంలో చేసిన మిగిలిన అన్ని మార్పులు ఈ మండలంలో కూడా చేసాను.
12 పామిడి మండలం పూర్తైంది ఈ మండలంలో 22 రెవిన్యూ గ్రామాలు ఉన్నవి.అందులో నిర్జన గ్రామాలు లేవు.వీటిలో 7 గ్రామాల శీర్శికలు సరిగానే ఉన్నవి.15 గ్రామాలు శీర్శికలు సవరణ నిమిత్తం తరలించాను.సవరించిన ప్రకారం అనుగుణంగా అన్ని గ్రామాలు లంకెలు మూసలో, వ్యాసంలోని విభాగంలో సవరించాను.అన్ని గ్రామాల మండలం లంకెలు, అన్ని గ్రామాల సమాచారపెట్టెలు సవరణలు చేసాను.అన్ని గ్రామాల చర్చా పేజీలలో చేపట్టిన చర్యలు వివరించాను. డి.హిరేహాల్ మండలంలో చేసిన మిగిలిన అన్ని మార్పులు ఈ మండలంలో కూడా చేసాను.
13 గార్లదిన్నె మండలం పూర్తైంది ఈ మండలంలో 18 రెవిన్యూ గ్రామాలు ఉన్నవి.నిర్జన గ్రామాలు లేవు.వీటిలో 6 గ్రామాల శీర్శికలు సరిగానే ఉన్నవి.11 గ్రామాలు శీర్శికలు సవరణ నిమిత్తం తరలించాను.అంకంపేటకు దినపత్రికల ఆధారం ఏమీ లభించలేదు. సవరించిన ప్రకారం అనుగుణంగా అన్ని గ్రామాలు లంకెలు మూసలో, వ్యాసంలోని విభాగంలో సవరించాను.అన్ని గ్రామాల మండలం లంకెలు, అన్ని గ్రామాల సమాచారపెట్టెలు సవరణలు చేసాను.అన్ని గ్రామాల చర్చా పేజీలలో చేపట్టిన చర్యలు వివరించాను. డి.హిరేహాల్ మండలంలో చేసిన మిగిలిన అన్ని మార్పులు ఈ మండలంలో కూడా చేసాను.
14 కూడేరు మండలం పూర్తైంది ఈ మండలంలో 13 రెవిన్యూ గ్రామాలు ఉన్నవి.నిర్జన గ్రామాలు లేవు.వీటిలో 5 గ్రామాల శీర్శికలు సరిగానే ఉన్నవి.8 గ్రామాలు శీర్శికలు సవరణ నిమిత్తం తరలించాను.సవరించిన ప్రకారం అనుగుణంగా అన్ని గ్రామాలు లంకెలు మూసలో, వ్యాసంలోని విభాగంలో, సమాచారపెట్టెలో సవరణలు చేసాను.అన్ని గ్రామాల చర్చా పేజీలలో చేపట్టిన చర్యలు వివరించాను.పనిచేయని పాపులేషన్ పైండర్ లింకు,లోగడ కూర్పుచేసిన 2011 జనాభా వివరాలు తొలగించాను.
15 ఉరవకొండ మండలం పూర్తైంది ఈ మండలంలో 22 రెవిన్యూ గ్రామాలు ఉన్నవి.నిర్జన గ్రామాలు లేవు.వీటిలో 13 గ్రామాల శీర్శికలు సరిగానే ఉన్నవి.9 గ్రామాలు శీర్శికలు సవరణ నిమిత్తం తరలించాను.సవరించిన ప్రకారం అనుగుణంగా అన్ని గ్రామాలు లంకెలు మూసలో, వ్యాసంలోని విభాగంలో, సమాచారపెట్టెలో సవరణలు చేసాను.అన్ని గ్రామాల చర్చా పేజీలలో చేపట్టిన చర్యలు వివరించాను.పనిచేయని పాపులేషన్ పైండర్ లింకు,లోగడ కూర్పుచేసిన 2011 జనాభా వివరాలు తొలగించాను.
16 బెళుగుప్ప మండలం పూర్తైంది ఈ మండలంలో 14 రెవిన్యూ గ్రామాలు ఉన్నవి.నిర్జన గ్రామాలు లేవు.వీటిలో 4 గ్రామాల శీర్శికలు సరిగానే ఉన్నవి.10 గ్రామాలు శీర్శికలు సవరణ నిమిత్తం తరలించాను.సవరించిన ప్రకారం అనుగుణంగా అన్ని గ్రామాలు లంకెలు మూసలో, వ్యాసంలోని విభాగంలో, సమాచారపెట్టెలో సవరణలు చేసాను.అన్ని గ్రామాల చర్చా పేజీలలో చేపట్టిన చర్యలు వివరించాను.పనిచేయని పాపులేషన్ పైండర్ లింకు,లోగడ కూర్పుచేసిన 2011 జనాభా వివరాలు తొలగించాను.
17 కణేకల్లు మండలం పూర్తైంది ఈ మండలంలో 17 రెవిన్యూ గ్రామాలు ఉన్నవి.నిర్జన గ్రామాలు లేవు.వీటిలో 6 గ్రామాల శీర్శికలు సరిగానే ఉన్నవి.8 గ్రామాలు శీర్శికలు సవరణ నిమిత్తం తరలించాను.3 గ్రామాల శీర్శికలు సరియైన ఆధారాల లభించనందున సవరించలేదు.సవరించిన ప్రకారం అనుగుణంగా అన్ని గ్రామాలు లంకెలు మూసలో, వ్యాసంలోని విభాగంలో, సమాచారపెట్టెలో సవరణలు చేసాను.అన్ని గ్రామాల చర్చా పేజీలలో చేపట్టిన చర్యలు వివరించాను.పనిచేయని పాపులేషన్ పైండర్ లింకు,లోగడ కూర్పుచేసిన 2011 జనాభా వివరాలు తొలగించాను.
18 రాయదుర్గం మండలం పూర్తైంది ఈ మండలంలో 14 రెవిన్యూ గ్రామాలు ఉన్నవి.నిర్జన గ్రామాలు లేవు.వీటిలో 6 గ్రామాల శీర్శికలు సరిగానే ఉన్నవి.7 గ్రామాలు శీర్శికలు సవరణ నిమిత్తం తరలించాను.ఒక గ్రామం శీర్శికకు సరియైన ఆధారం లభించనందున సవరించలేదు. సవరించిన ప్రకారం అనుగుణంగా అన్ని గ్రామాలు లంకెలు మూసలో, వ్యాసంలోని విభాగంలో, సమాచారపెట్టెలో సవరణలు చేసాను.అన్ని గ్రామాల చర్చా పేజీలలో చేపట్టిన చర్యలు వివరించాను.పనిచేయని పాపులేషన్ పైండర్ లింకు,లోగడ కూర్పుచేసిన 2011 జనాభా వివరాలు తొలగించాను.
19 గుమ్మఘట్ట మండలం పూర్తైంది ఈ మండలంలో 11 రెవిన్యూ గ్రామాలు ఉన్నవి.నిర్జన గ్రామాలు లేవు.వీటిలో 7 గ్రామాల శీర్శికలు సరిగానే ఉన్నవి.3 గ్రామాలు శీర్శికలు సవరణ నిమిత్తం తరలించాను.ఒక గ్రామం శీర్శికకు సరియైన ఆధారం లభించనందున సవరించలేదు.సవరించిన ప్రకారం అనుగుణంగా అన్ని గ్రామాలు లంకెలు మూసలో, వ్యాసంలోని విభాగంలో, సమాచారపెట్టెలో సవరణలు చేసాను.అన్ని గ్రామాల చర్చా పేజీలలో చేపట్టిన చర్యలు వివరించాను.పనిచేయని పాపులేషన్ పైండర్ లింకు,లోగడ కూర్పుచేసిన 2011 జనాభా వివరాలు తొలగించాను.
20 బ్రహ్మసముద్రం మండలం పూర్తైంది ఈ మండలంలో 13 రెవిన్యూ గ్రామాలు ఉన్నవి.నిర్జన గ్రామాలు లేవు.వీటిలో 4 గ్రామాల శీర్శికలు సరిగానే ఉన్నవి.9 గ్రామాలు శీర్శికలు సవరణ నిమిత్తం తరలించాను.సవరించిన ప్రకారం అనుగుణంగా అన్ని గ్రామాలు లంకెలు మూసలో, వ్యాసంలోని విభాగంలో, సమాచారపెట్టెలో సవరణలు చేసాను.అన్ని గ్రామాల చర్చా పేజీలలో చేపట్టిన చర్యలు వివరించాను.పనిచేయని పాపులేషన్ పైండర్ లింకు,లోగడ కూర్పుచేసిన 2011 జనాభా వివరాలు తొలగించాను.
21 శెట్టూరు మండలం పని జరుగుతుంది

చిత్తూరు జిల్లా మార్చు

క్ర.సం మండలం స్థితి (పూర్తైంది / పని జరుగుతోంది) విశేషాలేమైనా..
1

తెలంగాణ మార్చు

తెలంగాణలో పాత జిల్లాలనే జాబితాగా వేసాం.

ఆదిలాబాదు జిల్లా మార్చు

క్ర.సం మండలం స్థితి (పూర్తైంది / పని జరుగుతోంది) విశేషాలేమైనా..
1

నిజామాబాదు జిల్లా మార్చు

క్ర.సం మండలం స్థితి (పూర్తైంది / పని జరుగుతోంది) విశేషాలేమైనా..
1

కరీంనగర్ జిల్లా మార్చు

క్ర.సం మండలం స్థితి (పూర్తైంది / పని జరుగుతోంది) విశేషాలేమైనా..
1

వరంగల్లు జిల్లా మార్చు

క్ర.సం మండలం స్థితి (పూర్తైంది / పని జరుగుతోంది) విశేషాలేమైనా..
1

మెదక్ జిల్లా మార్చు

క్ర.సం మండలం స్థితి (పూర్తైంది / పని జరుగుతోంది) విశేషాలేమైనా..
1

హైదరాబాదు మార్చు

క్ర.సం మండలం స్థితి (పూర్తైంది / పని జరుగుతోంది) విశేషాలేమైనా..
1

రంగారెడ్డి జిల్లా మార్చు

క్ర.సం మండలం స్థితి (పూర్తైంది / పని జరుగుతోంది) విశేషాలేమైనా..
1

మహబూబ్ నగర్ జిల్లా మార్చు

(ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా = మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలు)

క్ర.సం మండలం స్థితి (పూర్తైంది / పని జరుగుతోంది) విశేషాలేమైనా..
1 కోస్గి పూర్తయింది 4 గ్రామాల పేర్లు మార్చాను (అమ్లికుంట → ఆమ్లికుంట, ముష్రిఫా → ముశ్రిఫా, సర్జాఖాన్‌పేట → సర్జఖాన్‌పేట, పోలేపల్లి → పోలెపల్లి) మూసలోనూ, మండలంపేజీలోని గ్రామాలపట్టికలోనూ మార్పుచేశాను.
2 నారాయణపేట పూర్తయింది 4 గ్రామాల పేర్లు మార్చాను (సింగూర్ → సింగారం, చిన్నజత్రం → చిన్నజట్రం, అప్పకపల్లి → అప్పక్‌పల్లి, పేరపల్లి → పేరపళ్ళ) మూసలోనూ, మండలంపేజీలోని గ్రామాలపట్టికలోనూ మార్పుచేశాను. తిరుమలాపూర్‌కు తిర్మలాపూర్‌కు ఉచ్ఛారణలో పెద్ద తేడా ఉండదు కాబట్టి మార్చలేను
3 దామరగిద్ద దాదాపు పూర్తయింది 2 గ్రామాల పేర్లపై సందిగ్దత (ఆధారాల కోసం పెండింగ్)
4 మరికల్ పూర్తయింది 3 గ్రామాల పేర్లు మార్చాను (మద్వార్ → మాధ్వార్, పస్పూల్ → పస్పుల, కణమనూర్ → కన్మనూర్) మూసలోనూ, మండలంపేజీలోని గ్రామాలపట్టికలోనూ మార్పుచేశాను.
5 మద్దూరు పూర్తయింది 7 గ్రామాల పేర్లు మార్చాను (పల్లేర్ల → పల్లెర్ల, నందిగం → నందిగాం, అల్లిపూర్ → అల్లీపూర్, రెన్వట్ల → రేనివట్ల, దోరేపల్లి → దోరెపల్లి, కాజిపురం → ఖాజీపూర్, దామగాన్‌పురం → దమగాన్‌పూర్) మూసలోనూ, మండలంపేజీలోని గ్రామాలపట్టికలోనూ మార్పుచేశాను.
6 ఊట్కూరు పూర్తయింది 3 గ్రామాల పేర్లు మార్చాను (నిడగుర్తి → నిడుగుర్తి, పెద్దజత్రం → పెద్దజట్రం, పులుమామిడి → పులిమామిడి) మూసలోనూ, మండలంపేజీలోని గ్రామాలపట్టికలోనూ మార్పుచేశాను.
7 నర్వ పూర్తయింది 1 గ్రామం పేరు మార్చాను (కల్వల్ → కల్వాల్) మూసలోనూ, మండలంపేజీలోని గ్రామాలపట్టికలోనూ మార్పుచేశాను.
8 మఖ్తల్ పూర్తయింది 2 గ్రామాల పేర్లు మార్చాను (నేరద్గం → నేరడిగాం, కోల్పూర్ → కొల్పూర్) మూసలోనూ, మండలంపేజీలోని గ్రామాలపట్టికలోనూ మార్పుచేశాను.
9 కృష్ణ పని జరుగుతోంది

నల్గొండ జిల్లా మార్చు

క్ర.సం మండలం స్థితి (పూర్తైంది / పని జరుగుతోంది) విశేషాలేమైనా..
1 మోతుకూరు మండలం

ఖమ్మం జిల్లా మార్చు

క్ర.సం మండలం స్థితి (పూర్తైంది / పని జరుగుతోంది) విశేషాలేమైనా..
1

ఇతరత్రా మార్చు

వాడుకరులు తమ సూచనలు సలహాలను చర్చాపేజీలో ఇవ్వవలసినదిగా మనవి.