వైద్యం వేంకటేశ్వరాచార్యులు

వైద్యం వేంకటేశ్వరాచార్యులు ఎంతో ఖ్యాతి కీర్తి ప్రతిష్టలు పొందిన కవి, రచయిత, పరిశోధకులు

Vaidyam Venkateswara Charyulu
వైద్యం వేంకటేశ్వరాచార్యులు
జననం1951, ఏప్రిల్ 01
కర్నూలు జిల్లా కర్నూలు మండలం రేమట గ్రామం
ప్రసిద్ధికవి, రచయిత, పరిశోధకులు
మతంహిందూ
తండ్రివి.పురుషోత్తం
తల్లికృష్ణమ్మ

జీవిత విశేషాలు

మార్చు

వైద్యం వేంకటేశ్వరాచార్యులు కర్నూలు మండలం రేమట గ్రామానికి చెందిన కృష్ణమ్మ, వి.పురుషోత్తం దంపతులకు కర్నూలులో01.04.1951 ఏప్రెల్‌ ఒకటిన జన్మించిన వైద్యం వేంకటేశ్వరాచార్యులు కర్నూలులోనే పెరిగారు. పాఠశాల విద్యను ఎసిపిపి ఉన్నతపాఠశాల ఉలిందకొండలో చదివారు. కళాశాల విద్యను మహబూబ్ నగర్ జిల్లాలోని మహారాణి ఆదిలక్ష్మమ్మ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల గద్వాలలో చదివారు. స్నాతకోత్తరవిద్యను దూరవిద్యలో ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నంలో చదివారు. 1975 నుండి 1999 వరకు సిల్వర్ జూబిలీ డిగ్రీ కళాశాల, కర్నూలు, 1999 నుండి 2004 వరకు ప్రభుత్వ డిగ్రీకళాశాల నంద్యాలలో, 2004 నుండి 2009 వరకు ప్రభుత్వ డిగ్రీకళాశాల బనగానపల్లెలో ఆచార్యులుగా పనిచేశారు. సుప్రసిద్ద కవులు కపిలవాయి లింగమూర్తి, ఆచార్య బిరుదురాజు రామరాజు, గడియారం రామకృష్ణ శర్మ, డా.శ్రీరంగాచార్య, సాహిత్య సాంగత్యంలో సాహిత్యంపై మమకారమేర్పడి రచనకు శ్రీకారం చుట్టారు.[1]

సాహిత్య కృషి

మార్చు

1969లో వేంకటరమణ నక్షత్రమాల పేరుతో కందపద్యాలను రాసి కలానికి పదును పెట్టారు. 10 ఆధ్యాత్మిక రచనలు చేసి 2003లో సాహితీవేత్తలు తెలుగు భాషాభిమానులచే ప్రశంసించబడిన తెలుగుభాష అనే గ్రంథాన్ని ఆటవెలదిలో తీసుకొచ్చారు. తెలుగు ఆవశ్యకతను నొక్కి చెప్పే రచన. 2004లోవ్యాసజయంతిలో కర్నూలు జిల్లాకు సంబధించిన సాహిత్య, సాంస్కృతిక, చారిత్రిక అంశాలను పరిశోధనాత్మకంగా 20 వ్యాసాలు రాశారు. 2005లోనూ వ్యాస సంపుటి వ్యాసవైజయంతిక తీసుకొచ్చారు. 2005లో ఉన్నమాట పేరుతో136 ఆటవెలదుల సూక్తులతో శతకం రాశారు. 2011లో కర్నూలు జిల్లా కవితరంగిణి పేరుతో జిల్లా కవుల చరిత్రను పరిశోధనాత్మకంగా రాశారు. ఇందులో ప్రాచీన కవులు మొదలు ఆధునికతరం కవుల వరకు వివరాలున్నాయి. ఎంతో ప్రామాణిక గ్రంధంగా జిల్లావాసులకు సమాచారాన్ని అందిస్తుంది. ఈ తరం కవులను, రచయితలను పరిశోధించి వారి వివరాలూ రాశారు. సామాజిక, సాహిత్య చరిత్రలో కర్నూలు స్థానం ఏమిటో ఈ గ్రంధం చదివితే అర్థం అవుతుంది. వెయ్యేండ్లలో కర్నూలులోని కవులు, పండితులు, రచయితలను పరిచయం చేసిన అద్భుత పరిశోధన. అంతే కాకుండా 12 పరిష్కృత రచనలు చేశారు. 5 పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. ప్రసిద్ధ రచయిత పరవస్తుచిన్నయసూరి రచించిన ఆంధ్రనిఘంటువు లిఖిత ప్రతులు ఏడుసంపుటాలు అదృశ్యం అయితే అందులోని పదాలను సేకరించి పరిశోధించి అకారాది ఆంధ్రనిఘంటువు పేరుతో రచన చేసి చరిత్ర సృష్టించారు. దేశంలోని అనేక విశ్వవిద్యాలయాల్లో జరిగే జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పరిశోధనా పత్రాలు సమర్పించారు. 22 గ్రంథాలకు విపులమైన పీఠికలు, 56 గ్రంధాలకు ముందుమాటలు, ఐదు గ్రంధాలకు సమీక్షలు రాశారు.[1] తెలుగుభాషలోని అన్ని దిన, వార, పక్ష, మాస, త్రైసిక పత్రికల్లో ఇప్పటివరకు 200 పైచిలుకు వైద్యం రచనలు ప్రచురితమయ్యాయి. కొన్ని పత్రికలు ఆయన రచనల్ని నిరంతరం కొనసాగిస్తూ శీర్షికలు నిర్వహించారు. జాతీయ స్థాయిలో వచ్చే ప్రత్యేకసంచికల్లోనూ ఆయన రచనలు ప్రచురితం అయ్యాయి. జాతీయస్థాయి కవిసమ్మేళనాల్లో తన కవితా గళం వినిపించారు. ఆకాశవాణి కడప, హైదరాబాద్‌, కర్నూలు కేంద్రాలలో ముఖాముఖిలోనూ సాహిత్య చర్చల్లో పాల్గొన్నారు. కర్నూలు ఆకాశవాణిలో సూక్తిసుధ పేరుతో 6 దారావాహిక ప్రసారాలు అయ్యాయి. దూరదర్శన్‌లోనూ, ఎలక్ట్రానిక్‌ చానెళ్ళలోనూ ఆయనతో ముఖాముఖి ప్రసారం అయ్యింది.

పురస్కారాలు

మార్చు

కర్నూలుజిల్లా అధికారభాషా సంఘం సభ్యునిగా పనిచేశారు. తాళపత్రగ్రంధ సమాచార సేకరణలో దేశస్థాయి ఉద్యమం జరుగుతున్న తరుణంలో జిల్లాలో ఆ ఉద్యమానికి సహ సమన్వయకర్తగా పనిచేశారు. ఇప్పటివరకు గడియారం రామకృష్ణమశర్మ స్ఫూర్తి పురస్కారం, పరవస్తు చిన్నయసూరి సాహిత్య పరిశోధనా పురస్కారం, లలితకవి తాటిమానునారాయణరెడ్డి స్మారక సాహిత్య పురస్కారం, ఆచార్య దివాకర్ల వేంకటావధాని సాహిత్య పురస్కారం, బిఎన్‌ శాస్త్రి స్మారక ప్రత్యేక ప్రతిభా పురస్కారం, ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా కర్నూలులో విశిష్ట పురస్కారం లభించాయి. ఈయన రచనలపై అనేక విశ్వవిద్యాలయాల్లో పరిశోధన జరుగుతున్నది. అనేక శతక కావ్యాలు రాసి శతకసాహిత్యంలో మేటి అనిపించుకున్నారు.[1] అవధానాల్లో పృచ్ఛకులుగానూ, అధ్యక్షులుగానూ, అవధానిగానూ చేశారు. సాహిత్యంలో బహుముఖీయ పజ్ఞాపాఠవాలు కలిగిన వీరు అనేక సాహిత్య, సాంస్కృతిక, కళాసంస్థలలో సభ్యులుగా ఉన్నారు. ఇంకా అనేక అముద్రిత రచనల్ని ముద్రించే పనిలోనూ, తితిదే ప్రాజెక్టుల నిర్వహణ, రూపకల్పన, పర్యవేక్షణలో ఉన్న వైద్యం వేంకటేశ్వరాచార్యులు సాహిత్యంలో ఆణిముత్యం.[1]

సాహితీచరిత్రకు దిక్సూచి 'వైద్యం'

మార్చు

ఆయనే ఒక చరిత్ర, నిత్య సాహిత్యాన్వేషి.వెయ్యేండ్లు దాటిన తెలుగుభాష సాహిత్యాన్ని పరిశోధించి రచనలు చేసిన సాహిత్య పరిశోధకరత్న. వెయ్యేళ్ళ సాహితీచరిత్రలో కర్నూలు జిల్లాకు చెందిన 800 మంది కవులు, పండితులు రచయితలను పరిచేయం చేస్తూ పరిశోధన గ్రంథం తీసుకొచ్చిన ఘనత జిల్లాలో కవీ రచయిత చేయని సాహసం. పాతతరం రచయితలకే కాదు, వర్ధమాన రచయితలకు దిక్సూచి. పద్యం రాసినా, అవధానం చేసినా ఆయన గొంతులో పద్యమాధుర్యం, కలంలో అభివ్యక్తి ఎవ్వరినైనా ఆకట్టుకుంటుంది. పరిశోధనతో ఆయన రాసిన వ్యాసాలు, విమర్శ తెలుగుసాహిత్యంలో సంచలనాలు. జిల్లా నుండే కాదు రతనాల సీమగా పేరు గాంచిన రాయలసీమ నుండి సాహిత్యవిమర్శ రాసిన తొలి విమర్శకుడు. అధునిక సాహిత్యంలోనూ వచనకవితల్ని రాసి యువతరానికి ఆదర్శంగా నిలిచిన లబ్ధప్రతిష్టుడు. అనేక తాళపత్ర గ్రంథాలు, శాసనాలు పరిష్కరించి ఆంధ్రసాహిత్యంలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకొన్న సాహితీపిపాసి. జిల్లా చరిత్రను ఖండాంతరాలకు తీసుకెళ్ళి కర్నూలులో ఏముందంటే సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లో జిల్లావాసులున్నారని తన పరిశోధన వ్యాసాల్లో తేల్చిన సుప్రసిద్ధసాహితీవేత్త. శ్రీమాన్ వైద్యం వేంకటేశ్వరాచార్యులవారు సాహితీ సంసేవనా తత్పరులే కాదు. మహా భక్తులు కూడాను. వీరు రచించిన సుదర్శన చక్ర రాజ శతకము అవశ్య పఠనీయ గ్రంథమని పఠించిన వారికి తెలియక మానదు.[2].ఆత్మ అక్షరం, శరీరం ఒక చిత్తరువు/బొమ్మ. ఇలాంటి అక్షర చిత్రబంధాలన భగవానుడు విశ్వ మహా చిత్రకావ్యంలో అసంఖ్యాకంగా రచించాడు. [3]

వైద్యం వారి రచనల జాబితా

మార్చు
  • 01. 1969 వెంకటరమణ నక్షత్రమాల - కందపద్యాలు
  • 02. 1979 హనుమత్తారామాల - సీసపద్యాలు - చిన్న టేకూరు సంబంధిత౦
  • 03. 1979 శ్రీ కురుమూర్తిగిరినిలయ - లక్ష్మి వెంకటేశ్వర సుప్రభాతమ్, సంస్కృతం - సాంధ్రాతాత్పర్యం
  • 04. 1983 శ్రీ కురుమూర్తి శ్రీనివాస శతకం, కంద పద్యాలు - సాంధ్రాతాత్పర్యం
  • 05. 1983 శ్రీ కురుమూర్తి క్షేత్ర చరిత్రము, వచనము - పరిశోధనాత్మకం
  • 06. 1988 వ్యాసత్రయి, వచనం - చౌడేశ్వరీదేవి నందవరీక సంబంధిత పరిశోధనాత్మక వ్యాసాలు
  • 07. 1988 శ్రీ దత్తజయంతి చరితము, యక్షగాం - రంగయామాత్యుని రామకృష్ణకవికృతం, తాళపత్రప్రతి, పరిష్కరణ
  • 08. 1988 శ్రీ దత్తావధూత శతకము, గేయశతకం, రంగయా మాత్యరామకృష్ణకవికృతం, తాళపత్రప్రతి - పరిష్కరణ
  • 09. 1988 శ్రీ దత్తప్రభుశతకము, గేయశతకం, క్రిష్టిపాటి వేంకటసుబ్బకవికృతం ,తాళపత్రప్రతి, పరిష్కరణ
  • 10. 1988 శ్రీ గురుదేవదత్త ధరణి సీతారామయోగీంద్ర స్వామివారిమాహాత్మ్యము, వచనం - పరిశోధనాత్మకం
  • 11. 1990 శ్రీ సీతారామ కల్యాణమం, యక్షగానం, దేవరవఝల సుబ్బకవికృతం, తాళపత్రప్రతి పరిష్కరణ
  • 12. 1991 మహావాక్య ప్రకరణము, ద్విపదకావ్యం-వేదాంతము, తడకనపల్లి కవిరాభయోగి కృతం - పరిష్కరణ
  • 13. 1991 చౌడేశ్వరీస్తోత్ర కదంబము, వివిధపూర్వకవి విరచిత సంస్కృతాంధ్ర పద్యాలు, తాళపత్రప్రతి - పరిష్కరణ
  • 14. 1991 నందవరీక ప్రశంస, వివిధపూర్వకవి విరచిత సంస్కృతాంధ్రపద్యాలు, తాళపత్రప్రతి - పరిష్కరణ
  • 15. 1992 శంకరశతకము, తడకనపల్లి కవిరామయోగి విరచితం - సంపాదకత్వం
  • 16. 1993 తడకనపల్లి కవిరామయోగి లఘుకృతులు - సంపాదకత్వం
  • 17. 1993 తారకబ్రహ్మశతకము,ద్విశతి - తడకనపల్లి రామయోగి విరచితం - సంపాదకత్వం
  • 18. 1994 శ్రీ వేంకటేశ్వరశతకము, పులకుర్తి లక్ష్మిరెడ్డి రచితం, వ్రాతప్రతి, పరిష్కరణ, పీఠిక
  • 19. 1994 శంకరశతకము, నందికొటుకూరి శంకర కృతం - పరిష్కరణ
  • 20. 1998 శ్రీ తిమ్మగురులీల, పద్యకావ్యం - బాలకవి గోవింద ప్రసాద విరచితం పరిష్కృతం
  • 20. 1998 శ్రీ తిమ్మగురులీల, పద్యకావ్యం, బాలకవి గోవిందప్రసాద విరచితం, పరిష్కరణ
  • 21. 2000 శ్రీ కంబగిరి లక్ష్మీనృసింహ శతకము, గేయ శతకం, స్థలపురాణ సహితం
  • 22. 2001 భజయతిరాజ స్తోత్రము, తెలుగు అనువాదం, - టీకాతాత్పర్య సహితం
  • 23. 2002 వ్యాస వైజయంతిక, వైష్ణవ సంబంధిత స్వీయ వ్యాసాలు (20) - మొదటిభాగం
  • 24. 2003 తెలుగుభాష, పద్యశతకం
  • 25. 2004 వ్యాస వైజయంతిక, కర్నూలు జిల్లాసంబంధిత స్వీయ వ్యాసాలు (20)
  • 26. 2004 వ్యాస వైజయంతిక, సాహిత్య సంబంధిత స్వీయ వ్యాసాలు (20)
  • 27. 2005 వ్యాస వైజయంతిక, వైష్ణవ సంబంధిత స్వీయ వ్యాసాలు (20)
  • 28. 2005 ఉన్నమాట, పద్య శతకం
  • 29. 2005 ఉత్తర వేంకటాచల మాహాత్మ్యమ్ – శ్రీకురుమూర్తి క్షేత్ర స్థల పురాణం, సంస్కృతమూలం, తెనుగు వచనీకరణ
  • 30. 2007 ఆంధ్ర వ్యాకరణములు - పరవస్తు చిన్నయ సూరి
  • 31. 2007 పద్యాంధ్ర వ్యాకరణము - పరవస్తు చిన్నయ సూరి
  • 32. 2007 సూత్రాంధ్ర వ్యాకరణము - పరవస్తు చిన్నయ సూరి
  • 33. 2007 ఆంధ్ర శబ్దశాసనము - పరవస్తు చిన్నయ సూరి
  • 34. 2007 శబ్దలక్షణ సంగ్రహము - పరవస్తు చిన్నయ సూరి (30,31,32,33,34 రచనలకు సంపాదకత్వం పీఠిక, ఈ 5 రచనలు ఒకే సంపుటంగ ప్రచురితం)
  • 35. 2008 చాత్తాదనామభాష్యం, పరిశోధనాత్మకం
  • 36. 2009సుదర్శన చక్రరాజ శతకము, స్వీయరచన- సుదర్శనచక్రరాజాన్ని గురించి విపులపీఠిక ౧౦౦ పుటలు.
  • 37. 2011 శతక ద్వాదశి-పన్నెండు స్వీయ శతకాల సంపుటం 12 శతకాలు-
  • 37 2011 1. శ్రీనివాస శతకము (ద్వితీయ ముద్రణ)
  • 37. 2011 2. కురుమూర్తివాస శతకము (గేయ శతకం)
  • 38. 2011 3. రంగనాయక శతకము(ఉత్పల చంపక వృత్తాలు)
  • 38. 2011 4. లక్ష్మీనృసింహ శతకము (ద్వితీయ ముద్రణ)
  • 39. 2011 5. సుదర్శన చక్రరాజ శతకము (గీత పద్య శతకం, ప్రథమ ముద్రణ)
  • 39. 2011 6. సుదర్శన చక్రరాజ శతకము (ద్వితీయ ముద్రణ)
  • 40. 2011 7. చెన్నరాయ శతకము (ప్రథమ ముద్రణ, ఆ.వె.)
  • 41. 2011 8. యతిరాజ శతకము (ప్రథమ ముద్రణ, కంద)
  • 41. 2011 9. తెలుగు భాషా శతకము (ద్వితీయ ముద్రణ)
  • 42. 2011 10. లింగమూర్తి శతకము (ప్రథమ ముద్రణ)
  • 42. 2011 11. ఉన్నమాట శతకము (ద్వితీయ ముద్రణ)
  • 43. 2011 12. వేంకటేశ శతకము (ప్రథమ ముద్యణ, సీసశతి)
  • 44. 2011 కర్నూలుజిల్లా కవితరంగిణి. (400 కవుల సంక్షిప్త పరిచయం, 400 ఆధునిక కవుల నామసూచిక)
  • 45. 2011 ఆంధ్రనిఘంటువు, పరవస్తు చిన్ధయసూరి కృతం, పునర్నిర్మాణం
  • 46. 2011 శ్రీ కరస్థల నాఖలింగేశ్వరస్వామి చరిత్ర, ద్విపద కావ్యం-నాగెళ్ల శివమూర్తి కృతం - సంపాద కత్వం
  • 47. 2012 కవిత వైజయంతి -స్వీయ చాటు కవిత సంకలనం
  • 48. 2012 యోగీశ్వర విలాసము, ద్విపద కావ్యం, నంది కొటుకూరి సిద్ధయోగి కృతం (18వ శతాబ్దం) -పరిష్కరణ
  • 49. 2013 ఆంధ్రపూర్ణాచార్య ప్రభావము, చంపూకావ్యం, దొంతిరెడ్డి పట్టాభిరామదాస కవికృతం, పరిష్కరణ, సంపాదకత్వం
  • 50. 2013 శాత్తాద శ్రీవైష్ణవం (పరిశోధనాత్మ కవ్యాసాలు 30)
  • 51. 2014 చిత్రబంధమాలిక (బంధకవితా విలసితం, 18వ శతాబ్దపు తిరుమల బుక్కపత్తన అణ్ణయాచార్యవిచితం., పరిష్కరణ, వ్యాఖ్యానం)
  • 52. 2014 చిత్రమ్ (చిత్రకవితా విలసితం, 18వ శతాబ్దపు కవిపండితులు ఆయలూరి కందాళార్య విరచితం, పరిష్కరణ, వ్యాఖ్యానం)
  • 53. 2016 కవిజనాశ్రయము, మల్లియరేచన కృతం. పరిష్కరణ, భావదీపిక వ్యాఖ్య., ప్రచురణ: తెలంగాణ సాహిత్య పరిశోధన కేంద్రం, హైదరాబాదు
  • 54. 2016 అధ్యాత్మరామాయణము, (కాణాదం పెద్దన సోమయాజి ప్రణీతం) పరిష్కరణ, పీఠిక, సంపాదకత్వం ప్రచురణ: తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి.
  • 55. ఆళ్వార్ల సంగ్రహ చరిత్ర ప్రచురణ: తిరుమల తిరుపతి దేవస్థానము, తిరుపతి
  • 56. శ్రీ కురుమూర్తిక్షేత్ర శతక సాహిత్యం : ఇందులో పన్నెండు శతకాలు ఉన్నవి ఆ వివరాలు:-
  • 56. 1. శ్రీ కురుమూర్తి వేంకటేశ్వరశతకము అజ్జకొల్లు శేషకవి కృతము, పరిష్కరణ, పీఠిక
  • 57. 2. శ్రీ కుర్మతి శ్రీనివాస శతకము రూప్ఖాన్ పేటరత్నమాంబ కృతము, పరిష్కరణ, పీఠిక
  • 58. 3. శ్రీ కృష్ణాష్టోత్తరశతనామ స్తోత్ర శతకము భట్టరాజు రామకృష్ణయ్యకృతం, పరిష్కరణ, పీఠిక
  • 59. 4. శ్రీ కుర్మతి శ్రీనివాస శతకము తిరుమల బుక్కపట్టణం రంగాచార్య కృతం పరిష్కరణ, పీఠిక
  • 60. 5. శ్రీ కురుమూర్తి సీతారామ శతకము లోకాయపల్లె శేషదాస కృతం పరిష్కరణ, పీఠిక
  • 61. 6. శ్రీ కురుమూర్తినాథ శతకము డా. చిలుకూరి నారాయణరావు కృతం పరిష్కరణ, పీఠిక
  • 62. 7. శ్రీ కురుమూర్తి శతకము పూదత్తు నారాయణదాస కృతం పీఠిక
  • 63. 8. శ్రీ కురుమూర్తి నాయక శతకము తిరునగరి రామచంద్రకవి కృతం పరిష్కరణ, పీఠిక
  • 63. 9. శ్రీ కురుమూర్తి శ్రీనివాస శతకము స్వీయ రచన, తృతీయ ముద్రణ
  • 63. 10. శ్రీ కురుమూర్తివాస శతకము స్వీయ రచన, ద్వితీయ ముద్రణ
  • 64. 11. శ్రీ కురుమూర్తి వేంకటేశ శతకము స్వీయ రచన, ద్వితీయ ముద్రణ
  • 64. 12. శ్రీ చెన్నరాయ శతకము స్వీయ రచన, ద్వితీయ ముద్రణ
  • 64. 2018 వ్యాసచంద్రిక, అధ్యాత్మ రామాయణ సంబంధిత మైన పది వ్యాసాలు.
  • 65. 2017 బమ్మెరపోతన మహాభాగవతము, సరళవ్యాఖ్యానం ముప్పదిపండితులు, వారిలో వైద్యంకూడఒకరు, వామనావతార చరిత్రకు వ్యాఖ్య. భాగవతం మొత్తం 8 సంపుటాలు, 5వ సంపుటం లోని వామనావతారచరిత్రకు సరళ వ్యాఖ్య. తి.తి.దే. ప్రచురణ
  • 66. 2021 ఆంధ్రాష్టపదులు, గద్వాల సంస్థాన కవికుంజరం, కామసముద్రం అప్పలాచార్యప్రణీతం. పరిష్కరణ, పీఠిక, సంపాదకత్వం
  • 67. 2021 తొలి తెలుగు నిఘంటువు చౌడప్ప సీసములు, నుడి తెలివిడి వ్యాఖ్య, అకారానక్రమ పదసూచికాది సహితం.
  • 68. 2021. శ్రీ ప్రబంధరాజ వేంకటేశ్వర విజయ విలాసము, చిత్ర కవన ప్రబంధం గణపవరపు వేంకటకవి కృతం. పరిష్కరణ, పీఠిక, విశేషాంశాను బంధాలు, 141 బంధచిత్రాలు.
  • 69. 2022 శ్రీనివాసవిలాసః (సంస్కృత కావ్యం) హొసదుర్గం కృష్ణమాచార్య కృతం
  • 70. 2022 శ్రీనివాస విలాసము (ఆంధ్రీకృత కావ్యం) తిరుపతి వేంకటకవులపై సంస్కృత మూలం తెలుగుసేత హొసదుర్గం వారి, తిరుపతి వేంకటకవుల రచనలు రెండూ ఒకే సంపుటంలో విశేషాంశాలతో ప్రచురితం.
  • 71. 2022 లోనారసి
  • 72. 2022 గద్వాలసంస్థానం-చాటుపద్య రత్నాలు
  • 73. 2022 గద్వాల సంస్థానం – బంధచిత్ర కవిత్వం (అచ్చులో)

వివిధపత్రికలలో, ప్రత్యేక సంచికలలో ప్రచురితమైన సాహిత్యంఎంతో ఉంది. కర్నూలు, కడప, హైదరాబాదు, వరంగల్, తిరుపతి ఆకాశవాణి కేంద్రాల నుంచి ప్రసారమైన సాహిత్యమూ ఉంది. అముద్రిత రచనలు వేల పుటలలో ఉన్నాయి. పరిష్కృత పూర్వకవుల రచనలు, స్వీయ నిర్మితకోశాలు, కావ్యవ్యాఖ్యానాలు, వ్యాసాలు, వివిధ రచనలకు రచించిన పీఠికలు, అభిప్రాయాలు,సమీక్షలు శతాధికంగా ఉన్నాయి. వీటిలో దాదాపు నలవైశాతం రచనలం డిటీపీ కూడ అయినవి. వీలునుబట్టి, ఆర్థికవనరులను బట్టి ప్రచురించే ప్రయత్నం జరుగుతోంది.

మూలాలు

మార్చు

బాహ్య లింకులు

మార్చు