వెతకటంలో ఇబ్బంది

ఎడమ ప్రక్క పట్టీలో ఒక పెట్టె క్రింద "వెళ్ళు", "వెతుకు" అనే రెండు బటన్లు ఉన్నాయి.

  • ఏదైనా వ్యాసం పేరు తప్పు లేకుండా వ్రాసి "వెళ్ళు" నొక్కితే ఆ వ్యాసానికి వెళతారు. ఇందులో టైపు చేస్తున్నపుడు మీ సహాయార్ధం అప్పటికే టైపు చేసిన అక్షరాలతో మొదలయ్యే వ్యాసాల పట్టీ కూడా వస్తుంది. ఉదాహరణకు "మనుషు" అన్నంత వరకు టైపు చేస్తే మనుషులు మారాలి, మనుషులు - మట్టిబొమ్మలు, మనుషులు మమతలు అనే మూడు సినిమా పేర్లు డ్రాప్‌డౌన్ మెన్యూగా వస్తాయి అని మీరు తేలికగా గమనించవచ్చును.
  • అలా కాకుండా ఏ పదాలైనా టైపు చేసి, "వెతుకు" నొక్కితే శోధనా ఫలితంగా ఆ పదాలున్న వ్యాసాలు రావాలి.
  • "గూగుల్" వంటి వెతుకు యంత్రాలలో తెలుగులో వ్రాసి వెదకండి. కొంతవరకు మీరు ఆశించిన వ్యాసాల సమాచారం లభించవచ్చును.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా