వి.ఐ. మునుస్వామి పిళ్ళై

భారతీయ రాజకీయవేత్త

రావు సాహిబ్ వేలూరు అయ్యస్వామి మునుస్వామి పిళ్ళై (23 ఫిబ్రవరి 1889 - 14 డిసెంబరు 1953) తమిళనాడుకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు, షెడ్యూల్డ్ కుల కార్యకర్త. 1937 నుండి 1939 వరకు సి. రాజగోపాలాచారి ప్రభుత్వంలో వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రిగా పనిచేశాడు. ఇతడు మునిసామి పిళ్ళై అని కూడా పిలువబడ్డాడు.

రావు సాహెబ్ వేలూరు అయ్యస్వామి మునుస్వామి పిళ్ళై
వి.ఐ. మునుస్వామి పిళ్ళై

1938లో వచ్చిన హరిపుర కాంగ్రెస్ సావనీర్ మీద మునుస్వామి ఫోటో


భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుడు
పదవీ కాలం
9 డిసెంబరు 1946 – 24 జనవరి 1950

వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రి (మద్రాస్ ప్రెసిడెన్సీ)
పదవీ కాలం
14 జూలై 1937 – 9 అక్టోబరు 1939
Premier సి. రాజగోపాలాచారి
గవర్నరు జాన్ ఎర్స్‌కిన్, లార్డ్ ఎర్స్‌కిన్

వ్యక్తిగత వివరాలు

జననం 1889
ఊటీ, మద్రాసు ప్రెసిడెన్సీ
మరణం 14 డిసెంబరు 1953
మద్రాస్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
వృత్తి వ్యాపారవేత్త

తొలి జీవితం మార్చు

మునుస్వామి పిళ్ళై 1889, ఫిబ్రవరి 23న తమిళనాడు రాష్ట్రం, నీలగిరి జిల్లాలోని ఉదకమండలంలోని ఒక పేద కుటుంబంలో జన్మించాడు. చదువును పూర్తిచేసిన తరువాత ఇరవై సంవత్సరాల వయస్సులో గుమస్తా ఉద్యోగంలో చేరాడు. ఆ తరువాత, మునుస్వామి పిళ్ళై 1925లో తన స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాడు.

ప్రజా జీవితం మార్చు

అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం వహించిన మునుస్వామి పిళ్ళై 1926లో మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు నామినేట్ అయ్యాడు. 1932, మే నెలలో నాగపూర్‌లో మునుసామి పిళ్ళై అధ్యక్షతన 'ఆల్ ఇండియా డిసి కాంగ్రెస్' (2వ కాన్ఫరెన్స్) జరిగింది.[1] భారత జాతీయ కాంగ్రెస్ పార్టీవిధానాలకు మద్దతు ఇవ్వడంతోపాటు 1937 నుండి 1939 వరకు రాజాజీ మంత్రివర్గంలో వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రిగా పనిచేశాడు.

తరువాత జీవితంలో మార్చు

1939లో కాంగ్రెస్ మంత్రిత్వ శాఖకు రాజీనామా చేసిన మునుస్వామి పిళ్ళై, ప్రజా జీవితం నుండి రిటైర్ అయ్యాడు. కొంతకాలం తరువాత మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి, 1946లో మద్రాసు నుండి భారత రాజ్యాంగ సభకు ఎన్నికయ్యాడు.[2] 1947, జూలై 22న భారత రాజ్యాంగ సభలో జాతీయ జెండాను ఆమోదించడంలో ప్రసంగం చేస్తూ "ఇది ధనవంతుల జెండా కాదు. అణగారిన, అణిచివేయబడిన వర్గాల జెండాగా ఉండాలి మా దేశం మీద" అని అన్నాడు.[3] 1952 పార్లమెంట్ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా తిండివనం నుండి పోటీచేసి ఓడిపోయాడు.[4]

మరణం మార్చు

మునుస్వామి పిళ్ళై తన 63 ఏళ్ళ వయసులో 1953, డిసెంబరు 14న మరణించాడు.[5] మునుస్వామి పిళ్ళై మరణానికి సంతాపం తెలుపుతూ మద్రాసు శాసనసభ ప్రత్యేక తీర్మానం కూడా చేసింది.[5]

మూలాలు మార్చు

  1. Ambeth, அம்பேத்: One of the stalwarts V. I. Muniswamy Pillay on Dr. Babasaheb Ambedkar in the Constituent Assembly of India
  2. Members of the Constituent Assembly
  3. Ambeth, அம்பேத்: V. I. Muniswamy Pillai on the National Flag of India
  4. ECI report on 1951 election
  5. 5.0 5.1 "Resume of the 1st Madras Legislative Assembly (1952–1957) Chapter XIV:Motions and Resolutions" (PDF). Tamil Nadu Legislative Assembly. Archived from the original (PDF) on 2011-09-04. Retrieved 2021-09-25.