విజయ్ దహియా (జననం 1973 మే 10) భారత మాజీ వికెట్ కీపర్. అతను ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ క్రికెట్ జట్టు కోచ్‌గాను, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గానూ ఉన్నాడు.

విజయ్ దహియా
2014 IPL సమయంలో విజయ్ దహియా
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1973-05-10) 1973 మే 10 (వయసు 50)
ఢిల్లీ
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రవికెట్ కీపరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 232)2000 నవంబరు 18 - జింబాబ్వే తో
చివరి టెస్టు2000 నవంబరు 25 - జింబాబ్వే తో
తొలి వన్‌డే (క్యాప్ 132)2000 అక్టోబరు 3 - కెన్యా తో
చివరి వన్‌డే2001 ఏప్రిల్ 6 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1993/94–2006ఢిల్లీ
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డే ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 2 19 84 83
చేసిన పరుగులు 2 216 3,532 1,389
బ్యాటింగు సగటు 16.61 33.63 21.70
100లు/50లు 0/0 0/1 3/24 1/6
అత్యుత్తమ స్కోరు 2* 51 152 102
క్యాచ్‌లు/స్టంపింగులు 6/0 19/5 196/20 80/23
మూలం: [1], 2013 డిసెంబరు 20

ఫస్ట్ క్లాస్ కెరీర్ మార్చు

దహియా కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, వికెట్ కీపరు. 1993/94లో ఢిల్లీ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. జింబాబ్వేతో జరిగిన 2000/01 సిరీస్‌లో తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.

1999/00 సీజన్‌లో దులీప్, దేవధర్ ట్రోఫీలను గెలుచుకున్న నార్త్ జోన్ క్రికెట్ జట్టులో దహియా భాగం. 2009లో, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా ఆధారిత ఫ్రాంచైజీ క్రికెట్ జట్టు అయిన కోల్‌కతా నైట్ రైడర్స్ కు అసిస్టెంట్ కోచ్‌గా దహియా నియమితులయ్యారు.

దహియా 1993/94 సీజన్‌లో లూథియానాలో పంజాబ్‌పై ఆటతో ఫస్ట్ క్లాస్ రంగప్రవేశం చేశాడు. 1999-2000లో దులీప్, దేవధర్ ట్రోఫీలను గెలుచుకున్న నార్త్ జోన్ జట్టులో భాగంగా ఉన్నాడు. కొంతకాలం ఢిల్లీకి కెప్టెన్‌గా కూడా చేసాడు. 2006 డిసెంబరులో ఉత్తరప్రదేశ్‌తో జరిగిన తన చివరి మ్యాచ్ ఆడి, అన్ని రకాల క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు [1] పదవీ విరమణకు ముందు, అతను తన చివరి రంజీ సీజన్‌ను తమిళనాడుపై చక్కటి 102 స్కోరు చేసి ప్రారంభించాడు. అది అతని అత్యధిక ఫస్ట్-క్లాస్ స్కోరు.

అంతర్జాతీయ కెరీర్ మార్చు

ICC నాకౌట్ ట్రోఫీలో 2000 అక్టోబరులో నైరోబీ జింఖానాలో కెన్యాతో జరిగిన వన్‌డే మ్యాచ్‌లో దహియా తొలి అంతర్జాతీయ ఆట ఆడాడు. ఆ మ్యాచ్‌లో అతను ఒక క్యాచ్ పట్టాడు. మొత్తం మీద దహియా, భారత్ తరఫున 19 వన్డేలు ఆడాడు.

2001 సిరీస్‌లో ఆస్ట్రేలియాతో ఫటోర్డా స్టేడియంలో తన చివరి వన్‌డే ఆడాడు. M. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మొదటి వన్‌డేలో ఆస్ట్రేలియాపై దహియా అత్యధిక స్కోరు 51 చేసాడు. ఇది మ్యాచ్-విజేత మొత్తం 315ను నెలకొల్పడంలో సహాయపడింది.

నవంబర్ 2000లో తన సొంత మైదానం ఫిరోజ్ షా కోట్లా వేదికగా జింబాబ్వేపై దహియా తన అరంగేట్రం చేశాడు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అతను విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో అదే ప్రత్యర్థితో మరో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. రెండో మ్యాచ్‌లో దహియా ఆరు క్యాచ్‌లు పట్టాడు. [1]

కోచింగ్ కెరీర్ మార్చు

దహియా 2007/08 సీజన్‌లో ఢిల్లీ కోచ్‌గా నియమిడైనప్పటికీ, అతను కోల్‌కతా నైట్ రైడర్స్‌తో చేసుకున్న ఒప్పందం కారణంగా 2013/14 సీజన్‌లో తొలగించారు. ఈ పదవిలో ఉండగా అతను 2007-08 సీజన్‌లో ఢిల్లీ జట్టును రంజీ ట్రోఫీ గెలుచుకోడానికి దోహదపడ్డాడు. 16 ఏళ్ల తరువాత ఢిల్లీ మళ్ళీ ఈ టైటిల్ సాధించింది. 2009లో IPL ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా నియమితుడయ్యాడు [2]

2014 సెప్టెంబరులో మళ్ళీ అతన్ని 2014/15 సీజను కోసం ఢిల్లీ రంజీ ట్రోఫీ జట్టుకు ప్రధాన కోచ్‌గా తిరిగి నియమించుకున్నారు. [3]


2019 డిసెంబరులో అతను IPL ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ కు టాలెంట్ స్కౌట్‌ హెడ్‌గా నియమితుడయ్యాడు. 2021 సెప్టెంబరులో 2021/22 సీజన్‌కు ముందు ఉత్తర ప్రదేశ్‌కు ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు. [4]2021 డిసెంబరులో దహియా లక్నో సూపర్ జెయింట్స్ అసిస్టెంట్ కోచ్‌గా నియమితుడయ్యాడు.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "Vijay Dahiya retires from all forms of cricket". ESPNcricinfo. 14 December 2006. Retrieved 20 December 2013.
  2. "Dahiya named Kolkata assistant coach". ESPNcricinfo. 8 October 2009. Retrieved 20 December 2013.
  3. Dahiya back as Delhi Ranji coach
  4. "Vijay Dahiya replaces Gyanendra Pandey as Uttar Pradesh coach". ESPN Cricinfo. Retrieved 30 September 2021.