వికీపీడియా:వ్యాససృష్టికి మార్గసూచీ/మూలాలు
సరైన మూలాలేంటంటే:
- పుస్తకాలు
- వార్తాపత్రికలు
- పేరున్న పత్రికలు
- విద్యా వైజ్ఞానిక పత్రికలు
- బిల్‌బోర్డ్
విశ్వసనీయం కాని మూలాలేంటంటే:
- బ్లాగులు
- MySpace పేజీలు
- Facebook పేజీలు
- LinkedIn పేజీలు
- కంపెనీ డైరెక్టరీ పేజీలు
- IMDb
- YouTube
- వ్యాస విషయానికి చెందిన స్వంత వెబ్‌సైటు
- "వ్యక్తిగత జ్ఞానం"
- వేరే ఎడిటర్లు స్వంతంగా, స్వతంత్రంగా నిర్ధారించుకోలేని మూలమేదైనా
వికీపీడియా లోని సమాచారం విశ్వసనీయంగా, నిర్ధారించుకోదగ్గదిగా ఉండాలి.
వాస్తవాలు, దృక్కోణాలు, సిద్ధాంతాలు, అభిప్రాయాలు వంటివి రాయాలంటే అవి ఈసరికే ఇప్పటికే ప్రచురించబడి ఉంటే మాత్రమే ఉపయోగించబడతాయి. విశ్వసనీయ మూలాల్లో ప్రచురితమై ఉండాలి. ఆ మూలాలు కచ్చితత్వానికి, వాస్తవాలను నిర్ధారించుకునేందుకూ పేరుగాంచి ఉండాలి, వ్యాస వుషయంతో సంబంధం లేనివై ఉండాలి. మూలాలను ఉల్లేఖించడమనేది వికీపీడియా వ్యాసాల్లోని అత్యంత ముఖ్యమైన అంగాల్లో ఒకటి. వికీపీడియ లోని ప్రతీ వ్యాసానికీ అది అధికారిక విధానం. మూలాల్లేని పాఠ్యానికి మూలాలు చూపించమని అడుగుతారు, చూపకపోతే దాన్ని తొలగిస్తారు. విద్య వైజ్ఞానిక విషయాల మూలాలు సాటివారి సమీక్ష జరిగి ఉండాలి. వ్యాసంలో రాసిన వాస్తవాలను మూలాలు నేరుగా వివరిస్తూ ఉండాలి. వ్యాసంలో రాసిన వాస్తవాలు ఎంత బలంగా ఉంటే మూలాలు అంత బలంగా ఉండాలి. మీ మూలాలు మంచివో కాదో మీకు తెలియకపోతే, వికీపీడియా:నమ్మదగ్గ మూలాలు చూడండి. ఇంకా సందేహాలుంటే, సహాయ కేంద్రంలో అడగండి.
- వికీపీడియా వ్యాసాలనే మూలాలుగా ఉల్లేఖించరాదు (ఒకవ్యాసంలో చూపిన సరైన మూలం వేరే వ్యాసంలో కూడా పనికొస్తదనుకుంటే దాన్ని కాపీ చేసుకోవచ్చు, అందులో తప్పేమీ లేదు).
- మీ స్వంత అభిప్రాయాలు అనుభవాలను చేర్చకండి.
మంచి మూలాలు
- విశ్వసనీయతకు పేరొంది ఉంటాయి: అవి నమ్మదగ్గ మూలాలు
- వాటికి వ్యాస విషయంతో అనుబంధం ఉండదు
- ఇతర వాడుకరులు వాటిని నిర్ధారించుకోగలుగుతారు
మీ వ్యాసంలో విశ్వసనీయమైన స్వతంత్రమైన మూలాలను చూపకపోతే, అది తొలగించబడవచ్చు.
సామాజిక మాధ్యమాల సైట్లకు, యూట్యూబ్ కూ ఇచ్చిన లింకులు తొలగించబడతాయి.
మీరు తలపెట్టిన వ్యాసానికి మంచి మూలాలున్నాయా?
This page is currently protected from editing. See the protection policy and protection log for more details. Please discuss any changes on the talk page; you may submit an edit request to ask an administrator to make an edit if it is uncontroversial or supported by consensus. You may also request that this page be unprotected. |