వి.ఎల్.ఎస్.భీమశంకరం (వేము లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్య భీమశంకరం) ప్రముఖ భూ భౌతిక శాస్త్రవేత్త.[1]

వేము లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్య భీమశంకరం
వి.ఎల్.ఎస్.భీమశంకరం
జననంనవంబరు 16 , 1931
పౌరసత్వంభారతీయుడు
జాతీయతFlag of India.svg భారతీయుడు
రంగములుభూ భౌతిక శాస్త్రవేత్త

జీవిత విశేషాలుసవరించు

భీమశంకరం నవంబరు 16 1931 న జన్మించారు. 1957 లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి పట్టభద్రులైనారు. 1967 నుండి 1979 ల మధ్య ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జియోఫిజిక్స్ విభాగపు అధిపతిగా పనిచేశారు. యూనివర్శిటీలో "సెంటర్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్" జియోఫిజిక్స్ ను ఎంతగానో అభివృద్ధి చేశారు. యు.జి.సి నేషనల్ ఫెలోషిప్ నందుకున్నారు.

మన దేశంలోని దక్కన్ పీఠభూమి యొక్క ప్రాచీన లోహకర్షకత్వం (అయస్కాంతత్వం) నకు సంబంధించి అతి విలువైన సమాచారాన్ని తన పరిశోధనల ద్వారా వెల్లడించారు.[2] అగ్ని శిలల అయస్కాంతత్వ పాక్షిక స్వయం విపర్యను విశదపరచడంలో అమోఘమేధాశక్తిని కల్పించారు. భూగర్భం లోని ఖనిజ సంపదను వెలికి తీయు క్రమంలో శాస్త్రీయమైన వ్యూహ రచన చేసి భూభౌతిక శాస్త్రమును అభివృద్ధి పరచారు.

ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (1928), ఇండియన్ జియోఫిజికల్ యూనియన్లో జియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, అసోసియేషన్ ఆఫ్ ఎక్స్ ప్లోరేషన్ ఆఫ్ జియో ఫిజిక్స్, ఆంధ్ర ప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మొదలగు సంస్థల గౌరవ సత్కారాలను అందుకున్నారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ జియోసైన్స్ లో గౌరవ సభ్యత్వ గ్రహీత. వాన్ వీల్డెన్ అవార్డు, యూరోపియన్ అసోసియేషన్ ఆఫ్ ఎక్స్ ప్లోరేషన్ జియోఫిజిక్స్, నెదర్లాండ్స్ (1957), డెసెన్ వీల్ అవార్డు, ఇండియన్ జియోఫిజికల్ యూనియన్ అవార్డు (1981) మొదలైనవి అందుకున్నారు.

మూలాలుసవరించు

  1. "ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ". Archived from the original on 2016-03-04. Retrieved 2014-07-27.
  2. యునెస్కో వారి పరిశోధనా పత్రం

యితర లింకులుసవరించు