వికీపీడియా చర్చ:సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక/జూలై 2016 - జూన్ 2017

గమనిక:సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక - జూలై 2016 - జూన్ 2017 కొరకు ఈ పేజీని సంప్రదింపు, చర్చ వంటి వాటి కొరకు వినియోగిస్తున్నాం

సముదాయంతో జరిపిన సంప్రదింపులు మార్చు

సముదాయ సభ్యులతో వివిధ మాధ్యమాల ద్వారా, పలు వేదికల్లో జరిపిన సంప్రదింపులను ఇక్కడ ఉంచుతున్నాం

వాడుకరి:Arjunaraoc మార్చు

  • ఇప్పటివరకు జరిగిన స్వచ్ఛంద కార్యక్రమాలు మరియు సిఐఎస్-ఎ2కె, అందుబాటులో గల తెవికీ సంపాదకుల ఆలోచనలు అధారంగా రూపొందించబడ్డాయి. సంపాదకులు వందలలో లెక్కించవచ్చు కాని చదువరులు లక్షలలో వుంటారు. వారి అభిప్రాయాలు తెలుసుకోవాలి అనే నా అభిప్రాయం కోరిన వారికి ఎప్పడినుండో తెలుపుచున్నాను. అంటూ పాఠకుల సర్వేను నిర్వహించమని, దాన్ని ప్రణాళికలో భాగం చేసుకునే ఆలోచన ఉందా అని అడిగారు.[1]
  • వికీసోర్సు పాఠ్యీకరణకు గూగుల్ ఓసీఆర్ వాడుకని మరింత సులభతరం చేయడం - వికీసోర్స్ పాఠ్యీకరణకి తెలుగు గూగుల్ OCR వాడుకని సులభతరం చేస్తే బొమ్మ రూపంలో వున్న పాత పుస్తకాలుపాఠ్యీకరణ వేగంగా చేయడానికి వీలుంటుంది. దీనిగురించి సిఐఎస్ ఏమైనా పని చేస్తున్నదా? అని ప్రశ్నించారు. ఆ దిశగా పనిచేయాలని ఆశిస్తున్నారు.[1]
  • వికీసోర్సులో చేర్చిన నశీర్ అహ్మద్ గారి పుస్తకాలలో కొన్నిటిలో (సాంకేతికంగా) దోషాలు ఉన్నాయని, వాటిని సరిజేయాలని అభిప్రాయపడుతున్నారు.[1]

వాడుకరి:T.sujatha మార్చు

  • జిల్లాల్లో జిల్లా కేంద్రాలు లేదా ప్రధాన పట్టణాల్లో తెవికీ: తెవికీని ప్రతి జిల్లాలోనూ జిల్లా కేంద్రం లేదా ప్రధాన పట్టణంలోకి తీసుకువెళ్ళే దీర్ఘకాలిక ప్రణాళిక ప్రారంభించాలి. హైదరాబాద్, విజయవాడల్లో తెలుగు వికీపీడియన్లు
  • తెలుగు వికీపీడియా జిల్లాల్లోని జిల్లా కేంద్రాలు, ముఖ్యపట్టణాలకు విస్తరించాలి. ఇది దీర్ఘకాలిక లక్ష్యంగా పెట్టుకుని విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ దాటి మరిన్ని పట్టణాల్లో సీఐఎస్-ఎ2కె కార్యకలాపాలు విస్తరించాలి. కనీసం కొన్ని పట్టణాల్లోనైనా సమావేశాలు నిర్వహించుకునేందుకు హైదరాబాద్ గోల్డెన్ థ్రెషోల్డ్ లాగా, విజయవాడ లయొలా కళాశాల లాగా స్థలం ఏర్పడాలి. స్థానికంగా వికీపీడియా సముదాయం తయారుకావాలి. ఈ క్రమంలో తిరుపతిలో కూడా అలాంటి అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించండి, నా వంతు సహకారం అందించగలను.
  • గ్రంథాలయాలను కేంద్రంగా తీసుకుని వికీపీడియన్లను అభివృద్ధి చేయడం, సమావేశాలు నిర్వహించుకునే ప్రయత్నం చేయడం వంటి అక్కడ సాధ్యపడతాయేమో ప్రయత్నించి చూడండి.
  • వికీపీడియా, వికీసోర్సుతో పాటుగా తెలుగు విక్ష్నరీని కూడా అభివృద్ధి చేయాలి. విక్ష్నరీలో మాండలీకాలు చేర్చేందుకు సోర్సు అందజేయాలి, విక్ష్నరీ పదాలకు పలు మాండలీక పదాలు వచ్చేలా ప్రయత్నించాలి.
  • గూగుల్ అనువాద వ్యాసాల శుద్ధి ప్రాజెక్టుకు ఇప్పటికీ సహకారం అందుతోంది. దాన్ని కొనసాగించాలి. విద్యార్థులు, ఇతరులతో వర్క్ షాపులు చేసేప్పుడు ఈ ప్రాజెక్టులో కూడా పనిచేసేలా ప్రోత్సహించాలి. తద్వారా తెవికీ నాణ్యత పెంచాలి.

వాడుకరి:Meena gayathri.s మార్చు

  • జెండర్ గ్యాప్ తగ్గించేలా కార్యక్రమాలు చేపట్టాలి.
  • మహిళల భద్రతకు సంబంధించిన చట్టాల గురించి, స్త్రీలకు ప్రత్యేకించిన వ్యాధుల గురించి సమాచారం పెంచేలా చర్యలు.
  • కొత్త వికీపీడియన్లతో అక్షరదోషాలు సరిచేసేలా ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా తెలుగులో రాయడం వచ్చి వికీలో ఎలారాయాలో తెలియనివారు.
  • సమాచార పెట్టె, ఫోటోలు ఎక్కించడం, రిఫరెన్సులు ఇవ్వడం, అంతర్వికీ లంకెలు, బయటి లంకెలు, సైటేషన్లు ఇవ్వడం వంటివాటి గురించి వీడియోలు తయారుచేయాలి.
  • విద్యాసంస్థలు, సాంస్కృతిక సంస్థలు తాడేపల్లిగూడెంలో ఉండడంతో తెవికీని అబివృద్ధి చేసేందుకు ప్రయత్నించాలి. పశ్చిమగోదావరి జిల్లాకు భౌగోళికంగా కేంద్ర స్థానంలో ఉండడం వల్ల జిల్లాలోని ఇతర వికీపీడియన్లకు కూడా ఉపయోగకరం. పశ్చిమగోదావరి జిల్లాలోని వికీపీడియా సముదాయం విస్తరించాలి, ఇక్కడే నెలవారీ సమావేశాలు ఏర్పాటుచేసుకునేందుకు సహకారం అందించాలి.
  • గూగుల్ అనువాద వ్యాసాల శుద్ధి ప్రాజెక్టును ప్రణాళికలో స్వీకరించి మరింత సహకారం అందించాలి, తద్వారా తెవికీలో నాణ్యత అభివృధ్ధికి ప్రయత్నించినట్టవుతంది.
  • తెవికీలో ముఖ్యమైన అంశాలు, వ్యక్తులపై వ్యాసాలు ఉన్నాయా? ఉంటే ఏ స్థితిలో ఉన్నాయి అన్నదానిపై పరిశోధన లేదా సర్వే. (content survey)

వాడుకరి:Veera.sj మార్చు

  • మీడియా కవరేజి బాగా పెరగాలి.
  • బ్లాగర్లను తెవికీలో చేర్చేలాంటి కార్యక్రమాలు ఏర్పాటుచేయాలి.
  • సాంకేతిక పదజాలం తెలుగులో తక్కువ

వాడుకరి:విశ్వనాధ్.బి.కె. మార్చు

  • గ్రామ వ్యాసాల్లో బొమ్మలు, సమాచారం అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలి. మరీ ముఖ్యంగా కొన్ని జిల్లాల గ్రామాల్లో అతితక్కువ సమాచారం ఉంది, ఉదాహరణకు: శ్రీకాకుళం, అనంతపురం వంటి జిల్లాలు. అలాంటి జిల్లాల్లో గ్రామవ్యాసాలు అభివృద్ధి చేయడం ప్రాధాన్యతగా స్వీకరించాలి.
  • తెలుగు వికీపీడియా తక్కువగా కవర్ చేసిన రసాయన శాస్త్రం, జీవ శాస్త్రం, భౌతిక శాస్త్రం వంటి అంశాల్లో విద్యార్థి వికీపీడియన్లతో వ్యాసాలు అభివృద్ధి చేసే ప్రయత్నం చేయాలి.

వాడుకరి:సుల్తాన్ ఖాదర్ మార్చు

  • భరతముని అకాడమీ, కృష్ణదేవరాయ తెలుగు సంఘం వంటి భాషా సంఘాలు, సాహిత్య సంఘాలు వంటివాటిపై దృష్టిపెట్టవచ్చు.
  • సోషల్ నెట్వర్కింగ్ ద్వారా కొత్త వాడుకరులను తెలుగులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించాలి
  • ఔత్సాహిక వాడుకరులను అనుభవమున్న వాడుకరులు తమ సర్కిల్లో గుర్తించి వారికి సీఐఎస్-ఎ2కె ద్వారా శిక్షణ ఇప్పించాలి.
  • బ్లాగర్లను వికీపీడియా వైపు తీసుకురావాలి.
  • తెలుగు రాష్ట్రాలకు అవతల ప్రాంతాల్లో ఉన్న భాషాభిమానులను తెవికీపీడియన్లుగా చేయడానికి ప్రయత్నించాలి.
  • మహిళా వికీపీడియన్లను మరింత మందిని తెవికీలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలి.
  • విశ్వవిద్యాలయాల్లో తెలుగు విభాగాల వారితో మాట్లాడి కార్యశాలలు నిర్వహించేందుకు సాధ్యపడితే చేయాలి.
  • ఫోటోలు చేర్చడం గురించి కృషిచేయాలి.
  • కడప జిల్లాలో కొన్ని విద్యాలయాలు తెవికీపై పనిచేసేందుకు ముందుకువస్తున్నాయి, ఆయా కళాశాలల్లో కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నం చేయొచ్చు.

వాడుకరి:Bhaskaranaidu మార్చు

  • వాడుకరులు నిలవట్లేదు, కొత్తవాళ్ళు నిలబడాలి. కొత్తవాడుకరులు ఎందుకు నిలవట్లేదు అన్న విషయం పరిశీలించాలి. నెలలో వాళ్ళంతట వాళ్ళు వచ్చేవాళ్ళలో కొందరైనా యాక్టివ్ వికీపీడియన్లు అయేలా ప్రయత్నించాలి.
  • యాక్టివ్ యూజర్లను అభివృద్ధి చేయాలి. కనీసం 10 ఎడిట్లు చేసేవాళ్ళ సంఖ్య, ఆపైన తెవికీలో చురుకైన వాడుకరి అయ్యేవారి సంఖ్య పెంచే కృషి చేయాలి. మార్చి 10, 2016 నాటికి తెవికీలో నామోదైన సభ్యుల సంఖ్య 52,000. ఈ రోజుకు క్రియాశీలకంగా వున్న వాడుకరులు (30 రోజులలో) 166 మంది. వీరిలో పది మార్పులు కన్నా తక్కువ చేసినవారు సుమారు 120 మంది. పది మార్పులకన్నా ఎక్కువ చేసిన క్రొత్తవారు కేవలము 8 మంది మాత్రమే. వంద మార్పులు అంతకన్నా ఎక్కువ చేసినవారు 23 మంది. వీరందరు సంవత్సరాలుగా వికీలో వ్రాస్తున్న పాత వారే. వీరందరూ ఎలాగూ వికీలోనే కొనసాగుతారు. క్రొత్తగా చేరిన వారిలో తెవికిలో కొన్నాళ్ల పాటు నిలదొక్కుకునే ప్రయత్నం చేయాలి. కనీసము నెలకు ఒక్క క్రొత్త వ్యక్తిని వికీలో నిలదొక్కుకునే లాగు చేయగలిగితే తెవికి అభివృద్ధి చాల బాగుంటుంది.
  • ఈ విషయముగా నాదొక సలహా. క్రొత్తగా తెవికీలో చేరే వారిని వారి ఇష్టప్రకారము అనుభవమున్న వికీపీడియన్లకు ఒక్కొక్కరికి సుమారు 4 లేదా 5 మందిని కేటాయించి వారిచే తర్పీదు ఇప్పించగలిగితే పలితము బాగ వుండవచ్చును. దీనికి అనుభవమున్న వికీపీడియన్లు తమ వద్దనే క్రొత్తవారికి తర్పీదు ఇవ్వడాని ఎంత మంది సిద్ధమో తెలుసుకొని ఆ ప్రయత్నము చేస్తే... మంచిది. (ఈ విషయములో నేను సిద్ధమే)
  • వికీపీడియా మార్గదర్శిని అనే పుస్తకాన్ని క్రొత్త వాడుకరులకు ఉచితముగా అందజేయ గలిగితే.... వికీపీడియా పై వారికి మంచి అవగాహన కలిగి ఉత్సాహంగా కొనసాగగలరని నా ఊహ. ఈ పుస్తకాన్ని ఒక సంవత్సరము క్రితమే క్రోడీకరించడమైనది. దీని ముద్రణకు సహకరించ గలిగితే మంచి ఫలితముండగలదు.
  • సీఐఎస్-ఎ2కె ద్వారా వికీ ప్రాజెక్టుల్లో వికీపీడియా గురించే ప్రధానమైన ప్రయత్నం జరుగుతోంది. వికీసోర్సు, విక్ష్నరీ, వికీకోట్ వంటివాటిలోనూ కృషిచేయాలి. ఈ మూడింటిలో క్రొత్త వారు వ్రాయడం చాల సులభము. మూలాలు చేర్చడమువంటి సమస్యలు తక్కువ. వికీసోర్స్ అయితే మరింత సులభము. దీనితో క్రొత్త వారికి వికీపీడియా సంబందిత వ్వవస్థల మీద కొంత అవగాహ్యన ఏర్పడుతుంది. దాంతో వారిలో ఉత్సాహము పెరిగే అవకాశము కలుగుతుంది. ఈ దిశగా కృషి చేయగలిగితే ఫలితము వుండవచ్చని నా అభిప్రాయము.

వాడుకరి:Nrgullapalli మార్చు

  • హైదరాబాద్ నెలవారీ సమావేశాలు ఉత్సాహభరితంగా, ప్రయోజనకరంగా చేయాలి.
  • ఢిల్లీ తెలుగు అసోసియేషన్ లో కవులు, కళాకారులు, మేధావులు ఉన్నారు. స్వంత బిల్డింగ్ ఉంది. వారితో కార్యకలాపాలు చేసే ప్రయత్నం చేయాలి. తెలుగు విశ్వవిద్యాలయంలో అన్ని రాష్ట్రాల తెలుగు అసోసియేషన్ల లిస్టు, చిరునామాలు ఉన్నాయి. తద్వారా ఇతర రాష్ట్రాల్లో తెవికీ అభివృద్ధి కోసం ప్రయత్నించవచ్చు.
  • తెలుగు వికీపీడియన్లకు శిక్షణ తరగతులు నిర్వహించాలని, అది కూడా One on One శిక్షణ జరగాలని గుళ్ళపల్లి నాగేశ్వరరావు పేర్కొన్నారు.[2]

వాడుకరి:Pranayraj1985 మార్చు

  • తెలంగాణా ప్రభుత్వ సంబంధించిన భాగస్వామ్యం సీఐఎస్-ఎ2కె స్వీకరించాలి, సీఐఎస్-ఎ2కె ప్రతిపాదనలు మెరుగుపరిచి కృషిచేయాలి.
  • తెలంగాణా ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హైదరాబాద్ రవీంద్రభారతిలో సమావేశం నిర్వహించుకునే అవకాశం కల్పిస్తానని ముందుకువచ్చారు. వారితో సీఐఎస్-ఎ2కె భాగస్వామ్యం చేయవచ్చేమో ప్రయత్నించి చూడాలి.

వాడుకరి:Rajasekhar1961 మార్చు

  • తెలుగు వికీపీడియా, వికీసోర్సుతో పాటుగా విక్ష్నరీ, వికీకోట్ ప్రాజెక్టులను కూడా సీఐఎస్-ఎ2కె ప్రణాళికలోకి తీసుకోవాలి.
  • టెంప్లెట్లు లోకలైజ్ చేయడం, ఇన్ఫోబాక్సులు లోకలైజ్ చేయడం, సృష్టించడం, రిఫరెన్సులు, సైటేషన్లు ఇవ్వడం వంటి అంశాలు లేకుంటే, ఆయా పనులు ఎలా చేయాలి అన్న అంశంపై "how to" తరహా వీడియోలు రూపొందించాలి.
  • వికీసోర్సులో పనిచేసే సభ్యులకు వివిధ సాంకేతికాంశాలపై శిక్షణనివ్వాలి. ఉదాహరణకు ఓసీఆర్ ద్వారా డిజిటైజ్ చేయడం, పుస్తకాన్ని తయారుచేయడం వగైరా అంశాలు వికీసోర్సర్లు అందరూ తెలుసుకోవాల్సినవి ఉన్నాయి.
  • వ్యక్తిగతంగా కూడా కొందరు ఉత్సాహం, అనుభవం ఉన్న వాడుకరులకు వారు ఇప్పటివరకూ ప్రయత్నించని అంశాలపై శిక్షణ ఇవ్వాలని సూచించారు. తద్వారా తెవికీకి ఒనగూడే మేలు గురించి ఆశాభావం వ్యక్తంచేశారు. వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు స్థితుల్లో ఉండడంతో వీలుంటే వ్యక్తిగతంగా శిక్షణ ఇవ్వాలని, సమయాన్ని దీనిపై పెట్టుబడి పెడితే ప్రతిఫలం ఉంటుందని సూచించారు.
  • పట్టణాలూ, నగరాల్లో వికీపీడియా కేంద్రాలుగా అభివృద్ధి చేయడం, స్థానికంగా సముదాయాన్ని ఏర్పరచడం వంటివి చేయాలని భావించారు.

వాడుకరి:Kvr.lohith మార్చు

  • తెలుగు వికీపీడియాలో నాణ్యత పెంపొందించేందుకు తగ్గ ప్రణాళిక అభివృద్ధి చేయాలి.
  • గూగుల్ అనువాద వ్యాసాల శుద్ధి వంటి ప్రాజెక్టుల రూపకల్పనలో సహకరించడం మంచి కృషి, అలాంటి ప్రయత్నాలు జరగాలి.
  • వికీపీడియా విద్యాకార్యక్రమంలో భాగంగా విద్యార్థి వికీపీడియన్లతో పనిచేసేప్పుడు యాంత్రికానువాదాలు చేయనీయకుండా, ఉన్న సాధారణ నామంతో వ్యాసం ఉన్న వృక్షాలకే శాస్త్రీయ నామంతో మరో వ్యాసం సృష్టించడం వంటి పొరబాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

మూలాలు, లంకెలు మరియు నోట్సు మార్చు

  1. 1.0 1.1 1.2 అర్జునరావుగారితో జరిగిన సంప్రదింపు ప్రధానంగా నవంబరు 2015న జరిగిన ఐఆర్సీలో మొదట నమోదైంది. ఆపైన పలు సంప్రదింపుల్లో ఆయన ఆ అభిప్రాయాలనే దృఢపరిచారు
  2. ఫిబ్రవరి 21, 2016 హైదరాబాద్ నెలవారీ సమావేశంలో CIS-A2K ప్రోగ్రాం ఆఫీసర్ తన్వీర్ హాసన్ నిర్వహించిన సంప్రదింపులో భాగంగా వ్యక్తమైన అభిప్రాయం
Return to the project page "సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక/జూలై 2016 - జూన్ 2017".