వికీపీడియా:నిర్వాహకుల పనుల సమీక్ష/చదువరి/2021 అక్టోబరు - 2022 జూన్
వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ పేజీలో నిర్వాహకులు చెయ్యాల్సిన కనీసమాత్రపు పని ఎంతో సూచన చేసారు. ఆ సూచనల మేరకు 2019 మార్చి నుండి ఇప్పటి వరకు 5 సార్లు ఆరు నెలల సమీక్ష చేసుకుంటూ వస్తున్నాను. ఈసారి 6 నెలలకు కాకుండా 9 నెలలకు సమీక్ష చేసుకుంటున్నాను. ఇక నుండి క్యాలెండరు సంవత్సరం లోనే రెండు సార్లు సమీక్ష చేసుకుంటాను. 2021 అక్టోబరు 1 నుండి 2022 జూన్ 30 వరకు ఉన్న 9 నెలల కాలంలో నేను చేసిన నిర్వాహకత్వ పనుల వివరాలను ఈ పేజీలో పెట్టాను. ఈ లెక్క లోకి ప్రధాన పేరుబరిలో చేసిన మార్పుచేర్పులు రావు కాబట్టి, వాటిని పరిగణించలేదు.
అడ్మిన్ స్కోరు
మార్చుఈ కాలంలో నేను చేసిన మొత్తం నిర్వాహక చర్యలు: 1017. ఎక్స్ టూల్స్ పరికరంలోని నిర్వాహక చర్యల వివరాలు కింది లింకులో చూడవచ్చు.
చెప్పుకోదగ్గ పనులు
మార్చుఈ కాలంలో నేను చేసిన ప్రత్యేకమైన పనులు ఇక్కడ ఉంటాయి. ఇవి నిర్వాహక పనులు కావు. కానీ ప్రత్యేకమైన పనులు కాబట్టి ఇక్కడ ఉదహరిస్తున్నాను. (మామూలుగా చేసే నిర్వాహక పనులను ఇక్కడ పరిగణించలేదు):
- వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లోని మండలాల పాత మ్యాపుల పేర్ల మార్పు ప్రాజెక్టులో పాల్గొని, దాదాపు 900 మ్యాపు బొమ్మలు ఏ మండలానికి చెందినవో పరిశీలించి, నిర్థారణ చేసుకుని తదనుగుణంగా వాటికి సరైన పేర్లు సూచించాను.
పేరుబరి వారీగా నా దిద్దుబాట్లు:
మార్చు- వికీపీడియా: 629. ఇందులో రచ్చబండలో రాసినవి: 101
- మూస: 924
- సహాయం: 28
- వర్గం: 154
- మీడియావికీ: 41
- మాడ్యూల్: 103
ఈ కాలంలో ట్రాన్స్‌లేట్‌వికీలో నేను చేసిన అనువాదాల సంఖ్య: 10,300. ఈ సారి మొబైలు సైటుకు సంబంధించిన అనువాదాలు ఎక్కువగా చేసాను. ప్రస్తుతం ఈ సైటులో అత్యధిక అనువాదాలు చేసినది నేనే. https://translatewiki.net/wiki/Special:ActiveLanguages/te పేజీలో కింద తెలుగు అనే విభాగంలో వాడుకరుల పేర్లు వరుసగా ఇచ్చి ఉంటాయి. వాడుకరి పేరుపై మౌసును ఉంచితే, ఆ వాడుకరి చేసిన మార్పుల సంఖ్యను చూపిస్తుంది. తెలుగు వికీపీడియా ఇంటర్‌ఫేసులో కనిపించే అనువాదాల్లో 99% అనువాదాలు ఇక్కడ చేసినవే. నా నిర్వాహకత్వం గురించి చెప్పేదేమైనా ఉంటే, ముఖ్యంగా విమర్శ ఉంటే, దీని చర్చా పేజీలో రాయండి.
ఈ కాలంలో నేను చేసిన మొత్తం దిద్దుబాట్లు: 5,975