వికీపీడియా చర్చ:సమావేశం/తెవికీ జన్మదిన వేడుక 2019/తెలుగు వికీపీడియా పరిస్థితిపై వాడుకరుల అభిప్రాయాలు-2019
ఎలా అభిప్రాయాలు తెలపాలి
మార్చు- అన్ని పాయింట్లు మీద విడివిడిగా తెలపాలా లేక అన్నిటికి కలిపి తెలపాలా? అనేది ఒక సందేహం
- వాటికి అభిప్రాయాలు మాత్రమే వెల్లడించాలా లేక అవసరమైన మార్గదర్శకాలు ప్రతిపాదించవచ్చా?
- వీటికి సంబందం ఉండి, ప్రాజెక్టు పేజిలోరాని విషయాలు ఏమైనా ఉంటే సూచించవచ్చా?
- చర్చా పేజీలో అభిప్రాయాలు తెలపాలా లేక ప్రాజెక్టు పేజీలో అభిప్రాయాలు తెలపలా?
చదువరి గారూ పైన తెలిపిన నా సందేహలు నివృత్తి చేయగలరు.--యర్రా రామారావు (చర్చ) 03:52, 30 డిసెంబరు 2019 (UTC)
- యర్రా రామారావు గారూ, మీరు చెప్పదలచిన పాయింటును రాసి, దానిపై మీ సూచనలివ్వండి. సూచనలు అన్నిటికీ ఇవ్వవచ్చు, లేక కొన్నిటికే ఇవ్వవచ్చు. కొత్త అభిప్రాయాలు రాయవచ్చు. మీరు అభిప్రాయాలైతే సమావేశంలో చెప్పారు, ఇంక చెప్పాల్సినవి ఉంటే చెప్పండి. ఆయా సమస్యలను ఎలా ఎదుర్కోవాలో, ఎలా పరిష్కరించాలో సూచనలు ఇస్తే బాగుంటుంది. __చదువరి (చర్చ • రచనలు) 04:17, 30 డిసెంబరు 2019 (UTC)
ప్రణయ్‌రాజ్ అభిప్రాయాలు
మార్చు- అనువాద వ్యాసాలను సరిచెయ్యకుండా, ఉన్నదున్నట్లుగా ప్రచురించిన వ్యాసాలను రాసినవాళ్ళకు సూచనలు చేసి, తప్పులను సవరించేలా చూడాలి. లేని పక్షంలో వ్యాసాలను తొలగించాలి.
- వికీ వ్యాస శైలి గురించి వాడుకరులందరూ తెలుసుకోవాలి.
- వికీపై శిక్షణ ఇచ్చేవారికి వికీ విధానాలు, శైలి, నాణ్యతపై అవగాహన ఉండాలి.
- తెవికీ సభ్యుదంలరూ బాట్‌లు రాయడం, నడపడం, మూసలను తయారు చేసుకోవడం వంటి విషయాలు నేర్చుకోవాలి.
- ఒక వాడుకరి సృష్టించిన పేజీలో ఇతర వాడుకరులు రాయడం లేదన్నది కొంత వరకు వాస్తవమే. కానీ, సృష్టించిన వాడుకరి ఆ వ్యాసాన్ని కనీసస్థాయి వ్యాసంగా తయారుచేయాలి. అలా రాయని వ్యాసాలను తొలగించాలి. లేకుంటే, నేను వ్యాసాన్ని మొదలు పెడుతా మిగతా వాళ్లు పూర్తిచేస్తారు అనుకునే అవకాశం ఉంది. మొదలుపెట్టిన వారే ఆ వ్యాసాన్ని పూర్తిచేయాలన్న నియమం ఉండాలి.
- కొత్త పేజీలను సృష్టించేటపుడు ఆంగ్ల వికీ వ్యాసాలకు లింకులను చేర్చాలి. అలా చేయకపోడంతో ఆయా వ్యాసాలు తెవికీలో ఉన్నాయో లేదో తెలియడంలేదు.
- కొత్త వాడకరులను ఫాలో అప్ చెయ్యాలి, వారితో స్నేహంగా మాట్లాడి వారికి వికీపరంగా సహకారం అందించాలి.
- బయటి సంస్థలు ఏ పద్ధతుల్లో వ్యాసాన్ని రూపొందిస్తున్నారో మనకెందుకు, అంతిమంగా నాణ్యమైన వ్యాసం తెవికీలోకి చేరితే మనకు చాలు గదా అనుకోకూడదు. డబ్బులు ఇచ్చి వ్యాసాలు రాయిస్తే అది వికీ నియమాలకు వ్యతిరేకం, వికీ స్ఫూర్తి దెబ్బతింటుంది అనేది నిజం. వికీలో వ్యాసాల రచనకు డబ్బులు చెల్లించాలేమో అని చాలామంది అనుకుంటున్నారు.
- కావలసిన వ్యాసాల కోసం కోరికల జాబితా ఉండాలి.
- ఇంగ్లీషు వికీలో ఉన్న డ్రాఫ్ట్స్ అనే పేరుబరి తెవికీలో కూడా ఉండాలి.
- అన్నింటికంటే ముఖ్యంగా... వికీ రచనల పరంగా ఒక వాడుకరి చేస్తున్న పనులను విమర్శించడానికి ముందు, గతంలో తను చేసిన తప్పులను గుర్తుతెచ్చుకొని వాటిని సరిదిద్దుకోవాలి.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 20:22, 2 జనవరి 2020 (UTC)
యర్రా రామారావు అభిప్రాయాలు, ప్రతిపాదనలు
మార్చుప్రాజెక్టు పేజీలోని మొదటి సమస్యపై
మార్చుమూస: భాషా దోషాలు ఉన్న పేజి లేదా మూస: భాషా దోషాలు అనే మూసను ఒక దానిని ఈ దిగువ తెలిపిన వివరాలతో తయారుచేసి అటువంటి వ్యాసాలకు పెట్టాలి.
"మీరు వ్యాసం సృష్టించి అభివృద్ధి చేసినందుకు ధన్యవాదాలు.కానీ ఈ వ్యాసంలో కొన్ని వ్యాకరణ, భాష , శైలికి సంబంధించిన దోషాలు ఉన్నవి.వికీపీడియా మార్గదర్శకాలకు, విధాన నిర్ణయాలకులోబడి వాటిని సవరించవలసిన అవసరముంది"
గమనిక:ఈ క్రింది విషయాలు వేరే పేజీలో వివరించి ఆ పేజీ లింకు మూసలో ఉంచాలి.
విషయాలు
- మా, మన అనే పదాలు లేదా అక్షరాలు ఉపయోగించరాదు.ఉదా:మా ఊరు, మా జిల్లా, మన ప్రాంతవాసులు మొదలగునవి.
- “ము” తో అంతమయ్యే పదాల విషయంలో “ము” స్థానంలో అనుస్వారం (సున్న) వాడాలి
- అలాగే అనుస్వారంతో అంతమయ్యే పదాలకు బహువచనాలు రాయడంలో అనుస్వారం మరుగునపడి, దాని ముందరి అక్షరం దీర్ఘమై చివర్లో “లు” చేరుతుంది.ఉదా: విధానం అనే పదం యొక్క బహువచనరూపం విధానాలు అవుతుంది.
- అతిశయోక్తులు, పొగడ్తలు వాడబడినవి.అవి తొలగించాలి.ఉదా: అద్భుతం, అపురూపం, మహానుభావుడు మొదలగునవి
- వ్యక్తి పేరు, కులసూచిక విడగొట్టి రాశారు.కలిపి రాయాలి. ఉదాహరణకు: రామారావు, సీతారామరాజు, చంద్రశేఖరశాస్త్రి, కృష్ణమాదిగ, రాజశేఖరరెడ్డి అని రాయాలి.
- పొడి అక్షరాలు ఇలా రాయాలి:ఎన్.టి.రామారావు, కె.బి.ఆర్.పార్కు. (అక్షరాలకు చుక్కకు మధ్య ఖాళీ లేకపోవడాన్ని గమనించండి) అలా రాశారో లేదో పరిశీలించి లేకపోతే సవరించండి.
- వ్యక్తుల గురించి రాసేటపుడు, శ్రీ,, గారు, డాక్టరు వంటి పురస్కార బిరుదులు,ఇతర గౌరవ వాచకాలు ఉపయోగించకూడదు.
- తేదీ ఆకృతి ఇలా ఉండాలి. ఉదాహరణకు, 1980 మే 12న అని రాయాలి.
- ఇంగ్లీషు నెలల పేర్లు ఏప్రిల్ జూన్ నెలలు తప్ప మిగిలిన నెలలు తెలుగు సహజమైన అజంత రూపంలో రాయాలి.జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు అని రాయాలి.
- కిలోమీటర్లు వంటి కొలమానాల పొట్టి పదాలను కింది విధంగా రాయాలి. కిలోమీటర్లు: కి.మీ. మీటర్లు: మీ. లీటర్లు: లీ. మిల్లీ లీటర్లు:మి.లీ. మిల్లీ మీటర్లు: మి.మీ. అని రాయాలి. (చుక్క ముందు, తరవాత కూడా స్పేసు ఇవ్వలేదు.గమనించండి)
- వ్యాసాల్లో నిష్పాక్షికత కోసం ఏకవచనాన్ని వాడాలి. వచ్చారు,చెప్పారు,చేశారు అనే పదాలు కాక చేశాడు, వచ్చాడు, చెప్పాడు, అన్న రూపాలు వాడాలి.
- పురుషుడిని ఉద్దేశించినపుడు "అతను", "ఇతను" లను వాడాలి. "అతడు", "ఇతడు", "ఆయన", "ఈయన", "వారు", "వీరు" అని వాడరాదు.
- స్త్రీని ఉద్దేశించినపుడు "ఆమె", "ఈమె" లను వాడాలి.
- విభాగాలకు లింకులు ఉండరాదు.
- విభక్తులు అవసరమైన పదాలుకు విభక్తులు లేకుండా రాయబడినవి. వీటికి "కి", "కు", "ని", "ను" వంటి విభక్తులను చేర్చి పదానికి, తద్వారా వాక్యానికీ అర్థాన్ని కలిగించాలి.
- భూతకాలానికి సంబందించిన సమాచారం, వర్తమాన కాలంలో రాయబడింది.దీన్ని సరిజేయాలి
- "యొక్క" అనే పదాన్ని చాలాచోట్ల వాడబడింది. యొక్క అన్న పదం వాడుక భాషలో లేదు.వివరణ: నా యొక్క భార్య, అతని యొక్క ఆస్తి అని అంటామా? నా భార్య, అతని ఆస్తి అన్నది సరైన ప్రయోగం.
- అనువాదం సమస్యలు ఉన్నవి.ఇంగ్లీషు వ్యాసం అనువదించిన కారణంగా అండ్ (and) అన్న పదానికి అనువాదంగా వ్యాసంలో "మరియు" పదాలు వచ్చిచేరినవి.వికీ మార్గదర్శకాలు ప్రకారం దీనికి బదులుగా," (కామా) వాడాలి. అవి పరిశీలించి సవరించాలి. అవసరమైతే రెండు పదాలకు చివర్లో "నీ" వంటి విభక్తులు చేర్చుకోవచ్చు. and అనే పదంతో కలిసే వాక్యాలను రెండు వాక్యాలుగా విడదీసుకోవడం బావుంటుంది.ఎంత చిన్న వాక్యాలైతే అంత తేటగా అర్థాన్ని ఇస్తాయి.
ప్రాజెక్టు పేజీలోని రెండవ సమస్యపై
మార్చుఇక్కడ రెండు విషయాలు చెప్పాలి.
- చర్చలలో ప్రవేశపెట్టే అంశాలు ఎక్కువగానే ఉంటున్నాయని నాభావన.వాడకరుల సంగతి అలా ఉంచండి.నిర్వాహకులు కూడా అంతంత మాత్రమే పాల్గొంటున్నారు.ఇక వాడకరులు సంగతికి వస్తే అనుభవం గడించి నిర్వాహకహోదాఉన్న వాడుకరులే సరిగా పాల్గొనకపోతే, మనం పాల్గొనుట బాగా ఉండదనే ఒక భయంతో కూడిన అభిప్రాయం వాళ్లలో ఉందని నేను భావిస్తున్నాను.
- చర్చలలో సాగతీత దోరణి ఉందనే విషయానికి నేను అంగీకరిస్తున్నాను.ఇది ఎందువలనంటే మన మనసులో నేను చెప్పేదే సరియైన అభిప్రాయం అనే దోరణి ఉంటున్నది. అదే సమయంలో అవతలివారు చెప్పేది అర్థంచేసుకోవటంకూడా మనలో లోపిస్తుంది అని నాకుంది.
- పరిష్కార మార్గం. నిర్వాహకులు తప్పనిసరిగా చర్చలలో భాగస్వామ్యం పెరగాలంటే ప్రతి మూడు చర్చలకు కనీసం రెండు చర్చలలో భాగస్వామ్యం ఉండాలని రచ్చబండలో ఒక విధాన నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పడైతే ఇది ఆచరణలోకి వస్తుందో సాగతీత దోరణికి దానంతట అదే అడ్డుకట్ట పడి,సరియైన నిర్ణయాలు నిర్ణయమైతాయని నాభావన. మీరు కొన్ని లోగడ జరిగిన కొన్ని చర్చలు గమనించండి. ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే చర్చలలో పాల్గొనేటప్పుడు మాత్రమే సాగతీత దోరణి ఉంటుంది.కాబట్టి సీనియర్ వాడకరులు, నిర్వాహకులు అయిన వాడుకరి:రహ్మానుద్దీన్, వాడుకరి:Rajasekhar1961, వాడుకరి:T.sujatha, వాడుకరి:K.Venkataramana, వాడుకరి:B.K.Viswanadh, వాడుకరి:YVSREDDY, వాడుకరి:Bhaskaranaidu, User:JVRKPRASAD, వాడుకరి:స్వరలాసిక గారలు, ఇంకా నేను ఉదహరించని ఇతర గౌరవ వికీపీడియన్లు, నిర్వాహకులు చర్చలలో పాల్గొనవలసిందిగా వార్కి వికీపీడియా నిర్వాహకునిగా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను.
- వాడుకరి:యర్రా రామారావు గారూ, చర్చల్లో పాల్గొనాలని నిబంధనలు పెట్టడం తగదని నా ఉద్దేశం.__చదువరి (చర్చ • రచనలు) 06:14, 17 జనవరి 2020 (UTC)
ప్రాజెక్టు పేజీలోని మూడవ సమస్యపై
మార్చుదీనికి ప్రధాన కారణం మనం నిర్ణయించుకున్న మార్గదర్శకాలు, విది విధాన నిర్ణయాలు మనం ఎంతవరకు పాటిస్తున్నాం అనేదానిపై ఎప్పుడైనా చర్చించుకున్నామా?నాకు తెలిసినంతవరకు అలాంటి చర్చలు జరిగి ఉండవని అనుకుంటున్నాను.నిర్వాహకులమైన మనం వాటిని సరిగా పాటించుటలేదనేది వాస్తవమని నేను అనుకుంటున్నాను. వాడుకరులకు మాత్రం మనం వాటిని గురించి చెపుతున్నాం. కొంతమంది సీనియర్ వాడుకరులు రాసిన వ్యాసాలు వాళ్లు చూసే ఉండవచ్చు. మనం ఇప్పుడు చెప్పుకునే లోపాలు వార్కి అవగాహనలేక మార్గదర్శకంగా అనిపించవచ్చు.
దీనికి పరిష్కార మార్గాలు
- వ్యాసాలు నాణ్యత మెరుగుపై దృష్టికి నేను పైన సూచించిన మూస: భాషా దోషాలు ఉన్న పేజి లేదా మూస: భాష దోషాలు అనే మూసను తయారుచేసి కొత్తగా సృష్టించే వ్యాసాలకు పెడితే పరిస్థితి మెరుగుపడటానికి అవకాశముందని నేను భావిస్తున్నాను.
- ఇక పాత వ్యాసల మెరుగుకు పైన చెప్పిన మూసను పెట్టి, Pranayraj Vangari గారు చెప్పినట్లు వ్యాసాలను రాసినవాళ్ళకు సూచనలు చేసి, తప్పులను సవరించేలా చూడాలి. లేని పక్షంలో వ్యాసాలను తొలగించాలనే అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.
ప్రాజెక్టు పేజీలోని నాలుగవ సమస్యపై
మార్చు- దీనికి పరిష్కారం మార్గం: నిర్వహకులు లేదా చురుకైన వాడకరులు కనీసం ఆరు నెలలకు ఒక సారైనా ఒక ప్రత్యక్షసమావేశం జరుపుకొని శిక్షణ కార్యక్రమాలు రూపొందించుకొని అమలుపర్చాలి.ఇద్దరు ముగ్గురు అన్నీ చెప్పేదానికన్నా ఎక్కువ మంది శిక్షకులు శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు జరగాలి.
ప్రాజెక్టు పేజీలోని ఐదవ సమస్యపై
మార్చు- దీని విషయంలో తెలిసినవారు స్ట్రక్చర్డ్ డేటాను కనుగొని దానికి ఒక ప్రాజెక్టు పేజీలో వివరించాలి.
ప్రాజెక్టు పేజీలోని ఆరవ సమస్యపై
మార్చు- ఇవన్నీ మనం పైన చెప్పుకున్న శిక్షణ కార్యక్రమంలో ఒక భాగంగా ఉండాలి.
ప్రాజెక్టు పేజీలోని ఏడవ సమస్యపై
మార్చు- ఇది వాస్తవమేనని నేను అభిప్రాయపడుతున్నాను.ఒక రకంగా చెప్పాలంటే వాళ్లే చురుకుగా ఉన్నట్లు నాకనిపిస్తుంది.ప్రతి వాడకరి తరుచూ ఇటీవల మార్పులు, కొత్తపేజీలు పరిశీలన చేస్తుంటే కొంతవరకు అరికట్టవచ్చని నా అభిప్రాయం.
ప్రాజెక్టు పేజీలోని ఎనిమిదవ సమస్యపై
మార్చు- 8 (1) పాయింటు దానికి:ఈ పాయింటుతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.నిర్వాహకుడుగా నేను గమనించిన దాని ప్రకారం లోగడ ఎవరు సృష్టించినా అందరు వాడకరులు భాగస్వామ్యం ఉన్నట్లు నాకనిపిస్తుంది. చురుకైన వాడకరులు, నిర్వాహకులు కొరత దీనికి కారణం అని నేను అనుకుంటున్నాను.
దీనికి నా సూచన: “మీరు పది వ్యాసాలు సృష్టించి అవి తొలగింపులకు గురిఅయ్యేబదులు, సృష్టించిన ఒక్క వ్యాసం పూర్తి సమాచారంతో వికీపీడియాలో శాశ్వత వ్యాసంగా ఉండేటట్లు చూసుకోండి అని తెలుగు వికీపీడియా విజ్ఞప్తి చేస్తుంది.” అనే వాఖ్య కంటిన్యూగా వికీపీడియాలో ప్రదర్శించాలి.దీనినే కొత్తవాడకరులుకు స్వాగత సందేశంలో కూడా తెలియపర్చేట్లు ఉండాలి.
- ఇక 8లో రెండు మూడు లో వివరించినవి ప్రాజెక్టుగా పనిగా చేపట్టి చేయవలసిన అవసరముంది.
- ఇక నాలుగవదానికి చదువరి గారు ఇప్పటికే వికీ ప్రాజెక్టు పేజీని తయారుచేసి రచ్చబండలో ప్రవేశపెట్టారు.
- ఇక ఐదవ విషయం నేను పైన ప్రస్తావనకు తీసుకు వచ్చాను
ప్రాజెక్టు పేజీలోని తొమ్మిదవ సమస్యపై
మార్చు- కొత్త వాడుకరులను బెదరగొట్ట కూడదు.వారిని ప్రోత్సహించాలి అనే దానిపై రెండూ ఉండాలి. వారు రాసిన వ్యాసాలను మనం మెరుగు పరచాలి అనే అభిప్రాయంతో నేను ఏకీభవించుటలేదు. ఇది మనం అనుకున్నా సాధ్యపడేదికాదు. ఎందుకంటే అంతంత మాత్రం చురుకైన వాడకరులు ఉన్న ప్రస్తుత కాలంలో జరిగేదికాదు.
ప్రాజెక్టు పేజీలోని పదవ,పదకొండో సమస్యలపై
మార్చు- ఈ రెండిటి విషయంలో మంచిని స్వాగతిస్తూ, వికీకి భంగకరం కల్పించే చెడుకు అడ్డుకట్ట వేసే భాధ్యత అందరి నిర్వాకులుపై ఉందని, వికీపీడియాకు భంగకరంగా ఉన్న వాటిని ఎటువంటి రాజీదోరణి లేకుండా నిర్వద్దంగా త్రోసిపుచ్చాలని నా అభిప్రాయం.
ప్రాజెక్టు పేజీలోని పన్నెండో సమస్యపై
మార్చు- ఇది మంచి ఆలోచనేగాని వీటికి రచ్చబండలో నియంత్రణ విధానం ఉండాలి.
ప్రాజెక్టు పేజీలోని పదమూడో సమస్యపై
మార్చుఇది మంచి ఆలోచన.దీనిని అమలులోకి తీసుకురావటాన్ని నేను స్వాగతిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 08:43, 4 జనవరి 2020 (UTC)
చదువరి గారూ పైన నా అభిప్రాయాలు ఐటం వారీగా తెలిపాను.మీరు గమనించగలరు.--యర్రా రామారావు (చర్చ) 06:01, 17 జనవరి 2020 (UTC)