హైదరాబాదు పుస్తక ప్రదర్శన


హైదరాబాదు పుస్తక ప్రదర్శన (Hyderabad Book Fair) ప్రతి సంవత్సరం హైదరాబాదు నగరంలో జరుగుతుంది.[1] దీనిని హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ నిర్వహిస్తుంది.

2015 పుస్తక ప్రదర్శనలో ఒకదృశ్యము

హైదరాబాదు బుక్ ఫెయిర్ సొసైటీని ప్రముఖ ప్రచురణకర్తలు, దుకాణదారులు, పంపిణీదారులు కలిసి 1985 సంవత్సరంలో ఏర్పాటుచేశారు.[1] మొదటి ప్రదర్శన అశోక్ నగర్ సిటీ కేంద్ర గ్రంథాలయంలో జరిగింది.[2] దీనికి ప్రజల భారీ స్పందనను దృష్టిలో ఉంచుకొని ప్రదర్శనను నిజాం కళాశాల ప్రాంగణం, పబ్లిక్ గార్డెన్స్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, కేశవ మెమోరియల్ గ్రౌండ్స్ లో జరుపుతూ వస్తున్నారు. ఈ ప్రదర్శన ముఖ్య ధ్యేయం ప్రజలలో పుస్తకాల పట్ల అవగాహన కలిగించడం.దీనిని 1987 లో రిజిస్టర్ చేశారు.(Regd. No. 230 / 1987 Under A.P. Public Societies Registration Act 1350 Fasli)

2015 పుస్తక ప్రదర్శనలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా చెక్క బజన కళాకారుల ప్రదర్శన

తెలుగును ప్రాచీన భాషగా గుర్తించిన నేపథ్యంలో తెలుగు భాషాభివృద్ధికి వివిధ రంగాలలో కృషి చేసిన క్రింది ప్రముఖులకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ వారు సన్మానించారు.

 1. పద్యం : బేతవోలు రామబ్రహ్మం
 2. సినిమా: రావి కొండలరావు
 3. ఉర్దూ సాహిత్యం: నస్రత్ మొహియుద్దీన్
 4. నవల: యద్దనపూడి సులోచనారాణి
 5. చరిత్ర పరిశోధన: వకుళాభరణం రామకృష్ణ
 6. తెలుగు భాష: సి. ధర్మారావు
 7. కవిత్వం: కె.శివారెడ్డి
 8. అనువాదరచన: ఆర్.వెంకటేశ్వరరావు
 9. బాలసాహిత్యం: రెడ్డి రాఘవయ్య


2009 సంవత్సరంలో 24వ హైదరాబాదు పుస్తక ప్రదర్శన పీపుల్స్ ప్లాజాలో డిసెంబరు 17 నుండి 27 తేదీల మధ్య జరిగింది.

2015 వ సంవత్సరములో 29వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన ఎన్.టి.ఆర్.స్టేడియంలో జరిగింది.

Telugu Wikipedia Stall in Hyderabad Bookfair 2016.

2016 వ సంవత్సరములో హైదరాబాదు పుస్తక ప్రదర్శన జరిగింది.

2017 వ సంవత్సరములో 30వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన జరిగింది.

 
Hyderabad book fair 2018 hoarding

31వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన (హైదరాబాద్ బుక్ ఫెయిర్) ప్రదర్శన హైదరాబాద్‌ తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్‌ స్టేడియం) ప్రాంగణంలో 18 జనవరి 2018 నుంచి 28 డిసెంబర్‌ 2018 వరకు నిర్వహించారు. 32వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన హైదరాబాదులోని తెలంగాణ కళాభారతి వేదికగా 320 పైగా పుస్తక దుకాణాతో డిసెంబర్‌ 15 నుంచి 25 వరకు జరిగింది. 15వ తేది శనివారంనాడు తెలంగాణ కళాభారతి మైదానం (ఎన్టీఆర్‌ స్టేడియం)లో జరిగిన పుస్తకమహోత్సవ ప్రారంభ వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా విచ్చేసి పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు.[3]

33వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన హైదరాబాదులోని తెలంగాణ కళాభారతి వేదికగా జరిగింది జాతీయ, అంతర్జాతీయ ప్రచురణ సంస్థలతో 260 స్టాళ్లను ఏర్పాటు చేశారు[4][5].

కరోనా మహమ్మారి కారణంగా 2020 సంవత్సరం లో పుస్తక ప్రదర్శన జరగలేదు[6]

34వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన హైదరాబాదులోని తెలంగాణ కళాభారతి వేదికగా 19 డిసెంబర్ 2021 నుండీ జరిగింది.[7]

35వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన హైదరాబాదులోని తెలంగాణ కళాభారతి వేదికగా 2022 డిసెంబరు 22 నుండి 2023 జనవరి 1 వరకు జరుగుతోంది.[8]

 
34 వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో తెలుగు వికీపీడియా స్టాలు

36వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన హైదరాబాద్‌, దోమల్‌గూడలోని తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్‌ స్టేడియం) ప్రాంగణంలో 2024 ఫిబ్రవరి 9 నుంచి 2024 ఫిబ్రవరి 19 వరకు జరగనుంది.[9]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
 1. 1.0 1.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-11-20. Retrieved 2009-12-19.
 2. సాక్షి, తెలంగాణ, హైదరాబాదు (13 December 2018). "వేడుకలా పుస్తక ప్రదర్శన". Archived from the original on 17 December 2018. Retrieved 17 December 2018.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link)
 3. సాక్షి, తెలంగాణ, హైదరాబాదు (16 December 2018). "పుస్తక పఠనంతోనే చైతన్యం". Archived from the original on 17 December 2018. Retrieved 17 December 2018.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link)
 4. "హైదరాబాద్ బుక్ ఫెయిర్ షురూ.. వారం రోజుల పాటు పుస్తక జాతర". Samayam Telugu. Retrieved 2021-12-20.
 5. "పుట్టెడు పుస్తకాలతో... హైదరాబాద్ పుస్తక ప్రదర్శన". ETV Bharat News. Retrieved 2021-12-20.
 6. "PressReader.com - Digital Newspaper & Magazine Subscriptions". www.pressreader.com. Retrieved 2021-12-20.
 7. "Hyd Book Fair: పుస్తకాల పండుగకు అక్షరాల తోరణం." Sakshi. 2021-12-19. Retrieved 2021-12-20.
 8. telugu, NT News (2022-12-06). "ఎన్టీఆర్ స్టేడియంలో డిసెంబ‌ర్ 22 నుంచి బుక్ ఫెయిర్‌". www.ntnews.com. Archived from the original on 2022-12-06. Retrieved 2022-12-06.
 9. V6 Velugu (8 January 2024). "ఫిబ్రవరి 9 నుంచి హైదరాబాద్లో నేషనల్ బుక్ ఫెయిర్". Archived from the original on 10 January 2024. Retrieved 10 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

వెలుపలి లంకెలు

మార్చు