కాలరేఖ |
---|
|
1822 | ఫ్రెంచి ఆవిష్కర్త నిసేఫోర్ నీప్సె మొట్టమొదటి శాశ్వత చిత్రాన్ని ముద్రించిననూ, డూప్లికేట్ చేసే ప్రక్రియలో అది చెడిపోయినది |
---|
1826 | నిసేఫోర్ నీప్సె తన కెమెరా అబ్స్క్యూరా తో మొట్టమొదటి శాశ్వత ఫోటోగ్రాఫ్ వ్యూ ఫ్రం ద విండో ఎట్ లే గ్రాస్ (View from the Window at Le Gras) ని సృష్టించటంలో సఫలీకృతులు |
---|
1832 | బ్రెజిల్ కు చెందిన హెర్క్యులెస్ ఫ్లారెన్స్ ఇంచుమించు డాగ్యురోటైప్ పద్ధతిని అవలంబించి దానిని ఫోటోగ్రఫీ అని వ్యవహరించాడు. |
---|
1834 | బ్రెజిల్ లోని కెంపినాస్ లో హెర్క్యూల్స్ ఫ్లారెన్స్ అనే ఒక ఫ్రెంచి చిత్రకారుడు, ఆవిష్కర్త ఒకానొక పద్ధతిని వివరించేందుకు తన డైరీలో "photographie" అనే పదాన్ని రాసుకొన్నాడు. |
---|
1835 | ఇప్పటివరకూ తెలిసిన అతి పురాతమైన నెగటివ్ గా గుర్తించబడిన ల్యాకోక్ అబ్బే లోని ఓరియల్ కిటికీ యొక్క ఛాయాచిత్రం తీయబడినది. |
---|
1837 | నిసేఫోర్ నీప్సె తో కలసి సిల్వర్ కాంపౌండ్ ల పై ప్రారంభించిన ప్రయోగాలని నీప్సే మరణించిన తర్వాత కూడా కొనసాగించిన లూయీస్ డాగ్యురె డాగ్యురోటైప్ ని కనుగొన్నాడు. |
---|
1838 | పాలిష్ చేయించుకోవటానికి ఒక వ్యక్తి కొన్ని నిముషాల బాటు ఆగి ఉండగా, లూయిస్ డాగ్యురె అతనిని చిత్రీకరించాడు |
---|
1839 | మార్చి 14: లండన్ రాయల్ సొసైటీ లో సర్ జాన్ హర్షల్ ఈ ఫోటోగ్రఫీ అనే పదాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఫిబ్రవరి 25: Vossische Zeitung అనే జర్మను వార్తాపత్రికలో జొహాన్ వాన్ మేడ్లర్ అనే బెర్లిన్ ఖగోళ శాస్త్రవేత్త ఈ పదాన్ని వాడాడు. జాన్ హర్షల్ సోడియం థయోసల్ఫేట్ ఫోటోలని స్థిరీకరించి మన్నగలిగేలా చేస్తుందని టాల్బట్, డాగురె లకి సమాచారమందించాడు. మొదటి గ్లాస్ నెగటివ్ ని తయారు చేశాడు. |
---|
1840 | ఇంగ్లీషు ఆవిష్కర్త విలియం హెన్రీ ఫాక్స్ టాల్బట్ సిల్వర్ ప్రక్రియ చిత్రాన్ని శాశ్వతీకరించటానికి డాగ్యురె ప్రక్రియని ఆధారం చేసుకొని దానినే మరింత అభివృద్ధి చేసి నెగిటివ్ లని రూపొందించే క్యాలోటైప్ ప్రక్రియని కనుగొన్నాడు. |
---|
|
---|
|
1855 | స్కాటిష్ భౌతిక శాస్త్రవేత్త జేంస్ క్లర్క్ మ్యాక్స్వెల్ మూడు రంగుల వేర్పాటు సిద్ధాంతం (త్రీ-కలర్-సెపరేషన్ ప్రిన్సిపల్) ని కనుగొన్నాడు |
---|
1860 | లూయీస్ డుకోస్ డు హారోన్ అనే ఫ్రెంచి ఫోటోగ్రఫర్ సబ్ట్రాక్టివ్ మెథడ్ ఆఫ్ కలర్ రీప్రొడక్షన్ (వ్యవకలన పద్ధతి)ని కనుగొన్నాడు |
---|
1861 | మొట్టమొదటి శాశ్వత కలర్ ఫోటోని తీశారు. |
---|
1873 | జర్మను ఫోటోకెమిస్ట్ హెర్మన్ వోగెల్ ఆకుపచ్చ, పసుపుపచ్చ, ఎరుపు రంగులని గుర్తించగలిగే డై సెన్సిటైజేషన్ అనే ప్రక్రియను కనుగొన్నాడు. ఇదే కలర్ ఫోటోగ్రఫీ ని వాణిజ్య రంగం వైపుకి మరల్చింది. |
---|
1888 | జార్జ్ ఈస్ట్మన్, హెన్రీ ఏ స్ట్రాంగ్ లు కలిసి కొడాక్ సంస్థను స్థాపించారు |
---|
|
---|
|
1907 | లూమియర్ సోదరులచే ఆటోక్రోం అనే కలర్ ఫోటోగ్రఫీ ప్రక్రియ కనుగొన్నారు |
---|
1908 | గాబ్రియల్ లిప్మన్ వ్యతీకరణ పద్ధతి ద్వారా ఫోటోలలో రంగులను పునరుత్పత్తి చేయగల లిప్మన్ ప్లేట్ ను కనుగొన్నాడు |
---|
1917 | 25 జూలై : నికాన్ మాతృ సంస్థ అయిన జపాన్ ఆప్టికల్ ఇండస్ట్రీస్ కో., లి. మిత్సుబిషి చే స్థాపన |
---|
1932 | నికాన్ యొక్క Nikkor బ్రాండు పరిచయం |
---|
1935 | మొట్టమొదటి కలర్ ఫిలిం (ఇంటెగ్రల్ ట్రైప్యాక్ లేదా మోనోప్యాక్) ని కోడాక్ కోడాక్రోం పేరు తో పరిచయం చేసింది. |
---|
1936 | అగ్ఫా యొక్క కలర్ ఫిలిం అగ్ఫా కలర్ న్యూ రూపొందించబడినది. |
---|
1937 | కెనాన్ మాతృ సంస్థ అయిన ప్రెసిషన్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ ల్యాబొరెటరీ స్థాపన. |
---|
1940 | కెనాన్ మొదటి ఎక్స్-రే కెమెరాని రూపొందించినది. |
---|
1948 | మొట్టమొదటి నికాన్ కెమెరా నికాన్ ఐ విడుదల. |
---|
|
---|
|
1957 | నికాన్ తన రేంజ్ ఫైండర్ కెమెరా అయిన నికాన్ ఎస్ పి ని విడుదల చేసినది. |
---|
1958 | టెలివిజన్ ప్రసారలకై కెనాన్ జూం కటకాన్ని కనుగొన్నది |
---|
1959 | కెనాన్ మొట్టమొదటి చలనచిత్ర కెమెరా అయిన రిఫ్లెక్స్ జూం 8 ని విడుదల చేసినది కెనాన్ 35 ఎం ఎం ఫిలిం సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరా అయిన కెనాన్ ఫ్లెక్స్ ని విడుదల చేసినది నికాన్ తన మొట్టమొదటి సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరా అయిన నికాన్ ఎఫ్ ని విడులద చేసినది. |
---|
1961 | కెనాన్ 7 అనబడు రేంజ్ ఫైండర్ కెమెరా విడుదలైనది |
---|
1963 | పోలరాయిడ్ ఇన్స్టంట్ కలర్ ఫిలిం ను కనుగొన్నది. |
---|
1965 | కెనాన్ పెలిక్స్ అనబడు సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరా విడుదల |
---|
1971 | కెనాన్ ఎఫ్-1 అనబడు ఎస్ ఎల్ ఆర్ కెమెరాని విడుదల చేసినది నికాన్ ఎఫ్ 2 విడుదల |
---|
1976 | మైక్రోకంప్యూటర్ తో అనుసంధానించబడిన ప్రపంచం లోనే మొట్టమొదటి కెమెరా ఏఈ-1 ని కెనాన్ రూపొందించినది. |
---|
|
---|
|
1980 | నికాన్ ఎఫ్ 3 విడుదల. |
---|
1981 | మొట్టమొదటి ఛార్జ్ కపుల్డ్ డివైస్ ని సోనీ మావికా అనే కెమెరాలో వినియోగం. దీనితో ఫిలిం కి తెర పడింది. |
---|
1987 | ఎలెక్ట్రో ఆప్టికల్ సిస్టం (ఈ ఓ ఎస్) శ్రేణిలో మొట్టమొదటిదైన కెనాన్ ఈ ఓ ఎస్ 650 విడుదల |
---|
1991 | DCS 100 పేరుతో కొడక్ వాణిజ్యపరంగా మొట్టమొదటి డి ఎస్ ఎల్ ఆర్ కెమెరాని అందుబాటులోకి తెచ్చింది. |
---|
1992 | ఈఓఎస్ 5, పవర్ షాట్ 600 (ఇది కెనాన్ యొక్క మొదటి డిజిటల్ కెమెరా) లని కెనాన్ విడుదల చేసినది. |
---|
1995 | ఈ ఎఫ్ 75-300 ఎం ఎం పేరు తో కెనాన్ కెమెరా కటకం విడుదల చేసినది. |
---|
సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరా నికాన్ డి1 విడుదల |
|
---|
|
2005 | నికాన్ డి3, నికాన్ డి700 విడుదల |
---|
2008 | మిడ్-రేంజ్ ఎస్ ఎల్ ఆర్ తో బాటు వీడియో రికార్డింగ్ కల నికాన్ డి90 విడుదల |
---|
2016 | ఫూజీఫిలిం ఉత్పత్తి అయిన ఇన్స్టాక్స్ మిని అనే ఇన్స్టంట్ ఫిల్మ్ శ్రేణిలో మోనోక్రోం ను విడుదల చేసినది |
---|
|
---|
|