వికీపీడియా చర్చ:తెవికీ దశాబ్ది ఉత్సవాలు-Tewiki 10th Anniversary/Budget

సభ్యులు మరియు ఇతర వికీమీడియేతర సంస్థలనుండి విరాళాల విభాగం మార్చు

సభ్యులు మరియు ఇతర వికీమీడియేతర సంస్థలనుండి నిధుల వనరులలో విరాళాల విభాగం కనిపించలేదు. ఇప్పటికే దీనిగురించి చర్చలుజరిపి మరియు కొందరు విరాళాలు ఇవ్వడానికి ముందుకువచ్చినపుడు ఇదిలేకపోవడం విచారకరం. ఇవి ఇంకా చిత్తు ప్రతి స్థితిలోనే వున్నట్లేైతే త్వరలో ఆ విభాగం చేర్చమని మనవి. --అర్జున (చర్చ) 04:31, 20 జనవరి 2014 (UTC)Reply

అర్జున గారూ విరాళాల కొరకు స్పాన్సర్ల పేజీలో (వికీపీడియా:తెవికీ_దశాబ్ది_ఉత్సవాలు-Tewiki_10th_Anniversary/Sponsors)ఇవ్వడం జరిగింది విరాళాల కొరకై ఎవరైనా సంప్రదింపులు జరుపాలంటే దశాబ్ధి కమిటీ సభ్యుల వివరాలు ఎలాగూ మొదటి, చివరి పేజీలలో ఉన్నాయి కనుక విరాళాల కొరకై ఎక్కడ వ్రాసినా దానిని తదనంతరం చర్చలకు వీలుగా స్పాన్సర్ల లింకుకు తీసుకు వెళతాము....విశ్వనాధ్ (చర్చ) 15:03, 23 జనవరి 2014 (UTC)Reply
  • విశ్వనాధ్ గారికి. విరాళాలు అంచనా వేసి వాటిని సేకరించడానికి కృషి చేస్తే, కార్యక్రమానికి నిధుల అభ్యర్ధనలు పరిశీలించేవారికి కూడా మన కార్యక్రమంపై మరింత సద్భావన ఏర్పడే వీలుండేది. మీరు చెప్పినదానిని బట్టి దీనికి ప్రాధాన్యత తగ్గిందని జనం అనుకొనే వీలుంది--అర్జున (చర్చ) 01:52, 24 జనవరి 2014 (UTC)Reply

బడ్జెట్ పట్టికలో 2 తప్పుల సవరణ మార్చు

బడ్జెట్ పట్టికలో ఒక చిన్న టైపాటు జరిగింది. వికీఅకాడెమీల వద్ద(కాన్ఫరెన్స్ కు మునుపు ఖర్చుల్లో) 1000 కి బదులుగా 10000 అనీ, అలానే లోకల ట్రాన్స్పోర్ట్, భోజనం, వసతి ఇంకా స్థానిక రవాణా శీర్షిక కింద 100 మంది వ్యక్తులకు గానూ 50 మంది వ్యక్తులనీ తప్పుగా టైపవటం జరిగింది. ఇవి రెండూ గుర్తించిన వెంటనే సరి చేసాను. వీటివల్ల మొత్తం గణించడంలో తప్పు అవలేదు. ఇంకేమయినా మార్పులు ఉంటే దయచేసి ముందుగా చర్చించి ఆ[ఐన మార్చాలి. నేరుగా మార్చవద్దు. ఈ తప్పును సరి చూపిన నికిత కు ధన్యవాదాలు . --రహ్మానుద్దీన్ (చర్చ) 08:55, 25 జనవరి 2014 (UTC)Reply

Return to the project page "తెవికీ దశాబ్ది ఉత్సవాలు-Tewiki 10th Anniversary/Budget".