వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/విశాఖపట్నం

తాజా వ్యాఖ్య: ఇప్పుడిక.. టాపిక్‌లో 11 నెలల క్రితం. రాసినది: Vjsuseela

ప్రాజెక్టు పేజీ పరిశీలన

మార్చు

పరిశీలించాను.బాగుంది.కొన్నిటికి వ్యాసాలు ఉండిఉండవచ్చు అనుకుంటాను.వాటికి వికీడేటా లింకు కలిపి విస్తరించాల్సిన అవసరం ఉంది.తెలుగు వికీపీడియా 20 వ వార్షికోత్సవం సందర్బంగా ఈ ప్రాజెక్టు రూపొందించినందుకు ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 05:16, 2 డిసెంబరు 2023 (UTC)Reply

డిసెంబరు 14

మార్చు

అందరికీ నమస్కారం. నిన్న, డిసెంబరు 14 మన ప్రాజెక్టుకు ఒక పెద్ద మైలు రాయి. ఇన్నాళ్ళూ రోజుకు పదీ పన్నెండు చొప్పున రాసుకుంటూ వస్తున్నాం. హఠాత్తుగా నిన్న 46 వ్యాసాలు వచ్చి చేరాయి. ఒక్క రోజులో వంద వ్యాసాలు కాస్తా 150 దాకా వచ్చేసింది. ఏంటా అని చూస్తే, ప్రవల్లిక గారు 25, భవ్య గారు 16 - వాళ్ళిద్దరికీ అభినందనలు, ధన్యవాదాలు. __ చదువరి (చర్చరచనలు) 02:59, 15 డిసెంబరు 2023 (UTC)Reply

@ప్రవల్లిక గారికి, భవ్య గారికి ఇద్దరకి అభినందనలు.ప్రత్యేక ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 03:18, 15 డిసెంబరు 2023 (UTC)Reply
అభినందనలు ప్రవల్లిక గారు, భవ్య గారు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:58, 16 డిసెంబరు 2023 (UTC)Reply

ఇప్పుడిక..

మార్చు

ప్రాజెక్టు పేజీలో ఎంచుకున్న అనువాదాలన్నీ దాదాపు అయిపోయాయ్. ఇంకా కొత్త వ్యాసాలు ఏ విషయాలపై రాయాలనే ప్రశ్న ఎదురైంది.

  • విశాఖపట్నం చరిత్ర (en:History of Visakhapatnam) అనే పేజీ సృష్టించాలి.

"విశాఖపట్నం" పేజీని సంస్కరించుదాం. దానిలో కింది పనులు చేద్దాం:

  • భాషా దోషాలను సరిచెయ్యడం
  • పేజీ హంగులను సమకూర్చడం - క్లుప్తవివరణ, వర్గాలు చేర్చడం, ఎర్ర వర్గాలను సవరించడం/తీసెయ్యడం, ఎర్ర లింకుల సంస్కరణ, కొత్త లింకులు ఇవ్వడం, వగైరా
  • పేజీలో మరింత సమాచారం చేర్పు
    • విశాఖ ప్రముఖుల పేర్లు చేర్చడం - ఎక్కువ మంది వస్తూంటే వాటిని ఉపవిభాగాలు చెయ్యడం - రచయితలు, క్రీడాకారులు, రాజకీయులు, వ్యాపారవేత్తలు, కళాకారులు .. ఇలాగ (తెవికీలో పేజీలు ఉన్నవాళ్ళ పేర్లనే చేరుద్దాం)
    • బొమ్మలు చేర్చడం/మార్చడం/అమర్చడం
    • నగరానికి తాగునీటి సరఫరా
    • మురుగునీటి వ్యవస్థ
    • గణాంకాలు - విస్తీర్ణం, జనాభా (చారిత్రిక గణాంకాలు కూడా), రోడ్ల పొడవు, స్థూల నగర ఉత్పత్తి, కార్పొరేషను బడ్జెట్టు, వుడా బడ్జెట్టు, ఉద్యోగుల సంఖ్య, శాంతిభద్రతల వువరాలు వగైరా
  • అన్నీ అయ్యాక మొత్తం విశాఖ పట్నం పేజీని వికీ శైలికి అనుగుణంగా తిరగ-కూర్చడం
  • వికీడేటాలో లక్షణాలు, ఐడీలూ చేర్చడం
  • అలాగే ఇతర భాషల్లో - ముఖ్యంగా ఇంగ్లీషులో - విశాఖపట్నం పేజీని విస్తరించడం

ఇప్పటివరకు సృష్టించిన విశాఖ సంబంధ పేజీలను కూడా పైవిధంగా బలోపేతం చేద్దాం. ఇదంతా సాముదాయిక కృషి. అందరం కలిసి చేద్దాం. ఈ విషయమై మీమీ ఆలోచనలు కూడా రాయవలసినది. __ చదువరి (చర్చరచనలు) 05:55, 16 డిసెంబరు 2023 (UTC)Reply

ఈ క్రింది వ్యాసాలను అవసరమైతే ఉపయోగించుకోవచ్చు. పరిశీలించండి. ధన్యవాదాలు.
https://www.researchgate.net/search.Search.html?query=about+visakhapatnam+heritage&type=publication
https://www.researchgate.net/publication/258286166_HERITAGE_SITES_IN_VISAKHAPATNAM_CITY_TYPOLOGIES_ARCHITECTURAL_STYLES_AND_STATUS

VJS (చర్చ) 09:40, 16 డిసెంబరు 2023 (UTC)Reply

Return to the project page "వికీప్రాజెక్టు/విశాఖపట్నం".