ఈ జాబితా మొదటి పేజిలోని మీకు తెలుసా? విభాగములో ఇప్పటిదాకా ప్రదర్శించిన వాక్యాల భాండాగారము.
- మీరు ఏదైనా వికిపీడియా వ్యాసము చదువుతున్నపుడు మీకు ఆహా! అనిపించే విషయము ఏదైనా కనిపిస్తే ఇక్కడ దానిని చేర్చండి. బహుశా మీలాగే చాలా మందికి ఆ విషయము తెలిసి ఉండకపోవచ్చు.
- ఈ భాండాగారములోనుండి ఒక సమయములో కేవలం మూడూ లేదా నాలుగింటిని మాత్రమే ఈ మూసలో చేర్చండి.
- వికీపీడియాలో వ్యాసాలు పూర్తవటం అని ఉండదు. ఎప్పుడూ ఎవరో ఒకరు వ్యాసాన్ని మెరుగుపరుస్తూనే ఉంటారు. అందుకని మీరు కొత్తగా తెలుసుకున్న విషయాలను ఎప్పటికప్పుడు ఇక్కడ చేర్చేయండి. అలాగే ఇక్కడా చేర్చిన విషయాలను దాయనవసరం లేదు.
2023 సంవత్సరంలోని వాక్యాలుసవరించు
- ... ఎం. పతంజలి శాస్త్రి భారతదేశపు రెండవ ప్రధాన న్యాయమూర్తి అనీ!
- ... హేలోజెన్ లను క్రిమిసంహారకాలుగా ఉపయోగిస్తారనీ!
- ... గృహస్థాశ్రమం పై హిందూ ఆశ్రమ వ్యవస్థలో విస్తృతమైన చర్చ ఉందనీ!
- ... స్వీడన్ లోని యిటర్బీ అనే గ్రామం పేరు మీద నాలుగు రసాయనిక మూలకాలకు పేర్లు పెట్టారనీ!
- ... హిందూస్తాన్ టైమ్స్ పత్రిక భారత స్వాతంత్ర్యోద్యమ కాలంలో జాతీయవాద దినపత్రికగా ప్రముఖ భూమిక పోషించిందనీ!
- ... భారతీయ నటుడు కబీర్ బేడీ పలు అంతర్జాతీయ చిత్రాల్లో నటించాడనీ!
- ... మోలిబ్డినం మూలకాన్ని ఎక్కువగా ఉక్కు మిశ్రమాల్లో ఉపయోగిస్తారనీ!
- ... కీళ్ళకు సంబంధించిన గౌటు వ్యాధి సాధారణంగా కాలి బొటనవేలు వాపుతో ప్రారంభం అవుతుందనీ!
- ... విద్యుత్ చేపలు సుమారు 650 వోల్టుల విద్యుచ్ఛక్తి ఉత్పత్తి చేయగలవనీ!
- ... మహారాష్ట్రలో రైస్ మిల్లులు పుష్కలంగా ఉన్న గోందియా పట్టణాన్ని రైస్ సిటీ అని పిలుస్తారనీ!
- ... భారతదేశపు చరిత్రలో అత్యధిక కాలం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసింది వై.వి. చంద్రచూడ్ అనీ!
- ... వీడియోటేపు లో సమాచారాన్ని లీనియర్ పద్ధతిలో భద్రపరచడం వలన, డేటాను చదవడం ఆలస్యం అవుతుందనీ!
- ... శ్రీకృష్ణుడు తన చివరి ప్రస్థానంలో ఉద్ధవుడికి ఉపదేశించిన బోధ ఉద్ధవ గీతగా పేరు గాంచిందనీ!
- ... ఇండోనేషియా లోని జావా దీవి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దీవి అనీ!
- ... భారత ప్రభుత్వ సంస్థ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ప్రపంచంలో అతిపెద్ద సామాజిక భద్రత సంస్థల్లో ఒకటి అనీ!
- ... ఆవర్తన పట్టికలోని మూలకాల్లో రీనియం చిట్టచివరి స్థిరమైన మూలకం అనీ!
- ... భారత జాతీయ బొగ్గు గనుల సంస్థ కోల్ ఇండియా ప్రధాన కార్యాలయం కోల్కత లో ఉందనీ!
- ... భారత రైల్వే ఇటీవల ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణించగలదనీ!
- ... హిమాలయ పర్వత సానువుల్లో పర్వతారోహణకు జోషిమఠ్ను ప్రవేశ ద్వారంగా పరిగణిస్తారనీ!
- ... శ్రీకృష్ణుడు తన మేనమామ కంసుడికి సంహరించిన తర్వాత అతని తండ్రి ఉగ్రసేనుడు మళ్ళీ రాజ్యపరిపాలన చేశాడనీ!
- ... భారతదేశంలో రబ్బర్ పరిశ్రమ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన రబ్బర్ బోర్డ్ ప్రధాన కార్యాలయం కేరళ లోని కొట్టాయంలో ఉందనీ!
- ... సర్ క్రీక్ భారతదేశం పాకిస్థాన్ ల మధ్యన ఒక వివాదాస్పద సరిహద్దు అనీ!
- ... స్టోన్హెంజ్ను యునైటెడ్ కింగ్డం లో అత్యంత ప్రసిద్ధమైన మైలురాళ్ళలో ఒకటిగా పరిగణిస్తారనీ!
- ... ఉత్తర లండన్ లో ఏర్పాటు చేయబడిన ఇండియా హౌస్ భారత స్వాతంత్ర్యోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిందనీ!
- ... గోల్డెన్ గ్లోబ్ పురస్కారం అంతర్జాతీయంగా సినిమాలు, టెలివిజన్ రంగంలో ఇచ్చే పురస్కారాలనీ!
- ... లారస్ ల్యాబ్స్ హైదరాబాదుకు చెందిన అంతర్జాతీయ మందుల సరఫరా సంస్థ అనీ!
- ... మొట్టమొదటగా మల్టి టచ్ సౌకర్యంతో వచ్చిన స్మార్ట్ ఫోన్ ఐఫోన్ అనీ!
- ... మైల్స్వామి అన్నాదురై ని మూన్ మ్యాన్ ఆఫ్ ఇండియా గా పిలుస్తారనీ!