వెలుగోటి సర్వజ్ఞ కుమారకృష్ణ యాచేంద్ర
వెలుగోటి సర్వజ్ఞ కుమారకృష్ణ యాచేంద్ర (1831-1892) తెలుగు రచయిత, వెంకటగిరి సంస్థానాధిపతి.
జీవిత విశేషాలు
మార్చువెలుగోటి సర్వజ్ఞ కుమారకృష్ణ యాచేంద్ర అసలు పేరు కుమారకృష్ణ యాచేంద్ర. తన 17వ ఏట వెంకటగిరి సంస్థానధిపతి పదవిని చేపట్టి, స్వయంకృషితో చదువుకొని తన ఆస్థానకవిగా గోపినాథుని వెంకయ్యశాస్త్రిని నియమించుకొన్నాడు. స్యయంకృషితో సంస్కృతం, తెలుగుభాషలలో పరిచయం యేర్పరచుకొని 14 పుస్తకాలు రచించాడు. ఈయన రచనలు జస్టిస్ పార్టీ అభిప్రాయాలకు దగ్గరగా ఉంటాయి. ఈయన 1860లో మథుర బృందావనయాత్రచేసి శ్రీ కృష్ణభక్తుడు అయినాడు. గోపీనాథుని వెంకయ్యశాస్త్రిచేత శ్రీకృష్ణజన్మఖండం కావ్యాన్ని తెనిగింపజేశాడు. ఈయన ఆస్తికుడే ఆయినా, మత గ్రంథాలు దైవదత్తమని నమ్మకపోవడం వంటి భావాలతో మనస్సాక్ష్యం అనే ఒక నూతన అలోచనా విధానాన్ని, భావాలను "మనసాక్ష్యం" గ్రంథంలో వివరంగా రాశాడు.
మనస్సాక్ష్యకూటం అనే సమాజాన్ని నెలకొల్పి వారం వారం అందులో తన మనస్సాక్ష్య తత్వాన్ని బోధించే యేర్పాట్లు చేసాడు. తన జీవితకాలంలో 14 గ్రంథాలు రాశాడు. సంగీతం మీద రాసిన "సభారంజని" తప్ప, మిగతావన్నీ అధ్యాత్మిక రచనలే. 1875లో బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను స్టార్ ఆఫ్ ఇండియా బిరుదుతో గౌరవించింది. తన జీవితకాలంలో 8 పర్యాయాలు కాశీరామేశ్వర యాత్రలు చేశాడు. విరివిగా దానధర్మాలు చేస్తూ, సత్రాలు కట్టించి అన్నదానం ఏర్పాటు చేశాడు. [1][2][3]
రచనలు
మార్చు- గీతార్థ సార సంగ్రహం
- సారాంశపంచకం
- హిందూమత విరొధభంజని
- నీతి సూత్రము, సహేతుక నీతిసూత్రములు
- మనస్సాక్ష్యము
- రత్నషట్కాంగుళీయకము
- సర్వమత సారసంగ్రహము
- నాస్తిక ధ్వాంత భాస్కరము
- నిర్గుణవాద నిరాకరణము
- సందిగ్ధ తత్వ రాద్ధాంతము
- నర్ హునర్
- సభారంజని
- మామూల్ నామా
కుమార యాచమ నాయుడికి సంగీతం, సాహిత్యం, నృత్యం, దేశాటన వంటి అనేక వ్యాపకాలు ఉండేవి. ఆయన 60వ ఏట మరణించాడు.[4]
మూలాలు
మార్చు- ↑ డాక్టర్ కాళిదాసు పురుషొత్తం, వెంకటగిరి సంస్థానం చరిత్ర, సాహిత్యం,ఎం.ఎస్.కొ ప్రచురణ,2018,
- ↑ అల్లాడి మహాదేవ శాస్త్రి, ఫ్యామిలీ హిస్టరీ అఫ్ వేంకటగిరి రాజాస్,అడీసన్ ప్రెస్స్, మద్రాసు,1922
- ↑ వెలుగోటివారి వంశచరిత్ర, వెల్లాల సదాశివశాస్త్రి, అవధానం, 1910.
- ↑ Biographical Sketches of The Rajas of Venkatagiri, Editor: T.Ramarao, Madras High Court Vakeel, 1875.