వికీపీడియా:Contact us/Article subjects
పాఠకులు
వ్యాస విషయాలు
లైసెన్సులు
దాతలు
పత్రికలు, భాగస్వామ్యాలు
|
మీ గురించో మీ సంస్థ గురించో ఉన్న వ్యాసం అసంపూర్తిగా ఉందని గానీ, సరిగా లేదని గానీ, పక్షపాతయుతంగా ఉందని గానీ మీరు భావిస్తే, దాని గురించి వికీపీడియా సంపాదకీయ సంఘంతో చర్చించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వికీపీడియాలో కేంద్రీకృతంగా ఒక రచయితో లేదా కంటెంట్ సమీక్షకుడో లేరు. మా కంటెంట్‌ను అనేకమంది సంపాదకులు స్వచ్చందంగా నిర్వహిస్తూంటారు. మీ వ్యాసంలో దిద్దుబాట్లు చేస్తున్నవారిని గాని పర్యవేక్షిస్తున్నవారిని గానీ సంప్రదించడం బహుశా అత్యుత్తమమైన మార్గం. వ్యాసపు "చర్చ" పేజీలో మీ సమస్యలను వివరిస్తూ ఒక గమనికను ఉంచితే, మీ వ్యాసాన్ని దిద్దుబాటు చేసే వారిని లేదా పర్యవేక్షించే వారిని సంప్రదించవచ్చు. వ్యాసానికి ఎగువన ఉన్న "చర్చ" లింకును నొక్కి ఈ పేజీకి వెళ్ళవచ్చు. అక్కడకు చేరుకున్న తర్వాత, దాని కుడి వైపున ఉన్న "అంశాన్ని చేర్చు" అనే టాబును నొక్కండి. ఇది చర్చ పేజీలో ఒక క్రొత్త విభాగాన్ని సృష్టిస్తుంది. అక్కడ మీరు మీ సమస్యను లేదా వ్యాఖ్యలను రాయవచ్చు. పేజీలో మీరే నేరుగా దిద్దుబాటు చేసేందుకు అడ్డుగా ఉన్న "మీ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్టు"ను సూచించేందుకు ఆ క్రొత్త విభాగంలో పైన {{request edit}} అనే మూసను పెట్టి, మీరు సూచిస్తున్న సవరణలు చెయ్యమని అభ్యర్థించండి. ఆ తరువాత "మార్పులను ప్రచురించు" నొక్కండి. వెంటనే ఆ పేజీలో మీ క్రొత్త విభాగం చేరుతుంది. చర్చ పేజీలో ఇలా సందేశం పెట్టినా ప్రయోజనం కనిపించక పోతే, మీరు సహాయ కేంద్రంలో అడగవచ్చు. ఈ పేజీని వికీ ఎడిటర్లు మరింత తరచుగా చూస్తూంటారు. ఇవి కాకుండా, info-en-qwikimedia.org కు ఈమెయిలు రాసి, ఇతర అనుభవజ్ఞులైన స్వచ్ఛంద కార్యకర్తలను సంప్రదించవచ్చు. మీ వ్యాసం పేరు లేదా అడ్రసునూ, దానిలో మీకున్న సమస్యలనూ ఆ ఈమెయిల్లో రాయండి. మీ ఈమెయిలును గోప్యంగా ఉంచే వకాశం ఉన్నప్పటికీ, భద్రతా ఉల్లంఘనలు, సమన్లు, లీకుల వంటి కారణాల వల్ల అది బహిర్గతమైనా కావచ్చు. స్వచ్ఛంద కార్యకర్తలు బాగా తప్పుడు సమాచారాన్ని తీసేస్తారు తప్ప, కొత్త సమాచారాన్ని చేర్చరని గ్రహించండి. సమాచారాన్ని చేర్చాలంటే, పైన చెప్పిన విధంగా చర్చ పేజీలో సంప్రదించడం తప్పనిసరి. మీకు సంబంద్గించిన వ్యాసంలో వాడేందుకు ఫొటోలను గానీ, మీ స్వరాన్ని రికార్డు చేసిన ఆడియో ఫైలును గానీ విరాళమివ్వదలిస్తే దాన్ని నేరుగా మీరే వికీపీడియా కామన్సు లోకి ఎక్కించి, ఆ పైన మీరే మీ వ్యాసం లోకి చేర్చవచ్చు. లేదా, photosubmissionwikimedia.org కు ఈమెయిలు చెయ్యవచ్చు. మీరు చేర్చదలచిన బొమ్మను, దానితో పాటు దాని కాపీహక్కులు మీకే ఉన్నాయన్న పత్రాన్నీ, దాన్ని స్వేచ్ఛాహక్కుల లైసెన్సు కింద విడుదల చేస్తున్నట్లుగా ఒక పత్రాన్నీ మీ ఈమెయిల్లో చేర్చండి. Creative Commons Attribution-ShareAlike 4.0 license అనే లైసెన్సు ఇందుకు సముచితమైనది. కాపీహక్కులు మీవి కాకపోతే, హక్కులను విడుదల చెయ్యమని ఆ హక్కులున్నవారిని అడగండి. కావలిస్తే "ఒప్పంద ప్రకటన" ను వాడవచ్చు.
|