వికీపీడియా చర్చ:వాడుకరుల గణాంకాలు/మొలకల గణాంకాలు

చదువరి మొలకలు

మార్చు

నా మొలకల జాబితాలో 48 అయోమయ నివృత్తి పేజీ లున్నాయి. వీటి పేర్లలో "(అయోమయ నివృత్తి)" అని లేకపోవడం వలన వీటిని మామూలు పేజీలుగా భావించారు. వీటిని తీసివేస్తే, నా మొత్తం మొలకలు: 152 అవుతాయి. అంటే 8.6% ఆ పేజీలు ఇవి: వాయువు, లోక్ సత్తా, అశోక చక్రవర్తి, యశోదారెడ్డి, విరాట్, శ్రీధర్, పెదగార్లపాడు, సీసము, షెట్‌పల్లి, కీసర, అంగలూరు, చింతకాని, తుంగతుర్తి, కావూరు, కమాన్‌పల్లి, ధన్వాడ, గణపవరం, పెనుగొండ, అంకుశాపూర్, చెరుకుపల్లి, బీబీనగర్, రామడుగు, టేకులపల్లి, కామేపల్లి, బండ్లపల్లె, కిస్టంపేట్, వెల్లటూరు, కూచిపూడి, కొల్లూరు, బయ్యారం, నాంపల్లి, దౌలతాబాద్, నాచారం, ఆల్వాల్, తుర్కపల్లి, నాగేపల్లి, బాబాపూర్, ఇబ్రహీంపట్నం, కన్నేపల్లి, ధర్మపురి, సారంగాపూర్, మేడిపల్లి, మర్రిగూడ, సిరికొండ, మల్లంపల్లి, పెగడపల్లి, బ్రాహ్మణ్‌పల్లి, తాడ్వాయి __చదువరి (చర్చరచనలు) 15:48, 14 జనవరి 2020 (UTC)Reply

చదువరి గారూ మాదిరిగా ఉదహరిస్తున్నాను. అప్పాజీపేట (అయోమయ నివృత్తి), అప్పాపురం అని రెండు రకాలుగా ఉండటాన మనకు తెలియని గుర్తు పట్టని ఇంకొక అప్పాపురం ఉన్నప్పుడు లంకెలు ఇచ్చేటప్పుడు కొంత గంధరగోళంగా ఉంటుంది. కావున వీటిని అన్నింటినీ ప్రాజెక్టు పని ఎలానూ చేస్తున్నాం, కనుక ఒకేసారి అప్పాపురం ఇలాంటి వాటిని అప్పాపురం (అయోమయనివృత్తి) గా తరలింపు చేస్తే బాగుంటుందని నేను అభిప్రాయపడుతున్నాను.ఇంకొకటి ఇవి మొలక వ్యాసాల క్రిందకు రావుగదా?నియమాలలో వీటికి మినహాయింపు ఉంది అనేది మనం రాసుకోవాలి.మీరూ అలోచించండి.--యర్రా రామారావు (చర్చ) 16:12, 14 జనవరి 2020 (UTC)Reply
యర్రా రామారావు గారూ, నిజమేనండి. అయోమయ నివృత్తి పేజీలన్నిటికీ పేరులో "(అయోమయ నివృత్తి)" అని ఉంటే లింకులిచ్చేటపుడు తికమక తగ్గుతుంది. ఇవి మొలక వ్యాసాల కిందికి రావు. స్పష్టంగా తెలిసిన అయోమయ నివృత్తి పేజీలను నేను పరిగణన లోకి తీసుకోలేదు.__చదువరి (చర్చరచనలు) 16:38, 14 జనవరి 2020 (UTC)Reply

ఒక సవరణ

మార్చు

యర్రా రామారావు గారి మొలకల జాబితా తప్పుగా పడింది, నా పొరపాటు కారణంగా. ఈ సంగతి ఆయన ఎత్తి చూపాక గమనించాను. దాన్నిపుడు సవరించాను. మిగతా సభ్యులు కూడా ఏమైనా దోషాలు గమనిస్తే సూచించగలరు. __చదువరి (చర్చరచనలు) 06:08, 16 జనవరి 2020 (UTC)Reply

గమనించని వాడుకరులను ప్రస్తావించుట గురించి

మార్చు

చదువరి గారూ మొలక వ్యాసాల అభివృద్ధి ప్రాజెక్టు పేజీ ఒకటి ఉందని కొంతమంది వాడుకరులు గమనించనట్లుగా అనిపిస్తుంది.వారిని పేజీ గూర్చి ప్రస్తావిస్తే బాగుంటుందేమో?--యర్రా రామారావు (చర్చ) 08:23, 22 జనవరి 2020 (UTC)Reply

Return to the project page "వాడుకరుల గణాంకాలు/మొలకల గణాంకాలు".