వికీపీడియా చర్చ:సమావేశం/తెవికీ జన్మదిన వేడుక 2019

తాజా వ్యాఖ్య: తేదీ టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Veera.sj

తేదీ

మార్చు

పుట్టినరోజు డిసెంబర్ 10, మంగళవారం కావటంతో వారాంతంలో ఆచరించడం అందరికీ అనుకూలం కావున, కార్యక్రమ నిర్వహణ ప్రణాళికకు తగిన సమయం అవసరం కనుక 21డిసెంబరు 2019 ని ప్రతిపాదిస్తున్నాను. --అర్జున (చర్చ) 04:27, 6 డిసెంబరు 2019 (UTC)Reply

"21 న హైదరాబాద్ పుస్తక ప్రదర్శన లో తెలుగు వికీపీడియా స్టాలు ఉంటుంది అని ప్రణయ్ చెప్పారు కాబట్టి ఈ శనివారం 14 డిసెంబర్ 2019 అయితే అనువుగా ఉంటుంది అని నా సూచన." అని ఈ చర్చా పేజీలో వేరే విభాగంలో Kasyap పేర్కొన్నారు. కావున User:Chaduvari, User:Veera.sj ( ప్రత్యక్షంగా పాల్గొనే ప్రస్తుత సమన్వయ సంఘ సభ్యులు)చర్చించి రేపటిలోగా తేదీ సమయం ఖరారు చేస్తే వికీపీడియా పై బేనర్ ప్రకటన చేర్చగలను. --అర్జున (చర్చ) 04:12, 9 డిసెంబరు 2019 (UTC)Reply
" ఆలస్యం: అమృతం - విషం! " 14వ తారీఖున జరుపటానికి నా వైపు నుండి ఏ సమస్యా లేదు. - శశి (చర్చ) 12:35, 9 డిసెంబరు 2019 (UTC)Reply
21 వ తేదీ బాగుంటుందని నా అభిప్రాయం. సమావేశం ఏర్పాట్ల గురించి అందరం ఒకసారి కలిసి మాట్టాడుకుంటే బాగుంటుంది. రేపు అంటే, 11 వ తేదీ సాయంత్రం కలుద్దామా? కోలివ్ లోనే కలుద్దాం. ఏమంటారు? __04:31, 10 డిసెంబరు 2019 (UTC)
తప్పకుండా, నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. - శశి (చర్చ) 08:52, 10 డిసెంబరు 2019 (UTC)Reply

ముఖ్య అతిథి

మార్చు

విజ్ఞానసర్వస్వాలకు లేక స్వేచ్ఛాసమూహాలకు సంబంధించిన ప్రముఖ వ్యక్తిని ఆహ్వానించడం మంచిది. దీనిగురించి చర్చల గోప్యతకు శశి ప్రారంభించిన తెవికీ టెలిగ్రామ్ సమూహంలో చర్చించితే బాగుంటుంది. శశి ఆ గ్రూప్ లో చేరటానికి మరిన్ని వివరాలు తెలియచేస్తారు.--అర్జున (చర్చ) 04:29, 6 డిసెంబరు 2019 (UTC)Reply

నా టెలిగ్రాం ఐడి: t.me/sasisaphr. గ్రూపులో చేరు ఆసక్తి గల వారు నాకు నేరుగా టెలిగ్రాం లో సందేశం పంపి అభ్యర్థించినచో చేర్చెదను. నా మొబైల్: 96 11 824 195. (ఇదే నా వాట్సాప్ కూడా). వాట్సాప్ పైన సంఫ్రదించిననూ టెలిగ్రాం లో చేర్చెదను. - శశి (చర్చ) 12:16, 6 డిసెంబరు 2019 (UTC)Reply

జ్ఞాపిక

మార్చు

జ్ఞాపికగా తెలుగు పుస్తకాలు అందచేయటం ఉపయోగంగా వుంటుంది. మన దగ్గర వున్న మనకు అవసరంలేని తెలుగు పుస్తకాలు వినిమయం చేసుకోవటం, పుస్తకవిక్రేతల ద్వారా పుస్తకాల కొనుగోలుకు ప్రోత్సాహకరంగా కొంత ధన సహాయం చేయడం కొన్ని ఆలోచనలు. --అర్జున (చర్చ) 04:33, 6 డిసెంబరు 2019 (UTC)Reply

కార్యక్రమం

మార్చు

కార్యక్రమ నిర్వహణలో ఆసక్తిగలవారు, కార్యక్రమ అంశాలలో ఆసక్తి వున్నవారు ఆసక్తిని తెలియచేయండి. --అర్జున (చర్చ) 04:44, 6 డిసెంబరు 2019 (UTC)Reply

నేను శశితో కలసి కోలివ్ చూశాను, ఈ కార్యక్రమం నిర్వాహణలో నేను కూడా ఉంటాను Kasyap (చర్చ) 18:01, 6 డిసెంబరు 2019 (UTC)Reply
ధన్యవాదాలు Kasyap. కార్యక్రమ నిర్వహణ సమన్వయం సంఘంలో మీ పేరు చేర్చండి. అలాగే పాల్గొనేవారిలో కూడా. --అర్జున (చర్చ) 06:41, 7 డిసెంబరు 2019 (UTC)Reply

కార్యక్రమ అంశాల మార్పు చేర్పులు

మార్చు

కార్యక్రమ అంశాలలో మార్పు చేర్పులు చర్చించండి. --అర్జున (చర్చ) 04:46, 6 డిసెంబరు 2019 (UTC)Reply

చదువరి

మార్చు

నా అభిప్రాయాలివి.

ఈ సమావేశాన్ని మనవరకే పరిమితం చేసుకుందాం, అతిథి అంటూ ఎవరినో పిలిచి వారి చేత చెప్పించుకోవడం మానేద్దామని నా ఉద్దేశం. పూర్తిగా మనవరకే ఒక వర్కుషాపు లాగా పెట్టుకుందాం; కొత్త వాళ్ళు కూడా రావచ్చు. కొత్తవారిని చేర్చుకోవడం ఎలా వంటి విషయాలను పక్కన పెడదాం. మనం చేస్తున్న పనులను, మన ప్రస్తుత పరిస్థితిని సమీక్షించుకుందాం. వ్యక్తిగతంగా మన మధ్య ఉన్న చిన్నపాటి పొరపొచ్చాలేమైనా ఉంటే వాటిని ఇస్త్రీ చేసుకుందాం. నాకు తోచినవి కొన్ని ఇక్కడ:

  • తెవికీ ప్రస్థానంపై సమీక్ష. కొన్ని గణాంకాలను ముందే తయారు చేసుకుని వాటి గురించి అందరం అక్కడ తెలుసుకుందాం. వాటిపై మన చర్చ చేసుకోవచ్చు.
  • అనువాద పరికరాన్ని వాడడం
  • భాషలో నాణ్యత పెంచుకోవడం
  • చర్చలు చెయ్యడం: చర్చ అనేది వికీ ప్రగతిలో ఒక ప్రధానమైన భూమిక పోషిస్తుంది. కానీ, తెవికీలో చర్చలు పెద్దగా జరగడం లేదు. ఎందుకలాగ? పరిస్థితిని ఎలా మెరుగుపరచుకోవాలి?
  • తెవికీలో మనకు నచ్చిన పనులు ఏమిటి
  • తెవికీలో మనకు నచ్చనివేమిటి - వైయక్తికంగా కాకుండా, విషయగతంగా చర్చ చేద్దాం. ఎలా ఉంటే బాగుంటుందో మార్గదర్శకాలు ఏర్పరచుకుందాం.

ఒక్కొక్క దానికీ ఇంత సమయం అని కేటాయించుకుందాం. సాయంత్రం రెండో మూడో గంటల సమయం చాలదు. వీలైతే ఒక పూటో ఒక రోజో పెట్టుకుందాం. కలిసి భోజనాలు చేద్దాం. కబుర్లు చెప్పుకుందాం. తలా కాసిని డబ్బులు వేసుకుందాం. నావంతుగా నేను ఐదువేలు ఇచ్చేందుకు సిద్ధం. అవసరం పడితే ఇంకొంతైనా ఇవ్వాలనే ఉత్సాహం ఉంది. __చదువరి (చర్చరచనలు) 06:36, 6 డిసెంబరు 2019 (UTC)Reply

చదువరి గారి స్పందనకు ధన్యవాదాలు. మంచి అంశాలను లేవనెత్తారు. ధనసహాయం గురించి ముందుకు రావడం చాలా సంతోషం. నేను కూడా కొంత సహాయం చేయగలను. ముఖ్య అతిథి అంశం వుంచడంవలన కొన్ని ప్రయోజనాలున్నాయి. ఉదాహరణకు వార్తామాధ్యమాలలో మన సమావేశం ప్రచారమయ్యే అవకాశం. అలాగే కొన్ని వనరులు సంపాదించడంలో లేక ఇతరత్రా ముందు ముందు ముఖ్య అతిథి ద్వారా ఏమైనా సహాయం అవసరమైతే పొందడం లాంటివి. ఇది తప్పనిసరిగా వుండాలని నేనేమి పట్టుబట్టటంలేదుకాని, అందరికి వివరం తెలియాలని రాస్తున్నాను. పూట లేక రోజు మొత్తం కార్యక్రమం చేయొచ్చు కాకపోతే పరోక్షంగా పాల్గొనేవారికి ఒకటి రెండు గంటలు కేటాయించడం మంచిది. అన్ని స్పందనలను పరిశీలించి ఒక వారంలో ఖరారు చేయడం బాగుంటుంది. నిర్వహణ సమన్వయ సంఘంలో మీ పేరు చేర్చినట్లున్నారు కాని పొరబాటు వలన తేది సమయం, వ్యాఖ్య మాత్రమే కనబడుతున్నది. అది సవరించండి. కార్యక్రమాన్ని ఖరారు చేయటానికి బాధ్యత తీసుకోమని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 07:05, 6 డిసెంబరు 2019 (UTC).Reply
పోద్దటినుండీ మనలో మనం సమీక్ష సమావేశం నిర్వహించుకోని,సాయంత్రం కేకు కోతకు ఏ ప్రముఖుడినైనా ఆహ్వానించవచ్చు . రేపు శనివారం IIIT లో తెవికీ ప్రాధమిక శిక్షణా శిబిరం ఉన్నది. మన మిత్రులు కూడా వస్తుంన్నారు కాబట్టి మరింత చర్చించి నిర్ణయం తీసుకోగలం . KTR వంటి ప్రముఖులను కూడా అతిథిగా ఆహ్వానించగల సత్తా మన తెలుగు వికీపీడియన్ లకు ఉన్నది కాబట్టి ఎలా చేస్తే బాగుంటుదో చెప్పగలరు . ఒక వేళ భారీఎత్తున అయితే మామిడి హరికృష్ణ గారు రవీంద్రభారతి మినీహాలు ఉచితంగా భోజనం తో సహ ఇస్తామని చాలా సార్లు తెవికీ సమూహం తో చెప్పినారు Kasyap (చర్చ) 18:21, 6 డిసెంబరు 2019 (UTC)Reply
నేను నిన్ను శనివారం ఐఐఐటి అవగాహన సదస్సు కు వచ్చిన తెవికీ మిత్రులతో ఇస్టాగోస్టిగా చర్చించాను . కార్యక్రమం పెద్దగా కాకుండా సముదాయ పరిదిలోనే నిర్వహిస్తే బాగుంటుంది అని సూచించారు. అలాంటప్పుడు శశి సుచించిన colive బాగుంటుంది. 21 న హైదరాబాద్ పుస్తక ప్రదర్శన లో తెలుగు వికీపీడియా స్టాలు ఉంటుంది అని ప్రణయ్ చెప్పారు కాబట్టి ఈ శనివారం 14 డిసెంబర్ 2019 అయితే అనువుగా ఉంటుంది అని నా సూచన.Kasyap (చర్చ) 16:57, 8 డిసెంబరు 2019 (UTC)Reply
తేది గురించి మొదటి విభాగంలో చర్చించండి. --అర్జున (చర్చ) 04:12, 9 డిసెంబరు 2019 (UTC)Reply
హైదరాబాద్ పుస్తక ప్రదర్శన డిసెంబరు 23వ తేది నుండి జనవరి 1వ తేది వరకు జరుగుతుంది.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 06:41, 10 డిసెంబరు 2019 (UTC)Reply

విశ్వనాథ్ అభిప్రాయాలు

మార్చు

ఇవి మనకు అలవాటైన పనులు. ప్రతి కార్యక్రమాన్ని వికీ ప్రచారానికి, మనలో ఉత్సాహం పెంచుకొనేలా తయారుచేసుకోగలం. ఉన్న ఉచిత వనరులను సద్వినియోగం చేసుకొని ఖర్చు ఎక్కువ కాకుండా భారీగానే చేయగలిగితే బావుంటుందనుకుంటాను. శశిధర్ ని నిరుత్సాహపరచాలని కాదు కాని, Kasyap చెప్పినట్టు హరికృష్ణ గారి సహకారం ఉంటే కనుక రవీంధ్రభారతి మినీహాల్ ఉపయోగించుకోవడం బావుంటుంది. ఎక్కువ ప్రచారం ఉంటుంది. భోజనాలు కేటరింగ్ ఇవ్వచ్చు, ఉదయం సాయంత్రం టీ స్నాక్స్ ఇవ్వచ్చు. కేక్ తప్పదు. ముఖద్వారం వద్ద బేనర్ పెట్టవచ్చు. జ్ఞాపికలు అనవసరం అని నా అభిప్రాయం, అవసరమే అయితే, ప్లాస్టిక్ కవర్లు నిషేదించారు కనుక చిన్న చేతి సంచులు మీద వికీ ముద్రను స్క్రీన్ ప్రింట్ చేయించే ఆలోచన ఉంటే బావుంటనుకుంటాను. కార్యక్రమం డిజైన్ చేసుకోవడం ఒక్క రోజు పని. రవీంధ్రభారతి సాధ్యం కాకపోయినా అవే ఏర్పాట్లు కోలివ్ గార్నెట్ లో కూడా చేసుకోవచ్చు. దూరంగా ఉన్న వాళ్ళు వచ్చేపని అయితే ముందుగా సమాచారం ఇవ్వడానికి త్వరగా నిర్ణయం తీసుకోగలరు. B.K.Viswanadh (చర్చ) 02:02, 7 డిసెంబరు 2019 (UTC)Reply

చిహ్నం.

మార్చు
 
ప్రతిపాదిత లోగో

నేను ఒక లోగో ప్రతిపాదించాను. ఇంకా ఇతర ప్రతిపాదనలకు ఆహ్వానం. సమూహం మెచ్చినది ఖరారు చేయవచ్చు.--అర్జున (చర్చ) 09:41, 6 డిసెంబరు 2019 (UTC)Reply

లోగో ఒకటి పోస్టరు సైజు ముద్రించి కాన్ఫరెన్స్ గది ప్రవేశ ద్వారం వద్ద పెడితే బాగుంటుంది అని నా అభిప్రాయం. కో లివ్ నివాసితులకు ఈ హాల్ ఇప్పటి వరకు కేవలం ఎంటర్ టైన్ మెంట్ కి పనికి వచ్చింది. ఇలాంటి కార్యక్రమాలు కూడా జరుపుకొనవచ్చని తెలుపటమే కాక, తెవికీ కి విజిబిలిటీ తెస్తుంది అని నా అభిప్రాయం. కోలివ్ నివాసితులలోని బ్లాగర్లు, రచయితలను ఆకర్షించాలనేదే నా తాపత్రయం.
అలాగే లోగోతో తెవికీ జన్మదినాల వేడుక జరిగేది ఇక్కడే వంటి బ్యానర్లు మెయిన్ రోడ్ పై పెడితే ఎలా ఉంటుంది? ఇవి కేవలం నా అభిప్రాయాలు మాత్రమే. బడ్జెట్, సాధ్యాసాధ్యాలు వంటివి పెద్దలు పరిగణలోకి తీసుకుని నిర్ణయించగలరు. - శశి (చర్చ) 14:00, 6 డిసెంబరు 2019 (UTC)Reply
శశి పెద్దలెవరు లేరు. మీరు కూడా సమన్వయ సంఘంలో చేరండి, పాలుపంచుకోండి.--అర్జున (చర్చ) 05:58, 7 డిసెంబరు 2019 (UTC)Reply
మీరు ఇప్పటికే చేరినట్లు ఇప్పుడు గమనించాను. ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 06:03, 7 డిసెంబరు 2019 (UTC)Reply
అర్జున గారు లోగో బావుంది. 16 అంకె లావు ఉండేది మార్చి చూస్తారా? B.K.Viswanadh (చర్చ) 02:03, 7 డిసెంబరు 2019 (UTC)Reply
B.K.Viswanadh గారికి, మీ వ్యాఖ్య అర్థం కాలేదు. '16 సంవత్సరాలు' కు నేను NTR ఖతి (చేతి వ్రాత రూపంలో వుంటుంది) వాడాను. '16' కి పరిమాణం 30 వాడాను. 'సంవత్సరాలు' కు పరిమాణం 12 వాడాను. పరిమాణం తగ్గించమంటారా. వేరే ఖతి వాడమంటారా?--అర్జున (చర్చ) 06:00, 7 డిసెంబరు 2019 (UTC)Reply
అర్జున గారు సంవత్సరాలు అవసరం లేదు. కేవల్ం 16 మాత్రమే వేరే ఫాంట్ అయితే (బహుశా రామరాజ) బోల్డ్‌గా కనిపిస్తుందని అన్నా..B.K.Viswanadh (చర్చ) 14:05, 7 డిసెంబరు 2019 (UTC)Reply
B.K.Viswanadh గారికి, మీ స్పందనకు ధన్యవాదాలు. కేక్ ఆకారం లేకపోతే 16 అంటే సంవత్సరాలు అని స్ఫురించదేమో. పక్కన జన్మదినవేడుక మాత్రమే వుంటే 16 వ జన్మదినం అనుకోవచ్చు. రామరాజ వికీపీడియాకు దాని బైలైన్ కు వాడాను, కావున మిగతా వాటికి వేరే ఖతి వాడితే బాగుంటుందనే ఉద్దేశంతో వాడాను. ఇంకా స్పందనలు చూసి సవరణలేదైనా చేస్తాను.--అర్జున (చర్చ) 05:01, 8 డిసెంబరు 2019 (UTC)Reply
ఇంకేమి స్పందనలు లేనందున, ప్రతిపాదించిన చిహ్నం ఖరారు చేశాను. --అర్జున (చర్చ) 00:52, 10 డిసెంబరు 2019 (UTC)Reply
 
విశ్వనాథ్ గారు తయారుచేసిన వికీపీడియా స్టాండ్ డిజైను

కార్యక్రమ సంబంధిత బాధ్యతల జాబితా

మార్చు

క్రింద జాబితా మొదలుపెట్టుతున్నాను. మీరు పాలుపంచుకోండి--అర్జున (చర్చ) 10:05, 6 డిసెంబరు 2019 (UTC)Reply

  • కార్యక్రమం అంశాల ఖరారు
  • వేదిక దృశ్యశ్రవణ వ్యవస్థ
పరీక్షించి చూచాను. నా ల్యాప్ టాప్ లో ఒక చలనచిత్రం నడుపుతూ ప్రొజెక్టర్ కు అనుసంధానించాను. స్క్రీను, ప్రొజెక్టర్, సౌండ్ చక్కగా ఉన్నవి. - శశి (చర్చ) 12:25, 6 డిసెంబరు 2019 (UTC)Reply
  • అల్పాహారం,లేక భోజనాల ఏర్పాటు
కూతవేటు దూరంలో కేశవరెడ్డి మిఠాయిలు ఉన్నవి. మార్గ మధ్యం లో నే ఉడిపీస్ ఉపహార్ ఉన్నది. ఇంకనూ అనేక ప్రత్యాన్మాయాలు ఉన్నవి. (చాయ్ పాయింట్ లో ఆన్లైన్ ఆర్డర్ వగైరా.) - శశి (చర్చ) 12:25, 6 డిసెంబరు 2019 (UTC)Reply
  • యూ ట్యూబ్ ప్రత్యక్ష ప్రసారం
  • కార్యక్రమ నివేదిక తయారీ
  • జ్ఞాపిక సంబంధిత పనులు
  • వార్తాప్రసార మాధ్యమాలకు ఆహ్వానం.
  • తెవికీ పై ప్రకటన ముసాయిదా (పుట్టినతేదినుండి సమావేశం వరకు ప్రదర్శించటానికి) - --అర్జున (చర్చ) 06:08, 7 డిసెంబరు 2019 (UTC)Reply
క్రమ సంఖ్య అంశం బాధ్యత ఎవరు ఎన్ని, ఎంత ఖర్చు (సుమారు) ఇతరాలు
1 అల్పాహారం
2 భోజనం
3 కేక్
4 జ్ఞాపిక
5 వార్తాప్రసార మాధ్యమాలకు ఆహ్వానం.
6 కార్యక్రమ నివేదిక తయారీ
7 రవాణా ఖర్చులు
8
9
10
మొత్తం

కో లివ్ గార్నెట్ లో ఉన్నవి/లేనివి

మార్చు
 
కోలివ్ గార్నెట్ కాన్ఫరెన్స్ రూమ్ లోని స్క్రీన్
 
కోలివ్ గార్నెట్ కాన్ఫరెన్స్ రూమ్ లోని సీటింగ్ ఏరియా

ఉన్నవి

మార్చు
  • ప్రొజెక్టరు/స్క్రీన్
  • స్టేడియం లో వీక్షకులు క్రీడలను చూచేందుకు మల్లే ఉన్న సీటింగ్ (మెట్ల వంటివి). 10-15 మంది కూర్చోగలరు
  • నాలుగైదు బీన్ బ్యాగులు
  • ఏసీ
  • విద్యుత్ బల్బులు
  • తేనీటి విందుకు ఓపెన్ టాప్ పార్టీ ఏరియా
  • పాశ్చాత్య శైలి శౌచాలయాలు రెండు
  • RO (Reverse Osmosis) వాటర్ డిస్పెన్సరు

లేనివి/కావలసినవి

మార్చు
  • కుర్చీలు (వయసు మళ్ళిన వారు స్టేడియం వంటి సీటింగ్ పై కూర్చోలేక పోవచ్చు. అయితే రీడింగు రూం లో గల కొన్ని కుర్చీలను తీసుకునే సౌలభ్యం ఉంది.)
  • మైకు, దాని స్పీకర్లు
  • టేబుల్. టేబుల్ క్లాత్

లేని సదుపాయాలను సమకూర్చేందుకు ఇతర వికీపీడియనుల సహాయం కోరడమైనది. -- 2019-12-06T18:03:22‎ Veera.sj

User:Veera.sj గారికి, వివరాలు తెలిపినందులకు ధన్యవాదాలు. సమావేశానికి ఎక్కువమంది హాజరైతే ఈ వేదిక సరిపోదనుకుంటాను. అటువంటి సందర్భానికి ప్రత్యామ్నాయ వేదిక గురించి ఆలోచించాలి.--అర్జున (చర్చ) 06:37, 7 డిసెంబరు 2019 (UTC)Reply

తెవికీపై ప్రకటన

మార్చు
 
జన్మదిన వేడుక-21 డిసెంబరు 2019,హైదరాబాదు లో పాల్గొనండి. తెవికీ గురించి మీ అనుభవాలు, అభిప్రాయాలు తెలుగు వికీపీడియా చర్చా పేజీలో రాయండి!

Mediawiki:Sitenotice లో చేర్చుటకు డిసెంబరు 10 నుండి సమావేశం వరకు ప్రదర్శించడానికి ప్రకటన చిత్తు ప్రతి చూడండి. మార్పులు తెలపండి, లేక మెరుగైన చిత్తు ప్రతులు చేర్చండి. 9 డిసెంబరు లోగా ఖరారు చేయాలి.--అర్జున (చర్చ) 06:19, 7 డిసెంబరు 2019 (UTC)Reply

User:Chaduvari గారినుండి కార్యక్రమం గురించి ఇంకా స్పందన రానందున, సాధారణ ప్రకటన ప్రదర్శనను చేరుస్తున్నాను. --అర్జున (చర్చ) 00:24, 10 డిసెంబరు 2019 (UTC)Reply

వేదికనుచేరుటకు సూచనలు

మార్చు

@User:Veera.sj గారికి, ప్రజారవాణ సంస్థల ద్వారా అనగా బస్, మెట్రో సూచనలు కూడా చేర్చాలి. మీరు లేక ఆ ప్రదేశం గురించి తెలిసినవారు చేర్చమని మనవి. --అర్జున (చర్చ) 06:48, 7 డిసెంబరు 2019 (UTC)Reply

ఈ మధ్యన యూబర్, ఓలా వంటి రవాణా సౌకర్యాలను పెంచి పోషించే బరువు బాధ్యతలు తీసుకోవటం తో , బస్సు నెంబరులు నాకు తెలియరావుట లేదు. గచ్చిబౌలి-మియాపూర్ రోడ్డు అని మాత్రం తెలుసు. మెట్రో ఆఖరు స్టేషను అయిన హైటెక్ సిటీ మెట్రోను తర్వాతి స్టాప్ అయిన రాయదుర్గం వరకు పొడిగించారు. ఇదే అన్నింటికన్నా దగ్గర. ఇక్కడి నుండి ర్యాడిసన్ (గచ్చిబౌలి) వెళ్ళే షేర్ ఆటోలు దొరుకును. అక్కడే మన కోలివ్ కలదు. అతి సమీప MMTS హైటెక్ సిటీ/హఫీజ్ పేట్ లు అవుతాయి. - శశి (చర్చ) 12:43, 9 డిసెంబరు 2019 (UTC)Reply
Return to the project page "సమావేశం/తెవికీ జన్మదిన వేడుక 2019".