వెల్చల్ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం

వెలిచాల లక్ష్మీనరసింహస్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లా, మోమిన్‌పేట్‌ మండలం, వెల్చల్ గ్రామంలోని పులిలొంక అడవుల్లో ఉన్న దేవాలయం.[1] పరమయ్యదాసు అనే పశువుల కాపరి కొండను తొలిచి నిర్మించిన ఈ దేవాలయం, రెండో యాదగిరిగుట్టగా పేరు సంపాదించుకుంది.[2]

వెల్చల్ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం
వెల్చల్ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం
వెల్చల్ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం
వెల్చల్ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం is located in Telangana
వెల్చల్ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం
వెల్చల్ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం
తెలంగాణ రాష్ట్రంలో ఉనికి
భౌగోళికాంశాలు :17°23′21″N 77°50′12″E / 17.389138°N 77.836728°E / 17.389138; 77.836728
ప్రదేశం
దేశం:భారత దేశము
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:వికారాబాదు జిల్లా
ప్రదేశం:వెల్చల్, మోమిన్‌పేట్‌ మండలం
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:విష్ణువు

చరిత్ర

మార్చు

1960లలో పరమయ్యదాసు అనే పశువుల కాపరి తన పశువులను మేపేందుకు ప్రతిరోజూ దట్టమైన పులిలొంక అడవుల్లోని గుట్టకు వెళ్ళేవాడు. మేకలూ తనూ ఒంటరిగా వున్నా అప్పుడప్పుడు భయం కలిగేది. దానికి తోడు, ఎండా వానలకు తల దాచుకోటానికి ఒక ఆసరా కూడా లేకపోవటంతో ఆ కొండలను తొలిచి ఒక గుహ చేద్దామని గొడ్డలి చేత బట్టి రాత్రింబవళ్ళు శ్రమించాడు.[3]

నిర్మాణం

మార్చు

లక్ష్మీ నరసింహస్వామి ఒకరోజు తన కలలో కనపడి 'ఎలాగూ కొండలను తొలుస్తున్నావు, నాక్కూడా ఒక గుడి కట్టు' అని అన్నట్టు అనిపించిందట". మేకలూ మేత మేసే సమయంలోనే కాకుండా, వాటి మేత తరువాత వాటిని ఇంటిలో వదిలేసి తిరిగి తన పనిలో నిమగ్నమయ్యేవాడు. ఎంత శ్రమించినప్పటికీ ఎటువంటి కష్టం అనిపించేది కాదట. గుడి నిర్మాణం ఎంతో దీక్షతో కూడినటువంటి కార్యం, ఎవరి సాయం అర్తించకుండా, తానూ ఒక్కడే సుమారు ఆరు సంవత్సరాలు శ్రమించాడు, ఇంటిని వదిలి పూర్తిగా అడివికే అంకితమయ్యాడు. తన తండ్రి మరణించిన చలించక, పట్టు వదలక, ఆకలి, నిద్ర, పగలు, రాత్రి ఏమి తెలియకుండా గడిపాడు. ఒక సొరంగంలా తవ్వి, గుహను చెక్కటంతో ఆలయం మరో నాలుగేళ్లకు కాని స్థానికుల కంటపడలేదు. తర్వాత దానిలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈయన శిల్పి కాకపోయినా తన ఊహశక్తితో సింహ ద్వారాలు, స్తంభాలు, వాటిమీద బొమ్మలు వంటివి ఊహించుకొని చెక్కాడు.[4]

ఇతర వివరాలు

మార్చు
  1. కర్ణాటక, మెదక్‌, రంగారెడ్డి, హైదరాబాదు‌, మహబూబ్ నగర్ జిల్లాల నుండి అనేకమంది భక్తులు స్వామి దర్శనానికి వస్తుంటారు. ఐదు శుక్రవారాలు ఆలయ ప్రదక్షిణలు చేస్తే కష్టాలు, పీడలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతుంటారు.
  2. ఈ దేవాలయ ఆవరణలో బద్రీనాథ్‌ ఆలయం, అఖండ స్వరూపం, వీరహనుమాన్‌, మల్లికార్జునస్వామి, రేణుకా ఎల్లమ్మదేవి, వెంకటేశ్వరస్వామి దేవాలయాలు కూడా ఉన్నాయి.
  3. రాజకీయ నాయకులు ఈ దేవాలయాన్ని సందర్శించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు.

మూలాలు

మార్చు
  1. The Hans India, Telangana (21 January 2019). "Collector visits temple". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 6 August 2020. Retrieved 6 August 2020.
  2. నవతెలంగాణ, స్టోరి (23 April 2017). "ప్రకృతి ఒడిలో.. లక్ష్మీనర్సింహ స్వామి క్షేత్రం". NavaTelangana. Archived from the original on 3 August 2020. Retrieved 3 August 2020.
  3. నమస్తే తెలంగాణ, పర్యాటకం (17 June 2020). "గుట్టను తొలచి గుడులుగా మలచి." ntnews. Archived from the original on 2 August 2020. Retrieved 3 August 2020.
  4. Telangana Today, Telangana (19 July 2020). "The Telangana man who single-handedly chiselled a mountain into temple". S Sandeep Kumar. Archived from the original on 23 July 2020. Retrieved 5 August 2020.