వికీపీడియా:మొలకపేజీల నియంత్రణ విధానం

విధానం స్థితి:అమోదించబడినది. 1 ఏప్రిల్ 2013


నేపథ్యం మార్చు

వికీపీడియా లో చాలా వరకు వ్యాసాలు మొలక స్థాయిలోనే ప్రారంభించపడతాయి. అయితే వాటి శాతం ఎక్కువైతే వికీపీడియా విలువకోల్పోవటానికి అవకాశముంది. తెలుగు వికీ చరిత్రలో గ్రామాల వ్యాసాలు ఏకవాక్య వ్యాసాలుగా బాట్ తో సృష్టించబడినవి. ఇవి తరువాత వికీ అభివృద్ధి క్రమంలో విస్తరించబడతాయనే ఆశవున్నా, గత కొద్దిసంవత్సరాలుగా తెవికి ఆశించినమేర అభివృద్ధి చెందక అది నెరవేరలేదు. అప్పుడప్పుడు కొందరు సభ్యులు కొత్త వ్యాసాల ప్రారంభించడంపై దృష్టిపెట్టటం వాటిని ఇతరులు వ్యతిరేకించటం జరుగుతున్నది. మొలక స్థాయి వ్యాసాలు స్థాయి మరీ పెరిగిపోకుండా చర్యలు చేపట్టటానికి విధానం ఆవశ్యకత చాలా చర్చల ( ఇటీవలి చర్చ) ద్వారా గుర్తించబడింది. అందువలన ఈ విధానం ప్రతిపాదించడమైనది.

ప్రతిపాదన మార్చు

తెవికీలో అనుభవంగడించినవారు (అనగా 25 మార్పులైన చేసినవారు) ప్రారంభించిన మొలక వ్యాసాలు, ప్రారంభించిన నెలరోజులలోగా కనీస స్థాయికి అనగా వ్యాస పరిమాణం (2000 బైట్ల మరియు కనీసం ఒక అంతర్గత లింకు) ఎదగకపోతే వాటిని వీలైతే ఇతర వ్యాసాలలో విలీనం చేసి తొలగించవలెను.

మద్దతుస్థాయి అంచనా కొరకు ఓటు ప్రక్రియ మార్చు

మద్దతు
 1.   కె. వి. రమణ. చర్చ 04:45, 7 మార్చి 2013 (UTC))[ప్రత్యుత్తరం]
 2. పాలగిరి (చర్చ) 06:05, 7 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
 3. రహ్మానుద్దీన్ షేక్(రహ్మానుద్దీన్ (చర్చ) 06:11, 7 మార్చి 2013 (UTC))[ప్రత్యుత్తరం]
 4. Chavakiran (చర్చ) 06:17, 7 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
 5. Rajasekhar1961 (చర్చ) 06:35, 7 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
 6. విశ్వనాధ్ (చర్చ) 07:37, 7 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
 7. --t.sujatha (చర్చ) 12:11, 9 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

<పై వరుసలో సంతకం చేయటం ద్వారా ఓటు వేయండి>

తటస్థం
 1. 2 కిలో బైట్ల కంటే తక్కువైన మొలకలను తొలగించడం పట్ల సరైన విధి విధానాలు రూపొందింపబడిన తర్వాత ఈ విధానం అమలైతే సమంజసంగా ఉంటుందనేది నా అభిప్రాయం. --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 04:49, 7 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
 2. సదుద్దేశమైనా, ఆచరణలో సాధ్యంకాదేమోనని అనుమానం. పనిచేస్తే సంతోషం వైజాసత్య (చర్చ) 08:18, 7 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
 3. నా అభిప్రాయాలు ఇక్కడ చెప్పాను. చిన్నవ్యాసాలకు వ్యతిరేకినైనా నియమాలు స్పష్టంగా లేవు కాబట్టి తటస్థం. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:59, 7 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యతిరేకం
 1. కొత్త వారిని తీవ్రంగా నిరుత్సాహపరిచే ఈ విధానానికి నేను వ్యతిరేకం.--పోటుగాడు (చర్చ) 12:26, 9 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
 2. <పై వరుసలో సంతకం చేయటం ద్వారా ఓటు వేయండి>

వోటింగ్ ఫలితం మార్చు