వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ తెలంగాణ సాంస్కృతిక దర్శిని/ఫోటోల పోటీ-2024

తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ, వికీమీడియా ఫౌండేషన్ లు సంస్థాగత భాగస్వామ్యాన్ని మరింతగా పెంచడానికి, తెలంగాణలో సాంస్కృతిక వారసత్వాన్ని డిజిటలైజ్ చేయడంలో, ఉచిత విజ్ఞానాన్ని ప్రోత్సహించడంలో క్రియాశీల సహకారాన్ని ప్రారంభించేందుకు తెవికీ తెలంగాణ సాంస్కృతిక దర్శిని అనే ప్రాజెక్టు రూపొందించబడింది.

ఈ ప్రాజెక్టులో భాగంగా 2014 నుండి 2024 వరకు తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి భాషా సాంస్కృతిక శాఖ విడుదల చేసిన ఫోటోలలో 6,800 ఫోటోలను తగిన పేరు, తెలుగు వివరణ, వర్గీకరణ, ఇతర అవసరమైన మెటాడేటాతో కలిపి వికీమీడియన్ ఇన్ రెసిడెన్స్ చేత వికీమీడియా కామన్స్ లోకి ఎక్కించడం జరిగింది. వికీ కామన్స్ లో ఎక్కించిన ఆ ఫోటోలను వికీపీడియా వ్యాసాలలో ఉపయోగించడాన్ని ప్రోత్సహించడమే ఈ పోటీ ఉద్దేశం.

లక్ష్యం

మార్చు

తెలుగు వికీపీడియాలో 3,500కు పైగా బొమ్మలు లేని వ్యాసాలు ఉన్నాయి. వాటిని బొమ్మలు కావలసిన వ్యాసాలు అనే వర్గంలో చూడవచ్చు. వాటిలో కొన్ని పేజీలకు బొమ్మలు చేర్చడం ఈ పోటీ లక్ష్యం.

నియమాలు

మార్చు
  • 2024 అక్టోబరు 26 - నవంబరు 4 మధ్య వికీపీడియా వ్యాసాల్లో బొమ్మలను చేర్చాలి.
  • కనీసం 15 పేజీలలో ఫోటోలు చేర్చినవారు ఈ పోటీకి అర్హత పొందుతారు.
  • పేజీలో చేర్చే బొమ్మ వీలైనంత ఖచ్చితంగా ఆ పేజీకి సరిపోయేలా ఉండాలి. జనరిక్ బొమ్మలను, సముచితం కాని బొమ్మలను చేర్చరాదు. వ్యాసంలో సంబంధమున్న చోటనే బొమ్మను చేర్చాలి.
  • చేర్చే ప్రతీ బొమ్మకూ, అది దేనికి సంబధించినదో వివరించే వ్యాఖ్య తప్పనిసరిగా ఉండాలి. వ్యాసానికి సరిపోయేలా ఉండాలి. (గమనిక: ఈ ప్రాజెక్టు ద్వారా ఎక్కించిన ప్రతి ఫోటోకు కామన్స్ లో తెలుగులోనే స్పష్టమైన వివరణ ఇవ్వబడింది)
  • ఒక్కొక్కరు ఎన్ని ఫైళ్ళను వాడొచ్చు అనే దానికి పరిమితి ఏమీ లేదు. అనేకమైన ఫొటోలను, సంబంధం లేని ఫొటోలను పెట్టేసి వ్యాసాలను వికారంగా చెయ్యకండి.
  • సమాచారపెట్టెలో ఉన్న FairUse ఫోటో స్థానంలో కామన్స్ ఫోటో చేర్చవచ్చు.
  • బొమ్మలను చేర్చాక, మార్పులను ప్రచురించేటపుడు రాసే దిద్దుబాటు సారాంశంలో సవివరమైన సారాంశంతో పాటు #TTSD24 అనే హ్యాష్‌ట్యాగులను తప్పనిసరిగా చేర్చాలి. ఉదాహరణకు, "సమాచారపెట్టెలో బొమ్మను చేర్చి మెరుగుపరచాను" #TTSD24. ఈ హ్యాష్‌ట్యాగులను చేర్చకపోతే, ఆ వ్యాసాలు పోటీ పరిగణన లోకి రావు. ఈ హ్యాష్‌ట్యాగును (#TTSD24) వ్యాసం లోపల చేర్చకండి.
  • #TTSD24 ట్యాగును బొమ్మలు చేర్చిన దిద్దుబాటు సారాంశం లోనే చేర్చాలి. బొమ్మ చేర్చని దిద్దుబాట్లను సేవు చేసేటపుడు ఈ ట్యాగులను చేర్చకండి.
  • వ్యాసంలో ఎన్నో ఫోటోగా చేర్చారో కూడా దిద్దుబాటు సారాంశంలో రాయగలరు (ఉదా: మొదటి ఫోటో, రెండవ ఫోటో, మూడవ ఫోటో).

మార్కుల వివరాలు

మార్చు
  • ఫోటో లేని వ్యాసంలో ఫోటో చేరిస్తే మూడు (3) మార్కులు, ఫోటోలు ఉన్న వ్యాసంలో మరో ఫోటో చేరిస్తే ఒక (1) మార్కు ఇవ్వబడుతుంది.
  • సమాచారపెట్టెలో చేర్చిన ఫోటోకు మూడు (3) మార్కులు ఇవ్వబడుతాయి.

వనరులు

మార్చు

కాలక్రమ వివరాలు

మార్చు
  • పోటీ ప్రారంభం: 2024 అక్టోబరు 26
  • పోటీ చివరి తేదీ: 2024 నవంబరు 4
  • ఫలితాల ప్రకటన: 2024 నవంబరు 8

బహుమతుల వివరాలు

మార్చు

ఫొటోలను చేర్చి అత్యధిక వికీపీడియా వ్యాసాలను మెరుగుపరచిన మొదటి ముగ్గురు వాడుకరులకు బహుమతులు:

  1. మొదటి బహుమతి ― ₹5000 గిఫ్ట్ కార్డు + సర్టిఫికెట్
  2. రెండవ బహుమతి ― ₹3000 గిఫ్ట్ కార్డు +సర్టిఫికెట్
  3. మూడవ బహుమతి ― ₹2000 గిఫ్ట్ కార్డు + సర్టిఫికెట్

పాల్గొనేవారు

మార్చు

ప్రస్తుతం వికీలో చురుగ్గా రాస్తున్న వాడుకరులతో సహా పాత, కొత్త వాడుకరులు అందరూ ఈ ప్రాజెక్టులో పాల్గొని తెవికీ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని విజ్ఞప్తి.

పాల్గొనేవారు ఈ క్రింద సంతకం చేయండి. (సంతకం చేయడానికి కొత్త లైనులో # ~~~~ అని రాస్తే సరిపోతుంది.)

  1. Kasyap (చర్చ) 07:50, 24 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  2. --V.J.Suseela (చర్చ) 13:02, 24 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  3. KINNERA ARAVIND (చర్చ) 14:53, 24 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  4. కె.వెంకటరమణచర్చ 16:10, 24 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  5. ``````Saiphani02 (చర్చ) 20:16, 24 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  6. ```Pinkypun (చర్చ) 13:15, 25 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  7. --స్వరలాసిక (చర్చ) 11:19, 25 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  8. చదువరి (చర్చరచనలు)
  9. Nagarani Bethi (చర్చ) 12:22, 25 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  10. Muralikrishna m (చర్చ) 00:53, 26 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  11. Pravallika16 (చర్చ) 09:07, 26 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  12. RATHOD SRAVAN (చర్చ) 04:03, 26 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  13. --Batthini Vinay Kumar Goud (చర్చ) 05:09, 26 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  14. --దేవేందర్ కొన్నే
  15.  ప్రభాకర్ గౌడ్చర్చ 03:09, 31 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  16. Divya4232 (చర్చ) 14:41, 2 నవంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

గణాంకాలు

మార్చు
తెవికీ పేజీల్లో ఫోటోల చేర్పు
క్రమసంఖ్య తేదీ చేర్చిన పేజీల సంఖ్య చేర్చిన ఫోటోల సంఖ్య
1 అక్టోబరు 26 135 204
2 అక్టోబరు 27 70 76
3 అక్టోబరు 28 104 120
4 అక్టోబరు 29 50 58
5 అక్టోబరు 30 33 56
6 అక్టోబరు 31 20 32
7 నవంబరు 1 17 28
8 నవంబరు 2 42 85
9 నవంబరు 3 31 57
10 నవంబరు 4 29 125
మొత్తం 10 రోజులు 531 పేజీలు 841 ఫోటోలు

ఫలితాలు

మార్చు

ఈ పోటీకి 16మంది వాడుకరులు సంతకాలు చేయగా, 12మంది వాడుకరులు పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీలో భాగంగా 10 రోజులలో తెవికీలోని 531 పేజీలలో 841 ఫోటోలు చేర్చబడ్డాయి. ఈ పోటీ ద్వారా 28 కొత్త వ్యాసాలు కూడా సృష్టించబడ్డాయి.

మార్కుల విషయంలో ముందుగా చెప్పినట్టుగా.... ఫోటో లేని వ్యాసంలో ఫోటో చేరిస్తే మూడు (3) మార్కులు, ఫోటోలు ఉన్న వ్యాసంలో మరో ఫోటో చేరిస్తే ఒక (1) మార్కు, సమాచారపెట్టెలో చేర్చిన ఫోటోకు మూడు (3) మార్కులు ఇవ్వబడ్డాయి.

అయితే, వ్యాసాలలో ఫోటోలు చేర్చడంలో... ఒకే ఎడిట్ లో ఒకటికంటే ఎక్కువ ఫోటోలు చేర్చడం, చేర్చిన ఫోటోను మరోసారి చేర్చి #TTSD24 ట్యాగు పెట్టడం, ఖాళీ ఎడిట్ తో #TTSD24 ట్యాగు పెట్టడం, జాబితాలో లేని ఫోటోలు చేర్చడం వంటివి జరిగాయి.

వాటిని పరిశీలించి... ఒకే ఎడిట్ లో ఒకటికంటే ఎక్కువ ఫోటోలు చేర్చిన ఎడిట్ కు ఒక (1) మార్కు, చేర్చిన ఫోటోను మరోసారి చేర్చి #TTSD24 ట్యాగు పెట్టిన ఎడిట్ కు సున్నా (0) మార్కులు, ఖాళీ ఎడిట్ తో #TTSD24 ట్యాగు పెట్టిన ఎడిట్ కు సున్నా (0) మార్కులు, జాబితాలో లేని ఫోటోలు చేర్చిన ఎడిట్ కు సున్నా (0) మార్కులు ఇవ్వబడ్డాయి.

ఫలితాలు
వాడుకరి పేరు దిద్దుబాట్లు మార్కులు బహుమతులు
Pinkypun 202 317 మొదటి బహుమతి
Muralikrishna m 189 244 ద్వితీయ బహుమతి
Pravallika16 171 203 తృతీయ బహుమతి
స్వరలాసిక 64 148
K.Venkataramana 15 20
Saiphani02 2 6
Divya4232 5 5
Vjsuseela 3 5
Kasyap 1 1
Batthini Vinay Kumar Goud 1 1
Chaduvari 1 1
KINNERA ARAVIND 1 1
కొత్త వ్యాసాలు
వాడుకరి పేరు వ్యాసాలు
స్వరలాసిక 15
Muralikrishna m 13

ఇతర లింకులు

మార్చు