వికీపీడియా:మీకు తెలుసా? భండారము/2010
(వికీపీడియా:మీకు తెలుసా? భండారము/పాత విశేషాలు 3 నుండి దారిమార్పు చెందింది)
2010
మార్చు21 వ వారం
మార్చు- ... ఆది మానవులు గుండు సూదులను జంతువుల ఎముకలతో తయారు చేసుకునే వారనీ! (గుండుసూది వ్యాసం )
- ... 2006 లో జరిపిన ఒక సర్వే ప్రకారం ప్రపంచం మొత్తం మీద సుమారు 125 మిలియన్ల కవలలు నివసిస్తున్నారనీ! ( కవలలు వ్యాసం)
- ... హైదరాబాద్ లో ప్రతి యేటా జరిగే పుస్తక ప్రదర్శన మొదటి సారిగా అశోక్ నగర్ లోని సిటీ కేంద్ర గ్రంథాలయంలో జరిగిందనీ! (హైదరాబాదు పుస్తక ప్రదర్శన వ్యాసం)
- ...హిందూ మతం, బౌద్ధ మతం, జైనమతం, సిక్కుమతం భారతదేశంలోనే ఉద్భవించాయనీ! ( భారతదేశ సంస్కృతివ్యాసం)
- ... ఇంటర్నెట్ ను మొదట్లో ARPANET (అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ నెట్‌వర్క్) అని వ్యవహరించే వారనీ! (ఇంటర్నెట్ చరిత్రవ్యాసం)
11 వ వారం
మార్చు- ... ప్రముఖ యువ సినీనటుడు రాజా సినిమాల్లోకి రాకముందు లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ లో పనిచేశాడనీ! ( రాజా వ్యాసం)
- ... పెన్సిల్ పంచభుజి, అష్టభుజి రూపాల్లోనే ఉంటుందనీ! ( పెన్సిల్ వ్యాసం)
- ... ప్రపంచంలో మొత్తం చీమలను కలిపితే వాటి బరువు, మనుషుల బరువు కన్నా ఎక్కువ ఉంటుందనీ! ( చీమ వ్యాసం )
- ... క్రీ.పూ 1000 సంవత్సరం నుంచి భారతదేశంలో నాణేలు చెలామణిలో ఉన్నాయనీ! ( నాణెం వ్యాసం)
- ... రెండు రాగి నాణెముల మధ్య ఒక నిజమైన రుద్రాక్షనుంచితే అది సవ్య దిశలో తిరుగుతుందనీ! ( రుద్రాక్ష వ్యాసం)
01 వ వారం
మార్చు- డిసెంబర్ 21 2009 నుంచి మార్చి 15 2010 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
- ... జాతక కథలు బుద్ధుని పూర్వ జన్మల గురించిన కథల సమాహారమనీ! (జాతక కథలు వ్యాసం)
- .. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ చిన్న వయసులేనే సంగీతంలో అనుపమాన ప్రతిభ కనబరిచాడనీ! ( బాలమేధావి వ్యాసం)
- ... నాయనార్లు అనగా తమిళనాడులో నివసించిన గొప్ప శివభక్తులనీ! (నాయనార్లు వ్యాసం)
- ... కలరిపయట్టు ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన యుద్ధక్రీడ గా అభివర్ణించబడుతుందనీ! (కలరిపయట్టు వ్యాసం)
- ... సగటు భారతీయుల్లో దాదాపు సగం మందికిపైగా టీ సేవిస్తున్నారనీ! (తేనీరు వ్యాసం)