విజయ్ మాల్యా

భారతీయ వ్యాపారవేత్త, మాజీ పార్లమెంటు సభ్యుడు
(విజయ్ మాల్య నుండి దారిమార్పు చెందింది)

విజయ్ విట్టల్ మాల్యా (జ. 1955 డిసెంబరు 18) ఒక భారతీయ వ్యాపారవేత్త.[5] రాజకీయ నాయకుడు.[6][7]విజయ్ మాల్యా ఎన్నో ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడు. భారతదేశంలో ఆర్థిక నేరాల ఎదుర్కొంటున్న విజయ్ మాల్యాను ఇంగ్లాండ్ ప్రభుత్వం విజయ్ మాల్యాను భారత ప్రభుత్వం కు అప్పగించే ప్రయత్నంలో ఇంగ్లాండ్ ప్రభుత్వం ఉంది.[8]

విజయ్ మాల్యా
రాజ్యసభ సభ్యుడు
In office
2010 జూలై 1 – 2 May 2016[1]
In office
2002 జూలై 10 – 2008 ఏప్రిల్ 9
నియోజకవర్గంకర్ణాటక
వ్యక్తిగత వివరాలు
జననం (1955-12-18) 1955 డిసెంబరు 18 (వయసు 69)[2]
మంగళూరు, కర్ణాటక, భారతదేశం
రాజకీయ పార్టీస్వతంత్ర రాజకీయ నాయకుడు
జీవిత భాగస్వామిరేఖ మాల్యా, సమీరా మాల్యా
సంతానం3, సిద్ధార్థ మాల్యాతో సహా
తల్లిదండ్రులువిట్టల్ మాల్యా
నివాసంలండన్ ఇంగ్లాండ్
మారుపేరుKing of Good Times[3][4]

మద్య పానీయాల వ్యాపారంలో ఉన్న ఒక వ్యాపారవేత్త కుమారుడు, మాల్యా భారతదేశంలో అతిపెద్ద స్పిరిట్స్ కంపెనీ యునైటెడ్ స్పిరిట్స్ మాజీ ఛైర్మన్ మద్యపానంతో సహా ఆసక్తులతో కూడిన భారతీయ సమ్మేళనమైన యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. విమానయాన మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్ ఎరువుల వ్యాపారాలను విజయ్ మాల్యా నడుపుతున్నాడు. విజయ్ మాల్యా 20 సంవత్సరాలకు పైగా భారతదేశంలోని బేయర్ క్రాప్‌సైన్స్ ఛైర్మన్‌గా పనిచేశాడు. విజయ్ మాల్యా ఇతర కంపెనీలకు కూడా ఛైర్మన్‌గా పనిచేశాడు.[9] విజయ్ మాల్యా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ క్రికెట్ జట్టు మాజీ యజమాని కూడా.

వ్యక్తిగత జీవితం

మార్చు

విజయ్ మాల్యా కర్ణాటకలోని మంగళూరులోని బంట్వాల్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త విట్టల్ మాల్యా,[2] లలితా రామయ్య దంపతులకు జన్మించాడు. విట్టల్ మాల్యా యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ అనే వ్యాపార సంస్థకు అధిపతి.[10] [11] విజయ్ మాల్యా లా మార్టినియర్ కలకత్తాలో విద్యాసంస్థలో విద్యనభ్యసించాడు. అక్కడ తన చివరి సంవత్సరంలో హేస్టింగ్స్ హౌస్‌కి హౌస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. సెయింట్ జేవియర్స్ కాలేజ్, కోల్‌కతాలో [2] [12] 1976లో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీతో (ఆనర్స్‌తో) పట్టా పొందాడు.[2] [13] కళాశాలలో ఉండగానే, విజయ్ మాల్యా తన కుటుంబ వ్యాపారాల్లో పనిచేసేవాడు.

1986లో, విజయ్ మాల్యా ఎయిర్ ఇండియా ఎయిర్ హోస్టెస్ సమీరా త్యాబ్జీని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు 1987 మే 7న సిద్ధార్థ మాల్యా, అనే కుమారుడు జన్మించాడు.[14] [15] విజయ్ మాల్యా తన మొదటి భార్యతో తనకు "గొప్ప సంబంధం" ఉందని ఇంటర్వ్యూలలో చెప్పినప్పటికీ, కొంతకాలం తర్వాత ఈ దంపతులు విడాకులు తీసుకున్నారు.[16] 1993 జూన్ లో విజయ్ మాల్యా రేఖను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు లియానా, తాన్య ఉన్నారు.[2] [17] [18] విజయ్ మాల్యా భార్య రేఖ ఇంతకుముందు రెండుసార్లు వివాహం చేసుకుంది. మునుపటి వివాహం నుండి లీలా, కబీర్ అనే కుమార్తె, కుమారుడు కూడా ఉన్నారు.[10] [18] రేఖ కూతురు లీలాను విజయ్ మాల్యా దత్తత తీసుకున్నాడు.[15]

విజయ్ మాల్యా తిరుమల వేంకటేశ్వర స్వామి, కుక్కే సుబ్రహ్మణ్య స్వామి భక్తుడు. 2012లో తన 57వ పుట్టినరోజు సందర్భంగా విజయ్ మాల్యా తిరుమల దేవాలయానికి 3 కిలోల బంగారు ఇటుకలను సమర్పించారు. 2012లో విజయ్ మాల్యా, కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయానికి 8 మిలియను (US$1,00,000) బంగారు పూతతో కూడిన తలుపులను విరాళంగా ఇచ్చాడు.

వ్యాపార జీవితం

మార్చు
 
కింగ్‌ఫిషర్ టవర్ పైన ఉన్న భవనం, ఇది విజయ్ మాల్యాకు చెందిన వైట్ హౌస్ నకలు చిత్తరువు

విజయ్ మాల్యా భారతదేశంలో అతిపెద్ద స్పిరిట్స్ కంపెనీ యునైటెడ్ స్పిరిట్స్ మాజీ ఛైర్మన్ గా పనిచేశాడు. విజయ్ మాల్యా యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ ఛైర్మన్‌గా కొనసాగుతున్నాడు, మద్యపానం, విమానయాన మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్ ఎరువులతో సహ విజయ్ మాల్యా అనేక వ్యాపారాలను నడుపుతున్నాడు. విజయ్ మాల్యా భారతదేశంలోని బేయర్ క్రాప్‌సైన్స్‌కు 20 సంవత్సరాలకు పైగా ఛైర్మన్‌గా పనిచేశాడు. విజయ్ మాల్యా ఇతర కంపెనీలకు కూడా ఛైర్మన్‌గా ఉన్నారు. [9]

విజయ్ మాల్యా ప్రముఖ వ్యాపారవేత్త విట్టల్ మాల్యా కుమారుడు, విజయ్ మాల్యా 1983లో తన తండ్రి విట్టల్ మాల్యా మరణంతో 28 సంవత్సరాల వయస్సులో తన తండ్రి నడుపుతున్న వ్యాపార సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్‌కు ఛైర్మన్ అయ్యాడు. [19] అప్పటి నుండి, అప్పటినుండి విజయ్ మాల్యా నడుపుతున్న వ్యాపార సంస్థ 60 కంపెనీల బహుళ-జాతీయ సమ్మేళనంగా అభివృద్ధి చెందింది, వార్షిక టర్నోవర్ 15 సంవత్సరాలలో 64% పెరిగి 1998-1999లో US$11 బిలియన్లకు చేరుకుంది.

విజయ్ మాల్యా యునైటెడ్ కింగ్‌ఫిషర్ బీర్ భారతదేశంలో 50% కంటే ఎక్కువ మార్కెట్ వాటాను కలిగి ఉన్నాడు. [20] విజయ్ మాల్యా నడుపుతున్న వ్యాపార సంస్థ యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ 100 మిలియన్ వినియోగదారులను తమ వైపు ఆకర్షించి మైలురాయిని సాధించింది, విజయ్ మాల్యా అధ్యక్షతన ప్రపంచంలో రెండవ అతిపెద్ద స్పిరిట్స్ కంపెనీగా యునైటెడ్ స్పిరిట్ లిమిటెడ్ కంపెనీ అవతరించింది. [20]

రాజకీయ జీవితం

మార్చు

గతంలో విజయ్ మాల్యా అఖిల భారత జనతా దళ్ పార్టీ సభ్యుడు, విజయ్ మాల్యా 2003లో సుబ్రమణియన్ స్వామి నేతృత్వంలోని జనతా పార్టీలో చేరారు 2010 వరకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేశాడు.[21][22][23] ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ జనతా దళ్ ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. విజయ్ మాల్యా తన సొంత రాష్ట్రం కర్ణాటక నుండి రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు ఎన్నికయ్యాడు, మొదట 2002లో జనతాదళ్ (సెక్యులర్) ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మద్దతుతో విజయ్ మాల్యా మొదటిసారి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. 2010లో విజయ్ మాల్యా జనతాదళ్ (సెక్యులర్) మద్దతుతో బి.జె.పి తరపున రెండవ సారి రాజ్యసభ సభ్యుడుగా ఎన్నికయ్యాడు [24]

2016 మే 2న, విజయ్ మాల్యా తన రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు, రాజ్యసభ ఎథిక్స్ ప్యానెల్ 2016లో విజయ్ మాల్యా రాజ్యసభ సభ్యుని పదవికి అనర్హుడు అని ప్రకటించింది.[1]దీంతో ఆయన రాజ్యసభ సభ్యుని పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత ఆయన భారతదేశం విడిచిపెట్టాడు, [25] భారతదేశం విడిచి వెళ్లిన తర్వాత విజయ్ మాల్యా పాస్‌పోర్ట్ ను భారత ప్రభుత్వం రద్దు చేసింది. [26]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 PTI (2 May 2016). "Vijay Mallya resigns from Rajya Sabha". The Hindu. Retrieved 2 May 2016.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 Vijay Mallya Rajya Sabha MP Archived 13 మే 2012 at the Wayback Machine Mallyainparliament.in. (Retrieved 4 June 2014).
  3. Tsang, Amie; Kumar, Hari (18 April 2017). "Vijay Mallya, Once India's 'King of Good Times', Is Arrested in London". New York Times. Retrieved 7 March 2018.
  4. Bengali, Shashank; Parth, M. N. (18 April 2017). "India's former 'King of Good Times' beer baron Vijay Mallya, is arrested in London". Los Angeles Times. Retrieved 7 March 2018.
  5. The Hindu Net Desk (4 August 2018). "List of fugitive economic offenders living abroad". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 20 August 2019.
  6. "Vijay Mallya becomes first person to be declared a 'fugitive economic offender' under new law". The Economic Times. Retrieved 16 July 2022.
  7. "List of fugitive economic offenders in India does not end with Vijay Mallya". Business Standard India. 11 July 2022. Retrieved 16 July 2022.
  8. "Vijay Mallya To Be Extradited Rules London Court: 10 Points". NDTV.com. 10 December 2018.
  9. 9.0 9.1 "10 Companies Vijay Mallya is a Director in". www.tofler.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 14 July 2017.
  10. 10.0 10.1 "Vijay Mallya". India.gov.in: National Portal of India. Archived from the original on 3 June 2013.
  11. "Vijay Mallya: Mr High Spirits". www.rediff.com. Retrieved 14 July 2017.
  12. Mathew, Fr. P.C., S.J., "Aims and Objectives Archived 18 సెప్టెంబరు 2010 at the Wayback Machine", St. Xavier's College, Kolkata (accessed May 2014).
  13. "The dethroned king of good times". The New Indian Express. Archived from the original on 13 May 2017. Retrieved 14 July 2017.
  14. "Sidhartha Mallya". Bornrich (in అమెరికన్ ఇంగ్లీష్). 21 December 2011. Archived from the original on 2 అక్టోబరు 2018. Retrieved 14 July 2017.
  15. 15.0 15.1 "Unseen pictures of Vijay Mallya and wives". DailyBhaskar (in ఇంగ్లీష్). 27 November 2012. Retrieved 14 July 2017.
  16. "My life is an open book: Vijay Mallya". Daily News & Analysis (in అమెరికన్ ఇంగ్లీష్). 21 April 2006. Retrieved 14 July 2017.
  17. Parliamentary Profile. Archived 1 మే 2014 at the Wayback Machine. India.gov.in (18 December 1955). Retrieved on 17 July 2016.
  18. 18.0 18.1 "I do, I do, I do..." The Times of India. Retrieved 14 July 2017.
  19. Dalal, Mihir (26 February 2016). "How Vijay Mallya inherited an empire and proceeded to lose it". Mint. Retrieved 14 July 2017.
  20. 20.0 20.1 "Accounting Policy, Bayer CropScience Ltd". Live Mint. Archived from the original on 12 December 2013. Retrieved 2 June 2014. (section 4.1)
  21. "Vijay Mallya joins Janata Party". Rediff.com. Retrieved 15 March 2016.
  22. "Vijay Mallya removed as Working President of Janata Party". Business Standard India. Press Trust of India. 8 June 2010. Retrieved 15 March 2016.
  23. "Steering clear of the limelight by Aravind Gowda". India Today. 26 February 2014. Retrieved 15 March 2016.
  24. "Both BJP, Congress had backed Vijay Mallya's Rajya Sabha membership". India News, India.com. 14 March 2016. Retrieved 14 March 2016.
  25. "Vijay Mallya Left Country On March 2, Government Tells Supreme Court". NDTV. Retrieved 14 July 2017.
  26. "Vijay Mallya's Passport Revoked By Ministry Of External Affairs". Huffington Post India. 24 April 2016. Retrieved 14 July 2017.