వేదిక:ఆంధ్రప్రదేశ్/2009 బయోగ్రఫీ జాబితా

29వ వారం
తండ్రి, డేవిడ్ బ్రౌన్ పోలికలను బట్టి మైనంపాటి సుబ్రహ్మణ్యం చిత్రించిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఊహాచిత్రం

చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (Charles Phillip Brown) (నవంబర్ 10, 1798 - డిసెంబర్ 12, 1884) తెలుగు సాహిత్యమునకు విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు. తొలి తెలుగు శబ్దకోశమును ఈయనే ప్రచురించాడు. బ్రౌన్ డిక్షనరీని ఇప్పటికి తెలుగులో ప్రామాణికంగా ఉపయోగిస్తారు. తెలుగు జాతికి సేవ చేసిన నలుగురు ప్రముఖ బ్రిటిషు అధికారులలో బ్రౌన్ ఒకడు. ఆంధ్ర భాషోద్ధారకుడు అని గౌరవించబడిన మహానుభావుడు.

సి.పి.బ్రౌన్ 1798 నవంబర్ 10న కలకత్తాలో జన్మించాడు. ఈయన తండ్రి డేవిడ్ బ్రౌన్ పేరొందిన క్రైస్తవ విద్వాంసుడు. తండ్రి మరణించిన తరువాత బ్రౌను కుటుంబం ఇంగ్లండు వెళ్ళిపోయింది. బ్రౌను అక్కడే హిందుస్తానీ భాష నేర్చుకున్నాడు. తరువాత 1817 ఆగష్టు 4న మద్రాసులో ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా మద్రాసులో వెలగపూడి కోదండరామ పంతులు వద్ద తెలుగులో ప్రాథమిక జ్ఞానాన్ని సంపాదించాడు.

1820 ఆగష్టులో కడపలో డిప్యూటీ కలెక్టరుగా చేరాడు. ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల్లో పనిచేసినపుడు తెలుగులో మాట్లాడడం తప్పనిసరి అయ్యింది. అయితే తెలుగు నేర్చుకోడానికి సులభమైన, శాస్త్రీయమైన విధానం లేకపోవడం వలన, పండితులు తమ తమ స్వంత పద్ధతులలో బోధిస్తూ ఉండేవారు. తెలుగేతరులకు ఈ విధంగా తెలుగు నేర్చుకోవడం ఇబ్బందిగా ఉండేది. భాష నేర్చుకోవడంలోని ఈ ఇబ్బంది, బ్రౌనును తెలుగు భాషా పరిశోధనకై పురికొల్పింది. ప్రాచీన తెలుగు కావ్యాలను వెలికితీసి, ప్రజలందరికీ అర్ధమయ్యేలా పరిష్కరించి, ప్రచురించడం, భాషకు ఓ వ్యాకరణం, ఓ నిఘంటువు, ఏర్పడడానికి దారితీసింది. మచిలీపట్నం, గుంటూరు, చిత్తూరు, తిరునెల్వేలి మొదలైనచోట్ల పనిచేసి, 1826 లో మళ్ళీ కడపకు తిరిగి వచ్చి అక్కడే స్థిర నివాసమేర్పరచుకొన్నాడు. అక్కడ ఒక బంగళా కొని, సొంత డబ్బుతో పండితులను నియమించి, అందులో తన సాహితీ వ్యాసంగాన్ని కొనసాగించాడు.

కడపలోను, మచిలీపట్నంలోను కూడా పాఠశాలలు పెట్టి ఉచితంగా చదువు చెప్పించాడు. విద్యార్థులకు ఉచితంగా భోజనవసతి కూడా కల్పించాడు. దానధర్మాలు విరివిగా చేసేవాడు. వికలాంగులకు సాయం చేసేవాడు. నెలనెలా పండితులకిచ్చే జీతాలు, దానధర్మాలు, పుస్తక ప్రచురణ ఖర్చుల కారణంగా బ్రౌను ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. అప్పులు కూడా చేసాడు. 1834లో ఉద్యోగం నుండి తొలగించడంతో ఇంగ్లండు వెళ్ళిపోయి, తిరిగి 1837లో కంపెనీలో పర్షియను అనువాదకుడిగా ఇండియా వచ్చాడు.

....పూర్తివ్యాసం: పాతవి

30వ వారం

అచ్యుత దేవ రాయలు (అచ్యుతరాయలు) విజయనగర సామ్రాజ్య చక్రవర్తి. తుళువ నరస నాయకుని మూడవ భార్య అయిన ఓబాంబ కుమారుడు. శ్రీకృష్ణదేవరాయల సవతి సోదరుడు. శ్రీకృష్ణదేవరాయల మరణ శాసనాన్ని అనుసరించి చంద్రగిరి దుర్గములో గృహనిర్బంధములో ఉన్న అచ్యుతదేవరాయలు రాజయినాడు. ఇతడు 1529 నుండి 1542 వరకు పరిపాలించాడు.


శ్రీకృష్ణదేవరాయల మరణంతో విజయనగరములో అంతఃకలహాలు చెలరేగాయి. అచ్యుతరాయల్ని వారసునిగా ప్రకటించడం నచ్చని కృష్ణదేవరాయల అల్లుడు అళియ రామరాయలు ప్రతిఘటించి అధికారం కైవసం చేసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ విశ్వాసపాత్రులైన సాళువ నరసింగనాయకుడు వంటి సామంతులు ఆ ప్రయత్నాలు సాగనివ్వలేదు. ఇతడు తిరుమల, శ్రీకాళహస్తి, విజయనగరంలలో మూడుసార్లు పట్టాభిషేకము చేసుకున్నాడు. అచ్యుతరాయల పట్టాభిషేకాలను రాజనాథ డిండిమభట్టు వ్రాసిన అచ్యుతరాయాభ్యుదయములో వివరముగా వర్ణించాడు.


అచ్యుతరాయలు రాజ్యము చేపట్టేనాటికి వారసత్వ పోరు కారణంగా విజయనగర రాజధానిలోని కల్లోల పరిస్థితులను ఆసరాగా తీసుకొని సామ్రాజ్యంపై ప్రతాపరుద్ర గజపతి దండెత్తినాడు. అయితే రాయలు గజపతిని తిప్పికొట్టాడు. 1530లో గోల్కొండ సుల్తాను కులీ కుత్బుల్ ముల్క్ దండెత్తి కొండవీడును ముట్టడించగా వెలుగోటి గని తిమ్మనాయుడు అతన్ని ఓడించి సుల్తాను అశ్వదళానికి అపార నష్టం కలిగించి దండయాత్రను తిప్పికొట్టాడు. ఇతను అనేక యుద్దములందు విజయం సాధించాడు. శత్రు దండయాత్రల ప్రమాదాన్ని గుర్తించిన అచ్యుతరాయలు, రామరాయలుతో సంధి చేసుకున్నాడు.


ఇతని పరిపాలనా కాలములో హంపిలోని తిరువేంగళనాధుని ఆలయము నిర్మించినాడు. ఈ ఆలయం అక్కడ కొలువై ఉన్న దేవుని పేరుమీదుగా కంటే అచ్యుతరాయ ఆలయము అన్న పేరుతోనే ప్రసిద్ధి చెందింది. న్యూనిజ్ రచనలు అచ్యుతరాయలను వ్యసనలోలునిగా, కౄరునిగా చిత్రీకరించినా, ఈయన ప్రశంసనీయుడని, సామ్రాజ్యపు గౌరవాన్ని, సంపదను నిలబెట్టేందుకు పోరాడాడని చెప్పటానికి ఆ తరువాత కాలములో శాసన మరియు సాహిత్య ఆధారాలు లభించాయి. ఇప్పుడు కపిల తీర్ధముగా ప్రసిద్ధమైన తిరుపతి లోని ఆళ్వార్ తీర్ధాన్ని అచ్యుతరాయలు నిర్మింపజేశాడు. తిరుమలలో ఆలయానికి దక్షిణము వైపున అచ్యుతరాయలు మరియు ఆయన భార్య వరదాంబికల రాతి విగ్రహాలు చూడవచ్చు. కృష్ణదేవరాయల లాగానే అచ్యుతరాయలు కూడా సాహిత్య పోషకుడు. ప్రతి సంవత్సరం ఒక గ్రంథం రాయించి తిరుపతి వెంకటేశ్వరునికి సమర్పించేవాడు. అచ్యుతరాయలు స్వయంగా తాళమహోదధి అనే గ్రంథం సంస్కృతంలో రాశాడు. ఈయన ఆస్థానములో కన్నడ కవి చాటు విఠలనాధుడు, ప్రముఖ సంగీతకారుడు పురందరదాసు మరియు సంస్కృత విద్వాంసుడు రెండవ రాజనాథ డిండిమభట్టు ఉండేవారు. కృష్ణరాయల సభ భువనవిజయములాగే, అచ్యుతరాయల సభను వెంకట విలాస మండపము అని పిలిచేవారు. .....పూర్తివ్యాసం: పాతవి

31వ వారం
వేదిక:ఆంధ్ర ప్రదేశ్/2009 13వ వారం బయోగ్రఫీ
32వ వారం
వేదిక:ఆంధ్ర ప్రదేశ్/2009 14వ వారం బయోగ్రఫీ
33వ వారం
వేదిక:ఆంధ్ర ప్రదేశ్/2009 15వ వారం బయోగ్రఫీ
34వ వారం
వేదిక:ఆంధ్ర ప్రదేశ్/2009 16వ వారం బయోగ్రఫీ
35వ వారం
వేదిక:ఆంధ్ర ప్రదేశ్/2009 17వ వారం బయోగ్రఫీ
36వ వారం
వేదిక:ఆంధ్ర ప్రదేశ్/2009 18వ వారం బయోగ్రఫీ
37వ వారం
వేదిక:ఆంధ్ర ప్రదేశ్/2009 19వ వారం బయోగ్రఫీ
38వ వారం
వేదిక:ఆంధ్ర ప్రదేశ్/2009 20వ వారం బయోగ్రఫీ
39వ వారం
వేదిక:ఆంధ్ర ప్రదేశ్/2009 21వ వారం బయోగ్రఫీ
40వ వారం
వేదిక:ఆంధ్ర ప్రదేశ్/2009 22వ వారం బయోగ్రఫీ
41వ వారం
వేదిక:ఆంధ్ర ప్రదేశ్/2009 23వ వారం బయోగ్రఫీ
42వ వారం
వేదిక:ఆంధ్ర ప్రదేశ్/2009 24వ వారం బయోగ్రఫీ
43వ వారం
వేదిక:ఆంధ్ర ప్రదేశ్/2009 25వ వారం బయోగ్రఫీ
44వ వారం
వేదిక:ఆంధ్ర ప్రదేశ్/2009 26వ వారం బయోగ్రఫీ
45వ వారం
వేదిక:ఆంధ్ర ప్రదేశ్/2009 27వ వారం బయోగ్రఫీ
46వ వారం
వేదిక:ఆంధ్ర ప్రదేశ్/2009 28వ వారం బయోగ్రఫీ
47వ వారం
వేదిక:ఆంధ్ర ప్రదేశ్/2009 29వ వారం బయోగ్రఫీ
48వ వారం
వేదిక:ఆంధ్ర ప్రదేశ్/2009 30వ వారం బయోగ్రఫీ
49వ వారం
వేదిక:ఆంధ్ర ప్రదేశ్/2009 31వ వారం బయోగ్రఫీ
50వ వారం
వేదిక:ఆంధ్ర ప్రదేశ్/2009 32వ వారం బయోగ్రఫీ
51వ వారం
వేదిక:ఆంధ్ర ప్రదేశ్/2009 33వ వారం బయోగ్రఫీ
52వ వారం
వేదిక:ఆంధ్ర ప్రదేశ్/2009 34వ వారం బయోగ్రఫీ
53వ వారం
వేదిక:ఆంధ్ర ప్రదేశ్/2009 35వ వారం బయోగ్రఫీ
54వ వారం
వేదిక:ఆంధ్ర ప్రదేశ్/2009 36వ వారం బయోగ్రఫీ