వేణిసోంపూర్
వేణిసోంపూర్, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా, అయిజ మండలంలోని గ్రామం.[1]
వేణిసోంపూర్ | |
— రెవెన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 15°54′14″N 77°38′21″E / 15.903836°N 77.639220°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | జోగులాంబ |
మండలం | అయిజా |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 824 |
- పురుషుల సంఖ్య | 414 |
- స్త్రీల సంఖ్య | 410 |
- గృహాల సంఖ్య | 193 |
పిన్ కోడ్ | 509135 |
ఇది మండల కేంద్రమైన అయిజా నుండి 15 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గద్వాల నుండి 45 కి. మీ. దూరంలోనూ ఉంది.ఈ గ్రామం తుంగభద్ర నది ఒడ్డున ఉంది.
గణాంకాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 193 ఇళ్లతో, 824 జనాభాతో 662 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 414, ఆడవారి సంఖ్య 410. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 64 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 0. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 576298[2].పిన్ కోడ్: 509135.
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 713. ఇందులో పురుషుల సంఖ్య 366, స్త్రీల సంఖ్య 347. గృహాల సంఖ్య 132.
విద్యా సౌకర్యాలు
మార్చుగ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉంది.బాలబడి అయిజాలోను, మాధ్యమిక పాఠశాల చిన్న తాండ్రపాడులోనూ ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల అయిజాలోను, ఇంజనీరింగ్ కళాశాల గద్వాలలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల కర్నూలులోను, పాలీటెక్నిక్ గద్వాలలోను, మేనేజిమెంటు కళాశాల కొండేర్లోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గద్వాలలో ఉన్నాయి.
వైద్య సౌకర్యం
మార్చుప్రభుత్వ వైద్య సౌకర్యం
మార్చుప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పశు వైద్యశాల, సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
మార్చుగ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. డిగ్రీ లేని డాక్టరు ఒకరు ఉన్నారు.
తాగు నీరు
మార్చుగ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.
పారిశుధ్యం
మార్చుమురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
మార్చుపోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. మొబైల్ ఫోన్ ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. ట్రాక్టరు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
మార్చుగ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి.
ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
మార్చుగ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
విద్యుత్తు
మార్చుగ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
మార్చువేనిసంపూర్లో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 20 హెక్టార్లు
- వ్యవసాయం సాగని, బంజరు భూమి: 19 హెక్టార్లు
- శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 2 హెక్టార్లు
- తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 2 హెక్టార్లు
- సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 4 హెక్టార్లు
- బంజరు భూమి: 221 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 390 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 294 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 320 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
మార్చువేనిసంపూర్లో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- కాలువలు: 180 హెక్టార్లు* బావులు/బోరు బావులు: 23 హెక్టార్లు* చెరువులు: 52 హెక్టార్లు* ఇతర వనరుల ద్వారా: 65 హెక్టార్లు
ఉత్పత్తి
మార్చువేనిసంపూర్లో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
మార్చుదేవాలయాలు
మార్చువేణుగోపాలస్వామి ఆలయం
మార్చుఆలయ చరిత్ర:పూర్వం (17వ శతాబ్దం) గద్వాల ఇలాకాలో అయిజ గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఆ కుటుంబం గద్వాల సంస్థానం రాజావారికి ఆస్థాన కవులుగా ఉండేవారు. వేంకట నరసింహాచార్యులు కుమారులు వెంకట రామాచార్యులు (వీరే తర్వాతి కాలంలో వ్యాస తత్వజ్ఞ తీర్థులుగా పేరు పొందారు.) దురదృష్టవశాత్తు ఇతని తండ్రి సుమారు 20 సంవత్సరాల వయసులో అనగా 1726 - 28 మధ్యకాలంలో గతించారు. అప్పుడు ఇతను ఇల్లు వదిలి బీచుపల్లి పుణ్యక్షేత్రంలో నివాసం ఉంటూ 12 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేసాడు.ఒక రోజు రాత్రి హఠాత్తుగా బీచుపల్లి ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై నీ తపస్సు ఫలించింది. ఇక్కడి నుండి నేరుగా వేణిసోంపురం గ్రామం వెళ్లి అక్కడ తుంగభద్రా నదితీరాన ఒక కుటీరం నిర్మించుకుని శిష్యులకు వేద విద్య బోధించమని చెప్పి వాసుదేవ విఠల పేరుతో కొన్ని కృతులు రాయమని చెప్పి అంతర్థానమయ్యాడు.
స్వామి ఆజ్ఞ ప్రకారం వేణిసోంపురం గ్రామం చేరుకొని అక్కడ జీవనం సాగించే మొదలుపెట్టాడు.అయితే అక్కడ అంతకుముందే తుంగభద్ర నది తీరాన నిజాం నవాబు ధాన్యాగారాలు, సైన్యానికి విడిది శాలలు, భోజనశాలలు, బురుజులు కోటలు ఉండేవి. వాటిని చూసి ఒక రోజు వెంకట్రామాచార్యులు గద్వాల రాజా వారి దగ్గరికి వెళ్లి అక్కడ జరిగిన వృత్తాంతం వివరించాడు. అది విన్న రాజావారు నిజాంను ఒప్పించి ఆ ప్రాంతాన్ని బ్రాహ్మణ కుటుంబానికి అగ్రహారంగా మార్చాడు. ఆ విధంగా దాన్ని వేదనిలయంగా మార్చిశిష్యులకు వేదాలను నేర్పుతూ అప్పుడప్పుడు బయటికి వెళ్లి ప్రవచనాలు కూడా చెప్పుకునేవాడు. అలా వుండగా ఒక రోజు రాజోలి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వైకుంఠ నారాయణ స్వామి గుడిలో మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వారి తదనంతర పీఠాధిపతి భువనేంద్రతీర్థుల దగ్గర సన్యాసం పుచ్చుకున్నాడు. నాటినుండి ఇతని పేరు వ్యాసతత్వజ్ఞాన తీర్థులుగా మారింది..
వీరిది ద్వైత మత వ్యవస్థాపకుడైన మధ్వాచార్యుల సాంప్రదాయ కుటుంబం ఆ విధంగా వేణు సోంపురం గ్రామంలో జీవనం సాగిస్తుండగా ఒకరోజు కొంత మంది శిష్యులతో కలిసి ఆధ్యాత్మిక ప్రబోధం విషయమై అలంపురం తాలుకాలోని వల్లూరు గ్రామం చేరుకున్నాడు. ఆ రోజు రాత్రి అక్కడే బస చేయగా రాత్రి కలలో శ్రీ వేణుగోపాలస్వామి "ఈ గ్రామం కుంట తూము దగ్గర నా విగ్రహం ఉంది" అని చెప్పి, దానిని బయటకు తీసి వేణిసోంపురం గ్రామంలో ప్రతిష్ఠించమని చెప్పారట. మర్నాడు ఉదయం స్వామి గ్రామ ప్రజలకు జరిగిన విషయం చెప్పి కొంత మంది గ్రామస్థులతో కలసి వెళ్లి అక్కడ తవ్వి తీయగా స్వామి విగ్రహం దొరికిందట. అయితే అక్కడ విశేషమేమిటంటే స్వామివారి విగ్రహం కుడి కాలు పై ఎడమ కాలు వేసుకొని ఉన్న విగ్రహం కలలో కనిపించిందట. కానీ ఇక్కడ దొరికింది ఎడమ కాలుపై కుడి కాలు వేసుకునివున్న విగ్రహం కనుగొనుట జరిగింది. అయితే ఆ రోజు రాత్రి మళ్ళీ అదే ఊరిలోబస చేయగా స్వామి కలలో కనిపించిన విగ్రహం దొరుకుతుందని చెప్పారట. మరుసటి రోజు గ్రామ పెద్దలను తీసుకువెళ్లి తవ్వగా చెప్పిన ప్రకారం స్వామి విగ్రహం దొరికిందట.. అయితే ఇక్కడి సహజ రూపమైన వేణుగోపాలస్వామి విగ్రహం వల్లూరు గ్రామంలో చైత్ర బహుళ పంచమి రోజున దక్షిణాభిముఖంగా ప్రతిష్ఠించారు. ఇప్పటికీ వల్లూరు గ్రామంలో ఆ రోజున ప్రతి సంవత్సరం ఉత్సవాలు ఘనంగా జరుగుచున్నాయి.
ఇక్కడ విశేషమేమిటంటే శ్రీ వేణుగోపాల స్వామి ఉత్సవ విగ్రహాలను 2017 లో పక్కనే ఉన్న రామాపురం గ్రామ వ్యక్తులు దొంగిలించారు.ఆ దొంగలు పక్కనే ఉన్న ఆముదాల పాడు గ్రామం దగ్గరికి వెళ్ళేసరికి వారికి కళ్లు కనిపించకపోగా అక్కడ ఉన్న గొర్రెలమంద దగ్గర పడిపోయారు. ఉదయాన్నే గొర్రెల మంద వారు దొంగలను పట్టుకుని గ్రామస్తులకు సమాచారం చేరవేయగా గ్రామస్థులు విగ్రహాలను స్వాధీనం చేసుకొని వారిని పోలీసులకు అప్పగించారు. ఇదంతా స్వామివారి మహిమలని ఇప్పటికీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చెప్పుకుంటుంటారు.
ఇకపోతే కుడికాలితో ఎడమకాలు వేసుకుని విగ్రహాలను 1742 - 44 సంవత్సరాల మధ్య వైశాఖ శుద్ధ దశమి రోజున వేణిసోంపురం గ్రామంలో ఆలయం నిర్మించి ప్రతిష్ఠించారు. అక్కడే వ్యాసతత్వజ్ఞ తీర్థులుచే షోడశబహు నృసింహ మూర్తిని 16 చేతులతో 16 ఆయుధాలతో ప్రతిష్ఠించబడింది.ఇప్పటికీ వేణి సోంపురం గ్రామంలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి దర్శనార్థం రాయలసీమ, కర్ణాటక ప్రాంతాలనుంచి సాంప్రదాయ కుటుంబాలు వచ్చి పోవడం విశేషం[3]
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 244, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
- ↑ జోగులాంబ గద్వాల జిల్లా ద్వాదశ పుణ్యక్షేత్రాలు, సం.:అంబటి భానుప్రకాశ్,గద్వాల సాహితీ ప్రచురణలు,2019, పుట-58
వెలుపలి లింకులు
మార్చు- గద్వాలజిల్లా ద్వాదశ పుణ్యక్షేత్రాలు (పద్యసంకలనం)