వికీపీడియా:వ్యాససృష్టికి మార్గసూచీ/Biographical notability
If a person has received significant coverage in reliable sources that are independent of the subject, they are presumed to satisfy the inclusion criteria for a stand-alone article.
ప్రతి ఒక్కరికీ వికీపీడియాలో పేజీ ఉండగలిగేంత గుర్తింపు ఉండదు. ఇతర విజ్ఞానసర్వస్వాల లాగానే వికీపీడియాలో కూడా చారిత్రక వ్యక్తులకు, వర్తమాన సంఘటనలలో పాల్గొన్న వ్యక్తులకూ జీవిత చరిత్ర వ్యాసాలు ఉంటాయి.
ఆ వ్యక్తి పట్ల ప్రజల్లో ఆసక్తి ఉందని నిరూపించేలా విశ్వసనీయమైన, మూడవ పక్ష ప్రచురణల్లో ఆ వ్యక్తి గురించిన సమాచారం లభించాలి. దిగువన ఉన్న అంశాలలో కనీసం ఒకదానిని సంతృప్తిపరచినా ఆ వ్యక్తికి వికీపీడియాలో పేజీ ఉండవచ్చు. ఎందుకంటే వారి గురించిన మంచి సమాచారం అందుబాటులో ఉండే అవకాశం ఉంది కాబట్టి. అయితే ఈ జాబితా సమగ్రమైనదేమీ కాదు. కానీ వికీపీడియాకు అవసరమైన విషయ ప్రాముఖ్యత ఉదాహరణలను చూపుతుంది:
- తన రంగంలో విస్తృతంగా గుర్తింపు పొందిన కృషి చేసిన వ్యక్తి
- అంతర్జాతీయ, జాతీయ లేదా రాష్ట్రవ్యాప్త పదవులు పొందిన రాజకీయ వ్యక్తులు.
- ప్రసిద్ధ వ్యక్తులు, అభిప్రాయ నిర్దేశకులు
- పూర్తిగా ప్రొఫెషనల్ లీగ్‌లో ఆడిన క్రీడాకారులు లేదా ఈత వంటి నాన్-లీగ్ క్రీడలో లేదా ఒలింపిక్ క్రీడలు లేదా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు వంటి ప్రధానంగా ఔత్సాహిక క్రీడలలో అత్యున్నత స్థాయిలో పోటీలో ఉన్న క్రీడాకారులు
- రచయితలు, సంపాదకులు, ఫోటోగ్రాఫర్‌లు తమ కృషిపై బహుళ సంఖ్యలో స్వతంత్ర సమీక్షలు ఉన్నవారు లేదా పురస్కారాలు అందుకున్నవారు
- చిత్రకారులు, శిల్పులు, వాస్తుశిల్పులు, ఇంజనీర్లు, ఇతర నిపుణులు - తమ కృషికి విస్తృతంగా గుర్తింపు పొందినవారు (మంచికైనా, చెడుకైనా). తమ రంగంలో శాశ్వతమైన చారిత్రక రికార్డులో భాగమయ్యే వారు
- వార్తల్లో నిలిచే సంఘటనల ద్వారా ఖ్యాతి లేదా అపఖ్యాతి పొందిన వ్యక్తులు
- ఆ వ్యక్తికి సంబంధమే లేని ముఖ్యమైన ప్రచురణల్లో ప్రధానాంశంగా ఉన్నవారు
గమనిక: పబ్లిక్ ఫిగర్ కాని వ్యక్తి, ఒకే ఒక్క ఘటనలో మాత్రమే వెలుగు లోకి వచ్చిన వ్యక్తికి జీవిత చరిత్ర వ్యాసం కంటే ఆ ఘటనకే వ్యాసయోగ్యత ఎక్కువ ఉంటుంది.
వికీపీడియాలో జీవించి ఉన్న వ్యక్తుల గురించి తప్పుడు సమాచారాన్ని జోడించరాదు; మీపై పరువు నష్టం దావా వేయవచ్చు.
గమనిక: మీకు ఆసక్తి వైరుధ్యం ఉంటే (వ్యాసం రాస్తున్నది మీ బంధువు, స్నేహితుడు, ఉద్యోగి, కాంట్రాక్టరు, తదితరులెవరైనా అయితే), వ్యాసం చర్చ పేజీలో దాన్ని వెల్లడించాలి; వికీపీడియాలో ఈ వ్యాసం రాసేందుకు ఎవరైనా మీకు డబ్బు చెల్లిస్తున్నట్లయితే, మీరు తప్పనిసరిగా Wikimedia Foundation వారి వినియోగ నిబంధనల ప్రకారం—చెల్లిస్తున్నది ఎవరు, క్లయింట్ ఎవరు, ఏదైనా ఇతర సంబంధిత అనుబంధం ఉందా అనేవి వెల్లడించాలి.
మీరు తలపెట్టిన వ్యాసానికి విషయ ప్రాముఖ్యత ఉన్నట్లేనా?
ఆ వ్యక్తికి విషయ ప్రాముల్ఖ్యత ఉన్నట్లు లేదు (ఏంచెయ్యమంటారు?)