తెలుగు సినిమాలలో విఫల ప్రేమలో విలపిస్తూ పాడే పాటలలో మన సినిమా రచయితలు బోలెడన్ని ప్రయోగాలు చేశారు. అనేక హిట్‌ గీతాలందించారు. అలనాటి సినిమాలలో విరహ, విషాద గీతాలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సాధారణంగా ప్రతి వ్యక్తి జీవితంలో విరహాన్ని, విషాదాన్ని అనుభవించి తీరుతాడు. ఇలాంటివి తెరమీద కనిపించినప్పుడు, తమ అనుభవాల్ని గుర్తుకుతెచ్చుకుని, ఆస్వాదించి వాటికి పట్టం కట్టారు. ఇది గమనించిన సినీ రూపకర్తలు బోలెడన్ని విరహ, విషాద గీతాలు రాయించి తద్వారా అనేక హిట్లు సాధించారు.

విషాద గీతాలు కూడా చాలా సినిమాల్లో ప్రముఖ పాత్ర పోషించాయి. అలనాటి కథానాయకులు అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీరామారావు, కృష్ణ, శోభన్‌బాబులు విషాద గీతాల్లో నటించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. దేవదాసులోని నాయకుడు ‘జగమేమాయ’అంటూ వేదాంత తత్త్వాన్ని ప్రకటించాడు. ప్రేమనగర్ కథానాయకుడు ‘మనసు గతి ఇంతే’ అని మనసు తత్త్వాన్ని వ్యక్తీకరించాడు. ఇలాంటి సందర్భానికి దగ్గరగానే ‘అభినందన’ చిత్రంలోని నాయకుడు ‘ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం’అంటూ ప్రేమలో లభించే హాలాహలం గురించి పాడాడు. కథానాయికకు దూరమై కథానాయకుడు పాడే గీతాలన్నీ దాదాపుగా ‘దేవదాసు’ సూచించిన బాటలోనే ప్రయాణించాయి.

మరో రకమైన విషాద గీతాలకు ఉదాహరణ ‘మురళీకృష్ణ’ చిత్రంలోని ‘ఎక్కడ ఉన్నా ఏమైనా నీ సుఖమే నే కోరుతున్నా’అనే పాట. నాయిక దూరమైనా ఆమె చల్లగా, శాంతిగా ఉండాలని కోరుకునే ఉదాత్త గీతాలివి. ‘ఈ జీవన తరంగాలలో, ఆ దేవుని చదరంగంలో’ (జీవన తరంగాలు), ‘ఎవరికి ఎవరు చివరికి ఎవరు’ (దేవదాసు మళ్ళీపుట్టాడు), ‘ఏమనుకున్నావు ననే్నమనుకున్నావు’ (బంగారుబాబు), ‘నేనొక ప్రేమ పిపాసిని’ (ఇంధ్ర ధనుస్సు), ‘రెండక్షరాల ప్రేమ, రెండు క్షణాల ప్రేమ’ (గజదొంగ), ‘గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం’ (స్వయంవరం), ‘ఆగదు ఏ నిమిషం నీకోసం’ (ప్రేమాభిషేకం), ఇది ధరిత్రి ఎరుగని పయనం ఏ చరిత్ర ఎరుగని కావ్యం’ (ప్రేమమందిరం), ‘వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి’ (మాతృదేవోభవ), ‘ఆకాశాన సూర్యుడుండడు సంధ్యవేళకే’ (సుందరకాండ) లాంటి మంచి విషాద గీతాలుగా చెప్పుకోవచ్చు.

సినిమాల్లో సందర్భానుసారంగా ఇలాంటి విరహ, విషాద గీతాలను సృష్టించడంవల్ల ఆ చిత్రాలకు నిండుదనం వస్తుంది. ఆయా పాత్రలు వాస్తవ జీవితాలకు దగ్గరగా ప్రవర్తించినట్లుగా ఉంటాయి. సగటు ప్రేక్షకులు తమ బాధలను నాయికా నాయకుల ద్వారా అనుభవించి సాంత్వన చెందేవారు.

తెలుగు చిత్రపరిశ్రమలో కొన్ని విషాద గీతాలు మార్చు

ఆచార్య ఆత్రేయ వ్రాసినవి మార్చు

 1. ఎవరో జ్వాలను రగిలించారు (డాక్టర్ చక్రవర్తి )
 2. దేవుడనేవాడున్నాడా అని (దాగుడు మూతలు)
 3. ఎక్కడవున్న ఏమైనా (మురళీ కృష్ణ )
 4. మానూ మాకునుకాను రాయీ రప్పను కానేకాను (మూగ మనసులు)
 5. నిను వీడని నీడను నేనే (అంతస్తులు)
 6. తలచినదే జరిగినదా దైవం ఎందులకు (మనసే మందిరం )
 7. చేతిలో చెయ్యేసి చెప్పు బావా (దసరా బుల్లోడు)
 8. మనసుగతి ఇంతే మనిషి బతుకింతే (ప్రేమనగర్ )
 9. ఎవరికోసం - ఎవరికోసం (ప్రేమనగర్ )
 10. చక్కనయ్య చందమామా (భార్యాబిడ్డలు)
 11. అందమైన జీవితము అద్దాల సౌథము (విచిత్ర బంధం)
 12. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో (జీవన తరంగాలు)
 13. మంచితనానికి తావేలేదు (బంగారు కలలు)
 14. నిన్ను మరచి పోవాలని అన్ని విడిచి వెళ్ళాలని (మంచి మనుషులు)
 15. రారయ్య పోయినవాళ్ళు (గాజుల కిష్టయ్య)
 16. ఒక జంట కలిసిన తరుణాన (బాబు)
 17. దేవుడే యిచ్చాడు వీధి ఒక్కటి (అంతులేని కథ)
 18. కళ్ళలో ఉన్నదేదో కనులకే తెలుసు (అంతులేని కథ)
 19. మనసులేని బ్రతుకొక నరకం (సెక్రెటరీ)
 20. ఇంతే యీ జీవితము చివరికి అంతా శూన్యము (అమరదీపం)
 21. ప్రేమకు మరణం లేదు - దానికి ఓటమి లేనే లేదు (ఇంద్రధనుస్సు)
 22. నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి (ఇంద్రధనుస్సు)
 23. ఈ అనంత కాలగమనంలో (సంధ్య)
 24. ఓ బాటసారి...ఇది జీవిత రహదారి (ఇల్లాలు)
 25. కాశీ విశ్వనాథా ...! తండ్రీ విశ్వనాథా...! (పులిబిడ్డ)
 26. ఏఏ దేవుళ్ళు శాసించినారో ఏఏ దేవతలు శపించినారో (పోరాటం)
 27. చుక్కల్లే తోచావే వెన్నెల్లె కాచావే ఎదబోయవే (నిరీక్షణ)
 28. ఏ నావ దే తీరము ఏ నేస్తమే జన్మ వరము (సంకీర్తన)
 29. ప్రేమలేదని, ప్రేమించరాదని (అభినందన)
 30. ప్రేమఎంత మధురం ప్రియురాలు అంత... (అభినందన)
 31. ఎదుటా నీవే ఎదలోనా నీవే (అభినందన)
 32. ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా (ప్రేమ)
 33. మనసొక మధు కలశం పగిలేవరకే అది నిత్యసుందరం (నీరాజనం)
 34. నేనే సాక్ష్యం.. ఈ ప్రేమ యాత్రకేది అంతమూ (నీరాజనం)

మూలాలు మార్చు

యితర లింకులు మార్చు