పాఠకులు ఏదైనా వ్యాసంలో ఉన్న సమస్య దేని గురించైనా ఫిర్యాదు చెయదలిస్తే, మరింత సమాచారం తెలుసుకోదలిస్తే.
వ్యాస విషయాలు మీ గురించి, మీ సంస్థ గురించి, మీకు సంబంధించిన వారి గురించిన వ్యాసాల్లో సమస్యలుంటే.
లైసెన్సులు వికీపీడియా సమాచారాన్ని కాపీ చేసుకోదలిస్తే, మీస్వంత కృతులను దానమివ్వదలిస్తే, లేదా మీకు హక్కులున్న సమాచారాన్ని అనుమతి లేకుండా వాడుకున్నా.
దాతలు విరాళమిచ్చే పద్ధతి గురించి, మీరిచ్చే డబ్బు ఎలా ఉపయోగపడుతుంది వగైరాల గురించి తెలుసుకునేందుకు.
పత్రికలు, భాగస్వామ్యాలు మీరు పాత్రికేయులైతే, వికీపీడియాను సంప్రదించదలచినా, లేదా వ్యాపార ప్రతిపాదన ఏదైనా ఉన్నా.
వికీపీడియాకు స్వాగతం!
వికీపీడియా దాదాపుగా అంతా కూడా స్వచ్ఛంద రచయితలు - ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీలాంటి వ్యక్తులు - రాసినదే. అంటే, అనుకోకుండానో ఉద్దేశపూర్వకంగానో ఇందులో తప్పు సమాచారం చేరే అవకాశం ఉంటుందన్నమాట.
వికీపీడియాలో మీకు ఎక్కడైనా తప్పు సమాచారం కనిపిస్తే, మీరు కింది చర్యలు తీసుకోవచ్చు.
ముందుగా - మీరే దాన్ని సరిదిద్దవచ్చు! వికీపీడియాలో ఎవరైనా దిద్దుబాట్లు చెయ్యవచ్చు. పేజీకి పైన ఉన్న "సవరించు" నొక్కి, అవసరమైన దిద్దుబాటు చేసి, "మార్పులను ప్రచురించు" నొక్కండి. దిద్దుబాట్ల గురించి మరింతగా తెలుసుకునేందుకు, మా సహాయం పేజీలు చూడండి.
లోపాన్ని మీరు సరిదిద్దలేక పోయినా, సరిదిద్దదలచక పోయినా, ఆ వ్యాసపు చర్చ పేజీలో సమస్యను వివరించవచ్చు.
దుశ్చర్యకు సంబంధించినదైతే, నేరుగా మీరే సరిచెయ్యడం అత్యుత్తమ మార్గం; అయితే, మీరు సరిచెయ్యలేని పక్షంలో,info-en-vwikimedia.orgకు ఈమెయిలు పంపవచ్చు. వ్యాస శీర్షికను, దుశ్చర్య వివరాలనూ ఈ మెయిల్లో రాయాలి.
info-en-owikimedia.org అడ్రసుకు - వికీపీడియా వాలంటీరు రెస్పాన్స్ టీముకు - కూడా ఈమెయిలు పంపవచ్చు. అయితే మీ సూచనలన్నిటికీ మేం సహాయపడలేక పోవచ్చు. ఆ జాబితాను కొద్దిమంది స్వచ్ఛంద సేవకులతో కూడిన చిన్న బృందం నిర్వహిస్తుంది. ఈమెయిలు పంపే పనైతే, అందులో వ్యాసం పేరు లేదా అడ్రసును, సమస్య వివరాన్నీ రాయండి. ఏకంగా ఓ కొత్త వ్యాసం రాయడానికో, వికీపీడియాలో లేని విషయాల గురించో, కంటెంటు వివాదాలను పరిష్కరించడం వంటి విషయాల్లో ఈ ఈ బృందం మీకు సహాయపడలేదని గ్రహించండి.
మీరు వెతుకుతున్న వ్యాసం మావద్ద లేకపోతే, కోరుతున్న వ్యాసాల జాబితాలో దాన్ని చేర్చండి. అయితే, అక్కడ చేర్చినంత మాత్రాన ఆ వ్యాసాన్ని వెంటనే సృష్టించేస్తారని కాదు. అసలు సృష్టిస్తారనే అనుకోవద్దు. మీరు వెతుకుతున్న వ్యాసం మా వద్ద ఉండి, అందులో మీరు వెతుకుతున్న సమాచారం లేకపోతే, లేదా మీరు ఏదైనా నిర్దుష్టమైన ప్రశ్నకు సమాధానం వెతుకుతుంటే, మా సంప్రదింపుల కేంద్రంలో అడగండి: మా స్వచ్ఛంద సేవకులు మీకు సహాయం చేస్తారు!