వికీపీడియా చర్చ:దశాబ్ది ఉత్సవాల వికీ పురస్కార ఎంపిక/ప్రతిపాదనలు

నా ప్రతిపాదనలు మార్చు

  • వాడుకరి:Arjunaraoc: వాడుకరుల సందేహాలు తీరుస్తూ తెవికీ పురోగతికి రథసారథి అయిన అర్జున గారు
  • వాడుకరి:Kvr.lohith: నిర్వాహకులు, శుద్ధి దళ సభ్యులు, పలు ప్రాజెక్టులని తీర్చిదిద్దుతూ ఉన్న వెంకటరమణ గారు
  • వాడుకరి:Rajasekhar1961: ప్రతి సంవత్సరం ఏదో ఒక బార్న్ స్టార్ తో తన అవిరామ కృషిని చాటుతున్న రాజశేఖర్ గారు

పేజీలో సులభంగా వాడుకరిని ప్రతిపాదించే పెట్టెను వాడాను కానీ అది ఎందుకో తప్పుడు లింక్ కు వెళుతున్నది. కావను ఇక్కడ ప్రతిపాదించాను - శశి (చర్చ) 08:24, 3 డిసెంబర్ 2013 (UTC)

శశి , మీ స్పందనకు ధన్యవాదాలు. ఎంపిక మండలిలో సభ్యుత్వం వలన నేను, రాజశేఖర్ గారు అర్హులము కాదు. రమణ గారు మొదటి రచన గడువు తరువాత కావున ఆయనకూడా ప్రస్తుతము అర్హులు కాదు అని తెలిసింది. మీ దృష్టిలో ఇంకెవరినైనా ప్రతిపాదించండి. ప్రతిపాదనల పేజీ చాలా వరకు సులభతరం చేశాము. దానిలోని సూచనలు మరొక్కసారి చదివి సమస్య వుంటే తెలియచేయండి. --అర్జున (చర్చ) 08:43, 3 డిసెంబర్ 2013 (UTC)

నేను రెడ్డిగారు.ప్రసాద్ గారు. వీవెన్, భూపతిరాజు రమెష్ రాజు లను ప్రతిపాదించినప్పటికీ నామినేషన్ల జాబితాలో పేర్లు కనబడుటలేదు. అర్జున గారు పరిశీలించగలరు--కె.వెంకటరమణ (చర్చ) 23:43, 3 డిసెంబర్ 2013 (UTC)

కె.వెంకటరమణ, సమస్య తెలిపినందులకు ధన్యవాదాలు. ఈ పేజీ ముఖ్యమని, దుశ్చర్యలకు గురికాకుండా వుంచాలని . నిన్న దీనిని నిర్వాహకులుమాత్రమే మార్చుటకు సంరక్షణ చేసినందున ఈ ఇబ్బంది ఏర్పడింది. ప్రస్తుతము సంరక్షణను రద్దుచేశాను. --అర్జున (చర్చ) 01:03, 4 డిసెంబర్ 2013 (UTC)

మరొక ప్రతిపాదన మార్చు

ప్రారంభ దశలో నాకు ఎంతో ఓపికగా సహాయ సహకారాలాని అందించిన వాడుకరి:కాసుబాబు గారిని ప్రతిపాదించదలచుకొన్నాను. ఎంత ప్రయత్నించిననూ తప్పుడు లింకుకే వెళుతున్నది. దయచేసి ఎవరైనా చొరవ తీసుకొని నా తరపున కాసుబాబు గారిని ప్రతిపాదించండి - శశి (చర్చ) 16:11, 4 డిసెంబర్ 2013 (UTC)

కాసుబాబు గారికి నేను ఆహ్వానం పంపించాను. ఇప్పుడే తననుండి జాబు వచ్చింది. తాను జనవరి 2014 నుండి తెవికీలో చురుకుగా పాల్గొనబోతున్నట్లు తెలియజేసారు. కానీ పురస్కారాన్ని ప్రతిపాదించడానికి తన సమ్మతిని ఇవ్వలేదు. అందుకు నాతో సహా, మీలాంటి వారి అభిమానులు చాలా బాధపడుతున్నారు. గమనించండి.Rajasekhar1961 (చర్చ) 02:51, 5 డిసెంబర్ 2013 (UTC)
Return to the project page "దశాబ్ది ఉత్సవాల వికీ పురస్కార ఎంపిక/ప్రతిపాదనలు".