వికీపీడియా:వికీప్రాజెక్టు/పత్రికలు
తెలుగు వికీపీడియా పత్రికల ప్రాజెక్టుకు సుస్వాగతం. తెలుగులో పత్రికలు ప్రచురించడం ప్రారంభమైన కాలం నుండి నేటి వరకు వెలువడుతున్న వివిధ పత్రికలకు సంబంధించిన వ్యాసాలు ఈ ప్రాజెక్టు పరిధిలో రూపొందించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. తెలుగు వెలువడిన ఏ విధమైన పత్రికనైనా ఈ ప్రాజెక్టులో మీరు కూర్చవచ్చును.ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యము తెవికీలో పత్రికలకు సంబంధించిన వ్యాసాలను గుర్తించి, వాటిని వర్గీకరించి, విశేషవ్యాసాల స్థాయిలో అభివృద్ధి చేయటం. పత్రికలకు సంబంధించిన వ్యాసాలతో పాటు ఆయా పత్రికల సంపాదకుల గురించి, ప్రచురణకర్తల గురించి, ప్రచురణ సంస్థల గురించి, ఆయా పత్రికలలో పనిచేసిన ప్రముఖ విలేఖరుల గురించి, రచయితల గురించి వ్యాసాలు రూపొంచి అభివృద్ధి చేయడం కూడా ఈ ప్రాజెక్టు పరిధిలోకి వస్తుంది.
- ప్రణాళిక
సమయం - సుమారు 6 నెలలు (జనవరి నుండి జూన్ 2015 వరకు)
- పరిధి
- సగటు తెవికీ చదువరికి ఆసక్తికలిగించే విషయాలనుబట్టి పత్రికల ప్రాముఖ్యతను చర్చించి నిర్ణయించటం.
- పత్రికల వ్యాసాలన్నింటిని తరగతులుగా వర్గీకరించి ప్రాముఖ్యతను గుర్తించడం
- పత్రికల ప్రాజెక్టుకు ముఖ్యమైన వ్యాసాలను గుర్తించడం; వాటిలో కొన్నింటిని మంచి వ్యాసాలుగా సమిష్ఠిగా అభివృద్ధి చేయడం.
ప్రాజెక్టు సభ్యులు
మార్చుప్రణాళిక ప్రాధాన్యతలు
మార్చువిధానాలు
మార్చు- ఏమి వ్రాయవచ్చును?
పత్రికల గురించిన వివరాలు, అంటే తొలి సంచిక వెలువడిన తేదీ, సంపాదకుని పేరు, ప్రచురణకర్త పేరు, ఎక్కడి నుండి వెలువడుతోంది, పత్రిక కాలపరిమితి వగైరా, పత్రిక ఆశయాలు, ధ్యేయాలు, సంక్షిప్తంగా పత్రిక చరిత్ర, పత్రికలోని సమాచారం, ఆ పత్రికలో వ్రాసిన రచయితల వివరాలు, పత్రికలోని ప్రధాన శీర్షికలు మొదలైన విషయాలు మూలాలను వుటంకించుతూ రాయాలి. పత్రిక ముఖచిత్రాన్ని స్కానర్ ద్వారా గ్రాహ్యం చేసి స్వేచ్ఛాహక్కులు వుంటే కామన్స్‌లో లేకపోతే తక్కువ విభాజకత పరిమాణంలోని బొమ్మను తెవికీ లోచేర్చాలి.
- ఏమి వ్రాయకూడదు?
వికీ విధివిధానాలను పాటించితే సరిపోతుంది. స్వంత అభిప్రాయాలు రాయకూడదు.
- ఎలా వ్రాయవచ్చును?
ప్రతి పత్రికలో కనీసం వుండాల్సిన విషయాలను గుర్తించితే అందరూ అది పాటించటం బాగుంటుంది.
- సమాచార పెట్టె మూస వీలుంటే బొమ్మలను చేర్చి దానిని సమాచారపెట్టెలో వాడాలి.
ప్రాజెక్టు ప్రకటన
మార్చు- ప్రాజెక్టు పెట్టెలు
- సభ్యుల పెట్టెలు
ప్రాజెక్టులో పనిచేసేవారికి ఉపయోగపడే వివరాలు
మార్చుజాబితాలు
మార్చు- తెలుగు పత్రికల జాబితా ఈ జాబితాలో సూచించిన పత్రికల వ్యాసాలను ప్రారంభించండి.
- తెలుగు పత్రికలు ఈ పేజీలో తెలుగు పత్రికలకు సంబంధించిన వివరాలు, వర్గీకరణలు (కాలపరిమితిని బట్టి, విషయాన్ని బట్టి) ఉన్నాయి. వ్యాసాలు ఉన్న పత్రికల జాబితా ఉంది. మీరు ఏదయినా పత్రిక గురించి వ్యాసం వ్రాసినట్లయితే ఆ వ్యాసం పేరును ఈ జాబితాకు జతచేయండి. ఈ జాబితాను మరింత విపులంగా వర్గీకరించవలసిన అవసరం ఉంది. అవసరమైతే కొత్త విభాగాలు చేర్చండి.
- వార్తాపత్రిక - ఈ పేజీలో వార్తాపత్రికలకు సంబంధించిన వివరాలున్నాయి.
మూసలు
మార్చు- {{వికీప్రాజెక్టు పత్రికలు}} అనే మూస ముఖ్యమైన తెలుగు పత్రికలతో వుంది. అది ఈ ప్రాజెక్టులోని పేజీలలో చేర్చేందుకు ఉపకరిస్తుంది.
వర్గాలు
మార్చుపత్రికల వ్యాసాలు క్రింది వర్గాలుగా వర్గీకరించబడ్డాయి/వర్గీకరించాలి.
- వర్గం:పత్రికారంగం
- వర్గం:తెలుగు పత్రికలు.
- విడుదల సంవత్సరం ఆధారంగా(ఉదాహరణకు వర్గం:1970 పత్రికలు )
- విషయం ఆధారంగా(ఉదాహరణకు వర్గం:తెలుగు సినిమా పత్రికలు, వర్గం:తెలుగు వార్తాపత్రికలు, వర్గం:తెలుగు హాస్యపత్రికలు)
- కాలపరిమితి ఆధారంగా (ఉదాహరణకు వర్గం:తెలుగు దినపత్రికలు, వర్గం:తెలుగు వారపత్రికలు, వర్గం:తెలుగు పక్షపత్రికలు,వర్గం:తెలుగు మాసపత్రికలు)
- ప్రచురణ మాధ్యమం ఆధారంగా (ఉదాహరణకు వర్గం:అచ్చుపత్రికలు, వర్గం:జాల పత్రికలు, వర్గం:గోడ పత్రికలు, వర్గం:వ్రాత పత్రికలు)
- పత్రికా మాధ్యంలో పనిచేస్తున్న ప్రముఖులు (ఉదాహరణకు వర్గం:సంపాదకులు, వర్గం:తెలుగువారిలో పాత్రికేయులు)
మార్చి2015 లో ప్రాజెక్టు గణాంకాలు
మార్చు- 28 ఫిబ్రవరి 2015న గణాంకాలు (దీనిలో అడ్డు వరస లేక నిలువ వరుస శీర్షికలపై నొక్కి ఆయా వ్యాసాల చర్చా పేజీలకు చేరవచ్చు. ఆ తరువాత వ్యాస పేజీకి చేరవచ్చు.
పత్రికల వ్యాసాలు |
ముఖ్యత | ||||||
---|---|---|---|---|---|---|---|
అతిముఖ్యం | చాలా ముఖ్యం | కొంచెంముఖ్యం | తక్కువముఖ్యం | తెలీదు | మొత్తం | ||
నాణ్యత | |||||||
విశేషవ్యాసం | 0 | 0 | 0 | 0 | 0 | 0 | |
విశేషంఅయ్యేది | 0 | 0 | 0 | 0 | 0 | 0 | |
మంచివ్యాసం | 0 | 0 | 0 | 0 | 0 | 0 | |
మంచిఅయ్యేది | 0 | 0 | 0 | 0 | 0 | 0 | |
ఆరంభ | 0 | 0 | 0 | 0 | 32 | 32 | |
మొలక | 0 | 0 | 0 | 0 | 204 | 204 | |
విలువకట్టని | 0 | 0 | 0 | 0 | 0 | 0 | |
మొత్తం | 0 | 0 | 0 | 0 | 236 | 236 |
మూలాలు
మార్చుఈ క్రింది మూలాల ద్వారా పత్రికలకు సంబంధించిన వ్యాసాలను అభివృద్ధి చేయవచ్చు.
- ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడెమీ వారి ఆర్చీవ్స్ వెబ్‌సైట్ http://www.pressacademyarchives.ap.nic.in/ ద్వారా పత్రికల సమాచారం లభిస్తుంది.
- భారతి మొదలైన పత్రికల గ్రంథస్వీకారం/ సమీక్షలలో సమకాలీన పత్రికల వివరాలు లభ్యమౌతాయి.
- ప్రస్తుతం వెలువడుతున్న పత్రికల సమాచారానికై వాటి వెబ్ పత్రికలను చూడవచ్చు.
- ఈ క్రింది పుస్తకాలలో కొంత సమాచారం లభిస్తుంది.
- * తెలుగుపత్రికల సాహిత్యసేవ - తిరుమల రామచంద్ర
- * తెలుగు జర్నలిజం అవతరణ వికాసం - వి.లక్ష్మణరెడ్డి
- * తెలుగు జర్నలిజం చరిత్ర - వ్యవస్థ - రాపోలు ఆనందభాస్కర్
- * ఆంధ్రజాతి అక్షర సంపద తెలుగు పత్రికలు - పొత్తూరి వెంకటేశ్వరరావు (ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ, హైదరాబాదు, 2004)
- * Press in India Vol.II of every year