వేరుశనగ

పప్పు ధాన్యం
(వేరు శెనగ నుండి దారిమార్పు చెందింది)

వేరుశనగ, బలమైన ఆహారం. ఇవి నూనె గింజలు. ఈ గింజలలో నూనె శాతం ఎక్కువ. వంట నూనె ప్రధానంగా వీటి నుండే తీస్తారు. భారత్ యావత్తూ పండే ఈ పంట, ఆంధ్రలో ప్రధాన మెట్ట పంట. నీరు తక్కువగా దొరికే రాయలసీమ ప్రాంతంలో ఇది ప్రధాన పంట.

వేరుశనగ
Peanut (Arachis hypogea)
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Subfamily:
Tribe:
Genus:
Species:
అ. హైపోజియా
Binomial name
అరాచిస్ హైపోజియా

వేరుశెనగ జన్మస్దలం దక్షిణ అమెరికా. వేరుశెనగ ఉష్ణ మండల నేలలో బాగా పెరుగుతుంది. గుల్లగా వుండు వ్యవసాయ భూములు అనుకూలం. ఇండియా, ఛైనా, దక్షిణ ఆసియా, ఆగ్నేయ ఆసియా ఖండ దేశాలలో వేరుశెనగ నూనె వాడకం ఎక్కువ. వేరుశనగ 'లెగుమినస్' జాతికి చెందిన మొక్క. శాస్త్రీయ నామం "అరాచిస్ హైపోగేయా లెగ్యూమ్". ఇది అన్ని రకాల వాతావరణ పరిస్దితులను తట్టుకోగలదు. వేరుశనగ పుష్పాలు బయట ఫలధీకరణ చెందిన తరువాత. మొక్క మొదలు చుట్టు భూమిలోనికి చొచ్చుకు వెళ్ళి కాయలుగా మారతాయి.

ప్రాథమిక లక్షణాలు

మార్చు
  • ఏక వార్షిక గుల్మం
  • విపరీత అండాకారంలో ఉన్న 4 పత్రకాలు గల పిచ్ఛాకార సంయుక్త పత్రం.
  • గ్రీవస్థంగా సమూహాలుగా ఏర్పడిన పసుపు రంగు పుష్పాలు.
  • 1-4 విత్తనాలు గల దీర్ఘవృత్తాకార ద్వివిధారక ఫలాలు.

వేరుశెనగ పంట

మార్చు
 
వేరుశనగ పొలం

వేరుశనగ విత్తన మొలక సమయంలో 14-16 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం. తొలకరి వర్షాలు అయ్యాక విత్తడం ఆంధ్రలో పరిపాటి. ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమలో వేరుశనగ సాగు అధికం.పంట కాయకొచ్చు సమయంలో ఉష్ణోగ్రత 23-25 సెంటిగ్రేడ్ డిగ్రీలు వున్నచో పంట దిగుబడి పెరుగును. పంటకాలంలో వర్షపాతం 12.5-17.5 సెం.మీ.వున్నచో మంచిది. పంటను విత్తు సమయం లో 12.5-17.5 సెం.మీ., పంట పెరుగు నప్పుడు 37-60 సెం>మీ. వర్షపాతం వున్నచో మంచిది. వేరుశనగను అన్ని సీజనులలో సాగు చెయ్యవచ్చును.కాని వర్షకాలంలోని ఖరిప్‌ సీజనులో 80% సాగుచెయ్యడం జరుగుచున్నది. అందులో 90% పంటను కేవలం వర్షం మీదనే ఆధార పడి సాగుచెయ్యడం జరుగుతుంది. దక్షిణ భారతదేశంలో ఖరీప్‌,, రబీ రెండు సీజనులలో వేరుశనగ పంటను సాగు చేస్తారు. నీటి సదుపాయం గల ప్రాంతాలలో వేసవి కాలంలో జనవరి-మార్చి మధ్య తక్కువ సమయంలో పంటకోతకు వచ్చే రకాలను సాగుచేస్తారు. వేరుశనగలో నూనె, ప్రోటీనులు, కార్బోహైడ్రెట్‌లు,, విటమిన్లు అధిక ప్రమాణంలో ఉంటాయి. అందుచే వేరుశనగ బలవర్దకమైన ఆహారం. వేరుశనగ గింజలో (Kernel) 43-50% వరకు నూనె, 25-30% వరకు ప్రోటిన్లు వుంటాయి. వేరుశనగ విత్తనాల నుండి నూనె తీసిన తరువాత ఆయిల్‌ కేకులో (నూనె తీసిన వేరుశనగ విత్తనాల పిండి) ప్రోటీన్‌ శాతం పెరుగుతుంది. వేరుశనగ పంటకాలం, విత్తనాల రకాలనుబట్టి 90-150 రోజులు ఉంటుంది. గుత్తిరకం (Bunch type) పంటకాలం 90-120 రోజులు. వ్యాప్తి (spreading Type) విత్తన రకం పంటకాలం 130-150 రోజులు వుంటుంది. పై రెండు రకాలను ఎక్కువగా వర్షకాలం (ఖరీప్‌) లోనే సాగు చేస్తారు. చీడ, పీడలను తట్టుకునే శక్తి గల సంకరజాతి (Hybride) వంగడాలను సాగు చెయ్యడం వలన 20% ఎక్కువ దిగుబడి సాధించవచ్చు.. మాములు రకం ఎకరానికి 500-600 కేజిలు దిగుబడి యివ్వగా, హైబ్రిడ్‌ రకం 900-1200 కేజీలు దిగుబడి వస్తుంది. వేరుసనగ కాయ (pod) లో పొట్టు (shell) 25-30%, గింజ (Kernel) 70-75% ఉంటుంది.భారతదేశం లోనే పేరుపొందిన కదిరి-3,5,7,9,71 మొదలగు వేరుశనగ వంగడాలు అనంతపురం జిల్లా కదిరి వ్యవసాయపరిశోధన కేంద్రం వారి సృష్టి.

హైబ్రిడ్ వేరుశెనగ రకాలు

మార్చు

కొన్నిరకాల హైబ్రిడ్‌ రకాలు

 
వేరు శనగ కాయలు.

1. ICGS 11:యిది ఎక్కువ దిగుబడి యిచ్చు రకం. చీడపీడలను వర్షాభావ పరిస్దితులను బాగా తట్టుకునే రకము.ఎక్కువగా ఖరిప్‌లో సాగుచెయ్యుదురు.పంటకాలం 120 రోజులు. మహరాష్ట్రలో 1.5 టన్నులు, హెక్టారుకు దిగుబడి వచ్చింది.ఆంధ్ర, కర్నాటకలో ట్రయల్‌రన్‌లో 2.5 టన్నుల దిగుబడి వచ్చింది.కాయలో 70% గింజ వుంటుంది.

2. ICGS 44:యిది కూడా ఎక్కువ దిగుబడి యిచ్చు రకం.పంటకాలం 120 రోజులు.వేసవి కాలంలో ఈ పంటను సాగు చెయ్య వచ్చును.వర్షాభావ పరిస్దితులను తట్తుకొగలదు.సరిగా సాగు చెసిన 3-4 టన్నులు, హెక్టారుకు దిగుబడి యిచ్చును.కాయలో గింజ 70%, పొట్టు 30% వుంటుంది.

3.ICGV 86590:యిది బంచ్‌ రకానికు చెందింది. పంటకాలం 96-123 రోజులు. చేడ, పీడలను తట్టుకోగలదు.దిగుబడి హెక్టారుకు 3 టన్నుల వరకు ఉంది. ఈ రకం ఎక్కువగా ఆంధ్ర, కర్నాటక, కేరళ,, తమిళనాడు లలో సాగు చేస్తారు

4.ICGV 91114 :యిదికూడా బంచ్‌ రకానికు చెందిన వంగడం.పంటకాలం 100 రోజులు.తీవ్రమైన వర్షాభావ పరిస్దితులను తట్టుకోగల వంగడం.పంట దిగుబడి 2.5-3 టన్నులు/హెక్టారుకు.గింజ పెద్దదిగా వుంటుంది.

5.ICGV 89104:బంచ్‌రకానికు చెందింది.పంటకాలం 110-120 రోజులు. అప్లొటాక్షిన్, అస్పరిగిల్లస్‌, ఫంగస్‌ వంటి వ్యాధులను నిలువరించ గలదు.దిగుబడి 2.0 టన్నులు/హెక్టరుకు. కాయలో 68% గింజ ఉంటుంది.

6. Kadiri-6 :కదిరి 6 వేరుశనగ రకం విత్తనాలు కరువును బాగా అధిగమించగలవు.

ఉపయోగాలు

మార్చు
  • వేరుశనగ విత్తనాల నుంచి లభించే వేరుశెనగ నూనె వంటకాలలో ఉపయోగిస్తారు. దీని నుంచి డాల్డా లేదా వనస్పతిని తయారుచేస్తారు. ఈ నూనెలను సబ్బులు, సౌందర్యపోషకాలు, కందెనలుగా వాడతారు.
  • వేరుశనగ విత్తనాలు బలమైన ఆహారం. వీటిల్లో ప్రోటీన్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి.
  • నూనె తీయగా మిగిలిని పిండిని ఎరువుగా, పశువులకు, కోళ్ళకు దాణాగా వాడతారు.

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=వేరుశనగ&oldid=4069140" నుండి వెలికితీశారు