వికీపీడియా చర్చ:శైలి/మార్గదర్శక, విధాన నిర్ణయాలు

తాజా వ్యాఖ్య: 6 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s

క్రీస్తు శకం సామాన్య కాలం

మార్చు

(వికీపీడియా:రచ్చబండ#క్రీస్తు_శకం_సామాన్య_కాలం నుంచి తీసుకువచ్చి ప్రచురించాను. రచ్చబండను పాతచర్చలకు తరలించగానే ఈ లింకు మారుస్తాను --పవన్ సంతోష్ (చర్చ) 03:21, 2 మార్చి 2018 (UTC))Reply
మన వ్యాసాల్లో ఇప్పటి వరకూ క్రీస్తు శకం, క్రీస్తుపూర్వం అనే వాడుక ఉంది. అయితే వాటి బదులుగా సామాన్య కాలం (Common Era or Current Era) సామాన్య కాలానికి ముందు (Before Common Era) గా వాడుతున్నారుగా.. వీటిపై మనం ఏం చేయాలి?.. అవే కొనసాగించాలా లేక మార్చాలా? వీటిపై మిగతా వికీ భాషల్లో ఎలా వాడుతున్నారో (ముఖ్యంగా ఆంగ్లంలో), మనం వాటినే అనుసరించాలా లేక మనకు సొంతగా మార్పు చేసుకోవచ్చా....--విశ్వనాధ్ (Viswanadh) (చర్చ) 06:11, 25 ఫిబ్రవరి 2018 (UTC)Reply

నేను ఇదివరకే చదువరి గారు సా.శ అని వాడగా చూశాను. నేను కూడా అదే అనుసరిస్తున్నాను.--రవిచంద్ర (చర్చ) 19:02, 27 ఫిబ్రవరి 2018 (UTC)Reply
ప్రయోగంలో ఇప్పటికీ క్రీ.శ. ఉన్నంత అమలులో సా.శ. లేదు. జన ప్రయోగంలో ఉన్నది వ్యవహారికమని భాషాపరమైన సందేహాలులో అనుసరిస్తున్నాం, కానీ ఇది శాస్త్రపరమైన విషయం. దీనికి ప్రామాణికత ప్రధానం తప్ప వ్యవహారం కాదని నా అనుకోలు. ఐతే ప్రామాణికత అన్నది నిర్ధారణ అయిందా అన్నది ప్రశ్న. ఈ విషయంలో ఇంగ్లీష్ వికీపీడియా శైలి పేజీ క్రీ.పూ., క్రీ.శ. సంప్రదాయ రచనా విధానంలో వాడుక ఉన్నదనీ, సామాన్య కాలానికి ముందు, సామాన్య శకం అన్నది కొన్ని ప్రామాణిక రచనల్లో వాడుకగా ఉందని రాశారు. కనుక ఆంగ్ల వికీపీడియా ఈ రెండు విధానాల్లో దేనిని అనుసరించినా శైలి విషయంలో దోషం కాదని నిర్ణయించుకుంది. ఐతే వ్యాసంలో మొదట ఏ పద్ధతితో ప్రారంభిస్తే దాన్నే కొనసాగించాలనీ, ప్రత్యేకించి కొన్ని అంశాల్లో తప్పనిసరి అయితే చర్చ పేజీలో చర్చ చేసి తప్ప ఇప్పటికే వ్యాసంలో ఉన్న పద్ధతిని (రెంటిలో ఏదైనా) మార్చరాదని నియమించింది. కాబట్టి వారి పద్ధతి అనుసరించినా అనుసరించవచ్చు, లేదా సా.శ. పద్ధతికి పూర్తిగా మారిపోయినా ఫర్వాలేదు అని నా అభిప్రాయం. --పవన్ సంతోష్ (చర్చ) 19:24, 27 ఫిబ్రవరి 2018 (UTC)Reply
ఎవరో ఒకరు అలా రాయడం మొదలెట్టారు కనుక దానిని అనుసరించడం ద్వారా అలవాటు చేయడం చేయవచ్చు. కనుక ఇప్పటి నుండి సా.శ వాడకం చేయడం అవసరం. కాకున్నా ఎప్పుదో ఒకప్పుడు అన్నిటినీ మార్చవలసి రావచ్చు..--విశ్వనాధ్ (Viswanadh) (చర్చ) 16:43, 28 ఫిబ్రవరి 2018 (UTC)Reply
సామాన్య శకం (సా.శ), సామాన్య శక పూర్వం (సా.శ.పూ) వాడడం అలావాటు చేసుకుందాం. __08:00, 1 మార్చి 2018 (UTC) __చదువరి (చర్చరచనలు)
Return to the project page "శైలి/మార్గదర్శక, విధాన నిర్ణయాలు".