వేణు ఊడుగుల (జ. జూలై 20) తెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత. నీదీ నాదీ ఒకే కథ చిత్రం ద్వారా తెలుగు సినిమారంగంలోకి దర్శకుడిగా ప్రవేశించాడు.[1]

వేణు ఊడుగుల
Venu Udugula.jpg
జననంవేణు ఊడుగుల
జూలై 20
ఉప్పరపల్లి, చెన్నారావుపేట మండలం, వరంగల్ గ్రామీణ జిల్లా,
వృత్తితెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత
జీవిత భాగస్వామిజరీనా

జననం - విద్యాభ్యాసంసవరించు

వేణు జూలై 20న వరంగల్ గ్రామీణ జిల్లా, చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో జన్మించాడు.[2] మూడో తరగతి వరకు ఉప్పరపల్లిలో చదువుకున్న వేణు, తర్వాత హన్మకొండ లోని బాలసముద్రంలో చదివాడు. డిగ్రీ చివరి సంవత్సరంలో హైదరాబాద్‌కు వచ్చాడు.

సినిమారంగ ప్రస్థానంసవరించు

చదువంటే పెద్దగా ఆసక్తి లేని వేణు బస్సు కండెక్టర్ అవ్వాలనుకున్నాడు. చిన్నప్పటినుండి సినిమాలపై ఆసక్తి ఉండడంతో, 2008లో సినిమారంగానికి వచ్చాడు. సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగినా ఎవరూ అవకాశాలు ఇవ్వకపోవడంతో కొంతకాలం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో పనిచేసి, ఆ తరువాత మదన్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశాడు.[3] వేటూరి సుందరరామ్మూర్తి దగ్గర సహాయకుడిగా పనిచేసాడు.

దర్శకత్వం చేసినవిసవరించు

  1. నీదీ నాదీ ఒకే కథ - (23.03.2018)[4]

రచన సహకారంసవరించు

  1. జై బోలో తెలంగాణా (మాటల రచయిత)

మూలాలుసవరించు

  1. నమస్తే తెలంగాణ, జందీగీ, యువ (21 March 2018). "నీదీ నాదీ ఒకే కథ..యువతరం వ్యథ". Retrieved 23 March 2018.
  2. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (2 June 2019). "మన తెలంగాణ ఘన తెలంగాణ". Archived from the original on 2 జూన్ 2019. Retrieved 15 June 2019.
  3. 123తెలుగు. "ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ: వేణు ఊడుగుల – సినిమాలో తల్లిదండ్రుల కోసం బలమైన సందేశం ఉంటుంది !". www.123telugu.com. Retrieved 23 March 2018.
  4. ఎన్.టివి తెలుగు (23 March 2018). "రివ్యూ: నీది నాది ఒకే కథ". Retrieved 23 March 2018.