వికీపీడియా చర్చ:రచ్చబండ (పాలసీలు)/నిర్వాహకత్వ హక్కులు పొందటానికి మార్గదర్శకాలు

రెండు సూచనలు

మార్చు

యర్రా రామారావు గారూ, ఈ ప్రతిపాదన విషయమై రెండు సూచనలు:

  1. మనకు వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి పేజీలోను, వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/ప్రమాణాలు పేజీలోనూ ఈసరికే కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. వీటిలో కొన్ని సవరణలు, చేర్పులు మీరు ప్రతిపదించదలచారని నేను భావిస్తున్నాను. ఈ పని చేపట్టినందుకు ధన్యవాదాలు. అయితే, ఈ ప్రతిపాదన ఏ నేఫథ్యంలో తెస్తున్నారో రాసారు గానీ ఈసరికే ఉన్న పై ప్రమాణాలను కూడా ఉదహరించి, వాటిని ఎలా మార్చదలచారో, ఎందుకు మార్చదలచారో కూడా రాస్తే ప్రతిపాదనలో స్పష్టత వస్తుంది.
  2. ఇలాంటి ప్రతిపాదనలను నేరుగా ఇలా వికీపీడియా: పేరుబరిలో కాకుండా, వికీపీడియా:రచ్చబండ (పాలసీలు) పేజీకి ఉపపేజీలుగా తయారుచేసి అక్కడ చర్చించాలి. ఆ పేజీలో కొన్ని ఉదాహరణలున్నాయి, పరిశీలించవచ్చు. ఆ చర్చ ఫలితాన్ని బట్టి రూపొందే విధానాన్ని ఇలా విధానాలు/మార్గదర్శకాల పేజీగా తయారుచెయ్యవచ్చు.

పరిశీలించండి.__ చదువరి (చర్చరచనలు) 11:12, 14 మార్చి 2024 (UTC)Reply

@చదువరిగారూ మీ సూచనలకు ధన్యవాదాలు.అలాగేనండీ.ఇంకా తయారీలో ఉంది.పూర్తి రూపు ఇంకా తీసుకురావాలి.ఇందులో ఇంకా సూచనలు ఏమైనా ఉంటే చేయగలరు. యర్రా రామారావు (చర్చ) 14:47, 14 మార్చి 2024 (UTC)Reply
వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/నిర్వాహకత్వ హక్కులు పొందటానికి మార్గదర్శకాలు అని తరలించాను. యర్రా రామారావు (చర్చ) 13:38, 18 మార్చి 2024 (UTC)Reply

నిర్వాహకత్వానికి దోహదపడే కృషి గురించి కొన్ని ఆలోచనలు

మార్చు

నిర్వాహకత్వాన్ని ప్రతిపాదించుకునే అభ్యర్థులు కింది విషయాలపై కృషి చేసి ఉంటే మంచిది

తెవికీ సమగ్రతను కాపాడడంపై శ్రద్ధ, ఆసక్తి: వివిధ పేజీల్లో జరుగుతున్న మార్పుచేర్పులను గమనించి అవి తెవికీ విధానాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో పరిశీలించి అవసరమైన చర్య తీసుకునే కృషి ఇది. వ్యాసాల్లో దుశ్చర్యలు, భాషాదోషాలు, మూలాల్లేని సమాచారం చేర్పు, ఉన్న సమాచారాన్ని నిర్హేతుకంగా తొలగించడం/మార్చడం, దిద్దుబాట్ల యుద్ధాలు, వేధింపులు, కొత్త వ్యాసాల్లో విషయ ప్రాముఖ్యత, వర్గీకరణ, ఇతర పేజీల నుండి లింకులు వంటి అంశాలను పరిశీలించడం ఈ కృషి లోకి వస్తాయి. ఇవి వాడుకరులందరూ చెయ్యవలసిన, చెయ్యదగ్గ పనులే. నిర్వాహకులు ఈ విషయమై మరింత అప్రమత్తంగా ఉండాలి. ఈ కృషి చేసే వాడుకరులు నిర్వాహక కృషికి మరింత దగ్గరౌతారు. తెవికీలో జరుగుతున్న తాజా మార్పుచేర్పులను గమనించే చోటు "ఇటీవలి మార్పులు". ఈ పేజీని నిరంతరం పరిశీలిస్తూ తగు చర్యలు తీసుకుంటూ ఉండాలి.

చర్చల్లో పాల్గొనడం: తెవికీ ప్రగతిలో ప్రధానమైన అంశం "చర్చ". ప్రతీ పేజీకీ అనుబంధంగా చర్చ పేజీ ఉండడం దీని ప్రాధాన్యతను తెలియజేస్తుంది. వాడుకరులు చురుగ్గా చర్చలలో పాల్గొంటే సరైన ఆలోచనలు ప్రవహించి మెరుగైన నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంటుంది. నిర్వాహక అభ్యర్థులు ఈ విషయంపై దృష్టి సారించి, చురుగ్గా చర్చల్లో పాల్గొనాలి. ముఖ్యంగా వ్యాసాల చర్చ, రచ్చబండ, తొలగింపు చర్చలు, వాడుకరి చర్చ (స్వాగతం కాకుండా), వంటి పేజీల్లో అవసరమైన చోట్ల తమ అభిప్రాయాలను, సూచనలనూ తెలియజేస్తూ ఉండాలి. కొత్త వాడుకరుల కృషిని అభినందించడం, మార్గదర్శనం చెయ్యడం, దోషాలను తెలియజెప్పడం వీటి లోకి వస్తాయి.

ఏయే అంశాలపై ఎలాంటి కృషి చెయ్యవచ్చు అనే ఒక సూచనామాత్రపు పట్టికను కింద ఇస్తున్నాను. దీన్ని బట్టి తాము చేసిన కృషి, నిర్వాహకత్వం ప్రతిపాదించేందుకు అనువుగా ఉందా లేదా అని అభ్యర్థులు పరిశీలించేందుకు ఇది తోడ్పడుతుంది. ప్రతిపాదనను పరిశీలించి, అభ్యర్థిత్వాన్ని అంచనా కట్టేందుకు వాడుకరులకూ ఇది ఒక సూచనగా పనిచేస్తుంది.

ఇది నిర్వాహకత్వాన్ని నిర్ణయించే "కొలత" కాదు. దీనిపై ఆధారపడి నిర్ణయం చెయ్యరాదు. అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడంలో దీన్ని ఒక పనిముట్టుగా మాత్రమే చూడాలి.

సం పని మార్కులు
1 ఇటీవలి మార్పులపై నిఘా పెట్టి పేజీల్లో జరిగే దుశ్చర్యలు మొదలైనవాటిని పరిశీలిస్తూ ఆయా దిద్దుబాట్లను తిరగ్గొడుతూ ఉండడం. కొత్త వ్యాసాలను తనిఖీ చెయ్యడం. (తెవికీ నాణ్యతపై, సమగ్రతపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది) చేసిన ప్రతి తనిఖీకీ.. 5
2 నిర్వహణకు సంబంధించి చేసే చర్యలు (అనాథ వ్యాసాలు, అగాధ వ్యాసాలు, కోరిన వ్యాసాలు/వర్గాలు/మూసలు వగైరా జాబితాలపై పనిచేయడం) (తెవికీ నాణ్యతపై, సమగ్రతపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది) 5
3 వ్యాసాల్లో భాష నాణ్యతపై చర్యలు - భాషను సవరించడం, సముచితమైన మూసను చేర్చడం వగైరా (తెవికీ నాణ్యతపై, సమగ్రతపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది) 5
4 నిర్వాహకుల నోటీసుబోర్డులో ఏదైనా విషయాన్ని నిర్వాహకుల దృష్టికి తీసుకురావడం. ఉదా: దుశ్చర్య, తొలగింపు చర్య, సంరక్షణ, వగైరా (తెవికీ నాణ్యతపై, సమగ్రతపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది) 10
5 అయోమయ నివృత్తి పేజీల సృష్టి/విస్తరణ/నిర్వహణ (వ్యాసాల నిర్వహణపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది) 5
6 అయోమయ నివృత్తి పేజీలకు వెళ్తున్న లింకులను గమనించి వాటిని సరైన పేజీకి మార్చడం (వ్యాసాల నిర్వహణపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది) 5
7 తక్షణమే తొలగించాల్సిన పేజీల్లో CSD మూసలు చేర్చడం (తెవికీ నాణ్యతపై, సమగ్రతపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది) 5
8 తొలగింపు చర్చపై నిర్ణయాన్ని ప్రకటించడం (నిర్ణయం ఎలా ప్రకటించాలనే పరిజ్ఞానాన్ని తెలియజేస్తుంది) 10
9 తొలగింపుకు ప్రతిపాదించడం (తొలగింపు హేతుకత తెలిసి ఉండడాన్ని సూచిస్తుంది) 5
10 తొలగింపు చర్చలో పాల్గొని అభిప్రాయం ప్రకటించడం (తొలగింపు హేతుకత తెలిసి ఉండడాన్ని సూచిస్తుంది. చర్చల్లో అభిప్రాయాలు చెప్పి ఒక నిర్ణయం కోసం కృషిచేసే నిబద్ధతను తెలియజేస్తుంది) 5
11 తొలగింపు ప్రతిపాదన వచ్చినపుడు ఆ వ్యాసంలో తగు మార్పులు చేసి తొలగింపు నుండి రక్షించడం (తొలగింపు హేతుకత తెలిసి ఉండడాన్ని, వ్యాసాలను తొలగించకుండా నిలిపి ఉంచే నిబద్ధతను సూచిస్తుంది) 10
12 రచ్చబండలో చర్చలో పాల్గొనడం (చర్చల్లో అభిప్రాయాలు చెప్పి ఒక నిర్ణయం కోసం కృషిచేసే నిబద్ధతను తెలియజేస్తుంది) 3
13 కొత్తవారికి తోడ్పాటు (స్వాగతం కాకుండా, వాడుకరి చేసిన పనిని ప్రస్తావిస్తూ ప్రోత్సహించడం, దోషాలేమైనా ఉంటే మర్యాదగా తెలియజేయడం) 10
14 ఎడబ్ల్యుబి వాడుక
15 అనువాద పరికరం వాడుక

పరిశీలించవలసినది. __ చదువరి (చర్చరచనలు) 05:11, 21 మార్చి 2024 (UTC)Reply

@Chaduvari గారూ, మంచి ప్రతిపాదన చేశారండీ. ధన్యవాదాలు. పవన్ సంతోష్ (చర్చ) 13:53, 29 మార్చి 2024 (UTC)Reply

నిర్వాహకత్వ హక్కులు పొందటానికి మార్గదర్శకాలు విధాన నిర్ణయ పేజీ తయారు

మార్చు

చదువరి గారు నిర్వాహకత్వ హక్కులు పొందటానికి మార్గదర్శకాలు ఫై జరిగిన చర్చలో నిర్ణయాల ప్రకారం తగిన విధాన నిర్ణయ పేజీని తయారు చేయవలసిసిందిగా మిమ్మల్ని కోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 07:41, 17 ఏప్రిల్ 2024 (UTC)Reply

యర్రా రామారావు గారూ, ఆలస్యానికి మన్నించండి. పేజీ తయారు చెయ్యబోయినపుడు, ఇక్కడ ప్రకటించిన నిర్ణయంలో నాకు కొన్ని సందేహాలు కలిగాయి. అవి ఇంకా తీరలేదు. అయితే సమయం గడచిపోతున్నందున, ఆ సందేహాలకు నేణే సమాధానం చెప్పుకుని, ఒక పేజీని తయారుచేసాను. అయితే నేరుగా అసలు పేజీలో పెట్టకుండా, దాన్ని నా వాడుకరి పేజీలో రాసాను.
Rajasekhar1961 గారూ, మీరు పై పేజీని పరిశీలించి, అది మీ నిర్ణయానికి తగినట్లుగా ఉంటే సరి, లేదంటే మార్పుచేర్పులు ఏమేం ఉండాలో చేసెయ్యండి/సూచించండి. నాకున్న సందేహాల్లో ముఖ్యమైనది: "కాబట్టి ముందు అలాంటి పనులు చేసి అవసరాన్ని బట్టి రోల్‌బ్యాక్ వంటి హక్కులు ఇచ్చి వాటి నిర్వాహణ సంతృపికరంగా అనిపిస్తే అప్పుడు నిర్వాహక ప్రతిపాదనకు ప్రోత్సహించవచ్చును." అని మీ నిర్ణయంలో రాసారు. అంటే నిర్వాహకత్వాని కంటే ముందు రోల్‌బ్యాక్ హక్కు పొందాలి, అందులో కృషి సంతృప్తికరంగా ఉంటేనే నిర్వాహకత్వం ఇస్తామా? కానీ అది చర్చలో ఒక్కచోటే ప్రతిపాదనగా వచ్చింది. దానిపై చర్చ కూడా జరగలేదు. ఈ సందేహం కారణంగా ప్రస్తుతం నేను తయారుచేసిన ముసాయిదాలో దాన్ని చేర్చలేదు. మీ నిర్ణయం అదే అయితే, దాన్ని మార్గదర్శకంలో చేర్చాల్సి ఉంటుంది.
ఆ తరువాత దాన్ని అసలు పేజీలో చేరుస్తాను. __ చదువరి (చర్చరచనలు) 04:57, 23 మే 2024 (UTC)Reply
@Chaduvari గారూ పేజీ చూసాను.అన్ని విషయాలు వచ్చాయి.ధన్యవాదాలు.అయితే @ Rajasekhar గారు ఒకసారి దీనిని చూసి పైన చదువరి గారు వెళ్ళబుచ్చిన సందేహం నివృత్తి చేస్తే దీనిని అమలులోకి తీసుకురావచ్చు. యర్రా రామారావు (చర్చ) 05:10, 23 మే 2024 (UTC)Reply
Return to the project page "రచ్చబండ (పాలసీలు)/నిర్వాహకత్వ హక్కులు పొందటానికి మార్గదర్శకాలు".