వికీపీడియా:వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/ఆంధ్ర లొయోల కళాశాల/వికీపీడియా విద్యా కార్యక్రమం జనవరి 11-13, 2016

ఆంధ్రా లయొలా కళాశాల, సీఐఎస్-ఎ2కె సంయుక్త నిర్వహణలో వికీపీడియా విద్యా కార్యక్రమం 11-13 జనవరి 2015న నిర్వహించాయి.

వివరాలు

మార్చు
స్థలం
ఆంధ్ర లయొలా కళాశాల, విజయవాడ.
సమయం
11-13 జనవరి 2016

జరిగే కార్యకలాపాలు

మార్చు
  • ఎంపిక చేసిన కొత్తవాడుకరులను ఖాతా తెరిపించడం, ఇప్పటికే ఖాతాలు ఉన్నవారు సాధారణంగా లాగినవడం.
  • వికీపీడియా గురించి విద్యార్థులకు మౌలిక, ప్రాథమిక అంశాలు అందజేయడం.

పాల్గొన్న విద్యార్థులు

మార్చు

నివేదిక

మార్చు

జనవరి 11, 2016న ప్రారంభమైన వర్క్ షాప్ కార్యక్రమం జనవరి 13, 2016 వరకూ కొనసాగింది. కార్యక్రమంలో వృక్షశాస్త్రం, సాంఖ్యక శాస్త్రం, భౌతిక శాస్త్రం, తెలుగు అంశాలకు సంబంధించిన విద్యార్థులు పాల్గొన్నారు. దాదాపుగా 40మంది విద్యార్థి వికీపీడియన్లు కార్యశాలలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా వికీశైలిని గురించిన అంశాలు కొత్త వికీపీడియన్లు నేర్చుకున్నారు. తాము రాయదలుచుకున్న వ్యాసాలకు దాదాపుగా సంబంధం కలిగిన ఆంగ్ల వికీపీడియా వ్యాసాలను, తెలుగు వికీపీడియా వ్యాసాలను గమనించి తద్వారా శీర్షికలు ఎలా ఏర్పరుస్తున్నారు, వ్యాస ప్రారంభంలో సారాంశాన్ని ఎలా రాస్తున్నారు వంటి అంశాలు పరిశీలించారు. విద్యార్థులకు తమ విద్యాంశానికి నేరుగా సంబంధం ఉన్న అంశాలకు మాత్రమే కాక ఇతరేతర అంశాల నుంచి కూడా వ్యాసాలు రాయమని ప్రోత్సహించడం జరిగింది. తద్వారా వ్యక్తిగతంగా వచన రచనా శైలిని ఏర్పరుచకోవడం, పోటీపరీక్షల్లో అక్కరకు రావడం వంటి విషయాలను ప్రస్తావించాము. కార్యశాల ముగిశాకా ఫాలో అప్ గా ఆ మేరకు ఆసక్తి కలిగిన విద్యార్థికి తన ఆసక్తులకు సరిపడే పుస్తకాన్ని కూడా సోర్సుగా ఇచ్చి, సూచనలు సలహాలు అందించడంతో రాజీవ్ గాంధీ హత్య అంశంపై వ్యాసాన్ని రూపొందించారు. కార్యక్రమంలో భాగంగా పలువురు కొత్త విద్యార్థులు వికీపీడియాలో ఖాతాతెరిచి దిద్దుబాట్లు చేయడం ప్రారంభించారు.

తెలుగు వికీపీడియా సముదాయంతో సంప్రదింపుల అనంతరం ఆంధ్రా లయోలా కళాశాలలో జనవరి 13, 2016న డిజిటల్ రీసోర్సు సెంటర్ ప్రారంభం చేశారు. సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ యాక్సెస్ టు నాలెడ్జ్ (సీఐఎస్-ఎ2కె) మరియు ఆంధ్రా లయోలా కళాశాల (ఏఎల్సీ) సంయుక్తంగా 10 కంప్యూటర్లతో డిజిటల్ రీసోర్సు సెంటర్ ను ఏర్పాటుచేశాయి. డిజిటల్ రీసోర్సు సెంటర్ ఏర్పాటు వికీపీడియన్లు మరియు ఆంధ్రా లయోలా కళాశాలలోని విద్యార్థి వికీపీడియన్లకు ఉపకరించేందుకు ఏర్పాటుచేశారు. ఈ కేంద్రాన్ని స్థానిక వికీపీడియన్లు శిక్షణ సమావేశాల కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ ప్రారంభ కార్యక్రమాన్ని ప్రముఖ భాషావేత్త ఆచార్య ఉమామహేశ్వరరావు, కళాశాల ప్రాచార్యులు, అధ్యాపకులు, విద్యార్థి వికీపీడియన్లు, వికీపీడియన్లు, సీఐఎస్-ఎ2కె ఉద్యోగుల సమక్షంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముందు డిజిటల్ రీసోర్సుల అవసరాన్ని ఉగ్గడిస్తూ ప్రొ. ఉమామహేశ్వరరావు మాట్లాడారు.