విజేత 2018లో విడుదలైన తెలుగు సినిమా.

కథ సవరించు

శ్రీనివాసరావు(మురళీశర్మ) ఓ మంచి తండ్రి. తన ఆశయాలను, కోరికలను, ఇష్టాలను చంపుకొని కుటుంబం కోసం బతుకుతుంటాడు. రామ్‌(కళ్యాణ్ దేవ్) ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ అత్తెసరు మార్కులతో ఉత్తీర్ణుడవుతాడు. ఉద్యోగం రాదు. శ్రీనివాసరావు స్నేహితుల పిల్లలు మంచి హోదాలో ఉంటారు. కానీ, తన కొడుకు ఎప్పుడు ఎదుగుతాడా? అన్న బెంగతో శ్రీనివాసరావు ఉంటాడు . రామ్‌ మాత్రం బాధ్యతలేవీ పట్టకుండా తిరుగుతుంటాడు. తన వీధిలో ఉన్న జైత్ర(మాళవిక నాయర్‌)ను ఇష్టపడతాడు. అసలు జీవితం పట్ల సీరియస్ గా లేని రామ్‌కు జీవితం విలువ.. నాన్న విలువ.. బాధ్యతల విలువ ఎలా తెలిశాయి? తనలో మార్పు ఎలా వచ్చింది? అనేదే మిగిలిన కథ.[1]

తారాగణం సవరించు

సాంకేతికవర్గం సవరించు

సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌

కూర్పు: కార్తీక శ్రీనివాస్‌

ఛాయాగ్రహణం: కె.కె.సెంథిల్ కుమార్

నిర్మాత: రజని కొర్రపాటి

రచన, దర్శకత్వం: రాకేష్‌ శశి

పురస్కారాలు సవరించు

సైమా అవార్డులు సవరించు

2018 సైమా అవార్డులు

  1. సైమా ఉత్తమ తొలిచిత్ర నటుడు (కళ్యాణ్ దేవ్)

మూలాలు సవరించు

  1. Sakshi (12 July 2018). "'విజేత' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 16 జూన్ 2021. Retrieved 16 June 2021.

బయటి లంకెలు సవరించు

*https://www.youtube.com/watch?v=SIj5qGyEnDs యూట్యూబ్ లో విజేత ప్రచార చిత్రం