వికీపీడియా చర్చ:ఈ వారం సమైక్య కృషి
మూస ఆకర్షణీయంగా ఉంది.
--t.sujatha 04:32, 18 ఏప్రిల్ 2008 (UTC)
నిర్వహించడానికి మార్గ దర్శకాలు
మార్చు"ఈ వారం సమైక్య కృషి" పనిని నిర్వహించడానికి కొన్ని మార్గదర్శకాలు సూచిస్తున్నాను. మీ అభిప్రాయాల ప్రకారం క్రింద ఇచ్చిన మార్గ దర్శకాలను నేరుగా మార్చండి (చర్చించనవసరం లేదు.). ఏకాభిప్రాయం కుదిరినాక మార్గదర్శకాలను ప్రధాన పేజీలోకి మారుద్దాము. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 07:07, 18 ఏప్రిల్ 2008 (UTC)
ఎటువంటివి సమైక్య కృషిలో ఉండవచ్చును?
మార్చు- ప్రతి వారం సమైక్య కృషి అనేది ఎక్కువ సభ్యులు పాల్గొంటానికి అనుకూలంగాను, ఆకర్షణీయంగాను ఉండాలి. కనుక ప్రత్యేకమైన సబ్జెక్టులు వీటికి సముచితం కాదు. అంటే సుడోకు, గోను తుఫాను వంటివి సమైక్య కృషి వ్యాసాలుగా ఉంచడం మంచిది కాదు.
- సమైక్య కృషిగా ఉంచిన వ్యాసాలపై సమాచారం సేకరించడానికి అందరికీ విస్తృతంగా అందుబాటులో ఉండాలి. కనుక ఆలె నరేంద్ర, దశరధ్ మంజీ వంటి వ్యాసాలు వీటికి సూటబుల్ కాదు.
- ప్రతి వారం సమైక్య కృషిలో మూడు అంశాలుంటాయి.
- ఒక వ్యాసం అనువాదం: నెల్సన్ మండేలా వంటి వ్యాసాలు ఇప్పటికే ఆంగ్ల వికీలో సమగ్రంగా ఉన్నాయి. కనుక ఇవి అనువాదాల కోవలోకి రావాలి. అనువాదం కాకుండా ఎక్కువ రోజులున్న వ్యాసాలను తొలగించేస్తున్నారు గనుక, అనువాదానికి ప్రతిపాదించిన వ్యాసం ఎన్నికైన వారంలోనే అంగ్ల వికీ నుండి కాపీ చేయాలి. (ప్రతిపాదించినప్పుడు కాదు).
- ఒక వ్యాసం సృష్టి మరియు / లేదా విస్తరణ: నన్నయ, కాకతీయులు, తెలుగు శతకాలు వంటివి. వర్గం:విస్తరణ కోరబడిన వ్యాసములులోనివి గాని, మరేమైనా గాని.
- ఒక వ్యాసం శుద్ధి, వికీకరణ, అక్షరదోష సవరణ, మూలాలు కూర్చడం వంటివి - వర్గం:శుద్ధి చేయవలసిన అన్ని వ్యాసాలు, వర్గం:వికీకరించవలసిన వ్యాసములు లోనివి గాని, మరేమైనా గాని.
- సభ్యులు తీరిక వేళలో మాత్రం వీకీలో వ్రాస్తుంటారు కనుక ఒక్క వ్యాసాన్ని సమగ్రంగా ఒక్క వారంల్కో ఆంగ్లవీకీ నుండి కాపీ చేయడం వీలు కానిపని.ఒక్క వారంలో పని ఆరంభిస్తే చాలు.--t.sujatha 04:12, 23 ఏప్రిల్ 2008 (UTC)
- నా ఉద్దేశ్యంలో ముందుగా తెవికీలో ఉన్న అసంపూర్తిగా ఉన్న వ్యాసాలనే వృద్ది చేయాలి. కనీసం సృష్టించి ఒక మూడు నెలలైన వ్యాసాన్ని మాత్రమే ఎన్నుకోవాలి. కానీ కాసుబాబుగారు ఇప్పటివరకూ కొత్త వ్యాసాలనే ఎక్కువగా ప్రతిపాదించినట్టున్నారు (నేనూ ఒక వ్యాసం ప్రతిపాదించాను!!!!). సుజాతగారూ! మీరన్నట్లు ఏ వ్యాసమైనా వికీలో ఒక వారంలో పూర్తి చేయబడదు. మనం చేసేదల్లా ఉన్న స్థాయినుంచి కొద్దిగా మెరుగుపరచడమే! ఈ పని ఇంకా ఊపందుకుంటే అప్పుడు మనం నాణ్యత గురించి ఆలోచించవచ్చునేమో కదా. అయినా గానీ కొత్తవ్యాసాలను తెచ్చి అనువదించడం మాని ఉన్న వ్యాసాలను అనువదిస్తే మంచిదని నా ఉద్దేశ్యం కూడా!δευ దేవా 23:36, 23 ఏప్రిల్ 2008 (UTC)
- దేవా గారూ మీ ఉద్దేశ్యం అర్ధమైంది.మీరన్నట్లు పాత వ్యాసాలను ముందుగా మెరుగు పరచాలి.ఏది ఏమైనా మొకలను అభివృద్ధి పరచాలన్న ఆలోచన రేకెత్తించి ఆ దిశలో కృషి జరగడం ముదావహం.దీని పై దృష్టి పెట్టి కృషి చేస్తున్న సభ్యులందరూ అభినందనీయులే.--t.sujatha 05:00, 24 ఏప్రిల్ 2008 (UTC)
నామినేషన్ విధం
మార్చునామినేషన్లను మూడు కేటగిరీలలోనూ ఎవరైనా చేయవచ్చును. వికీపీడియా:ఈ వారం సమైక్య కృషి లో వీటికి విభాగాలున్నాయి.
అలా ప్రతిపాదించిన వ్యాసాల చర్చాపేజీలో {{సమిష్టి కృషి పరిగణన}} అనే మూస ఉంచండి.
వ్యాసాల ఎన్నిక
మార్చువోటింగ్ అదీ ఇప్పుడు అంత అవుసరం అనిపించడం లేదు. ఎవరైనా నామినేషన్‌లలో ఉన్న వ్యాసాలలో మూడింటిని (ఒకో కేటగిరీలో ఒకో వ్యాసాన్ని) తీసి ఆ వారం సమైక్య కృషిగా ఉంచవచ్చును. ఎన్నికైన వ్యాసాలను మీరు తొలగిస్తే కారణాన్ని చర్చా పేజీలో వ్రాయండి.
విస్తరణ అనువాదం
మార్చువిస్తరణకి అనువాదంకి ఏంటి తేడా? విస్తరణ చేస్తే ఆంగ్ల వికీలో నుండే చేయాలి. అనువాదము అక్కడ నుండే. చర్చసాయీరచనలు 07:32, 27 ఏప్రిల్ 2008 (UTC)
- విస్తరణ అంటే కేవలం ఆంగ్ల వికీ అనువాదం కాదు. అనేక ఇతర గ్రంథాలు, వెబ్సైట్లు నుంచి సమాచారం సేకరించి ఎన్వికీలో లేని సమాచారం కూడా జోడించవచ్చు.--117.198.194.235 09:24, 27 ఏప్రిల్ 2008 (UTC)
- తమరు ఏవరో తెలుసుకోవచ్చా? చర్చసాయీరచనలు 09:27, 27 ఏప్రిల్ 2008 (UTC)
మంచి చర్చ
మార్చుఓ ఈ విషయంపై ఇంత చర్చ జరిగిందా? నే చూడనే లేదు. రవిచంద్ర గారూ ఏవో కొన్ని యాధృఛ్ఛికంగా మూసలో చేరుస్తున్నారనుకున్నా. ఒక వ్యాసం సమైక్య కృషికై ప్రతిపాదించుదామని ఇటువచ్చి చూశా. పాల్గొన్న అందరికీ అభినందనలు --వైజాసత్య 18:15, 25 మే 2009 (UTC)