వికీపీడియాలో అయోమయ నివృత్తి పేజీలకు ఒక ప్రత్యేకత ఉంది. ఒకే పేరుతో ఉన్న వ్యక్తులు, స్థలాలు వంటి విషయాల పేజీలకు వెళ్లడంలో ఉండే సందిగ్ధతను తొలగించేందుకు ఈ పేజీలను సృష్టించారు. ఈ పేజీలో ఈ శీర్షికతో పోలి ఉండే వివిధ పేజీల లింకులను ఇస్తాం. ఈ లింకులను వినియోగించుకుని పాఠకులు తమకు అవసరమైన పేజీకి వెళ్ళగలుగుతారు. కొన్ని అయోమయ నివృత్తి పేజీల్లో సంబంధిత పేజీలన్నిటికీ లింకులు లేవు.మిస్సయిన లింకులన్నిటినీ చేర్చాలి.

అయితే వాడుకరులు పనిగట్టుకుని అయోమయ నివృత్తి పేజీలకు లింకులు ఇవ్వకూడదు. అలా ఇచ్చిన లింకులను సవరించి, నేరుగా లక్ష్యిత పేజీకి లింకులను మార్చడం ఈ ప్రాజెక్టు ఉద్దేశాల్లో ఒకటి.

ఒకేలాంటి పేరుతో పేజీలు అసలంటూ ఉంటేనే అయోమయం కలుగుతుంది. అసలు పేజీలే లేకపోతే ఇక అయోమయం కలిగే ప్రసక్తే లేదు, అలాంటపుడు ఆ లేని పేజీల లింకులను అంటే ఎర్రలింకులను అ.ని. పేజీలో చేర్చాల్సిన పన్లేదు. కానీ కొన్ని అ.ని. పేజీల్లో ఎర్రలింకులున్నాయి. వాటిని తీసెయ్యాలి.

ప్రాజెక్టు ఉద్దేశాలు

మార్చు
  • అవసరమైనవాటికి అయోమయ నివృత్తి పేజీలను సృష్టించడం. ఆయా పేజీల్లో చేర్చాలసిన అన్ని లింకులనూ చేర్చి విస్తరించడం
  • ఇప్పటికే ఉన్న అయోమయ నివృత్తి పేజీల్లో సంబంధిత పేజీలన్నిటికీ లింకులు లేవు.మిస్సయిన లింకులన్నిటినీ చేర్చాలి
  • అయోమయ నివృత్తి పేజీల్లో ఉన్న ఎర్ర లింకులను తీసెయ్యడం
  • అవసరం లేని అయోమయ నివృత్తి పేజీలను తొలగించడం/తొలగింపుకు ప్రతిపాదించడం
  • పేరులో "(అయోమయ నివృత్తి)" అని లేని అ.ని. పేజీలను ఆ పేరుకు తరలించడం
  • ప్రధాన, మూస పేరుబరుల లోని వివిధ పేజీల నుండి అయోమయ నివృత్తి పేజీలకు ఇచ్చిన లింకులను, తీసేసి, నేరుగా సంబంధిత పేజీలకు లింకులు ఇవ్వడం

ఎలా చెయ్యాలి

మార్చు

అయోమయ నివృత్తి పేజీలను వర్గం:అయోమయ నివృత్తి అనే వర్గం లోకి చేర్చాం. ఈ వర్గం లోని ఏదో ఒక పేజీని తీసుకుని ఆ పేజీకి ఉన్న లింకులను సంస్కరించాలి. అయోమయ నివృత్తి పేజీలకు ఇచ్చిన లింకులను ఎలా సవరించాలో తెలిపే వివరాలను వికీపీడియా:ఇన్‌కమింగు లింకులున్న అయోమయ నివృత్తి పేజీలు పేజీలో చూడవచ్చు.

కొన్ని సూచనలు

మార్చు
  • AWB వాడితే పని సులభంగా చెయ్యవచ్చు.
    • ఏయే పేజీలను తెరవాలో అదే చూసుకుంటుంది
    • పేజీలను అదే తెరుస్తుంది
    • ఏయే లింకులను సరిచెయ్యాలో అది సూచిస్తుంది
    • ప్రస్తుతం ఉన్న లింకు స్థానంలో ఏ లింకు ఇవ్వవచ్చో సూచనలు చేస్తుంది, సరైనదాన్ని ఎంచుకోవడమే మన పని.
  • ఏ పేజీకి లింకు ఇవ్వాలో తెలియనపుడు లింకు పక్కనే {{Disambiguation required}} అనే మూసను పెట్టడం ఒక పరిష్కారం. తెలిసినవాళ్ళు సరైన లింకును ఇస్తారు. కానీ తెవికీలో ఉన్న వాడుకరుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని చూస్తే ఇది జరిగే అవకాశం తక్కువ. అందుచేత ఈ పరిష్కారాన్ని సాధ్యమైనంతవరకు వాడకపోవడమే మంచిది. ఈ సందర్భంలో అసలు లింకు తీసెయ్యడమే నయం.

ఉపపేజీలు

మార్చు

పాల్గొనే వారు

మార్చు
  1. చదువరి (చర్చరచనలు): వర్గం:అయోమయ నివృత్తి వర్గంలో "వ" అక్షరం కింద ఉన్న పేజీలను చేస్తాను.
  2. ప్రణయ్ రాజ్ వంగరి (చర్చరచనలు)
  3. యర్రా రామారావు (చర్చ) 09:07, 3 జనవరి 2020 (UTC) - ఈ పనిలో నేను వర్గం:అయోమయ నివృత్తి లోని అక్షరక్రమం ప్రకారం నావరకు నేను "అ" నుండి "ఔ" వరకు గల 447 పేజీలు చేపడదామని అనుకుంటున్నాను.[ప్రత్యుత్తరం]

అక్షరక్రమం ప్రకారం సవరణలు మొదలు పెట్టిన పేజీలు

మార్చు

వర్గం:అయోమయ నివృత్తి లోని అక్షరక్రమం ప్రకారం 'అ' నుండి 2020 జనవరి 4 న సవరణ కార్యక్రమం మొదలు పెట్టాను.--యర్రా రామారావు (చర్చ) 07:01, 6 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అక్షరక్రమం ప్రకారం సవరణలు పూర్తైన పేజీలు

మార్చు

చదువరి

మార్చు