వెంకీ
వెంకీ 2004లో శ్రీను వైట్ల దర్శకత్వంలో విడుదలైన సినిమా.[1] ఇందులో రవితేజ, స్నేహ ప్రధాన పాత్రధారులు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్నందించాడు.
వెంకీ | |
---|---|
దర్శకత్వం | శ్రీను వైట్ల |
రచన | కోన వెంకట్ గోపీమోహన్ |
నిర్మాత | అట్లూరి పూర్ణచంద్రరావు |
తారాగణం | రవితేజ స్నేహ అశుతోష్ రాణా |
ఛాయాగ్రహణం | ప్రసాద్ మూరెళ్ళ |
సంగీతం | దేవి శ్రీ ప్రసాద్ |
విడుదల తేదీ | మార్చి 26, 2004 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹80 మిలియను (US$1.0 million) |
కథ
మార్చువైజాగ్, సీతంపేట కు చెందిన వెంకటేశ్వరరావు అలియాస్ వెంకీ కి జాతకాలంటే పిచ్చి. జగదాంబ చౌదరి అనే జ్యోతిష్కుడికి దగ్గరకు తరచు వెళ్ళి వస్తుంటాడు. అది అతని నాన్నగారికి ఏ మాత్రం నచ్చదు. ఏదో ఒక ఉద్యోగం చూసుకోమని పోరుపెడుతుంటాడు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా వెంకీ, అతని మిత్రబృందం ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి ఒకరి చేతిలో మోసపోతారు. అతన్ని వెంబడిస్తూ అదృష్టవశాత్తూ పోలీసు ప్రవేశ పరీక్షలో నెగ్గుతారు. పోలీసు శిక్షణ కోసం అందరూ హైదరాబాదుకు బయలుదేరుతారు. రైల్లో వెంకీకి శ్రావణి అనే అమ్మాయి పరిచయం అవుతుంది.
తారాగణం
మార్చు- వెంకీగా రవితేజ
- శ్రావణిగా స్నేహ
- యోగేంద్ర శర్మగా అశుతోష్ రాణా
- వెంకీ తండ్రిగా తనికెళ్ళ భరణి
- వెంకీ తల్లిగా ఢిల్లీ రాజేశ్వరి
- శ్రావణి తండ్రిగా సి. వి. ఎల్. నరసింహా రావు
- గజాలాగా బ్రహ్మానందం
- బొక్కాగా ఎ. వి. ఎస్
- రమణ గా చిత్రం శ్రీను
- సూరిబాబు గా శ్రీనివాస రెడ్డి
- వీరభద్రం/బుజ్జి గా రామచంద్ర
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- నిప్పు నాగరాజుగా వేణు మాధవ్
- కృష్ణ భగవాన్
- పోలీసు అధికారిగా భరత్
- మాస్టర్ భరత్
- జగదాంబ చౌదరిగా మల్లికార్జున రావు
- అతిథి పాత్రలో రాశి (చిలకేమో సికాకుళం పాటలో)
- శరత్ కుమార్ ఐ. పి. ఎస్ ఆహుతి ప్రసాద్
పాటల జాబితా
మార్చుమార్ మార్ , గానం.మాణిక్య వినాయగం, శ్రీలేఖ పార్ధసారది
గోంగూర తోటకాడ , గానం.పుష్పవనం కుప్పుస్వామీ, కల్పన
సిలకేమో , గానం.పాలక్కడ్ శ్రీరామ్, మాలతి లక్ష్మణ్
ఓ మనసా, గానం.వేణు, సుమంగళి
అనగనగా కథలా, గానం.కార్తీక్, సుమంగళి
అందాల చుక్కల లేడీ , గానం.మల్లిఖార్జున్, కల్పన.
మూలాలు
మార్చు- ↑ జి. వి, రమణ. "ఐడిల్ బ్రెయిన్ లో వెంకీ చిత్ర సమీక్ష". idlebrain.com. idlebrain.com. Retrieved 26 March 2017.