• ముంగిలి
  • యాదృచ్చికం
  • చుట్టుపక్కల
  • లాగినవండి
  • విరాళాలు
  • వికీపీడియా గురించి
  • అస్వీకారములు
వికీపీడియా

వికీపీడియా:Contact us/Licensing

  • భాష
  • వీక్షించు
  • సవరించు
< వికీపీడియా:Contact us



పరిచయం


పాఠకులు
ఏదైనా వ్యాసంలో ఉన్న సమస్య దేని గురించైనా ఫిర్యాదు చెయదలిస్తే, మరింత సమాచారం తెలుసుకోదలిస్తే.


వ్యాస విషయాలు
మీ గురించి, మీ సంస్థ గురించి, మీకు సంబంధించిన వారి గురించిన వ్యాసాల్లో సమస్యలుంటే.


లైసెన్సులు
వికీపీడియా సమాచారాన్ని కాపీ చేసుకోదలిస్తే, మీస్వంత కృతులను దానమివ్వదలిస్తే, లేదా మీకు హక్కులున్న సమాచారాన్ని అనుమతి లేకుండా వాడుకున్నా.


దాతలు
విరాళమిచ్చే పద్ధతి గురించి, మీరిచ్చే డబ్బు ఎలా ఉపయోగపడుతుంది వగైరాల గురించి తెలుసుకునేందుకు.


పత్రికలు, భాగస్వామ్యాలు
మీరు పాత్రికేయులైతే, వికీపీడియాను సంప్రదించదలచినా, లేదా వ్యాపార ప్రతిపాదన ఏదైనా ఉన్నా.



An example of a freely licensed photograph

వికీపీడియాలో మీకు కనబడినదాన్ని వాడుకోవాలనుకుంటున్నారా? వికీపీడియా స్వేచ్ఛా లైసెన్సు కలిగిన విజ్ఞానసర్వస్వం; మా కంటెంటును చాలావరకు కాపీ చేసి ఏ ప్రయోజనం కోసమైనా వాడుకోవచ్చు. దీనికి ఒకే మినహాయింపు ఉంది - అది "సముచిత వినియోగం" పేరుతో మేం చూపించే కంటెంటు. ఏదైనా సముచిత వినియోగ దస్త్రం పేజీకి వెళితే ఫెయిర్ యూజ్ మీడియా అని స్పష్టంగా గుర్తించబడి ఉంటుంది; ఆ దస్త్రం "అమెరికా కాపీహక్కు చట్టం ప్రకారం సముచిత వినియోగం" గా గుర్తించబడి ఉండడం మీకు కనిపిస్తుంది. సదరు బొమ్మలను వికీపీడియాలో గానీ, ఇతర చోట్ల గానీ వేరే విధంగా వినియోగించుకోవడం కాపీహక్కుల ఉల్లంఘన కావచ్చు. సముచితమైన వినియోగ పాఠ్యాన్ని కొటేషనులో స్పష్టంగా చూపించాలి. మిగతా కంటెంటు అంతా కూడా, లైసెన్సింగ్ షరతులకు అనుగుణంగా ఉన్నంతవరకూ, స్వేచ్ఛా లైసెన్సు కింద పొందవచ్చు, మీ ఉపయోగం కోసం అందుబాటులో ఉంటుంది. వివరాల కోసం, వికీపీడియా కంటెంట్‌ను తిరిగి ఉపయోగించడం గురించిన మా పేజీని చూడండి. మా ఎన్సైక్లోపీడియా వ్యాసాలలో ఉపయోగించిన పాఠ్యం, బొమ్మలూ ఆడియో లాంటి అన్ని మీడియా ఫైళ్ళ మూలాలను, లైసెన్సులను చూపించడానికి మేము తీవ్రంగా ప్రయత్నిస్తూంటాం. అయినప్పటికీ, మీడియా ఫైళ్ళన్నీ సరిగానే వాడామనీ, లేదా సరిగ్గా గుర్తించామనీ మేము హామీ ఇవ్వలేము. ఒక బొమ్మ పబ్లిక్ డొమైన్‌లో ఉందని ఆ బొమ్మ వివరణ పేజీ పేర్కొన్నట్లయితే, ఆ దావా సరైనదేనా అని మీకు మీరే తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు వర్తించే చట్టాల ప్రకారం మీ బొమ్మ వాడుక ఆమోదయోగ్యమైనదా అనేది మీరే నిర్ణయించుకోవాలి.

ఇక్కడ మీ కంటబడ్డ కంటెంటు కాపీహక్కుల ఉల్లంఘనేమో నని మీకు అనిపించిందా? కాపీహక్కులున్న కంటెంటును మేం అనుచితంగా వాడుకుంటున్నామని మీకు అనిపిస్తే info-en-c@wikimedia.orgకు ఈమెయిలు చెయ్యండి. పేజీ పేరు లేదా అడ్రసు, సంబంధిత పాఠ్యానికి మీరే స్వంతదారు అని తెలిపే ఋజువులనూ ఇవ్వండి. మీరు ఆన్‌లైను లోని OCILLA అభ్యర్థన పంపదలిస్తే, మీ DMCA తీసెయ్యండి అనే అభ్యర్థనను మా అధీకృత ఏజెంటుకు పంపాలి. కాపీహక్కుల స్వంతదారు మీరు కాకపోయినా సరే, మీరు పంపే సమాచారాన్ని స్వాగతిస్తాం. ఈ సమస్యను ఎలా ఎత్తి చూపాలో తెలుసుకునేందుకు మా en:Wikipedia:Copyvio101 చూడవచ్చు. లేదా, పైన చూపిన అడ్రసుకు ఈమెయిలు పంపవచ్చు.

ఫోటీల వంటి కంటెంటును వికీపీడియాకు విరాళమివ్వవచ్చు కూడా. మీరే స్వయంగా దాన్ని ఎక్కించవచ్చు, ఆపై దాన్ని ఏదైనా వ్యాసంలో చేర్చవచ్చు. లేదా దాన్ని photosubmission@wikimedia.org కి ఈమెయిలు చెయ్యవచ్చు. ఈమెయిలు ద్వారా పంపదలిస్తే, దానికి ఫొటోని జతచేసి, దాని కాపీహక్కులు మీకే ఉన్నాయని చెప్పే వివరణ ఇవ్వాలి. అలగే దాన్ని స్వేచ్ఛా లైసెన్సు కింద విడుదల చేస్తున్నట్లుగా కూడా ప్రకటించాలి. మేం క్రియేటివ్ కామన్స్ యాట్రిబ్యూషన్-షేర్‌ఎలైక్ 4.0 లైసెన్సును కోరుకుంటాం. en:Wikipedia:Declaration of consent వద్ద ఉన్న ఫారాన్ని ఇందుకు వాడుకోవచ్చు. ఈమెయిలు ద్వారా పంపే ప్రకటనలను ప్రాసెస్ చేసేందుకు కొన్ని వారాలు పట్టవచ్చని గమనించండి. చివరగా, మీరు విరాళమివ్వదలచిన కంటెంటు ఈసరికే ఆన్‌లైనులో ఉంటే, మీ బదులు మరో వాడుకరిని దాన్ని ఎక్కించమని అభ్యర్థించవచ్చు. మీకు కాపీహక్కులున్న కంటెంటును విరాళమిచ్చే విషయమై మరింత సమచారం కోసం en:Wikipedia:Donating copyrighted materials చూడండి.


తిరిగి పాఠాల మెనూకు >>




"https://te.wikipedia.org/w/index.php?title=వికీపీడియా:Contact_us/Licensing&oldid=3489199" నుండి వెలికితీశారు
Last edited on 15 మార్చి 2022, at 16:55
వికీపీడియా
  • ఈ పేజీలో చివరి మార్పు 15 మార్చి 2022న 16:55కు జరిగింది.
  • అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 3.0 క్రింద లభ్యం
  • గోప్యతా విధానం
  • వికీపీడియా గురించి
  • అస్వీకారములు
  • వాడుక నియమాలు
  • డెస్కుటాప్
  • వృద్ధికారులు
  • గణాంకాలు
  • కుకీ ప్రకటన