వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ తెలంగాణ సాంస్కృతిక దర్శిని
తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, 2016 నుండి వికీమీడియా ప్రాజెక్ట్‌లకు, తెలుగు వికీమీడియా సముదాయానికి సహకారాన్ని అందిస్తోంది. హైదరాబాదులోని రవీంద్రభారతి వేదికగా అనేక కార్యకలాపాలు, కార్యక్రమాలను నిర్వహించడానికి భాషా సాంస్కృతిక శాఖ నుండి సముదాయం గతంలో సహకారాన్ని పొందింది.
తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. మామిడి హరికృష్ణతో సిఐఎస్-ఎ2కె, తెలుగు వికీమీడియన్‌లకు చెందిన కొంతమంది సభ్యులు, వికీమీడియా ఫౌండేషన్ ప్రతినిధులు అనేక చర్చలు జరిపిన తరువాత ఉచిత విజ్ఞానాన్ని ప్రోత్సహించడం, తెలంగాణలో సాంస్కృతిక వారసత్వాన్ని డిజిటలైజ్ చేయడం వంటి ఇతర సంబంధిత అంశాలకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ సందర్భంలో, సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, వికీమీడియా ఫౌండేషన్ లు సంస్థాగత భాగస్వామ్యాన్ని మరింతగా పెంచడానికి, తెలంగాణలో సాంస్కృతిక వారసత్వాన్ని డిజిటలైజ్ చేయడంలో, ఉచిత విజ్ఞానాన్ని ప్రోత్సహించడంలో క్రియాశీల సహకారాన్ని ప్రారంభించేందుకు ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి.
లక్ష్యాలు
మార్చు2014 నుండి 2024 వరకు తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన సాంస్కృతిక మీడియా (ఫోటోలు, వీడియోలు)ను, భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన తెలంగాణ నేపథ్య, చారిత్రక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన పుస్తకాలను, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో చిత్రించిన తెలంగాణ తేజోమూర్తుల తైలవర్ణ చిత్రాలను పబ్లిక్ డొమైన్ లోకి విడుదల చేయడం.
కార్యకలాపాలు & పురోగతి
మార్చు- 2024 మార్చి చివరి వారంలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ, వికీమీడియా ఫౌండేషన్ ప్రతినిధులు తెవికీ తెలంగాణ సాంస్కృతిక దర్శిని ప్రాజెక్టుకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. సాంస్కృతిక వారసత్వాన్ని డిజిటలైజ్ చేయడానికి, శిక్షణ ద్వారా ఉచిత జ్ఞానాన్ని ప్రోత్సహించడానికి, ఓపెన్ లైసెన్సుల క్రింద వనరులను అందుబాటులో ఉంచడానికి ఈ సంస్థలు కలిసి పనిచేస్తాయి.
- తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, గత దశాబ్దకాలంలో (2014-2024) వివిధ సందర్భాలలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన సాంస్కృతిక మీడియా (ఫోటోలు) ఆర్కైవ్‌ను విడుదల చేసింది, వికీమీడియా కామన్స్ OTRS సిస్టమ్‌కు అవసరమైన డాక్యుమెంటేషన్‌ను సమర్పించింది.
- 2024 ఏప్రిల్ మొదటివారం నుండి, వికీమీడియన్ ఇన్ రెసిడెన్స్ చేత తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ విడుదల చేసిన మీడియాను తగిన పేరు, తెలుగు వివరణ, వర్గీకరణ, ఇతర అవసరమైన మెటాడేటాతో కలిపి వికీమీడియా కామన్స్ లోకి ఎక్కించడం ప్రారంభించింది. ఎప్పటికప్పుడు భాగస్వామ్య సంస్థలతోనూ, వికీమీడియా సముదాయంతోనూ సమన్వయం చేసుకోవడం జరిగింది.
- 2024 అక్టోబరు నాటికి, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ వికీమీడియన్ ఇన్ రెసిడెన్స్ ద్వారా వివిధ కేటగిరీల క్రింద 6,800 మీడియా ఫైల్‌లు అప్‌లోడ్ చేయబడ్డాయి.
- 2024 అక్టోబరులో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన 68 పుస్తకాలను పబ్లిక్ డొమైన్ లోకి విడుదల చేయడంకోసం వికీమీడియా కామన్స్ OTRS సిస్టమ్‌కు అవసరమైన డాక్యుమెంటేషన్‌ను సమర్పించింది.