వికీపీడియా చర్చ:తెవికీ 20 వ వార్షికోత్సవం/నివేదిక/భవిష్యత్ కార్యాచరణపై చర్చ

ధన్యవాదాలు మార్చు

ఎందరో వికీపీడియన్లు అందరికీ వందనాలు.."

నివేదిక అక్షరబద్ధం చేసిన తీరు బాగుంది. ధన్యవాదాలు..! Muralikrishna m (చర్చ) 15:31, 14 ఫిబ్రవరి 2024 (UTC)Reply

నా భావన మార్చు

విశ్లేషణ నివేదిక తయారు చేసి, మా దృష్టికి తెచ్చినందుకు ముందుగా పవన్ (CIS-A2K) గారికి ధన్యవాదాలు. నాకు సంబంధించిన విభాగంలో భవిష్యత్తులో వికీలో ఏమి ఉండాలి, ఎలా నడవాలి, ఏం జరగాలి? అనే దానిపై నా భావన వ్యాసాలు ఉన్నవాటికి రెడ్ లింకులు కలపటం, అవకాశం ఉన్నవాటిని రెడ్ లింకులకు వ్యాసాలు సృష్టించటం, అవకాశం లేనివాటికి రెడ్‌లింకులు తొలగించాలని నా ఉద్దేశ్యం.ఆ రకంగా సవరించగోరు చున్నాను. యర్రా రామారావు (చర్చ) 14:43, 8 మార్చి 2024 (UTC)Reply

@యర్రా రామారావు గారూ, అలాగేనండీ. అందుకు అనుగుణంగా దిద్దుతాను. పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 15:35, 8 మార్చి 2024 (UTC)Reply
@యర్రా రామారావు గారూ, మీరు పైన రాసిన పాయింటు నాకు సవ్యంగా అర్థం కాలేదు. మీరే దయచేసి ఇక్కడ మీ ఉద్దేశానికి అనుగుణంగా సరిదిద్దేస్తారా? పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 17:22, 9 మార్చి 2024 (UTC)Reply
@పవన్ (CIS-A2K) గారూ అలాగేనండీ యర్రా రామారావు (చర్చ) 17:26, 9 మార్చి 2024 (UTC)Reply

చదువరి అభిప్రాయాలు మార్చు

విశాఖలో జరిగిన చర్చల సారాన్ని చక్కగా క్రోడీకరించి, భవిష్యత్తు కార్యాచరణను సముదాయం ముందుకు తెచ్చినందుకు @పవన్ గారికి ధన్యవాదాలు. భవిష్యత్తులో తెలుగు వికీపీడియా ఎలా ఉండాలి అనే కార్యాచరణకు ఇది చక్కటి భూమికను అందిస్తోంది.

ఈ విషయమై నా అభిప్రాయాలు ఇవి:

బయటి కార్యక్రమాలు మార్చు

బయటి కార్యలాపాలు బాగా విస్తృతంగా జరగాలి.

  1. ప్రతి మూడు నెలలకూ ఒకసారి ఔట్‌రీచ్ జరగాలి. ఇవి వివిధ సామాజిక సముదాయాల కోసం ప్రత్యేకించాలి.
    1. విశ్రాంత ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు
    2. ఇప్పుడు పని చేస్తున్న ఉపాధ్యాయులు
    3. గ్రామ స్థాయి ఉద్యోగులు/స్వచ్ఛంద సేవకులు (ఫొటోలు ఎక్కించేందుకు వీళ్ళు అత్యుత్తమం)
  2. పత్రికల్లో వికీ శీర్షికలను పెట్టుకోవచ్చు
    1. పత్రికల్లో ప్రతి వారం ఈవావ్యా వచ్చేలా ఒక శీర్షికను నిర్వహించవచ్చు. దీనికి కంటెంటును వికీ బృందమే పత్రిక ఎడిటరుకు పంపించవచ్చు.
    2. చరిత్రలో ఈ రోజును ప్రచురించుకోమని చెప్పి తెవికీకి శ్రేయస్సు ఇచ్చేలా మాట్లాడుకోవచ్చు
  3. సామాజిక మాధ్యమాల్లో అధికారికంగా ఖాతాలను నిర్వహించడం
    1. రోజుకో "మీకు తెలుసా" ఇవ్వవచ్చు
    2. ఇవ్వాళ్టి ప్రముఖ వార్తలకు సంబంధించిన వ్యాసాల లింకులు ఇవ్వవచ్చు

వికీ అంతర్గత కార్యక్రమాలు మార్చు

  1. భాషా నాణ్యత మెరుగుపరచే విషయమై కృషి జరగాలి. వాడుకరులందరూ దీనిపై దృష్టి పెట్టాలి. దీని కోసం శాశ్వత ప్రాతిపదికన ఒక ప్రాజెక్టు ఉండాలి. భాషా నాణ్యత విషయమై విస్తృతంగా అవగాహన కలిగించాలి.
  2. కొత్తవాళ్లకు శిక్షణ, మార్గదర్శకత్వం, ప్రోత్సాహం కోసం ఒక సమగ్రమైన శిక్షణా విభాగం ఉండాలి. (ఒక్క సంవత్సరంలో)
  3. కొత్తవారికి మార్గదర్శకత్వం చేస్తూ, వారిని దత్తత తీసుకునే సమూహం ఒకటి ఉండాలి. గ్రోత్ ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న గురువులు ఈ బాధ్యత తీసుకోవచ్చు.
  4. సహాయం పేజీలు, వీడియోలు, ఆడియోలు పెరగాలి
  5. మొబైలుపై ఎడిటింగు గురించిన సహాయం బాగా రావాలి. ప్రస్తుతం ఇది దాదాపుగా లేదు.
  6. పాతవాళ్ళకు కూడా అవసరమైన అంశాలపై శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలి.
  7. నిర్వాహకులు కొందరే చురుగ్గా ఉన్నారు. మరింత మంది నిర్వాహకులు రావాలి. గత రెండూ మూడేళ్ళలో కొత్తగా చేరిన వాడుకరులు నిర్వాహకత్వం తీసుకోవాలి. వచ్చే రెండేళ్ళలో, నిర్వాహకుల్లో కనీసం 50% మంది కొత్తవాళ్ళు ఉండాలి. అంటే ఒక పదిమంది దాకా కొత్త నిర్వాహకులు రావాలి
  8. నిర్వాహకత్వంపై ఆసక్తి ఉన్నవారికి తగిన ప్రోత్సాహం ఉండాళి. వారు నిర్వాహకత్వం చేపట్టేందుకు అవసరమైన శిక్షణ అందుబాటులో ఉండాలి. నిర్వాహకుల ఎంపిక మరింత శాస్త్రీయంగా చెయ్యాలి. ప్రశ్నలు-సమాధానాల సంస్కృతి పెరగాలి. నిర్వాహక హోదా ఇచ్చేముందు నిర్వహణ సంబంధ పనులు ఎన్ని చేసారో పరిశీలించాలి. అంటే చర్చలు, చర్చల్లో నిర్ణయాలు, విధానాలు మార్గదర్శకాలు, కొత్తవారికి శిక్షణ వగైరా అంశాలలో చేసిన కృషికి రేటింగు ఇవ్వాలి. నిర్వాహకత్వం పట్ల ఆసక్తి ఉన్న వారికి శిక్షణ ఇచ్చేందుకు అనుభవజ్ఞులు చొరవ తీసుకోవాలి.
  9. వర్గాల క్రమబద్ధీకరణ జరగాలి: పాఠకులు వికీలో వ్యాసాలు ఏమేం ఉన్నాయో చూసేందుకు (బ్రౌజింగ్ అంటారు కదా..అది.) వర్గాలు అత్యుత్తమ మార్గం. చక్కటి వర్గీకరణ దీన్ని సులభతరం చేస్తుంది. ప్రస్తుతం మన వర్గీకరణలో ఉన్న దోషాలను సరిచెయ్యాలి.
    1. దీన్నొక ప్రాజెక్టుగా తీసుకుని వర్గీకరణలు మెరుగుపరచాలి/చెయ్యాలి.
    2. ఈసరికే ఉన్న వర్గాల పేర్లు కొన్ని సరిగ్గా లేవు. వాటిని సరిచెయ్యాలి.
    3. పై పనులకు AWB ని విరివిగా వాడుకోవాలి
    4. ప్రతి వర్గానికీ వివరణ ఉండాలి. తేలిగ్గా బ్రౌజింగు చేసుకునేందుకు గాను, తగిన వర్గవృక్షాలు తయారు చేసి ప్రదర్శించాలి. ఉదాహరణకు క్రికెట్ వర్గ వృక్షం, ఆంధ్రప్రదేశ్ వర్గ వృక్షం వగైరా.
    5. ముఖ్యమైన శీర్ష వర్గాలకు ఒక వ్యాసం ఉండాలి. ఒక అవలోకనం పేజీలాగా దీన్ని తయారుచెయ్యాలి. ఉదాహరణకు క్రికెట్ వ్యాసాల అవలోకనం
  10. అనువాద పరికరం, AWB వంటి ఉపకరణాల వాడుక పెంచాలి. వీటిపై శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలి
  11. దుశ్చర్యల నివారణ, నిరోధం, పరిష్కారం కోసం మరింత కట్టుదిట్టమైన వ్యవస్థ ఉండాలి.
    1. ఇటీవలి మార్పులను తనిఖీ చేసేవాళ్ళు పెరగాలి, దాని కోసం ఒక వాడుకరి గుంపు ఉండాలి
    2. మరింత మంది క్రియాశీలకమైన నిర్వాహకులు ఉండాలి
    3. తెవికీ లోనే చెక్‌యూజర్లు ఉండాలి
  12. వ్యాసాల నిర్వహణకు, మెరుగుదలకూ సంబంధించి వికీప్రాజెక్టులు మరిన్ని రావాలి. ఉదా: అనాథాశ్రమం, ఎర్రలింకుల సంస్కరణ వంటివి.
  13. తక్షణ ప్రాధాన్యత ఉన్న అంశాలకు సంబంధించిన వ్యాసాలపై పని జరగాలి.
    1. వర్తమాన ఘటనలకు సంబంధించిన వ్యాసాలు
    2. రాబోయే ఘటనలకు సంబంధించిన వ్యాసాలు
    3. ఈసరికే ఉన్న వ్యాసాలను ఆయా ఘటనలకు సంబంధించిన వర్గాల్లో చేర్చాలి
  14. రోజుకో వ్యాసం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అలాంటివే ఇతర పోటీలను కాయించాలి. ఉదాహరణకు,
    1. 100 రోజులు - 100 వ్యాసాలు (రోజుకొకటి అనే నిబంధన లేదు)
    2. 100 రోజులు - 100 లక్షల బైట్లు (రోజుకింత అనే నిబంధన లేదు)
    3. 10 రోజులు - 10 వర్గాల్లో 100 పేజీలు
  15. మెరుగైన వ్యాసాల, మంచి వ్యాసాల తయారీ వ్యవస్థపై దృష్టి పెట్టాలి. మంచి వ్యాసంగా తీర్చిదిద్దిన వారికి (ప్రతిపాదకుడు, సమీక్షకుడు - ఇద్దరికీ) ప్రోత్సాహకాలు (పాయింట్లు) ఉండాలి. 2024 లో కనీసం 53 మంచి వ్యాసాలు తయారుచెయ్యాలి. (మూడు నెలల్లో మొదలుపెట్టాలి). రెండవ ఏటి నుండి ఈవావ్యాగా వీటినే ఎంపిక చెయ్యాలి.
  16. ఒక శాస్త్రీయమైన పద్ధతిలో నెలవారీగా/వార్షికంగా ప్రముఖ వికీపీడియన్లను, కొత్త వికీపీడియన్లనూ ఎంపిక చేసే పద్ధతిని ప్రవేశపెట్టాలి. వికీలో చేసే అర్థవంతమైన కృషికి గాను వాడుకరికి వికీదీప్తి (పాయింట్ల వ్యవస్థ) రావాలి. కృషిచేసేకొద్దీ వికీదీప్తి పెరుగుతూ పోతుంది. ఈ విషయమై చర్చకు ప్రారంభం స్థానంగా వికీపీడియా:నాణ్యతా మూల్యాంకనం పేజీని పెట్టుకోవచ్చు.
  17. కౌంట్‌డౌన్లు పెట్టుకోవాలి. ఉదాహరణకు,
    1. లక్షో వ్యాసానికి కౌంట్‌డౌన్
    2. వ్యక్తిగత కౌంట్‌డౌన్లు - 1000 వ్యాసాల కౌంట్‌డౌన్, కోటి బైట్ల కౌంట్‌డౌన్

"వికీ అంతర్గత కార్యక్రమాలు" విభాగం లోని అంశాలపై పని చేసేందుకు నాకు ఉత్సాహం ఉంది. అయితే ఇవి ఎవరికి వారుగా కాకుండా ఏయే పనులు చేపట్టాలి అని సముదాయం నిర్ణయిచాక వాటిపై అందరం కృషి చేస్తే విజయం వైపు అడుగులు వెయ్యవచ్చు. __ చదువరి (చర్చరచనలు) 04:51, 11 మార్చి 2024 (UTC)Reply

వాడుకరుల అభిప్రాయాలు మార్చు

భవిష్యత్తు కార్యాచరణలో పేర్కొన్న వివిధ అంశాలను ఇక్కడ ఉపవిభాగాలుగా చేర్చాను. ఆయా అంశాలపై తమ సూచనలను సంబంధిత విభాగంలో చేర్చవలసినది. సూచనలను క్రోడీకరించేందుకు వీలుగా కింది విధంగా బుల్లెట్ పాయింట్లతో చేర్చవలసినది. ఏ అంశానికి సంబంధించిన ఆ విభాగం లోనే రాయవలసినది. __చదువరి (చర్చరచనలు) 08:28, 11 మార్చి 2024 (UTC)Reply

  • వాడుకరి పేరు
    • మొదటి సూచన
    • రెండవ సూచన
    • సంతకం
  • వాడుకరి పేరు
    • మొదటి సూచన
    • రెండవ సూచన
    • సంతకం

అవుట్‌రీచ్ కార్యక్రమాల విస్తృతి పెరగాలి మార్చు

  • చదువరి
    • ఈ విషయమై గతంలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు వీలుగా ఇప్పటికి జరిగిన కార్యక్రమాల విశేషాలను ఒకే చోటికి తీసుకురావాలి. ఒకే వికీప్రాజెక్టు గొడుగు కిందికి తెస్తే బాగుంటుంది.
    • ఈ ఔట్‌రీచ్ కార్యక్రమాలను ఎలా జరపాలనే విషయమై ప్రామాణికాలను తయారు చేసుకోవాలి. (ముందే హాజరవదగ్గ వాళ్ళ జాబితా తయారు చేసుకోవడం, వాళ్లకు సమాచారం ఇవ్వడం, కార్యక్రమాలకు అవసరమైన సరుకూ సరంజామాను ముందే తయారు చేసుకోవడం వంటివి). ఈ విశ్హయాలను పైన తయారు చేసే గొడుగు ప్రాజెక్టు పేజీలో చర్చించవచ్చు
    • చదువరి (చర్చరచనలు) 08:47, 11 మార్చి 2024 (UTC)Reply

మాధ్యమాల ద్వారా వ్యాప్తి మార్చు

  • చదువరి
    • పత్రికల్లో వికీ శీర్షికలను పెట్టుకోవచ్చు., ఉదాహరణకు: ప్రతి వారం ఈవావ్యా గురించి సంక్షిప్తంగా వచ్చేలా ఒక శీర్షికను నిర్వహించవచ్చు. దీనికి కంటెంటును వికీ బృందమే పత్రిక ఎడిటరుకు పంపించవచ్చు.
    • చరిత్రలో ఈ రోజును ప్రచురించుకోమని చెప్పి తెవికీకి శ్రేయస్సు ఇచ్చేలా మాట్లాడుకోవచ్చు
    • సామాజిక మాధ్యమాల్లో అధికారికంగా ఖాతాలను నిర్వహించడం
    • మాధ్యమాల్లో ప్రచురించేందుకు రోజుకో "మీకు తెలుసా" ఇవ్వవచ్చు.
    • ఇవ్వాళ పేపర్లలో వచ్చిన ప్రముఖ వార్తలకు సంబంధించి తెవికీలో ఉన్న వ్యాసాల లింకులు ఇవ్వవచ్చు
    • చదువరి (చర్చరచనలు) 08:51, 11 మార్చి 2024 (UTC)Reply

ప్రత్యేకించిన సామాజిక సమూహాల ప్రజలకు అవుట్‌రీచ్ కార్యక్రమాలు మార్చు

సోదర ప్రాజెక్టులపై కృషి, అవగాహన పెంపు మార్చు

భాషా నాణ్యత పెంపు మార్చు

  • చదువరి
    • భాషా నాణ్యత పట్ల వాడుకరులందరి లోనూ చైతన్యం కలిగేలా ఉద్యమాన్ని నిర్వహించాలి
    • తెవికీ వ్యాసాల్లో సాధారణంగా దొర్లుతున్న దోషాలను జాబితా చెయ్యాలి. వాటిని నివారించడానికి ఉపాయాలను సూచించాలి
    • అనువాదాల్లో వచ్చే లోపాలను వాటికి పరిష్కారాలనూ జాబితా చెయ్యాలి
    • భాష విషయమై వాడుకరులకు ఉపయోగపడేలా ప్రముఖుల చేత ప్రసంగాలు ఏర్పాటు చెయ్యడం, వ్యాసాలు రాయించడం చెయ్యాలి
    • దీనికోసం ఒక గొడుగు వికీప్రాజెక్టు అవసరం
    • చదువరి (చర్చరచనలు) 08:58, 11 మార్చి 2024 (UTC)Reply

మూలాలను చేర్చడం, లోపాల సవరణ మార్చు

మంచి వ్యాసాలు, మెరుగైన వ్యాసాల తయారీ కోసం కృషి మార్చు

మెరుగైన వర్గీకరణ మార్చు

  • చదువరి
    • వర్గాల క్రమబద్ధీకరణ జరగాలి: పాఠకులు వికీలో వ్యాసాలు ఏమేం ఉన్నాయో చూసేందుకు (బ్రౌజింగ్ అంటారు కదా..అది.) వర్గాలు అత్యుత్తమ మార్గం. చక్కటి వర్గీకరణ దీన్ని సులభతరం చేస్తుంది.
    • ఈసరికే ఉన్న వర్గాల పేర్లు కొన్ని సరిగ్గా లేవు. వాటిని సరిచెయ్యాలి.
    • పై పనులకు AWB ని విరివిగా వాడుకోవాలి
    • ప్రతి వర్గానికీ వివరణ ఉండాలి. తేలిగ్గా బ్రౌజింగు చేసుకునేందుకు గాను, తగిన వర్గవృక్షాలు తయారు చేసి ప్రదర్శించాలి. ఉదాహరణకు క్రికెట్ వర్గ వృక్షం, ఆంధ్రప్రదేశ్ వర్గ వృక్షం వగైరా.
    • ముఖ్యమైన శీర్ష వర్గాలకు ఒక వ్యాసం ఉండాలి. ఒక అవలోకనం పేజీలాగా దీన్ని తయారుచెయ్యాలి. ఉదాహరణకు క్రికెట్ వ్యాసాల అవలోకనం
    • దీన్నొక వికీప్రాజెక్టుగా తీసుకుని చెయ్యాలి.
    • చదువరి (చర్చరచనలు) 09:10, 11 మార్చి 2024 (UTC)Reply

నాణ్యత పెంపు కోసం వివిధ వికీప్రాజెక్టుల రూపకల్పన మార్చు

సహాయం పేజీలను నవీకరించడం, ఇప్పుడు సహాయం అందుబాటులో లేని అనేక అంశాలకు సృష్టించడం. మార్చు

  • చదువరి
    • కొత్తవాళ్లకు శిక్షణ, మార్గదర్శకత్వం, ప్రోత్సాహం కోసం ఒక సమగ్రమైన శిక్షణా విభాగం ఉండాలి.
    • మొబైలుపై ఎడిటింగు గురించిన సహాయం బాగా రావాలి. ప్రస్తుతం ఇది దాదాపుగా లేదు.
    • చదువరి (చర్చరచనలు) 09:02, 11 మార్చి 2024 (UTC)Reply

తెవికీలో కృషి ఏం చేయాలి, ఎలా చేయాలన్నదానిపై వీడియోలు సృష్టించడం మార్చు

  • చదువరి
    • సహాయం పేజీలు, వీడియోలు, ఆడియోలు పెరగాలి. ప్రస్తుతం ఉన్న పేజీలను సంస్కరించాలి. దీనికోసం ప్రణయ్ రాజ్ గారి ఆధ్వర్యంలో ఒక ప్రాజెక్టు జరుగుతోంది. అక్కడ జరిగిన పనిని వాడుకుంటూ ముందుకు తీసుకుపోవాలి.
    • చదువరి (చర్చరచనలు) 09:04, 11 మార్చి 2024 (UTC)Reply

కొత్తవాళ్ళను అనుభవజ్ఞులైన వికీమీడియన్లు వికీదత్తత తీసుకోవడం మార్చు

తెవికీ బడి నడిపి తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల్లో రాయడం గురించి, పలు అంశాల గురించి వీడియో తరగతులు తీసుకోవడం మార్చు

కచ్చితమైన ప్రమాణాలు పెట్టి ఈనెల వికీపీడియన్/ఈ ఏడాది వికీపీడియన్ వంటి టైటిల్స్ ఇచ్చి ప్రోత్సహించడం మార్చు

మరింతమంది కొత్తవారిని నిర్వాహకులను చేయాలి. మార్చు

  • చదువరి
    • తెవికీలో మరింత మంది నిర్వాహకుల అవసరం ఉంది. గత రెండు మూడేళ్ళలో కొత్తగా చేరిన వాడుకరులు నిర్వాహకత్వం తీసుకోవాలి. వచ్చే రెండేళ్ళలో, నిర్వాహకుల్లో కనీసం 50% మంది కొత్తవాళ్ళు ఉండాలి అనే లక్ష్యం పెట్టుకోవాలి.
    • నిర్వాహకత్వంపై ఆసక్తి ఉన్నవారికి తగిన ప్రోత్సాహం ఉండాలి. వారు నిర్వాహకత్వం చేపట్టేందుకు అవసరమైన శిక్షణ అందుబాటులో ఉండాలి. నిర్వాహకుల ఎంపిక మరింత శాస్త్రీయంగా చెయ్యాలి. ప్రశ్నలు-సమాధానాల సంస్కృతి పెరగాలి. నిర్వాహక హోదా ఇచ్చేముందు నిర్వహణ సంబంధ పనులు ఎన్ని చేసారో పరిశీలించాలి. అంటే చర్చలు, చర్చల్లో నిర్ణయాలు, విధానాలు మార్గదర్శకాలు, కొత్తవారికి శిక్షణ వగైరా అంశాలలో చేసిన కృషికి రేటింగు ఇవ్వాలి. నిర్వాహకత్వం పట్ల ఆసక్తి ఉన్న వారికి శిక్షణ ఇచ్చేందుకు అనుభవజ్ఞులు చొరవ తీసుకోవాలి.
    • చదువరి (చర్చరచనలు) 09:08, 11 మార్చి 2024 (UTC)Reply

మొబైల్ ఎడిటింగ్‌లో ఉన్న సమస్యలను పరిశీలించి పరిష్కారం కోసం ప్రయత్నాలు చేయడం మార్చు

ఎర్రలింకుల సంస్కరణ మార్చు

  • చదువరి
    • గతంలో దీనిపై ఒక వికీప్రాజెక్టు జరిగింది. అయినప్పటికీ ఇంకా బోలెడు ఎర్రలింకులున్నాయి. అసలు ఉనికిలోనే లేని 1,66,000 పేజీలకు వివిధ వ్యాసాల నుండి లింకులున్నాయి. అంటే, వికీలింకు రూలు ప్రకారం ఈ లక్షా అరవయ్యారు వేల పేజీలను సృష్టిస్తే ఆ ఎర్రలింకులన్నీ నీలి లింకులైపోతాయన్నమాట. కానీ నిజానికి వీటిలో చాలావరకు వ్యాసాలు సృష్టించకుండానే సరిచెయ్యవచ్చు. దీనిపై ఒక వికీప్రాజెక్టు పెట్టుకోవాలి. లింకులు సరౌతాయి, కొత్త వ్యాసాలు ఉనికి లోకి వస్తాయి.
    • చదువరి (చర్చరచనలు) 10:03, 11 మార్చి 2024 (UTC)Reply

ట్వింకిల్ టెంప్లెట్ సరిదిద్దడం మార్చు

విజువల్ ఎడిటర్ డీఫాల్ట్ అయ్యాకా పనిచేయడం ఆగిపోయిన ఉపకరణాలను సరిదిద్దడం మార్చు

వికీడేటా - వికీపీడియా సమాచారపెట్టెల మధ్య ఇటునుంచి అటు, అటునుంచి ఇటు డేటా ఆటోమేటెడ్‌గా వెళ్ళడం మార్చు

  • చదువరి
    • అటునుంచి ఇటు: దీనిపై కొంత కృషి వికీడేటా లోను, ఎన్వికీ లోనూ జరిగింది. దాన్ని వాడుకోవచ్చు. ఇతర భారతీయ భాషా వికీల్లో ఈ విషయమై ఏమైనా పని జరుగుతున్నదేమో పరిశీలించాలి. ఆయాపనులను మన కూడా చేసుకుంటే సరిపోతుంది. ఇది సత్వర మార్గం.
    • ఇటు నుంచి అటు: వ్యాసాల లోని సమాచారాన్ని ఇటూ నుంచి అటు ఇప్పట్లో తీసుకెళ్ళలేమనుకుంటాను. కానీ, మన వద్ద ఉన్న వివిధ జాబితాలు, పట్టికల లోని డేటాను మాత్రం Quickstatements వంటి పరికరాలను, గూగుల్ డాక్స్ లోని విశేషాలనూ వాడుకుని కొంతపని చెయ్యవచ్చు. ఉదాహరణకు పురస్కార గ్రహీతలు అనే పేజీ ఉంటే, అందులో పట్టిఉక ఉంటే.. దాన్ని వాడుకుని ఆయా వ్యక్తులందరి వికీడేటా పేజీల్లో పురస్కారం పేరు, వచ్చిన సంవత్సరం, సంబంధిత మూలం వంటి సమాచారాన్ని చిటికెలో ఎక్కించెయ్యొచ్చు.
    • చదువరి (చర్చరచనలు) 09:19, 11 మార్చి 2024 (UTC)Reply

తెలుగులో అక్షరదోషాలు, వ్యాకరణదోషాలు చూసిపెట్టే ఉపకరణం రూపకల్పన మార్చు

  • చదువరి
    • ఇది గనక వస్తే అది ఒక అద్భుతం అవుతుంది, తెవికీ పాలిట. ఇప్పటికే గూగుల్ యంత్రం ద్వారా అనువాదం బాగా మెరుగుపడింది. ప్రస్తుతం ఆ అనువాదాల్లో మూణ్ణాలుగు ప్రధానమైన దోషాలుంటున్నాయి. వాటిని సవరించే మరో యంత్రం మనకు అందుబాటులో ఉంటే.. మన అనువాద వ్యాసాలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతాయి. నెలనెలా వంద, మూణ్ణెల్లలో వెయ్యి వ్యాసాలు లాంటి లక్ష్యాలు పెట్టుకోవడం, సాధించడం మామూలైపోతుంది. ఇప్పటి 100 వికీడేస్ లాగ.
    • చదువరి (చర్చరచనలు) 09:27, 11 మార్చి 2024 (UTC)Reply

మనసు ఫౌండేషన్ స్కాన్ చేసిన పుస్తకాల్లో కాపీహక్కులు లేనివాటిని ఎంచి వికీసోర్సులో చేర్చి డిజిటలీకరించడం మార్చు

ప్రతీ వ్యాసంలోనూ తప్పకుండా తగిన బొమ్మలు ఉండాలి మార్చు

  • చదువరి
    • మనకు 27 వేల పైచిలుకు గ్రామాల మండలాల వ్యాసాలున్నాయి. మొత్తం వ్యాసాల్లో 25% పైమాటే. వీటిలో బహుశా 10% కి మించి బొమ్మలు ఉండకపోవచ్చు. వీటన్నిటి లోనూ బొమ్మలు చేరిస్తే బొమ్మల్లేణి వ్యాసాల శాతం లోంచి 24 శాతం పాయింట్లు తగ్గిపోతుంది. ఇందుకోసం వికీలవ్ తెల్కుగు విలేజెస్ లాంటి ఫొటోల ఎక్కింపు కార్యక్ల్రమం చెయ్యాలి.
    • చదువరి (చర్చరచనలు) 09:33, 11 మార్చి 2024 (UTC)Reply

ఆడియో పుస్తకాలు, ఆడియో వ్యాసాల తయారీకి కృషి మార్చు

Return to the project page "తెవికీ 20 వ వార్షికోత్సవం/నివేదిక/భవిష్యత్ కార్యాచరణపై చర్చ".