వేద రజిని
వేద రజిని, తెలంగాణకు చెందిన నృత్యకారిణి. మలిదశ తెలంగాణ ఉద్యమంలో అనేక వేదికల మీద గజ్జెకట్టి నాట్యం చేసింది.[2] 2023 జూలై 7న తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా నియమించబడింది.[3]
వేద రజిని | |||
పదవీ కాలం 2023 జూలై 7 – 07 డిసెంబర్ 2023[1] | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | 1986, మార్చి 4 జడ్చర్ల, మహబూబ్‌నగర్ జిల్లా, తెలంగాణ | ||
వృత్తి | నృత్యకారిణి | ||
జీవిత భాగస్వామి | సాయిచంద్ | ||
పిల్లలు | చరీష్ (కుమారుడు), నది (కుమార్తె) |
జననం, విద్య
మార్చురజిని 1986, మార్చి 4న తెలంగాణ రాష్ట్రం, మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల పట్టణంలో జన్మించింది. జడ్చర్లలోని నాగార్జునా హైస్కూల్ లో పాఠశాల విద్యను, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను పూర్తిచేసింది.
వివాహం
మార్చురజినికి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్యమ గాయకుడు సాయిచంద్ తో పరిచయమయింది. ఉద్యమ సమయంలో ఇద్దరూ కలిసి అనేక వేదికల మీద ఆటపాటలతో ప్రజలను ఉత్తేజపరిచారు. ఆ పరిచయం ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో 2012లో వివాహం చేసుకున్నారు. వారికి కుమారుడు చరీష్ (చెర్రీస్), కుమార్తె నది ఉన్నారు. సాయిచంద్ 2023, జూన్ 29న గుండెపోటుతో మరణించాడు.[4]
చైర్‌పర్సన్‌గా
మార్చుగిడ్డంగుల శాఖ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఉన్న సాయిచంద్ మరణించడంతో సాయిచంద్ భార్య రజినికే ఆ బాధ్యతలను అప్పజెప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించగా, రజినిని చైర్‌పర్సన్‌గా నియమిస్తూ 2023 జులై 7న తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో ఆర్టీ నెంబరు 983) జారీ చేసింది. ఆమె జులై 20న తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించింది.[5]
తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల ఒక నెల వేతనం నుంచి సాయిచంద్ కుటుంబానికి రూ. కోటిన్నర ఆర్థికసాయాన్ని అందజేయనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించాడు.[6][7]
మూలాలు
మార్చు- ↑ V6 Velugu (11 December 2023). "54 కార్పొరేషన్ల చైర్మన్లు ఔట్". Archived from the original on 19 February 2024. Retrieved 19 February 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Rajini: సాయిచంద్ భార్యకు పదవి.. కోటిన్నర ఆర్థిక సాయం ప్రకటించిన కేటీఆర్". Samayam Telugu. 2023-07-07. Archived from the original on 2023-07-07. Retrieved 2023-07-07.
- ↑ "Telangana government has given a key post to Saichand's wife". Vaartha. 2023-07-07. Archived from the original on 2023-07-07. Retrieved 2023-07-07.
- ↑ Eenadu (30 June 2023). "తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయిచంద్ హఠాన్మరణం". Archived from the original on 30 June 2023. Retrieved 30 June 2023.
- ↑ Andhra Jyothy (21 July 2023). "గిడ్డంగుల సంస్థ చైర్‌పర్సన్‌గా రజినీ సాయిచంద్ బాధ్యతల స్వీకరణ". Retrieved 21 July 2023.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ Namasthe Telangana (7 July 2023). "సాయిచంద్ సతీమణి వేద రజనీకి గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ నియామక పత్రం అందజేత". Archived from the original on 7 July 2023. Retrieved 7 July 2023.
- ↑ T News Telugu (20 July 2023). "రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా రజిని సాయి చంద్ ప్రమాణం". Archived from the original on 20 July 2023. Retrieved 20 July 2023.